బయోటెక్నాలజీ
Sakshi Education
ప్రపంచంలో మార్పులకు బ్రహ్మాస్త్రం..బయోటెక్నాలజీ.. ఇది నిపుణుల అభిప్రాయం..ఆహార ఉత్పత్తుల వృద్ధికి అవసరమైన వం గడాల సృష్టి మొదలు..ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన వ్యాక్సీన్ల తయూరీ వరకు బయోటెక్ ప్రధాన మార్గం.. నిన్న మొన్నటి జన్యుపర సమస్యలు మొదలుకొని.. నేడు కుల వ్యవస్థ మూలాలు కనుక్కునే తరుణంలో...ఇప్పటి వరకు ‘ఇల్‌నెస్’ విభాగానికే పరిమితమైన పరిశోధనలు..భవిష్యత్తులో ‘వెల్‌నెస్’ విభాగంలోనూ ఊపందుకోనున్నాయి..దీంతో ఈ రంగం ఇప్పుడు అవకాశాలకు వేదికగా నిలుస్తోంది.. ‘రాబోయే శతాబ్దం బయూలజీదే’ అంటూ..శాస్తవ్రేత్తలు అభిప్రాయూలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బయోటెక్నాలజీ కెరీర్‌పై ఫోకస్..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకనుగుణంగా మానవవనరులను తీర్చిదిద్దడం కోసం గత దశాబ్ద కాలంగా ఎన్నో కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. అలాంటి వాటిలో బయోటెక్నాలజీ ఒకటి. బయూలజీ, టెక్నాలజీల కలయికతో రూపుదిద్దుకున్న బయోటెక్నాలజీ..రీసెర్చ్ ఓరియెంటెడ్ సైన్స్. ఇందులో ప్రధాన అధ్యయన అంశాలు..జెనిటిక్స్,బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ, వైరాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్.
విషయంతోపాటు:
భవిష్యత్తులో బయోటెక్నాలజీ ఉపాధి అవకాశాల్లో ముందుంటుందనేది నిస్సందేహం. అరుుతే ఈ రంగంలో స్థిరపడాలన్నా, ఉన్నత స్థానాలకు చేరాలన్నా.. విషయ పరిజ్ఞానంతోపాటు..తార్కిక విశ్లేషణ, సునిశిత పరిశీలన, నలుగురితో కలసి పనిచేయడం వంటి వ్యక్తిగత స్కిల్స్ కూడా ఎంతో అవసరం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిశోధనల పట్ల ఆసక్తి, సమస్య పరిష్కారంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి.
అవకాశాలు:
వారసత్వంగా సంక్రమించే వ్యాధులకు వ్యాక్సిన్లు, వైద్య, ఆరోగ్య అంశాలకు సంబంధించిన బయలాజికల్ ఇండికేటర్ల తయూరీ... పరిశ్రమల వ్యర్థాలను బయూలాజికల్‌గా తొలగించడం వంటి విధులను బయోటెక్నాలాజిస్ట్‌లు నిర్వహించాలి.వీరికి డ్రగ్ అండ్ ఫార్మస్యూటికల్ సంస్థలు, ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్, వేస్ట్‌మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోప్రాసెసింగ్, టెక్స్‌టైల్, కెమికల్, పరిశ్రమల్లో, పరిశోధన సంస్థలతోపాటు ప్రభుత్వంలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్, అగ్రికల్చరల్, హార్టికల్చర్ విభాగాల్లో కూడా అవకాశాలుంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, టీచర్, మార్కెటింగ్ మేనేజర్, సైన్స్ రాయిటర్, బయోఇన్ఫర్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ కంపెనీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారిని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకుంటున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్, అసిస్టెంట్స్‌గా కూడా బయోటెక్నాలజీ అభ్యర్థులకు అవకాశాలుంటాయి.
టాప్‌రిక్రూటర్స్: డాబర్, రాన్‌బాక్సీ, రెడ్డీస్ ల్యాబ్, హిందుస్థాన్ లీవర్, నోవర్టీస్, బేయర్స్ హెల్త్‌కేర్, బయోకాన్.. తదితర కార్పొరేట్ సంస్థలు.
