పీఎస్‌యూలకు సన్నద్ధమవ్వండిలా...!
Sakshi Education
గేట్... గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే పరీక్ష.
ప్రభుత్వ రంగంలోని నవరత్న, మహారత్న, మినీరత్న హోదాలు పొందిన పీఎస్‌యూ(పబ్లిక్ సెక్టార్‌యూనిట్స్)ల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సైతం మార్గంగా నిలుస్తోంది గేట్. ఇటీవల గేట్-2018 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. పీఎస్‌యూలు మలిదశ ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పీఎస్‌యూల్లో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ తీరుతెన్నులను తెలుసుకుందాం...
గేట్-2018 మొత్తం 23 పేపర్లలో ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 3,4,10,11 తేదీల్లో జరిగింది. దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా హాజరయ్యారు. గేట్ పరీక్ష 65 ప్రశ్నలు..100 మార్కులకు 3 గంటల వ్యవధిలో జరిగింది. మార్చిలో ఫలితాలు వెల్లడించారు. గేట్ స్కోర్‌తో నియామకాలు చేపట్టే పీఎస్‌యూల్లో ప్రముఖంగా పేర్కొనే గెయిల్, బీపీసీఎల్, బీహెచ్‌ఈఎల్, పవర్‌గ్రిడ్, ఐఓసీఎల్ తదితర కంపెనీల్లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ కంపెనీలు మలిదశ ఎంపిక ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నాయి.
మలిదశకు ఎంపిక :
పీఎస్‌యూలు అభ్యర్థులను మలిదశ ప్రక్రియకు ఎంపిక చేసేందుకు.. ఆ తర్వాత తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. గేట్ స్కోర్‌కు 70 శాతం నుంచి 75 శాతం వెయిటేజీ.. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలకు మిగతా 30 శాతం నుంచి 25శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తున్నాయి. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన చివరి అభ్యర్థి పొందిన స్కోర్/పర్సంటేజినే ఫైనల్ కటాఫ్‌గా పేర్కొంటున్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు జరిపే పీఎస్‌యూలు.. మలి దశలో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థిని లోతుగా పరీక్షిస్తున్నాయి.
గ్రూప్ డిస్కషన్ :
గ్రూప్ డిస్కషన్(జీడీ)లో భాగంగా.. ఐదు నుంచి పది మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటుచేసి... ఏదైనా ఒక టాపిక్‌పై చర్చించమని అడుగుతున్నారు. జీడీ దాదాపు అరగంట వ్యవధిలో ఉంటుంది. కాబట్టి ఒక్కో అభ్యర్థికి సగటున అయిదు నిమిషాల సమయం లభిస్తుంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు అంశంపై తమ అభిప్రాయాలు నిర్దిష్టంగా చెప్పాలి. ఇతర సభ్యుల వాదనపై స్పందిస్తూనే.. తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుంది.
గ్రూప్ టాస్క్ :
పలు పీఎస్‌యూలు గ్రూప్ టాస్క్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. ఏదైనా ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందుంచి.. దానికి పరిష్కారం కనుక్కోమని అడుగుతున్నారు. సదరు సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో.. అభ్యర్థులు బృందంగా పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను రియల్ టైం అప్లికేషన్ పరంగా ఎలా అనువర్తింప చేస్తున్నారో పరీక్షించడం గ్రూప్ టాస్క్ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఒక టాస్క్‌ను పూర్తిచేసే క్రమంలో ఇతరులతో కలిసి పనిచేసే దృక్పథం వంటి లక్షణాలను పరిశీలించేందుకు గ్రూప్ టాస్క్ నిర్వహణ విధానాన్ని అనుసరిస్తున్నాయి.
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ :
గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌లలో విజయం సాధించిన అభ్యర్థులు.. చివరిగా ఎదుర్కోవాల్సిన కీలక దశ.. పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ సందర్భంగా అభ్యర్థుల్లోని రెండు ముఖ్య లక్షణాలను పరీక్షిస్తారు. అవి.. సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిగత నేపథ్యం. సాంకేతిక నైపుణ్యం పరంగా.. అప్పటికే అభ్యర్థులు పూర్తి చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అభ్యర్థుల భవిష్యత్తు కెరీర్ లక్ష్యాలను తెలుసుకునే విధంగా ఉంటున్నాయి. అభ్యర్థి భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఎంపిక చేసుకున్న విభాగం లేదా సబ్జెక్ట్ ద్వారా వాటిని అందుకోగలరా? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి.
మంచి స్కోర్ ఉంటేనే..
గత రెండేళ్లుగా గేట్‌కు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో ఎక్కువ శాతం మంది పీఎస్‌యూ ఉద్యోగమే లక్ష్యంగా ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. దాంతో పీఎస్‌యూ నియామకాల పరంగా మలిదశ కటాఫ్‌తోపాటు ఫైనల్ కటాఫ్ ఏటేటా పెరుగుతోంది. జనరల్ కేటగిరీలో 800కు పైగా స్కోర్ సాధించిన అభ్యర్థులకే నియామకాలు ఖరారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా గేట్ స్కోర్ ఆధారంగా క్రేజీ పీఎస్‌యూలుగా నిలుస్తున్న సంస్థలు ఎన్‌టీపీసీ, బీఈఎంఎల్, పవర్‌గ్రిడ్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్, సెయిల్ మాత్రమేకాకుండా... డీఆర్‌డీఓ, ఎండీఎల్, వైజాగ్ స్టీల్ వంటి సంస్థల్లో చేరేందుకు కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటిలో గేట్ స్కోర్ జనరల్ కేటగిరీలో సగటున 750, రిజర్వ్‌డ్ కేటగిరీల్లో 500 నుంచి 600 మధ్యలో ఉంటోంది.
ఆ వివరాలు...
1) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా:
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్.
మొత్తం పోస్టులు : 542.
అర్హత: ఆయా బ్రాంచ్‌లతో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, గేట్ ఉత్తీర్ణత.
గరిష్ట వయోపరిమితి: ఏప్రిల్ 30 నాటికి 27ఏళ్లు(ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు)
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 5 - మే 4, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/recruitment
2) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు.
మొత్తం పోస్టులు: 200.
అర్హత: ఆయా బ్రాంచ్‌లతో 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత.
వయో పరిమితి: ఏప్రిల్ 18, 2018 నాటికి 26ఏళ్లు . రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://npcilcareers.co.in
3) మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్
పోస్ట్: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
అర్హత: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత. గేట్-2017 ఉత్తీర్ణత.
వయో పరిమితి: జనవరి 21, 2018 నాటికి 28 సంవత్సరాలు.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 9 - మే 8, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.mecl.gov.in/Careers.aspx

Published date : 18 Apr 2018 06:16PM