ఫ్రెషర్స్ vs సీనియర్స్... ఎవరికి ఎలాంటి అవకాశాలు ?
Sakshi Education
జాబ్ మార్కెట్ ఎలా ఉంది? నియామకాలు పెరుగుతున్నాయా.. తగ్గాయా? ఏ రంగంలో ఎక్కువ ఆఫర్లు లభిస్తున్నాయి.. పే ప్యాకేజీలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఐటీలో రిక్రూట్‌మెంట్స్.. ఇవి.. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగుల నుంచి తాజాగా పట్టాతో జాబ్ మార్కెట్లో అడుగుపెట్టిన ఫ్రెషర్స్, ఇప్పటికే ఉద్యోగం చేస్తూ మిడ్ కెరీర్ మార్పుల గురించి ఆలోచిస్తున్న సీనియర్ల వరకూ... ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సందేహాలు! ఓ వైపు త్వరలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రారంభం కానున్నాయి.
మరోవైపు ఆటోమేషన్, ఏఐ కారణంగా సీనియర్లకు అనిశ్చిత పరిస్థితి! ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఫ్రెషర్స్‌కు అవకా శాలు.. మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ గమనంపై నిపుణుల విశ్లేషణ...
ప్రస్తుతం జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. నైపుణ్యాలున్న ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా టెక్నికల్ అర్హతలతో బయటకు వస్తున్న వారికి సంస్థల ప్రాధాన్యం లభిస్తోంది. బీటెక్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులకు గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పరిస్థితి కొంత మెరుగైంది. నౌకరీ డాట్ కామ్ నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఫ్రెషర్స్‌కు డిమాండ్ పరంగా 12 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో మిడిల్ లెవల్‌లో 8 శాతం, సబ్-సీనియర్ లెవల్‌లో ఆరు శాతం, సీనియర్ మేనేజ్‌మెంట్‌లో కేవలం 5 శాతం మాత్రమే వృద్ధి నమోదు కావడం గమనార్హం.
మాన్‌స్టర్ డాట్ కామ్ నివేదిక ప్రకారం 0-3 ఏళ్ల అనుభవమున్న వారికి గతేడాదితో పోల్చితే దాదాపు అన్ని రంగాల్లోనూ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా హెచ్‌ఆర్, అడ్మినిస్ట్రేషన్‌లో ఫ్రెషర్స్ విషయంలో 45 శాతం వృద్ధి నమో దైంది. అలాగే ఫైనాన్స్ అండ్ అ కౌంట్స్ విభాగంలో 34 శాతం, న్యాయ విభాగంలో అత్యధికంగా 87 శాతం డిమాండ్ నెలకొనడం విశేషం. ఇదే స మయంలో సీనియర్లు, మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌కు డిమాండ్ తగ్గడం గమనార్హం.
స్టార్టప్, ఈ-కామర్స్ :
స్టార్టప్‌లు, ఈ-కామర్స్, ఈ-రిటైల్ సంస్థలు ఫ్రెషర్స్‌కు పెద్దపీట వేయడంలో ముందంజలో నిలుస్తున్నాయి. మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వంటి సంప్రదాయ ఉద్యోగాలు మొదలు... డేటాఅనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ జాబ్స్ వరకూ.. వివిధ ఉద్యోగాలను తాజా గ్రాడ్యుయేట్లకు అందిస్తున్నాయి. తక్కువ జీతంతోనే ఫ్రెష్ టాలెంట్‌ను నియమించుకోవచ్చనే ధోరణి సంస్థల్లో కనిపిస్తోంది.
ఉత్పత్తి రంగం :
ఉత్పత్తి రంగంలో టెక్నికల్ అర్హతలున్న వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో ఐటీఐ ఉత్తీర్ణులను టెక్నీషియన్లుగా, డిప్లొమా ఉత్తీర్ణులను సూపర్‌వైజర్లుగా నియమిస్తున్నాయి. బీటెక్ అర్హతలున్న వారికి ప్రాజెక్ట్ అసోసియేట్ లేదా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ హోదాలు లభిస్తున్నాయి. ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులకు సగటున నెలకు రూ. 10వేల నుంచి రూ.18వేల వరకు; బీటెక్ పట్ట భద్రు లకు సగటున రూ. 20 వేల వరకు వేతనాలు అందుతున్నాయి.
బీఎఫ్‌ఎస్‌ఐ :
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో 30 శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. ఈ రంగంలో సంప్రదాయ డిగ్రీ ఉత్తీర్ణులకు కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్, ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ అర్హతలున్న వారికి నెట్ వర్కింగ్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఫ్రంట్ ఎండ్ విభాగాల్లో సగటున నెలకు రూ.20 వేలు; టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సగటున రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ రంగం :
ప్రస్తుతం ఈ రంగంలో నియామకాలు కొంత మంద కొడిగానే ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నౌకరీ డాట్ కామ్ ప్రకారం ఐటీ రంగంలో ఫ్రెషర్స్‌కు జాబ్స్ పరంగా రెండు శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. మాన్‌స్టర్ డాట్ కామ్ నివేదిక ప్రకారం ఇది ఇంకా తక్కువగానే ఉంది. ఆటోమేషన్ నేపథ్యంలో లేటెస్ట్ టెక్నాలజీస్ (ఐఓటీ, ఏఐ, అనలిటిక్స్ తదితర)పై పట్టున్న వారికి మాత్రం డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
సీనియర్ల సంగతి :
పదేళ్లకుపైగా అనుభవంతో దరఖాస్తు చేసుకునే సీనియర్స్‌లో తమ సంస్థ అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్నాయా? లేటెస్ట్ టెక్నాలజీపై వీరికి అవగాహన ఉందా.. అనే కోణంలో కంపెనీలు ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. గతేడాది కాలంలో సీనియర్ లెవల్ రిక్రూట్‌మెంట్స్‌లో తగ్గుదల నమోదైంది. ఐటీతో పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ, సీనియర్ల దరఖాస్తుల్లో ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి మాత్రం కంపెనీలు ఆహ్వానం పలుకుతున్నాయి. మిడిల్ లెవల్‌లో (4-7 అనుభవం) సగటున ఎనిమిది శాతం; సబ్ సీనియర్ లెవల్‌లో (8-12 ఏళ్ల అనుభవం) ఆరు శాతం; సీనియర్ మేనేజ్‌మెంట్ హోదా (13-16 ఏళ్ల అనుభవం)లో అయిదు శాతం హైరింగ్ వృద్ధి నమోదైంది. కాబట్టి మిడ్ కెరీర్‌లో ఉన్న సీనియర్‌లో ఉద్యోగాలు మారే విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నది నిపుణుల మాట.