వేతనాలు:
ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ఏడాదికి కనీసం రూ.70 వేల నుంచి రూ. 85 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా ఏడాదికి రూ.2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడాలంటే మాత్రం పీజీ లేదా పీహెచ్‌డీ తప్పనిసరి. ఈ డిగ్రీలతో ఆర్ అండ్ డీ విభాగంలో అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఏడాదికి రూ. 2 నుంచి 3 లక్షల వరకు పే ప్యాకేజీ లభిస్తుంది.
విస్తరిస్తున్న రంగం:
దేశంలో బయోటెక్నాలజీకి మెడికల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయోటె క్నాలజీ రంగాల్లో ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటా యి. మొత్తం బయోటెక్నాలజీ రంగంలో 70 శాతం ఆదాయం.. మెడికల్ బయోటెక్నాలజీ నుంచే వస్తుంది. మెడికల్ బయోటెక్నాల జీలో శాంతా బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ, రాన్‌బాక్సీ, వోకార్ట్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. ఆహార ఉత్పత్తులను పెంచ డం కోసంమెరుగైన వంగడాలు, బయోఫెస్టిసైడ్స్‌పై విస్తత్ర స్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ప్రస్తుతం అందుకు అవసర మైన స్థారుులో మానవ వనరులు అందుబాటులో లేవు. అంతేకాకుండా.. ఈ రంగంలో అవుట్ సోర్సింగ్ కూడా విస్తరిస్తోంది. మరో వైపు లైఫ్ సైన్స్ పరిశోధకుల కోసం నూతనంగా బయలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రారంభించాలని భారత ప్రభుత్వం ఆలో చిస్తోంది. క్లినికల్ పరిశోధనలకు, మానవ వనరులకు అనుకూలంగా ఉండటంతో బయలాజికల్ కంపెనీలకు, పరిశోధనలకు భారత దేశం చిరునామాగా మారింది. అందుకే అమెరికా, యూరప్ దేశాలు మన దేశంపై దృష్టి సారించాయి. 2020 నాటికి భారత బయో టెక్ పరిశ్రమ వాటా రూ. 4.40 వేల కోట్లకు పెరగనుందని అంచనా. ఈ రంగం అనుభజ్ఞుల, స్పెషలిస్టు కొరత నెదుర్కొంటుందని ఇటీవలి సర్వే వెల్లడించింది. దీంతో బయోటెక్నాలజీ చేసిన వారి భవిష్యత్‌కు ఎటువంటి ఢోకాలేదని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ రంగం ఆర్థికాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించడంతోపాటు భారత జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రధాన అంశంగా మారుతుంది. ఇంధనానికి ప్రత్యామ్నాయంగా బయో ఫ్యూయల్ రానుంది. ప్రస్తుతం ఈ విభాగంలో పరిశోధనలు ముమ్మరమయ్యాయి. దీంతో బయో అవకాశాలకు భారత్‌ను కేరాఫ్‌గా పేర్కొనవచ్చు.
ప్రవేశం:
బయోటెక్నాలజీకి సంబంధించి బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు పలు రకాల కోర్సులను వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులను ఎంచుకోవడం ద్వారా బయోటెక్నాలజీలో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. బ్యాచిలర్/ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి సైన్స్/మ్యాథ్స్‌లతో ఇంటర్మీడియెట్, పీజీ కోర్సులకు సంబంధిత అంశంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు పీజీ పూర్తి చేసి ఉండాలి. ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి అర్హత ప్రమాణాలు మారుతు ఉంటాయి. కాబట్టి వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను చూడొచ్చు.
కోర్సులు:
జేఎన్‌యూ పరీక్ష:
పీజీ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఢిల్లీలో ని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నిర్వహించే ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీ(బయోటెక్నాలజీ) లో ప్రవేశం కల్పిస్తున్నారుు. ఈ యూనివర్సిటీల్లో సీటు పొందినవారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టయిఫండ్ కూడా అందిస్తుంది.
