ఉన్నతస్థాయి కొలువులకు...భారీ వేతనాలకు@ఏఎఫ్ క్యాట్-2020
Sakshi Education
కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులకు చక్కటి అవకాశం.. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్). భారత వైమానిక దళంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నతస్థాయి కొలువు, ఆకర్షణీయమైన వేతనం ఏఎఫ్‌క్యాట్ ద్వారా అందుకోవచ్చు. ఏఎఫ్‌క్యాట్ 2020 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్, శిక్షణ, వేతనం తదితర వివరాలు...
మొత్తం పోస్టుల సంఖ్య: 249
ఖాళీల వివరాలు..
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ:
బ్రాంచ్ ఫ్లయింగ్: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ): 60
బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్):
బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్):
ఎన్ఎన్సీ స్పెషల్ ఎంట్రీ: బ్రాంచ్.. ఫ్లయింగ్.. సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్ఎస్సీ కింద భర్తీ చేస్తారు.
ఏఎఫ్ క్యాట్ :
ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్, నాన్ టెక్నికల్) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో ఏఎఫ్ క్యాట్ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో రెండు రకాల పోస్టులుంటాయి. కొన్ని పర్మనెంట్ కమిషన్ (పీసీ), మరికొన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరిధిలోకి వస్తాయి. పర్మనెంట్ కమిషన్ (పీసీ) విభాగంలో ఎంపికైన వారు పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగొచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్‌లో అవకాశం పొందితే గరిష్టంగా 14ఏళ్ల పాటు ఉద్యోగంలో సేవలందించి వైదొలుగుతారు. మహిళలు ఎస్ఎస్సీ ఉద్యోగాలకే అర్హులు. అలాగే ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలైన పైలట్ పోస్టులన్నీ ఎస్ఎస్సీ కిందకే వస్తాయి. గ్రౌండ్ డ్యూటీ పోస్టులను పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు విభాగాల్లోనూ భర్తీ చేస్తారు.
అర్హతలు :
ఫ్లయింగ్ బ్రాంచ్ :
ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్(10+2)లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఫైనల్ చదువుతున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2021, జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 1997 నుంచి జనవరి 1, 2001 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ బ్రాంచ్ :
విభాగం: ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంటర్/10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
విభాగం: ఏరోనాటికల్ ఇంజనీరింగ్(మెకానికల్)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌ల్లో ఏదో ఒక విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసుండాలి. ఇంటర్/10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రౌండ్ డ్యూటీ-నాన్ టెక్నికల్ బ్రాంచ్ :
ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగాలున్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. అకౌంట్స్ విభాగానికి బీకాం 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు అర్హులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 20 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. జనవరి 2, 1995 నుంచి జనవరి 1, 2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం ఇలా..:
ఏఎఫ్‌క్యాట్ పరీక్ష విధానం :
ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఈకేటీ :
టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనంగా రాయాలి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఏఎఫ్‌ఎస్‌బీ.. స్టేజ్-1, 2 :
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు(ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. ఇక స్టేజ్-1 స్క్రీనింగ్ టెస్టులో చిన్న అసైన్మెంట్స్, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధోశక్తిని పరిశీలిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించిన వారే స్టేజ్-2కి వెళ్తారు. స్టేజ్-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇన్ డోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులుంటాయి. వీటిలో మానసిక , శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ దశలన్నీ పూర్తిచేసుకున్న వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైన వారి మెరిట్ లిస్ట్ తయారు చేసి శిక్షణ కోసం ఎంపిక చే స్తారు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2021 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
ఉపకార వేతనం :
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వారికి రూ.56,100 మూల వేతనం లభిస్తుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఎ సహా ఇతర అలవెన్సులు అదనం. మిలటరీ సర్వీస్ పే(ఎంఎస్పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పోస్టింగ్ పొందిన ప్రాంతం బట్టి రూ.83 వేల నుంచి రూ.96 వేల వరకు నెల వేతనం(సీటీసీ) పొందొచ్చు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, పిల్లలకు చదువుల అలవెన్సు, రాయితీ ధరలకు క్యాంటీన్, ఫర్నీచర్‌తో కూడిన నివాస సముదాయం, తక్కువ వడ్డీకి రుణాలు, ఎల్‌టీఏ, 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు ఉంటాయి.
శిక్షణ :
ఏఎఫ్ క్యాట్‌లో ఎంపికైన ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాల పాటు.. గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైన వారికి 52 వారాలపాటు ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ ఇస్తారు. ఫ్ల్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్, హకీంపేట్, బీదర్, ఎలహంకల్లో ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఫైటర్ పైలట్, ట్రాన్స్పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్‌గా వేర్వేరగా ఆయా విభాగాల్లో అంతర్గత శిక్షణ ఇస్తారు.
సిలబస్ :
ఆన్లైన్ పరీక్షలో జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు మాత్రం డిగ్రీ స్థాయిలో ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో క్రీడలు, చరిత్ర, భూగోళ శాస్త్రం,పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్య శాస్త్రంలోని ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌లోని వెర్బల్ ఎబిలిటీలో కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సినానిమ్స్, యాంటనిమ్స్, వొకాబ్యులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో.. సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, బారువడ్డీ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ విభాగంలో.. వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ (మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30
దరఖాస్తు ఫీజు: 250 (అన్ని కేటగిరి అభ్యర్థులకు).
