నయా ట్రెండ్...మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్
Sakshi Education
ఎంబీఏ .. ఇంజనీరింగ్.. ఇవి రెండు స్వరూపం, సిలబస్ పరంగా పూర్తిగా భిన్నమైనవి!ఒకదానికొకటి సంబంధం లేని కోర్సులు..కానీ.. ఇప్పుడు.. ఈ కోర్సుల్లో.. కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఐవోటీ, రోబోటిక్స్, బిగ్ డేటా, ఏఐ వంటివి ఇటు ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా.. అటు మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు కూడా తప్పనిసరిగా మారుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు పెంచేందుకు మేనేజ్‌మెంట్ సంబంధిత టాపిక్స్‌ను చేర్చడం జరుగుతోంది. అలాగే టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ అంశాల కలయికతో కొత్త కోర్సులకు రూపకల్పన జరుగుతోంది. ఈ నేపథ్యంలో నయా ట్రెండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం..
వాస్తవానికి మేనేజ్‌మెంట్ కోర్సు అంటే నిర్వహణ నైపుణ్యాలను అందించే కోర్సు. భవిష్యత్తు లీడర్లను తీర్చిదిద్దే ప్రోగ్రామ్. ఇప్పుడు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ అంశాలు చొచ్చుకొస్తున్నాయి. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలూ అవసరమవుతున్నాయి. ఆటోమేషన్ ప్రభావంతో కంపెనీల్లో విధి నిర్వహణలో అవి కీలకంగా మారుతున్నాయి. పోటీ ప్రపంచంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి, సేవలు అందించేందుకు కంపెనీలు తమ మేనేజర్స్‌కు లేటెస్ట్ టెక్నాలజీపై పట్టుండాలని కోరుకోవడం పరిపాటిగా మారింది. కారణం.. సంస్థలు తాము అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు తమ ఉన్నత ఉద్యోగులకు ఉండాలని ఆశిస్తుండటమే! ఇదే కారణంగా గత రెండేళ్లుగా మేనేజ్‌మెంట్ కోర్సుల కరిక్యులంలో టెక్నికల్ అంశాలు కనిపిస్తున్నాయి. కేస్ స్టడీస్, అందుకు సంబంధించి జర్నల్స్ విశ్లేషణలో మునిగితేలే మేనేజ్‌మెంట్ విద్యార్థులు.. లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకొని మేనేజ్‌మెంట్ ఇంజనీర్లుగా తమను తాము మలచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి ఎంతో కీలకం...
మేనేజ్‌మెంట్ కోర్సుల కరిక్యులంలో సాంకేతిక అంశాలు చొచ్చుకురావడానికి ప్రధాన కారణం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కోర్సుల్లో టెక్నాలజీపరంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బిగ్‌డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్.. అనేవి కీలకంగా నిలుస్తున్నాయి. క్లయింట్లకు సమర్థంగా, వేగంగా సేవలు అందించే క్రమంలో కంపెనీలకు ఈ టెక్నాలజీ తప్పనిసరిగా మారుతోంది. దాంతో అటు ఇంజనీరింగ్‌తోపాటు ఇటు మేనేజ్‌మెంట్ విభాగాలవారికి కూడా విధినిర్వహణలో ఇవి ఆవశ్యకంగా మారుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే ఒక ఉత్పత్తి లేదా సర్వీస్‌ను సాంకేతికంగా ఏఐ విధానంలో రూపొందించినప్పుడు దానికి సంబంధించిన వివరాలు అర్థం చేసుకోవాలంటే.. సదరు నిర్వహణ అధికారులకు కూడా దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా దైనందిన కార్యకలాపాల కోణంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కీలకంగా మారుతోంది. అలాగే ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లోని సిబ్బంది ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా కంపెనీల్లో రోబోటిక్స్‌తో కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక రోబో పనిచేసే విధానం తెలుసుకోవడం ద్వారా.. దానికి సంబంధించి ఒక పని పూర్తయిన తర్వాత నిర్వహణ పరంగా అనుసరించాల్సిన విధి విధానాల గురించి మేనేజ్‌మెంట్ నిపుణులకు అవగాహన ఉండటం ఎంతో మేలు చేస్తుంది.