ఎంబీఏ/పీజీడీఎం (బయోటెక్నాలజీ):
ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తతమవుతుండటంతో ఇటీవల కాలంలో బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు కూడా ఉపందుకున్నా రుు. అంతేస్థారుులో వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడానికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెటింగ్ మేనేజర్ల అవసరం పెరుగుతోంది. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుకు రూపకల్పన చేశారుు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
బయోటెక్నాలజీలో పరిశోధనలంటే ఆసక్తి ఉన్న వారికి పీహెచ్‌డీ సరైన వేదిక. ప్రస్తుతం దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారుు. సాధారణంగా వీటిలో ప్రవేశానికి గేట్ స్కోరు లేదా యూజీసీ నిర్వహించే నెట్-జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) లేదా సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీని వల్ల పీహెచ్‌డీలో ప్రవేశంతోపాటు క్రమం తప్పకుండా లభించే ఫెలోషిప్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఫెలోషిప్ పొందలేని వారికోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు టీచింగ్, రీసెర్చ్ అసిస్టెన్స్ పేరిట తోడ్పాటునందిస్తున్నారుు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు).. బీఎస్సీ నుంచే పీహెచ్‌డీ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్.. బీఎస్సీ అర్హతగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది.
పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
బయోటెక్నాలజీలో మంచి కెరీర్ ఆశించిన అభ్యర్థులు..తమ ప్రస్తుత విద్యార్హతలను బట్టి బయోఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ డిప్లొమా లేదా ఇదే సబ్జెక్టులో ఎంఎస్సీ/ఎంటెక్‌లు చేయడం మంచిది. కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం పలు కంప్యూటర్ శిక్షణ సంస్థలు అందించే ఆఫీస్ అప్లికేషన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్‌మెం ట్ కోర్సులు పూర్తి చేయడం కూడా లాభిస్తుంది. అదే విధంగా మెడికల్ నానో టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ వంటి స్పెషలైజ్డ్ కోర్సులను చేయవచ్చు. కెమికల్ లేబొరే టరీ టెక్నాలజిస్ట్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫోరెన్సిక్ సైంటిస్ట్, ఫార్మసిస్ట్స్, మెడికల్ సైంటిస్ట్, బయూలాజికల్ సైంటిస్ట్ వంటి ఉన్నత కోర్సులను కూడా బయోటెక్నాలజీ అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు నానో టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలను సప్లిమెంటరీ సర్టిఫికెట్ కోర్సులుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో బయోటెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు
బీఎస్సీ-బయోటెక్నాలజీ: అన్ని ప్రముఖ వర్సిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి అర్హులు. అకడెమిక్ సెషన్ ఇంటర్ ఫలితాల తర్వాత జూలై/ఆగస్ట్‌లలో ప్రారంభవమవుతుంది. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను చూడవచ్చు.
బీటెక్ (బయోటెక్నాలజీ): రాష్ట్రంలో ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న కళాశాలల సంఖ్య: 14. వీటిల్లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉటుంది. ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలువడుతుంది.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ): కాకతీయ, ఆది కవి నన్నయ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో వెలువడుంది. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను చూడొచ్చు.
ఎంఎస్సీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు బయోటెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. సంబంధిత నోటిఫికేషన్లు ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో వెలువడుతాయి. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్ సైట్‌లను చూడొచ్చు.
