Skip to main content

మీరు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే..

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సందడి మొదలైంది. ఇప్పుడు బీఈ/బీటెక్‌లో ఎంచుకునే బ్రాంచ్ భవిష్యత్ కెరీర్‌ను నిర్దేశిస్తుంది.

మన దేశంలో ఇంజనీరింగ్ అనేది ఒక ఉన్నత విద్య కోర్సుగానే కాకుండా.. దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలకు చక్కటి మార్గంగా భావిస్తారు. ఇంజనీరింగ్‌లో ఎన్నో బ్రాంచ్‌లున్నా.. ఎక్కువ మంది విద్యార్థుల దృష్టి ప్రధానంగా సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్ బ్రాంచ్‌లపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు ఆయా బ్రాంచ్‌లపై అవగాహన కల్పించే కథనం... 

  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్..

  1.  కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీ రింగ్(సీఎస్‌ఈ); ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఈ రెండు కోర్సులు ఒకటేనా లేదా వీటి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహం చాలా మంది విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. 
  2.     సీఎస్‌ఈ : కంప్యూటర్ సైన్స్ పూర్తిగా లాజిక్‌తో కూడుకొని ఉంటుంది. లాజిక్ తెలిసి కోడింగ్ నైపుణ్యం అలవడితే సీఎస్‌ఈ పూర్తిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
  3.  ఐటీ: కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా సమాచారాన్ని స్టోర్ చేయడం, ప్రాసెసింగ్, ప్రొటెక్టింగ్, రిట్రీవింగ్ వంటి కార్యకలాపాల నిర్వాహణకు ఐటీ కీలకం. ఐటీ నిపుణులు అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయడం దగ్గర నుంచి క్లిష్టమైన కంప్యూటర్ నెట్‌వర్క్‌ను,ఇన్ఫర్మేషన్ డేటాబేస్ లను డిజైన్ చేయడం వరకూ.. అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంటారు.  డేటా మేనేజ్‌మెంట్, నెట్ వర్కింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డేటాబేస్, సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్ తదితర వ్యవహారాలన్నింటినీ చూసే నైపుణ్యం ఐటీ నిపుణులకు ఉంటుంది. 
  4. ప్రధాన వ్యత్యాసం:  ఈ రెండు బ్రాంచ్‌ల మధ్య  పెద్దగా వ్యత్యాసాలు కనిపించవు. ఆయా కోర్సుల పాఠ్యాంశాలు, కరిక్యులం గమనిస్తే దాదాపు ఒకేలా ఉంటుంది.  మౌలికంగా కొన్ని తేడాలు తప్ప మిగతా అంతా ఒక్కటే. స్థూలంగా చెప్పాలంటే.. సీఎస్‌ఈ బ్రాంచ్ కంప్యూటింగ్ ఫౌండేషన్‌పై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఐటీలో.. డేటాబేస్, బిజినెస్, అకౌంటింగ్, అప్లికేషన్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి ఎక్కువగా  ఉంటుంది. ఈ రెండు బ్రాంచ్‌లకు కెరీర్ పరంగా ఒకే రకమైన అవకాశాలు లభిస్తాయి.
  5. డిమాండ్ ఎక్కువ: ప్రతీ రంగంలో ఐటీ సేవల విస్తృతి అంతకంతకూ పెరుగుతోంది. కంప్యూ టర్ సేవలు వినియోగిస్తున్న ప్రతి రంగంలో ఐటీ నిపుణుల అవసరం ఉంటుంది. అందుకే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంది. సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసినవారికి నైపుణ్యాలుంటే కొలువు ఖాయమనే అభిప్రాయముంది. అందుకే ఈ బ్రాంచ్‌లకు క్రేజ్ ఎక్కువ. గత కొన్నేళ్ల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్‌ను గమనిస్తే... ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్ సహా ఇతర ప్రఖ్యాత సంస్థల్లో సీఎస్‌ఈ/ఐటీ కోర్సులకు డిమాండ్ అధికంగా ఉంది. టాప్ ర్యాంకర్లలో అధికశాతం మంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు.

ఉద్యోగావకాశాలు..

 ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు బహుళ జాతి సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, ఫేస్‌బుక్  వంటి సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటితోపాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్ తదితర నైపుణ్యాలున్న అభ్యర్థులు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, విప్రో వంటి కంపెనీల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

  ఇంకా చదవండి:part 2: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

Published date : 22 Oct 2020 06:34PM

Photo Stories