ఎంబీఏలో ఆధునిక స్పెషలైజేషన్లు
Sakshi Education
ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)లో స్పెషలైజేషన్లు అంటేఒకప్పుడు ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్ మాత్రమే. అయితే కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంబీఏలో ఎన్నో అధునాతన స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన వినూత్న స్పెషలైజేషన్లపై ఫోకస్..
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రో కబడ్డీ లీగ్, హాకీ ఇండియా లీగ్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ వంటి వాటికి ఆదరణ పెరుగుతోంది. దాంతో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. క్రీడలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ, నిర్వహణ తదితరాల అధ్యయనాన్ని స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌గా చెప్పొచ్చు.
ఫ్యాషన్ మేనేజ్‌మెంట్
దేశంలో ఫ్యాషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ బ్రాండ్లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. వీటితోపాటు ఈ-కామర్స్ వృద్ధి, వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ఆవిర్భవించింది.
బిజినెస్ అనలిటిక్స్
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరెట్, బిజినెస్ ప్రపంచంలో తాజాగా డిమాండ్ పెరుగుతున్న విభాగం.. బిజినెస్ అనలిటిక్స్. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బిజినెస్‌కు సంబంధించిన వ్యూహాలను రచించడం ఇందులోని ప్రధానాంశం. కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచుకునే క్రమంలో వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు చేసుకుంటాయి. సమాచారాన్ని విశ్లేషించి, కంపెనీల పాలసీలను నిర్ణయించడంలో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు.
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక శాతం ప్రజలు నిర్మాణ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఏ నిర్మాణానికి సంబంధించిన అంశంలోనైనా కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ పాత్ర ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మేనేజ్‌మెంట్ నిపుణులు చురుగ్గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందడం, స్థలాన్ని అభివృద్ధి చేయడం వంటి బాధ్యతలు చేపడతారు.
టెలికాం మేనేజ్‌మెంట్
టెక్నాలజీ లేని జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించలేం. ప్రపంచీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం రంగంలో నిపుణుల అవసరం పెరిగింది. పరిశ్రమ విజయవంతం కావడంలో టెలికాం మేనేజ్‌మెంట్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు.

- కోర్సులు అందిస్తున్న సంస్థలు: నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఏఎస్‌ఎం) - ముంబై; ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్-ముంబై; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఐఎస్‌డబ్ల్యూబీఎం) - కోల్‌కతా.. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా స్పోర్ట్స్ మార్కెటింగ్, స్పాన్సర్‌షిప్, స్పోర్ట్స్ ఫైనాన్స్ అండ్ బిజినెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ పాలసీ తదితర అంశాలను బోధిస్తున్నాయి.
- ఉద్యోగావకాశాలు: దేశంలో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు క్రీడలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిలో స్పోర్ట్స్ మేనేజర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు క్రీడాకారులను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఇలాంటి వాటికి సంబంధించి స్పోర్ట్స్ మార్కెటింగ్ మేనేజర్, స్పాన్సర్‌షిప్ మేనేజర్ల అవసరం కూడా ఉంది.
ఫ్యాషన్ మేనేజ్‌మెంట్
దేశంలో ఫ్యాషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ బ్రాండ్లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. వీటితోపాటు ఈ-కామర్స్ వృద్ధి, వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ఆవిర్భవించింది.
- అందిస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్); అమిటి స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. కోర్సులో భాగంగా ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్ అండ్ మర్చండైజింగ్, అపెరల్ ఎక్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ అండ్ మర్చండైజింగ్, బిజినెస్ కమ్యూనికేషన్ తదితర అంశాలను బోధిస్తాయి.