బిగ్ డేటా.. బిజినెస్ అనలిటిక్స్ :
మేనేజ్‌మెంట్ విద్యలో టెక్నాలజీ ఆవశ్యకతను గుర్తించిన బీస్కూల్స్ తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నాయి. కరిక్యులంలో మార్పులు చేస్తున్నాయి.
ఐఐఎంలు మాత్రమే కాకుండా.. మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల బోధన పరంగా జాతీయ స్థాయిలో పేరున్న ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ), హెచ్‌సీయూ తదితర యూనివర్సిటీలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్ అంశాలను పూర్తి స్థాయిలో బోధించేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ కోర్సును ప్రారంభించింది. ఇటీవల కాలంలో రాష్ట్రాల స్థాయిలో టాప్-10 జాబితాలో ఉంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు, క్యాంపస్ కళాశాలల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు వచ్చే ఏడాది నుంచి కరిక్యులంలో మార్పులు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా మేనేజ్‌మెంట్ అంశాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్!
ఎంబీఏలో టెక్నాలజీ టాపిక్స్‌ను చేరుస్తున్నట్లుగానే.. ఇంజనీరింగ్/టెక్నికల్ కోర్సుల్లోనూ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాల చేరికతో పలు కొత్త కోర్సులకు ఆవిష్కరణ జరుగుతోంది. ముఖ్యంగా ఎంటెక్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లు స్పెషలైజేషన్‌గా కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా బీటెక్ స్థాయిలో ఈ అంశాలు కరిక్యులంలో ఒక సబ్జెక్ట్‌గా బోధించేందుకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఇప్పుడు కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల్లో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి.. ఇటు లేటెస్ట్ టెక్నాలజీతోపాటు అటు మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాలపైనా అవగాహన ఉంటేనే సంస్థల లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే ఆయా కోర్సుల్లో సంబంధిత నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. కంపెనీలకు ప్రస్తుతం అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా...
వాస్తవ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం జరుగుతోంది. ఈ విషయంలో అటానమస్ హోదా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు ముందుంటున్నాయి. అందుకే ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఇవి త్వరగా రూపొందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌సీయూలో కూడా బిజినెస్ అనలిటిక్స్‌లో ఎంబీఏ కోర్సును ప్రారంభించాం. అదే విధంగా హెల్త్‌కేర్‌కు నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును ప్రవేశ పెట్టాం. కంపెనీల అవసరాలకు అనుగుణంగా అకడమిక్స్ మారితేనే విద్యార్థులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు స్వాగతం పలుకుతాయి.
- ప్రొఫెసర్ బి.రాజశేఖర్, డీన్, ఎస్‌ఎంఎస్, హెచ్‌సీయూ

- వాస్తవానికి బిగ్ డేటా అనలిటిక్స్ అనేది ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్.. రెండు కోర్సుల వారికి అవసరమైన నైపుణ్యమే. స్థూలంగా చెప్పాలంటే.. సంస్థల వినియోగదారులను గుర్తించడం, వారి ప్రొఫైల్స్‌ను విశ్లేషించి, వారి ఆసక్తులు, గత కొనుగోళ్లు ఆధారంగా వారు కోరుకుంటున్న, ఆసక్తి చూపుతున్న ప్రొడక్ట్స్ గురించి విశ్లేషించి దానికి అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌ల రూపకల్పన దిశగా చర్యలు చేపట్టడం. ఈ విషయంలో సాంకేతిక నిపుణులు బిగ్ డేటా సమాచారాన్ని అందిస్తే.. దాన్ని విశ్లేషించడం మేనేజ్‌మెంట్ అభ్యర్థుల విధిలో భాగంగా మారుతోంది.
- ఇక మేనేజ్‌మెంట్ అభ్యర్థులకే పరిమితమని పేర్కొన దగ్గ అంశం.. బిజినెస్ అనలిటిక్స్. సంస్థకు సంబంధించి మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాల కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర అంశాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి బిజినెస్ అనలిటిక్స్ దోహదపడుతుంది. ఇది కూడా ఇప్పుడు మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తోపాటు ఇంజనీరింగ్ కోర్సుల్లో ముఖ్యాంశంగా మారుతోంది. .
