సీఐఐ ఐప్యాట్ 2021 ఎగ్జామ్ సిలబస్, ప్రిపరేషన్ గురించి తెలుసుకోండిలా..
Sakshi Education
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నైపుణ్యాలను పరీక్షించి, వారి ప్రతిభను గుర్తించి.. కంపెనీలకు అందజేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)...
ఐపాట్ (ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్)ను నిర్వహిస్తోంది. సీఐఐ ఐపాట్–2021కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో... సిలబస్‌పై ప్రత్యేక కథనం...
సెక్షన్–1 కాగ్నిటివ్ ఎబిలిటీస్..
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో.. అలెగ్జిషన్ అండ్ మిక్చర్, ఏరియాస్ అండ్ మెన్సురేషన్, సగటు, క్యాలెండర్, కో ఆర్డినేట్ జ్యామెట్రీ, చైన్ రూల్, కాంపౌండ్ ఇంట్రస్ట్, హైట్ అండ్ డిస్టెన్స్, పార్టనర్‌షిప్, ఎల్‌సీఎం–హెచ్‌సీఎఫ్, నంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పైప్స్ అండ్ సిస్టెరన్స్, క్రిప్టరిథమిటిక్ ప్రాబ్లమ్స్, పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వేల్యూ అండ్ సర్ఫేస్ ఏరియా, ప్రాఫిట్ అంట్ లాస్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రోగ్రేషన్, సింపుల్ ఇంట్రస్ట్, సింప్లిఫికేషన్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, టైమ్ అండ్ వర్క్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపొర్షన్‌పై ప్రశ్నలు వస్తాయి.
- ఎనలిటికల్ రీజనింగ్‌లో.. అనాలజీస్, ఆర్గ్యుమెంట్స్, రక్త సంబంధాలు, బైనరీ లాజిక్, కాజ్ అండ్ ఎఫెక్ట్, క్లాక్స్, క్యూబ్స్, లాజికల్ గేమ్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డేటా సఫిసియన్సీ, లెటర్ సిరీస్, లాజిక్స్, లెటర్ సింబల్, లాజికల్ కనెక్టివ్స్, సిల్లొజిజం, లాజికల్ సీక్వెన్స్ అండ్ మ్యాచింగ్, లాజికల్ ప్రాబ్లమ్స్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్, లాజికల్ డిడక్షన్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్, కేలండర్స్, క్లాసిఫికేషన్‌పై దృష్టిపెట్టాలి.
- డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో..రాడార్ లేదా వెబ్, లైన్ చార్టు, పైచార్టు, కంబైన్డ్ డేటా సెట్, గ్రాఫ్ రిలేటెడ్ ప్రశ్నలు, టేబ్యులర్ ఫారం, బార్ గ్రాఫ్ లేదా పై చార్టులు, కేస్‌లెట్ ఫారం, మిస్సింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
- ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌లో.. సెంటెన్స్ కరెక్షన్, పేరాగ్రాఫ్ ఫార్మేషన్, వాక్య నిర్మాణం, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, వర్డ్స్ ఆర్డర్, వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్, చేంజ్ ఆఫ్ వాయిస్, సెంటెన్స్ ఆర్డరింగ్, గ్రామర్, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పై ప్రశ్నలు ఎదురవుతాయి.
సెక్షన్–2.. ప్రొఫెషనల్ ఎబిలిటీస్
- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్: ఇందులో కాంట్రాక్ట్స్.. వివిధ రకాల ఒప్పందాలు, కాంట్రాక్ట్ లీగల్ బేసిస్–ట్రాట్స్ యాక్ట్, భారతీయ కాంట్రాక్ట్ చట్టం, యజమానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టర్ అండ్ ఇంజనీర్/సప్లయర్– బాధ్యతలు–విధులు, కాంట్రాక్ట్ రకాలు,మధ్యవర్తిత్వం–వివాదాలు, ఒప్పంద నిబంధనలు–సామరస్యపూర్వక పరి ష్కారం, డిపార్ట్‌మెంటల్, లొకేషన్, సింగిల్, భారతీయ కాంట్రాక్ట్ చట్టం తదితర అంశాలు ఉంటాయి.