- కెరీర్ అవకాశాలు: ఫ్యాషన్ రంగంలో బ్రాండ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, మార్కెటింగ్ కన్సల్టెంట్, డిజిటల్ మార్కెటర్ తదితర హోదాల్లో పనిచేయొచ్చు. పాంటలూన్స్, ఆడిదాస్, రిలయన్స్ తదితర కంపెనీల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
బిజినెస్ అనలిటిక్స్
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరెట్, బిజినెస్ ప్రపంచంలో తాజాగా డిమాండ్ పెరుగుతున్న విభాగం.. బిజినెస్ అనలిటిక్స్. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బిజినెస్‌కు సంబంధించిన వ్యూహాలను రచించడం ఇందులోని ప్రధానాంశం. కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచుకునే క్రమంలో వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు చేసుకుంటాయి. సమాచారాన్ని విశ్లేషించి, కంపెనీల పాలసీలను నిర్ణయించడంలో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు.
- కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ - హైదరాబాద్; ఐఐఎం లక్నో, కోల్‌కతా, బెంగళూరు; గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - చెన్నై; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్
- కోర్సు చేయాలనుకునేవారికి డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులుండాలి. క్యాట్/మ్యాట్/జీమ్యాట్/ఎక్స్‌ఏటీ స్కోర్ కలిగి ఉండాలి. కొన్ని సంస్థలు రాత పరీక్ష నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు బీటెక్, బీఎస్సీలో ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్ లేదా బీఏలో ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ లేదా బీకాం/బీబీఏ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నాయి.
- కోర్సులో భాగంగా డేటా అనలిటిక్స్ బేసిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్, అప్లైడ్ బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టాటిస్టికల్ కమ్యూనికేషన్, బిగ్ డేటా అనలిటిక్స్, డేటా క్లీనింగ్, నార్మలైజేషన్, డేటా మైనింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు.
- ఉద్యోగావకాశాలు: ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, సోషల్ మీడియా తదితర సంస్థల్లో అవకాశాలుంటాయి. బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్, బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, బిగ్ డేటా అనలిస్ట్, డేటా వేర్‌హౌజింగ్ ఎక్స్‌పర్ట్ తదితర హోదాల్లో పనిచేయొచ్చు. హెచ్‌పీ, ఐబీఎం, కాగ్నిజెంట్, టీసీఎస్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తదితర కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక శాతం ప్రజలు నిర్మాణ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఏ నిర్మాణానికి సంబంధించిన అంశంలోనైనా కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ పాత్ర ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మేనేజ్‌మెంట్ నిపుణులు చురుగ్గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందడం, స్థలాన్ని అభివృద్ధి చేయడం వంటి బాధ్యతలు చేపడతారు.
- బీటెక్ అభ్యర్థులు ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులు పూర్తిచేసిన వారికి కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ మంచి కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తుంది. దేశంలో చాలా సంస్థలు పీజీ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ఎంటెక్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, పీహెచ్‌డీ తదితర కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.
- ఉద్యోగావకాశాలు: పెద్ద నిర్మాణ సంస్థలు స్వయంగా కన్‌స్ట్రక్షన్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. ఎల్ అండ్ టీ, గామన్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థలు వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
టెలికాం మేనేజ్‌మెంట్
టెక్నాలజీ లేని జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించలేం. ప్రపంచీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం రంగంలో నిపుణుల అవసరం పెరిగింది. పరిశ్రమ విజయవంతం కావడంలో టెలికాం మేనేజ్‌మెంట్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు.
- కోర్సులు అందిస్తున్న సంస్థలు:
- సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్ (ఎఐటీఎం)-పుణె; అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ - నోయిడా తదితర సంస్థలు కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్స్/ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఏరోస్పేస్‌లో బీటెక్ లేదా ఐటీ/టెలికాంలో బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా బీసీఏ లేదా ఎంసీఏ అర్హత ఉన్నవారు ఎంబీఏలో చేరొచ్చు.
- కోర్సులో భాగంగా నెట్‌వర్కింగ్ ఫండమెంటల్స్, టెలికాం టెక్నాలజీ ఫండమెంటల్స్, వైర్‌లెస్ టెక్నాలజీ, టెలికాం నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, టెలికాం బిజినెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ తదితర అంశాలు నేర్పిస్తారు.
- ఉద్యోగావకాశాలు: భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర కంపెనీల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
Published date : 07 Jun 2016 11:27AM