`ప్రాంగణం`లో పదిలమైన కెరీర్...
Sakshi Education
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు సంపాదించడం... నేటి ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రథమ లక్ష్యం. బీటెక్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులంతా కాలేజీ నుంచి ‘ప్లేస్‌మెంట్స్’ అనే ఔట్‌గేట్ ద్వారా ఉన్నత కెరీర్‌లోకి అడుగుపెట్టాలని కోరుకుంటారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్ ప్రారంభమవుతున్న క్రమంలో ‘ప్రాంగణం’లో పదిలమైన జాబ్ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు ఉన్న మార్గాలపై స్పెషల్ ఫోకస్...
ప్రతి విద్యార్థికి తన కెరీర్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఉదాహణకు సివిల్ ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఆ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. వృత్తి, విధులు, కెరీర్ వృద్ధి, సానుకూల-ప్రతికూల అంశాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. ఈ విధమైన అవగాహనతో విద్యార్థుల్లో కెరీర్ పట్ల ఆసక్తితోపాటు క్యాంపస్ కొలువులను సాధించే అర్హతలు అలవడతాయి.
ఆకట్టుకునే రెజ్యూమె...
‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. రెజ్యూమె.. విద్యార్థి గురించి కంపెనీ లేదా సంస్థకు తెలియజేసే డాక్యుమెంట్. అందుకే దీని తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కంపెనీలు తమ అవసరాలకు సరిపోయే అభ్యర్థుల కోసం గాలిస్తుంటాయి. అందుకే విద్యార్థులు కంపెనీల అవసరాలను ప్రతిబింబించేలా రెజ్యూమె రూపొందించుకోవాలి. సీనియర్ విద్యార్థులు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ల సలహాలు తీసుకోవాలి. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లను ఉపయోగించుకోవాలి.
రెజ్యూమె టిప్స్:
ఇలా సిద్ధంకండి...
టెక్నికల్-నాన్ టెక్నికల్ స్కిల్స్
డొమైన్ జాబ్స్:
నాన్ డొమైన్ జాబ్స్
నాన్ డొమైన్ జాబ్స్‌ను జనరిక్ జాబ్స్‌గా నిర్వచిస్తారు. బీపీవో/కెపీవో/సర్వీసెస్/టెక్ సపోర్ట్ వంటి విభాగాలు ఈ కోవకు చెందినవి. తెలుగు రాష్ట్రాల్లో 55 శాతం నియామకాలు ఐటీ, ఐటీఈఎస్ సేవా రంగానికి చెందిన కంపెనీలు చేపడుతున్నాయి. విద్యార్థులు సైతం వీటిలో ఉద్యోగాలు సంపాదించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు.
సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ:
రిక్రూట్‌మెంట్ సీజన్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువును ఖాయం చేసుకోవాలంటే సాఫ్ట్‌స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. వీటిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి.
ఇంటర్వ్యూ:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో కీలకమైంది ఇంటర్వ్యూ. టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఒక్కోసారి ఇవి రెండూ కలిసి ఉంటాయి. చాలా కంపెనీలు వీటిని వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. టెక్నికల్ రౌండ్‌లో కంపెనీ అవసరాలకు తగ్గట్లు ప్రశ్నలు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థి రాత పరీక్షలో రాసిన సమాధానాల ఆధారంగా ప్రశ్నిస్తారు.

- ఇతరుల రెజ్యూమెల్లోంచి మంచి అంశాలను తీసుకోవచ్చు కాని పూర్తిస్థాయి కాపీ చేయకూడదు.
- ఇంటర్వ్యూలో చర్చించే అంశాల్లో దాదాపు 60 శాతం ప్రాజెక్టువర్క్ గురించే ఉంటాయి. కాబట్టి సంబంధిత అంశాలను స్పష్టంగా అర్థమయ్యేలా పేర్కొనాలి. ఆయా అంశాలపై ఏ కోణంలో ప్రశ్న అడిగినా చెప్పగలిగేలా సన్నద్ధత అవసరం.
- ఎక్స్‌ట్రా కరిక్యులం యాక్టివిటీస్, అలవాట్లు, నాయకత్వ లక్షణాలు, సానుకూల వైఖరులు, బృంద స్ఫూర్తి తదితరాలను ప్రతిబింబించే అంశాలను స్పష్టంగా పేర్కొనాలి. ఉదాహరణకు కాలేజీలో ఏదైనా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తే దాన్ని ప్రస్తావించాలి.
- బలాలు-బలహీనతలు, రిఫరెల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇలా సిద్ధంకండి...
- సబ్జెక్టు, భవిష్యత్తు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఫ్యాకల్టీ, సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి.
- విద్యార్థులు ఆయా రంగాలకు సంబంధించి తాజా పరిణామాలు, మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం అవసరం. వీటికోసం బిజినెస్ పత్రికలు, మ్యాగజైన్లను ఉపయోగించుకోవాలి.
- టెక్నికల్ స్కిల్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా కోడింగ్, డి-బగ్గింగ్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
టెక్నికల్-నాన్ టెక్నికల్ స్కిల్స్
డొమైన్ జాబ్స్:
- డొమైన్ జాబ్స్ కోర్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉంటాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి... కెరీర్‌ను సైట్ ఇంజనీరింగ్, స్ట్రక్చురల్ డిజైన్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌ల్లో ఏదో ఒక దాంట్లో ప్రారంభిస్తాడు. సంబంధిత డొమైన్‌లో చేసిన మైనర్, మేజర్ ప్రాజెక్టుల్లో మీరు చూపిన ఉత్సాహం... ఇంటర్వ్యూ బోర్డు గుర్తించేలా చూసుకోవాలి.