సంస్థల కోణంలో...
ఫ్రెషర్స్: తాజా నైపుణ్యాలు ఉంటాయనే అభిప్రాయం.
ఐటీఐ: రూ.10 వేలు
డిప్లొమా: రూ.15 వేలు
బీటెక్, ఎంబీఏ: రూ.20 వేల నుంచి రూ.30 వేలు.
బీఏ, బీకాం: రూ.12 వేల నుంచి రూ.18 వేలు.
ఫ్రెషర్స్ హైరింగ్ ఆశాజనకమే.. కానీ
హైరింగ్ ట్రెండ్స్ కోణంలో ఫ్రెషర్స్‌కు పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, వారు కేవలం అకడమిక్ సర్టిఫికెట్‌తోనే ఉద్యోగం లభిస్తుందనుకోవడం సరికాదు. ఎందుకంటే.. కంపెనీలు అకడమిక్‌తోపాటు లేటెస్ట్ అప్‌డేట్స్‌పై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఉంటేనే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
- శశికుమార్, ఎండీ, ఇన్‌డీడ్.
క్యాంపస్ డ్రైవ్స్‌కే ప్రాధాన్యం :
ఫ్రెషర్స్ హైరింగ్ విషయంలో సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్‌కే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టే సంస్థలు, వాటి విధివిధానాలు, అర్హతలు, ఇతర నిబంధనలు తెలుసుకుని వాటిని సొంతం చేసుకోవడానికి కృషిచేయాలి. ఇక.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరగని ఇన్‌స్టిట్యూట్‌ల అభ్యర్థులు జాబ్ పోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్లను నిరంతరం వీక్షిస్తూ అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- ఎ.జి.రావు, ఎండీ, మ్యాన్‌పవర్ గ్రూప్.
- ''నైపుణ్యాలుంటే ఫ్రెషర్స్‌కు అవకాశాలు అందుకునే వీలుంది. కానీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకపోవడమే ప్రధాన సమస్యగా నిలుస్తుంది''.
- సీనియర్లు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు అలవరచుకుంటేనే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి''.
- సాఫ్ట్‌వేర్, బీఎఫ్‌ఎస్‌ఐ, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటో మొబైల్.. ఇలా ఏ రంగంలోనైనా ఇదే పరిస్థితి !!

- పనిలో చొరవ చూపిస్తారనే ఆలోచన.
- ఉద్యోగ భద్రత కోణంలో మెరుగైన పనితీరు ప్రదర్శిస్తారనే భావన.
- కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా మెరుగ్గా రాణిస్తారనే అభిప్రాయం.
- ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుందనే ఆలోచన.
- లేటెస్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంపై ఆసక్తి చూపరనే అభిప్రాయం.
- క్రీయేటివ్ థింకింగ్‌కు ఆస్కారం తక్కువ.
- సవాళ్లను స్వీకరించడంలో అనుభవం ఉపయోగపడుతుందనే అభిప్రాయం.
ఐటీఐ: రూ.10 వేలు
డిప్లొమా: రూ.15 వేలు
బీటెక్, ఎంబీఏ: రూ.20 వేల నుంచి రూ.30 వేలు.
బీఏ, బీకాం: రూ.12 వేల నుంచి రూ.18 వేలు.
ఫ్రెషర్స్ హైరింగ్ ఆశాజనకమే.. కానీ
హైరింగ్ ట్రెండ్స్ కోణంలో ఫ్రెషర్స్‌కు పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, వారు కేవలం అకడమిక్ సర్టిఫికెట్‌తోనే ఉద్యోగం లభిస్తుందనుకోవడం సరికాదు. ఎందుకంటే.. కంపెనీలు అకడమిక్‌తోపాటు లేటెస్ట్ అప్‌డేట్స్‌పై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఉంటేనే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
- శశికుమార్, ఎండీ, ఇన్‌డీడ్.
క్యాంపస్ డ్రైవ్స్‌కే ప్రాధాన్యం :
ఫ్రెషర్స్ హైరింగ్ విషయంలో సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్‌కే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టే సంస్థలు, వాటి విధివిధానాలు, అర్హతలు, ఇతర నిబంధనలు తెలుసుకుని వాటిని సొంతం చేసుకోవడానికి కృషిచేయాలి. ఇక.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరగని ఇన్‌స్టిట్యూట్‌ల అభ్యర్థులు జాబ్ పోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్లను నిరంతరం వీక్షిస్తూ అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- ఎ.జి.రావు, ఎండీ, మ్యాన్‌పవర్ గ్రూప్.
Published date : 07 Sep 2018 05:33PM