ఉద్యోగానికి తొలి మెట్టు..ప్రాజెక్ట్ వర్క్!
Sakshi Education
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకమైంది. అది వారి భవిష్యత్తును నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంజనీరింగ్ ఫైనలియర్ ప్రారంభంలోనే విద్యార్థులు ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లు తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్ట్‌నంతా ఆచరణలోకి తీసుకురావాల్సింది ప్రాజెక్ట్ వర్క్‌లోనే! 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి నిపుణుల సూచనలు, సలహాలు...
విద్యార్థులు తొలుత ప్రాజెక్ట్ వర్క్ ప్రాధాన్యతను, అది వారికి భవిష్యత్తులో కలిగించే ప్రయోజనాన్ని, దానివల్ల వచ్చే ఉద్యోగావకాశాలను తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. పూర్తి అవగాహన, సృజనాత్మకతతో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. గతంలో సీనియర్ విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ కాన్సెప్టుల్ని పునరావృతం చేయకుండా కొత్త అంశాలను ఎంచుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్‌ను ఉద్యోగానికి తొలి మెట్టుగా పేర్కొనొచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్‌కను ప్రారంభించినప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు దూరదృష్టితో ఆలోచిస్తూ, తాజా సాంకేతిక ధోరణులను వినియోగించుకుంటూ నిజాయితీ, అంకితభావంతో కృషి చేస్తే మంచి కెరీర్‌కు పునాది వేసుకున్నట్టే. భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉన్న సమస్యలను ముందుగానే ఊహించి, వాటి పరిష్కారం దిశగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే అది విద్యార్థులను ఉద్యోగ అన్వేషణలో సఫలీకృతం అయ్యేట్లు చేస్తుంది.
స్పష్టత, ఆసక్తి ముఖ్యం
ఇంజనీరింగ్ విద్యార్థులు ఫైనలియర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే ప్రాజెక్ట్ వర్‌కను మొదలుపెట్టాలి. కాన్సెప్ట్‌పై క్లారిటీతోపాటు విద్యార్థి ఆసక్తి ప్రాజెక్ట్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్కెట్ ట్రెండ్స్.. సంస్థల అవసరాలు.. మారుతున్న టెక్నాలజీలు.. వాటికి నెలకొన్న డిమాండ్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించాలి. ప్రాజెక్ట్ వర్క్ ఎంపికలో తొందరపాటు, అవగాహన లేమి ఉండకూడదు. ఫ్యాకల్టీని, ఇండస్ట్రీ నిపుణులను సంప్రదించడంతోపాటు పరిశ్రమ అవసరాలను తెలుసుకుని కాన్సెప్ట్‌ను ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్‌లలో ఇది తప్పనిసరి. కోర్ రంగంలో తరచూ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందువల్ల ప్రాజెక్ట్ వర్క్ నిజ జీవితానికి ఉపయోగపడేలా ఉండేట్లు చూసుకోవాలి. మెరికల్లాంటి విద్యార్థులను సెలెక్ట్ చేసుకునేందుకు ఒక్కోసారి కంపెనీలే కాలేజీ క్యాంపస్‌లకు వస్తుంటాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి ప్రాజెక్ట్ వర్క్‌ను అప్పగిస్తాయి. దీంతో కాలేజీ క్యాంపస్‌లోనే ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ వర్క్‌ను కంపెనీలో చేశామా? లేక కాలేజీ క్యాంపస్‌లో చేశామా? అనే విషయం ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌ను సాధ్యమైనంత వరకు కంపెనీల్లో చేస్తేనే మంచిది. ఎందుకంటే విద్యార్థి పనితీరు నచ్చితే ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక అదే సంస్థలో ప్లేస్‌మెంట్ దొరికే అవకాశమూ ఉంది.
కోర్ బ్రాంచ్ విద్యార్థులకు ఉండాల్సిన నైపుణ్యాలు
ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్‌లను ఎవర్‌గ్రీన్ బ్రాంచ్‌లుగా పరిగణిస్తారు. ఆయా బ్రాంచ్‌లలో అవకాశాలకు కొదవలేకపోవడమే ఇందుకు కారణం. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మేలైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాజెక్ట్ వర్క్‌లో సత్తా చాటాలి. కోర్ బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు సమాజ పోకడలపైన, ఆయా రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులపైన ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. వీటికి అనుగుణంగా ఆలోచించి ఏ ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందో ఊహించగలగాలి. ఈ మేరకు ఫ్యాకల్టీ సాయం తీసుకోవడం ఉత్తమం.
సివిల్ ఇంజనీరింగ్
నిర్మాణ రంగంలో వేలకొద్దీ అవకాశాలను కల్పించే రంగం సివిల్. మన దేశంలో 2020 నాటికి దాదాపు నాలుగు లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరం ఉండనుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు భారీగా అందుబాటులోకి రానున్నాయి. సివిల్ ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ప్లానింగ్, డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, సూపర్‌విజన్, క్వాలిటీ కంట్రోల్, మెయింటనెన్స్ వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విభాగాల్లో డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ వర్క్‌లను చేయడం లాభిస్తుంది.
డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ వర్క్‌లు
సివిల్ ఇంజనీరింగ్‌లో ఎక్కువ మంది స్ట్రక్చరల్, ట్రాన్స్‌పోర్టేషన్, కన్‌స్ట్రక్షన్, హైడ్రాలిక్స్ విభాగాల్లో ప్రాజెక్ట్ వర్క్‌లను ఎంచుకుంటున్నారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో హై స్ట్రెంత్ కాంక్రీట్, డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్, స్పెషల్ కాంక్రీట్, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్, డిజైన్ ఆఫ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్, ఫౌండేషన్ ఇంజనీరింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) విభాగాల్లో ప్రాజెక్ట్ వర్కులకు డిమాండ్ నెలకొంది.
ఉద్యోగావకాశాలు
ఈ విభాగాల్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తే ఎల్ అండ్ టీ, నాగార్జునా కన్‌స్ట్రక్షన్ కంపెనీ, జీఎంఆర్ వంటి ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. హైడ్రాలిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తే నీటిపారుదల రంగానికి సంబంధించి ముఖ్యంగా భారీ డ్యాంల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, వీటికి సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో చోటు దొరుకుతుంది.
మెకానికల్ ఇంజనీరింగ్
పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నంత కాలం మెకానికల్‌లో కొలువులకు కొదవలేదు. అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సంపాదించుకుంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ప్రతి పరిశ్రమలోనూ మెకానికల్ ఇంజనీర్ అవసరం. వీళ్లు లేకుంటే పరిశ్రమలు మనుగడ సాగించలేవు. పరిశోధనలూ జరగవు. భారీ ఇంజనీరింగ్ పనిముట్ల నుంచి ప్రయోగశాలల్లో పరికరాలు, ఇంట్లో నిత్యం వాడే ఎలక్ట్రికల్ వస్తువుల వరకు అంతా మెకానికల్ ఇంజనీరింగ్‌లో సంభవించిన ఆవిష్కరణలే. అందువల్ల ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.
డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ వర్క్‌లు
ప్రసుత్తం మార్కెట్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్, జియోటెక్నికల్, ఎనర్జీ సిస్టం, మెషిన్ టూల్ డిజైనింగ్ తదితర విభాగాల్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది.
ఈసీఈ
సమాజాభివృద్ధిలో ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) పాత్ర అద్వితీయం. ప్రస్తుతం కమ్యూనికేషన్ టెక్నాలజీ విశ్వవ్యాప్తంగా సరిహద్దులను చెరిపివేస్తున్న నేపథ్యంలో అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ మొదలుకొని రాకెట్ ప్రయోగాల వరకు ఈసీఈ ఇంజనీర్ల పాత్ర ఎనలేనిది.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
మార్కెట్ ఒడిదొడుకులు, సంక్షోభాలతో పెద్దగా ప్రభావితమవని రంగం.. ఎలక్ట్రికల్. ఇందులో ఎప్పుడూ అవకాశాలు ఉంటూనే ఉంటాయి. పరిశ్రమలు మొదలు విద్యుదుత్పత్తి కంపెనీల్లో ఉద్యోగాలు చాలా ఉంటాయి.
ఉద్యోగావకాశాలు
ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, నేషనల్ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటి ప్రముఖ సంస్థల్లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్
ఇంజనీరింగ్ విభాగాలన్నింటిలో ఎక్కువ క్రేజ్ ఉన్న విభాగం సీఎస్‌ఈ. 21వ శతాబ్దం కంప్యూటర్ సైన్స్‌దే అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలో కొన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ తర్వాత పుంజుకొని ఇప్పటికీ క్రేజ్‌ను సంపాదించుకుంటున్న కోర్సు ఇది. దీని ద్వారా భారీ స్థాయిలో వేతనాలు, కార్పొరేట్ కొలువు, సమాజంలో హోదా లభిస్తాయి.
ప్రాజెక్ట్ వర్క్ కీలకం
ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో ప్రాజెక్ట్ వర్క్ కచ్చితంగా వారి భవిష్యత్‌ను నిర్దేశించేదే అని చెప్పొచ్చు. అందువల్ల దీన్ని ఏమాత్రం ఆషామాషీగా తీసుకోకూడదు. సవాల్‌గా భావించి పనిచేయాలి. భవిష్యత్‌లో వచ్చే ఉద్యోగావకాశాల్లో ప్రాజెక్ట్ వర్క్ కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో, కొత్త కంపెనీల్లో చేరేటప్పుడు ఇంటర్వ్యూల్లో ప్రాజెక్ట్ వర్క్‌పై 50 శాతానికి పైగా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకొని అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాజెక్టులను చేస్తే కచ్చితంగా మంచి అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. ఇందులో మంచి నైపుణ్యం సాధించినవారికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి.

Published date : 02 Jul 2016 03:13PM