ఏఎఫ్‌క్యాట్ ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2020, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.afcat.cdac.in

- ఈ(ఎల్): పర్మనెంట్ కమిషన్(పీసీ)-40, ఎస్ఎస్సీ-26
- ఏఈ(ఎం): పర్మనెంట్ కమిషన్-23, ఎస్ఎస్సీ-16
బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్):
- అడ్మిన్ పీసీ-24, ఎస్ఎస్సీ-16; అకౌంట్స్ పీసీ-14, ఎస్ఎస్సీ-10; లాజిస్టిక్స్ పీసీ-12, ఎస్ఎస్సీ-08.
ఎన్ఎన్సీ స్పెషల్ ఎంట్రీ: బ్రాంచ్.. ఫ్లయింగ్.. సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్ఎస్సీ కింద భర్తీ చేస్తారు.
ఏఎఫ్ క్యాట్ :
ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్, నాన్ టెక్నికల్) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో ఏఎఫ్ క్యాట్ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో రెండు రకాల పోస్టులుంటాయి. కొన్ని పర్మనెంట్ కమిషన్ (పీసీ), మరికొన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరిధిలోకి వస్తాయి. పర్మనెంట్ కమిషన్ (పీసీ) విభాగంలో ఎంపికైన వారు పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగొచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్‌లో అవకాశం పొందితే గరిష్టంగా 14ఏళ్ల పాటు ఉద్యోగంలో సేవలందించి వైదొలుగుతారు. మహిళలు ఎస్ఎస్సీ ఉద్యోగాలకే అర్హులు. అలాగే ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలైన పైలట్ పోస్టులన్నీ ఎస్ఎస్సీ కిందకే వస్తాయి. గ్రౌండ్ డ్యూటీ పోస్టులను పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు విభాగాల్లోనూ భర్తీ చేస్తారు.
అర్హతలు :
ఫ్లయింగ్ బ్రాంచ్ :
ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్(10+2)లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఫైనల్ చదువుతున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2021, జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 1997 నుంచి జనవరి 1, 2001 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ బ్రాంచ్ :
విభాగం: ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంటర్/10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
విభాగం: ఏరోనాటికల్ ఇంజనీరింగ్(మెకానికల్)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌ల్లో ఏదో ఒక విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసుండాలి. ఇంటర్/10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కువయసు: 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ-నాన్ టెక్నికల్ బ్రాంచ్ :
ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగాలున్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. అకౌంట్స్ విభాగానికి బీకాం 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు అర్హులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 20 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. జనవరి 2, 1995 నుంచి జనవరి 1, 2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం ఇలా..:
- కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పెలైట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టు(పీఏబీటీ), మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది.
- టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనంగా రాయాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1,స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు.
- ఫ్లయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్ ైపైలట్ సెలక్షన్ సిస్టం(సీపీఎస్‌ఎస్) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
ఏఎఫ్‌క్యాట్ పరీక్ష విధానం :
ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఈకేటీ :
టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనంగా రాయాలి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఏఎఫ్‌ఎస్‌బీ.. స్టేజ్-1, 2 :
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు(ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. ఇక స్టేజ్-1 స్క్రీనింగ్ టెస్టులో చిన్న అసైన్మెంట్స్, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధోశక్తిని పరిశీలిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించిన వారే స్టేజ్-2కి వెళ్తారు. స్టేజ్-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇన్ డోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులుంటాయి. వీటిలో మానసిక , శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ దశలన్నీ పూర్తిచేసుకున్న వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైన వారి మెరిట్ లిస్ట్ తయారు చేసి శిక్షణ కోసం ఎంపిక చే స్తారు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2021 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
ఉపకార వేతనం :
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వారికి రూ.56,100 మూల వేతనం లభిస్తుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఎ సహా ఇతర అలవెన్సులు అదనం. మిలటరీ సర్వీస్ పే(ఎంఎస్పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పోస్టింగ్ పొందిన ప్రాంతం బట్టి రూ.83 వేల నుంచి రూ.96 వేల వరకు నెల వేతనం(సీటీసీ) పొందొచ్చు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, పిల్లలకు చదువుల అలవెన్సు, రాయితీ ధరలకు క్యాంటీన్, ఫర్నీచర్‌తో కూడిన నివాస సముదాయం, తక్కువ వడ్డీకి రుణాలు, ఎల్‌టీఏ, 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు ఉంటాయి.
శిక్షణ :
ఏఎఫ్ క్యాట్‌లో ఎంపికైన ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాల పాటు.. గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైన వారికి 52 వారాలపాటు ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ ఇస్తారు. ఫ్ల్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్, హకీంపేట్, బీదర్, ఎలహంకల్లో ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఫైటర్ పైలట్, ట్రాన్స్పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్‌గా వేర్వేరగా ఆయా విభాగాల్లో అంతర్గత శిక్షణ ఇస్తారు.
సిలబస్ :
ఆన్లైన్ పరీక్షలో జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు మాత్రం డిగ్రీ స్థాయిలో ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో క్రీడలు, చరిత్ర, భూగోళ శాస్త్రం,పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్య శాస్త్రంలోని ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌లోని వెర్బల్ ఎబిలిటీలో కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సినానిమ్స్, యాంటనిమ్స్, వొకాబ్యులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో.. సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, బారువడ్డీ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ విభాగంలో.. వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ (మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30
దరఖాస్తు ఫీజు: 250 (అన్ని కేటగిరి అభ్యర్థులకు).
ఏఎఫ్‌క్యాట్ ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2020, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.afcat.cdac.in
Published date : 07 Dec 2019 11:42AM