ఎంటెక్ (బయోటెక్నాలజీ/బయోమెడికల్ ఇంజనీరింగ్): ఈ కోర్సును ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
దేశంలో ప్రముఖ బయోటెక్ స్కూల్స్
www.ncbi.nlm.nih.gov
www.whybiotech.com
https://dbtindia.nic.in
https://pharmacos.eudra.org

- బీఎస్సీ-బయోటెక్నాలజీ
- ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-బయోటెక్నాలజీ
- ఎంఎస్సీ-బయోటెక్నాలజీ
- ఎంటెక్-బయోటెక్నాలజీ
- ఎంబీఏ-బయోటెక్నాలజీ
- ఎంఎస్సీ-అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ
- ఎంవీఎస్సీ-యానిమల్ బయోటెక్నాలజీ
- ఎంఎస్సీ/ఎంవీఎస్సీ-వెటర్నరీ బయోటెక్నాలజీ
- ఎంఎస్సీ- మెరైన్ బయోటెక్నాలజీ
- ఎంటెక్- బయోమెడికల్ బయోటెక్నాలజీ
- పీహెచ్‌డీ-పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్
- దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీలు బీఈ/బీటెక్ స్థాయిలో బయోటెక్నాలజీని అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) అర్హతగా జరిగే ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారుు. సంబంధిత నోటిఫికేషన్లు సెప్టెంబర్/అక్టోబర్/నవంబర్/డిసెంబర్‌లో వెలువడుతాయి.
- ఐఐటీ-ఢిల్లీ, ఖరగ్‌పూర్‌లు బయోటెక్నాలజీ/బయో ఇంజనీరింగ్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ- జేఈఈ స్కోర్ ఆధారంగానే ఇందులో ప్రవేశం.
- ఐఐటీలలో బయోటెక్నాలజీలో ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటున్నారుు. గ్రాడ్యుయేట్ ఆప్టి ట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్(గేట్) స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుని వీటిల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎంఎస్సీ చేయాలంటే మాత్రం జారుుంట్ అడ్మిషన్ టు ఎంఎస్సీ (జామ్) పరీక్షకు హాజరు కావాలి. సంబంధిత నోటిఫికేషన్లు అక్టోబర్/నవంబర్/డిసెంబర్‌లలో వెలువడుతుంది.
- జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కత యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీలు కూడా బయోటెక్నాలజీలో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాయి. గేట్ ద్వారా ప్రవేశం.
- ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-న్యూఢిల్లీ కూడా బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం. సంబంధిత నోటిఫికేషన్ డిసెంబర్‌లో వెలువడుతుంది.
జేఎన్‌యూ పరీక్ష:
పీజీ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఢిల్లీలో ని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నిర్వహించే ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీ(బయోటెక్నాలజీ) లో ప్రవేశం కల్పిస్తున్నారుు. ఈ యూనివర్సిటీల్లో సీటు పొందినవారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టయిఫండ్ కూడా అందిస్తుంది.
ఎంబీఏ/పీజీడీఎం (బయోటెక్నాలజీ):
ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తతమవుతుండటంతో ఇటీవల కాలంలో బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు కూడా ఉపందుకున్నా రుు. అంతేస్థారుులో వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడానికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెటింగ్ మేనేజర్ల అవసరం పెరుగుతోంది. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుకు రూపకల్పన చేశారుు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
- అమిటీ యూనివర్సిటీ-నోయిడా
వెబ్‌సైట్: www.amity.edu - పుణె యూనివర్సిటీ-పుణె
వెబ్‌సైట్: www.unipune.ac.in - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్-ఉస్మానియా యూనివర్సిటీ
- పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-బయోటెక్నాలజీ
వెబ్‌సైట్: www.ipeindia.org
బయోటెక్నాలజీలో పరిశోధనలంటే ఆసక్తి ఉన్న వారికి పీహెచ్‌డీ సరైన వేదిక. ప్రస్తుతం దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారుు. సాధారణంగా వీటిలో ప్రవేశానికి గేట్ స్కోరు లేదా యూజీసీ నిర్వహించే నెట్-జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) లేదా సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీని వల్ల పీహెచ్‌డీలో ప్రవేశంతోపాటు క్రమం తప్పకుండా లభించే ఫెలోషిప్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఫెలోషిప్ పొందలేని వారికోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు టీచింగ్, రీసెర్చ్ అసిస్టెన్స్ పేరిట తోడ్పాటునందిస్తున్నారుు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు).. బీఎస్సీ నుంచే పీహెచ్‌డీ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్.. బీఎస్సీ అర్హతగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది.
పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
- మాలిక్యులర్ బయాలజీ
- మైక్రోబయాలజీ
- బయోకెమిస్ట్రీ
- బయోఫిజిక్స్
- బోటనీ
- జువాలజీ
- ఫార్మకాలజీ
- ఫిజియాలజీ
- హార్టికల్చర్
- టిష్యూకల్చర్
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
- యానిమల్ సెన్సైస్
- డైరీ టెక్నాలజీ
- ఫిషరీస్
- జెనెటిక్స్
- క్లినికల్ బయోటెక్నాలజీ
- ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.
- మెరైన్ బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీలో మంచి కెరీర్ ఆశించిన అభ్యర్థులు..తమ ప్రస్తుత విద్యార్హతలను బట్టి బయోఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ డిప్లొమా లేదా ఇదే సబ్జెక్టులో ఎంఎస్సీ/ఎంటెక్‌లు చేయడం మంచిది. కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం పలు కంప్యూటర్ శిక్షణ సంస్థలు అందించే ఆఫీస్ అప్లికేషన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్‌మెం ట్ కోర్సులు పూర్తి చేయడం కూడా లాభిస్తుంది. అదే విధంగా మెడికల్ నానో టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ వంటి స్పెషలైజ్డ్ కోర్సులను చేయవచ్చు. కెమికల్ లేబొరే టరీ టెక్నాలజిస్ట్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫోరెన్సిక్ సైంటిస్ట్, ఫార్మసిస్ట్స్, మెడికల్ సైంటిస్ట్, బయూలాజికల్ సైంటిస్ట్ వంటి ఉన్నత కోర్సులను కూడా బయోటెక్నాలజీ అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు నానో టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలను సప్లిమెంటరీ సర్టిఫికెట్ కోర్సులుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో బయోటెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు
బీఎస్సీ-బయోటెక్నాలజీ: అన్ని ప్రముఖ వర్సిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి అర్హులు. అకడెమిక్ సెషన్ ఇంటర్ ఫలితాల తర్వాత జూలై/ఆగస్ట్‌లలో ప్రారంభవమవుతుంది. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను చూడవచ్చు.
బీటెక్ (బయోటెక్నాలజీ): రాష్ట్రంలో ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న కళాశాలల సంఖ్య: 14. వీటిల్లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉటుంది. ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలువడుతుంది.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ): కాకతీయ, ఆది కవి నన్నయ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో వెలువడుంది. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను చూడొచ్చు.
ఎంఎస్సీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు బయోటెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. సంబంధిత నోటిఫికేషన్లు ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో వెలువడుతాయి. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్ సైట్‌లను చూడొచ్చు.
ఎంటెక్ (బయోటెక్నాలజీ/బయోమెడికల్ ఇంజనీరింగ్): ఈ కోర్సును ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
దేశంలో ప్రముఖ బయోటెక్ స్కూల్స్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
- స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ, జేఎన్‌యూ, ఢిల్లీ
- రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, త్రివేండ్రం
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
- యూనిమల్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కార్నల్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్
- స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ వడోదరా (గుజరాత్)
- పాండిచ్చేరి యూనివర్సిటీ-పుదుచ్చెరి
- యూనివర్సిటీ ఆఫ్ పుణె-పుణె
- థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-పాటియాల
- ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-తమిళనాడు
- అమిటీ యూనివర్సిటీ-నోయిడా
- ఆక్స్‌ఫర్డ్ కాలేజ్ ఆఫ్ సైన్స్-బెంగళూర్
- ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వివరాలకు: www.osmania.ac.in - కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వివరాలకు: www.kuwarangal.com - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
వివరాలకు: www.uohyd.ernet.in - ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వివరాలకు: www.andhrauniversity.info - ఆది కవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి
వివరాలకు: www.nannayauniversity.info - శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వివరాలకు: www.svuniversity.in - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
వివరాలకు: www.nagarjunauniversity.ac.in - శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-అనంతపురం
వివరాలకు: www.skuniversity.org
www.ncbi.nlm.nih.gov
www.whybiotech.com
https://dbtindia.nic.in
https://pharmacos.eudra.org
Published date : 30 Jan 2012 02:27PM