- హెల్త్ సేఫ్టీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో.. వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదం, ప్రమా దాల భావనలకు సంబంధించిన టాపిక్, విభిన్న రకాల అపాయాలను గుర్తించడం, రిస్క్ తగ్గింపుపై విభిన్న విధానాలు–సూత్రాలు, ఫ్యాక్టరీ చట్టం 1948 ప్రకారం ముఖ్యమైన భద్రతా నిబంధనలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాలి.
- పర్యావరణ చట్టాలు: ఇందులో పర్యావరణం–అటవీ మంత్రిత్వశాఖ ముఖ్యమైన విధులు, జనరల్ రిక్వైర్‌మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ సిస్టం,క్యోటో ప్రోటోకాల్,కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కీలక విధులు ఉంటాయి.
- సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎథిక్స్: ఇందులో సమాన అవకాశాలు, కుటుంబ నైతికత, సెక్స్ అండ్ జెండర్, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం, ఇంజనీర్ల ప్రొఫెషనల్ బాధ్యత, మహిళలు–పని, లైంగిక వేధింపుల భావనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సామాజిక విధులు, వ్యక్తిగత చట్టాలు–అవలోకనం(ఆస్తి హక్కులు/కుటుంబ చట్టాలు), వృత్తిపరమైన ప్రవర్తన– జవాబుదారీతనం,ముఖ్యమైన నైతిక ప్రవర్తనా నియమావళి, ప్రొఫెషనల్ ఇంజనీర్ల నైతిక ప్రవర్తనా నియమావళిపై ప్రశ్నలు ఉంటాయి.
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: ఇందులో ఖర్చు విశ్లేషణ, ఉత్పత్తి ప్రక్రియ ఉపాంత ఖర్చు–విశ్లేషణ, బ్రేక్ ఈవెన్ కాస్టింగ్, నిర్ణయం తీసుకోవడం లేదా కొనుగోలు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ, విభిన్న బడ్జెట్స్ తయారీ, క్యాష్ ఫ్లో విశ్లేషణ–కంట్రోల్, వ్యయ విశ్లేషణ, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, సెక్షనల్ అకౌంట్స్ మెయింటెనెన్స్, బ్యాలెన్స్ షీట్–రిటర్న్, బేసిక్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్రశ్నలు ఎదురవుతాయి.
- లీగల్ కాంట్రాక్ట్స్ అండ్ ఆర్బిట్రేషన్: ఇందులో వివిధ రకాల ఒప్పందాలు–ప్రభుత్వం, కాంట్రాక్ట్ లీగల్ బేసిస్–ట్రాట్స్ చట్టం అండ్ భారతీయ కాంట్రాక్ట్ చట్టం, యజమానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టర్ అండ్ ఇంజనీర్/సప్లయర్–బాధ్యతలు–విధులు, మధ్యవర్తిత్వం–వివాదాలు, ఒప్పంద నిబంధనలు–సామ రస్యపూర్వక పరిష్కారం, వివాద పరిష్కార బోర్డు, ఆర్బిట్రేటర్‌పై ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్–3(ఏ/బీ): ఇందులో ఫిజిక్స్,కెమిస్ట్రీ విభాగాల నుంచి, విద్యార్థి చదువుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు (10+50) వస్తాయి.
దరఖాస్తు విధానం..
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 2021, మార్చి31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్ష జూన్ మొదటి, రెండో వారంలో నిర్వహిస్తారు, జూలైలో సర్టిఫికేషన్ వస్తుంది. ఆగస్టు 2021 నుంచి ఉద్యోగాలకు ఇంటర్వూలకు హాజరుకావచ్చు.
- డిప్లొమా హోల్డర్స్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. 2021 మే 1 నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ ఎగ్జామ్ ఆగస్టు మొదటి, రెండో వారంలో నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో సర్టిఫికేష¯న్ అందిస్తారు. అక్టోబర్ నుంచి జాబ్ బోర్డ్ అందుబాటులో ఉంటుంది.
- పరీక్ష కేంద్రాలు: ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలోను; తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్లులో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు: https://www.ipate.in
ఇంకా చదవండి: part 1: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాల అంచన వేసేందుకు నిర్వహించే సీఐఐ ఐప్యాట్ 2021 నోటిఫికేషన్ విడుదల.. అర్హత వివరాలు తెలుసుకోండిలా..
Published date : 26 Mar 2021 03:53PM