మేనేజ్‌మెంట్ విద్యలో టెక్నాలజీ ఆవశ్యకతను గుర్తించిన బీస్కూల్స్ తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నాయి. కరిక్యులంలో మార్పులు చేస్తున్నాయి.
- దేశంలోని ప్రముఖ ఐఐఎంలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌లో ఒక కోర్సుగా చేర్చాయి.
- ఐఐఎం-బి, కోజికోడ్, కోల్‌కత వంటి ఇన్‌స్టిట్యూట్‌లు బిగ్‌డేటా మేనేజ్‌మెంట్‌లో ఆరు నెలల స్వల్ప వ్యవధిలో కోర్సును నిర్వహిస్తున్నాయి.
- ఐఐఎం- కోజికోడ్ మరో అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మెషీన్ లెర్నింగ్‌ను సైతం పీజీ ప్రోగ్రామ్‌లో ఒక కోర్సుగా ప్రవేశ పెట్టింది.
- ఇవే కాకుండా మిగతా ఐఐఎంలు కూడా ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్‌ను పీజీ ప్రోగ్రామ్‌లో ఒక కోర్సుగా బోధిస్తున్నాయి.
ఐఐఎంలు మాత్రమే కాకుండా.. మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల బోధన పరంగా జాతీయ స్థాయిలో పేరున్న ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ), హెచ్‌సీయూ తదితర యూనివర్సిటీలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్ అంశాలను పూర్తి స్థాయిలో బోధించేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ కోర్సును ప్రారంభించింది. ఇటీవల కాలంలో రాష్ట్రాల స్థాయిలో టాప్-10 జాబితాలో ఉంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు, క్యాంపస్ కళాశాలల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు వచ్చే ఏడాది నుంచి కరిక్యులంలో మార్పులు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా మేనేజ్‌మెంట్ అంశాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్!
ఎంబీఏలో టెక్నాలజీ టాపిక్స్‌ను చేరుస్తున్నట్లుగానే.. ఇంజనీరింగ్/టెక్నికల్ కోర్సుల్లోనూ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాల చేరికతో పలు కొత్త కోర్సులకు ఆవిష్కరణ జరుగుతోంది. ముఖ్యంగా ఎంటెక్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లు స్పెషలైజేషన్‌గా కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా బీటెక్ స్థాయిలో ఈ అంశాలు కరిక్యులంలో ఒక సబ్జెక్ట్‌గా బోధించేందుకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
- ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
- ఐఐటీ - ఢిల్లీ, ఐఐటీ - కాన్పూర్, ఐఐటీ - ఖరగ్‌పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్‌ఐటీలు ఎంటెక్ (సీఎస్‌ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఇప్పుడు కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల్లో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి.. ఇటు లేటెస్ట్ టెక్నాలజీతోపాటు అటు మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాలపైనా అవగాహన ఉంటేనే సంస్థల లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే ఆయా కోర్సుల్లో సంబంధిత నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. కంపెనీలకు ప్రస్తుతం అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా...
వాస్తవ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం జరుగుతోంది. ఈ విషయంలో అటానమస్ హోదా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు ముందుంటున్నాయి. అందుకే ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఇవి త్వరగా రూపొందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌సీయూలో కూడా బిజినెస్ అనలిటిక్స్‌లో ఎంబీఏ కోర్సును ప్రారంభించాం. అదే విధంగా హెల్త్‌కేర్‌కు నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును ప్రవేశ పెట్టాం. కంపెనీల అవసరాలకు అనుగుణంగా అకడమిక్స్ మారితేనే విద్యార్థులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు స్వాగతం పలుకుతాయి.
- ప్రొఫెసర్ బి.రాజశేఖర్, డీన్, ఎస్‌ఎంఎస్, హెచ్‌సీయూ
Published date : 20 Oct 2017 04:21PM