- {పొడక్ట్ డెవలప్‌మెంట్ ఉద్యోగ నియామకాల్లో విద్యార్థులను వివిధ అంశాల్లో పరీక్షిస్తారు. అవి...
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు- 20 శాతం.
- ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ- 25 శాతం.
- పోగ్రామింగ్ స్కిల్స్, లాజికల్ థాట్స్- 55 శాతం.
- చాలా మంది ఒక ప్రోగ్రామ్ వెనుకున్న లాజిక్‌ను వివరించడంలో ఇంటర్వ్యూ బోర్డు ముందు విఫలమవుతున్నారు. అందువల్ల ఇ, ఇ++, జావా, కోర్ జావా తదితర భాషల్లో ప్రోగ్రామ్‌లను రాయడం, వాటిని బాగా వివరించడంలో నైపుణ్యాలు పెంచుకోవాలి. డాట్ నెట్ టెక్నాలజీస్, మొబైల్ అప్లికేషన్స్, ఈ-కామర్స్ సంబంధిత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
నాన్ డొమైన్ జాబ్స్
నాన్ డొమైన్ జాబ్స్‌ను జనరిక్ జాబ్స్‌గా నిర్వచిస్తారు. బీపీవో/కెపీవో/సర్వీసెస్/టెక్ సపోర్ట్ వంటి విభాగాలు ఈ కోవకు చెందినవి. తెలుగు రాష్ట్రాల్లో 55 శాతం నియామకాలు ఐటీ, ఐటీఈఎస్ సేవా రంగానికి చెందిన కంపెనీలు చేపడుతున్నాయి. విద్యార్థులు సైతం వీటిలో ఉద్యోగాలు సంపాదించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు.
- సర్వీస్ సెక్టార్ ఉద్యోగాలకు పరీక్షించే నైపుణ్యాలు: ఇంగ్లిష్ భాషా సామర్థ్యం-45 శాతం; ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ-30 శాతం; బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్-25 శాతం.
- సర్వీస్ సెక్టార్ కంపెనీలు కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యం, నాన్ ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో బలహీనంగా ఉంటున్నారు. వీరు ఈ స్కిల్స్ పెంపొందించుకోవడానికి అధిక సమయం కేటాయించాలి. సెమినార్లలో పాల్గొనడం, ఫ్యాకల్టీ, సహచరులతో ఇంగ్లిష్‌లో మాట్లాడటం, జర్నల్స్, ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం ద్వారా ఇంగ్లిష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకోవచ్చు.
- క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సమయంలో నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్‌లో మంచి స్కోర్ చేయగలిగితే ఉద్యోగం గ్యారంటీ.
- ఐటీ పరిశ్రమ (బీపీవో, కేపీవోలు తప్ప) నియామకాలకు బేసిక్ కంప్యూటర్ కాన్సెప్టులపై పట్టు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ తప్పనిసరి. సేవా రంగం పరిశ్రమలైతే నియామకాల సమయంలో ఐటీ స్కిల్స్‌కు ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం లేదు. ఈ కంపెనీలు అభ్యర్థులకు ప్రొబేషనరీ సమయంలో అవసరమైన ఐటీ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నాయి.
సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ:
రిక్రూట్‌మెంట్ సీజన్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువును ఖాయం చేసుకోవాలంటే సాఫ్ట్‌స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. వీటిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి.
- సెమినార్లు: ఆత్మస్థైర్యం ఇనుమడిస్తుంది. స్టేజ్ అంటే భయం పోతుంది. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది.
- జస్ట్ ఎ మినిట్ సెషన్ (జామ్), జీడీ, డిబేట్: ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఆత్మస్థైర్యంతో సందేశాన్ని చేరవేసే నైపుణ్యాలు, సందర్భాన్ని బట్టి హావభావాలు ఎలా ఉండాలో తెలుస్తుంది.
- సమయ పాలన: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయ పాలన చాలా అవసరం. ఈ క్రమంలో విద్యార్థుల్లో సమయ పాలనను అంచనా వేసేందుకు రిక్రూటర్లు ప్రాధాన్యమిస్తున్నారు. దీన్ని గుర్తించి విద్యార్థులు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఉదాహరణకు ఏదైనా ప్రాజెక్టు ఇచ్చి.. దాన్ని నువ్వు ఎలా పూర్తిచేస్తావో చెప్పు? అని అడిగిన సందర్భాల్లో విద్యార్థి చాకచక్యంగా వ్యవహరించాలి.
- బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం: అభ్యర్థి ఓ బృందంతో కలిసి పనిచేయగలడా? బృందానికి నాయకత్వం వహించి, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయగలడా? సందర్భానుసారం సరైన నిర్ణయాలు తీసుకోగలడా? వంటి అంశాలను పరిశీలించేలా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఈ స్కిల్స్ పెంచుకునేందుకు కృషిచేయాలి.
ఇంటర్వ్యూ:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో కీలకమైంది ఇంటర్వ్యూ. టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఒక్కోసారి ఇవి రెండూ కలిసి ఉంటాయి. చాలా కంపెనీలు వీటిని వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. టెక్నికల్ రౌండ్‌లో కంపెనీ అవసరాలకు తగ్గట్లు ప్రశ్నలు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థి రాత పరీక్షలో రాసిన సమాధానాల ఆధారంగా ప్రశ్నిస్తారు.
- ఉద్యోగం, సంబంధిత సంస్థపై విద్యార్థి ఆసక్తి; బలాలు-బలహీనతలు; హాబీలు, కోకరిక్యులర్-ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తదితర అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు.
Published date : 30 Jul 2015 06:26PM