కొత్త సంవత్సరం .. కొలువుల వసంతం
Sakshi Education
కొత్త సంవత్సరం.. దేశంలో లక్షలాది యువతపై కొలువుల వర్షం కురిపించనుంది.
కార్పొరేట్ సంస్థల్లో కాలు మోపాలనే ఉద్యోగార్థుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఎనీ డిగ్రీ.. డోంట్ వర్రీ..! అనే రీతిలో అన్ని కోర్సుల అభ్యర్థులకు వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆకర్షణీయ వేతనాలు సొంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేల్లో తమ నియామకాల తీరుతెన్నులపై ఆయా సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం! కొత్త సంవత్సరం.. కొలువుల సంవత్సరం కానుందని, అభ్యర్థులు వాటిని అందుకునే విధంగా ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో వినూత్న అవకాశాలు, అందుకునేందుకు మార్గాలపై విశ్లేషణ..
దేశీయ ఉత్పత్తులను పెంచే దిశగా ప్రకటించిన పథకం.. మేక్ ఇన్ ఇండియా: ఈ-గవర్నెన్స్.. డిజిటైజేషన్.. పాలన, కార్యాచరణల్లో సాంకేతికతకు పెద్దపీట వేసే యోచన.. స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్.. దేశం నలుమూలలా అన్ని నగరాలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం.. అన్నిటికీ మించి.. జీడీపీ వృద్ధి రేటు అంచనా 5.6 శాతం..మరోవైపు మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌లో భాగంగా వేగంగా కదులుతున్న సంస్థలు, ప్రభుత్వాలు.. కొత్త సంవత్సరంలో లక్షల సంఖ్యలో కొలువులు షురూ అనడానికి నిదర్శనాలివే! ఇప్పటివరకు ఆయా సంస్థలు నిర్వహించిన సర్వేలు, గణాంకాల ప్రకారం- 2015లో పది లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా.
టాప్ సెక్టార్లివే: పది లక్షల ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనాల నేపథ్యంలో రిక్రూట్‌మెంట్ పరంగా టాప్ సెక్టార్స్‌ను పరిశీలిస్తే.. ఐటీ, ఐటీఈఎస్, టెలికం, హాస్పిటాలిటీ, ఫార్మా అండ్ హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, అవుట్ సోర్సింగ్, రిటైల్ రంగాలు ముందంజలో నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఉత్పత్తి రంగంలోనూ నియామకాల పరంగా భారీగా వృద్ధి నమోదు కానుండటం గమనార్హం. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐలకు పచ్చజెండా, బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకులకు అనుమతులు వంటివి బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో భారీ నియామకాలకు ఊతమిచ్చే అవకాశముంది.
ఈ-కామర్స్
ఈ-కామర్స్.. కొత్త సంవత్సరంలో రిక్రూట్‌మెంట్స్ కోణంలో ఔత్సాహికులకు సరికొత్త వేదికగా, ఆకర్షణీయమైన రంగంగా నిలవనుంది. ఈ రంగంలో పేరొందిన అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలకు పెద్దఎత్తున పెట్టుబడులు రావడం, భారీ ఆఫర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ ఫుల్ జోష్‌లో ఉంది. అరచేతిలోని మొబైల్ ఫోన్‌తో ఒక్క క్లిక్‌తో అద్భుత ఆఫర్లతో అసంఖ్యాక వస్తువులను ఇంటికే తెచ్చి అందిస్తున్న ఈ-కామర్స్ రంగం మార్కెట్ వాటా మూడు బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనా. దీంతో ఆయా సంస్థలు సమర్థవంతంగా, వేగంగా సేవలందించేందుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను కూడా భారీగా చేపట్టనున్నాయి. ఈ సంవత్సరం ఈ రంగంలో యాభైవేల మందికి పైగా రిక్రూట్ చేసుకునే అవకాశముంది. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో అవసరాల కోసం ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా భారీ సంఖ్యలో ఆఫర్లు అందించాయి. కొత్త సంవత్సరం అటు ఇండస్ట్రీ పరంగా, ఇటు ఔత్సాహికుల కోణంలో ఇయర్ ఆఫ్ ఈ-కామర్స్‌గా నిలవనుంది.
రిటైల్, ఎఫ్‌ఎంసీజీ రిక్రూట్‌మెంట్స్
జీడీపీలో 15 శాతం వాటా నమోదు చేసుకుంటున్న సంప్రదాయ రిటైల్ రంగంలో కూడా ఈ ఏడాది భారీ సంఖ్యలో నియామకాలు జరగనున్నాయి. ఈ రంగంలో ప్రముఖ సంస్థలన్నీ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతోపాటు ద్వితీయ/తృతీయ శ్రేణి నగరాల్లోనూ స్టోర్స్‌ను నెలకొల్పుతున్నాయి. దాంతో ప్యాకింగ్ బాయ్స్ మొదలు సీఈఓ స్థాయి వరకూ.. రిటైల్, ఎఫ్‌ఎంసీజీ విభాగాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి.
ఐటీ.. మేటి
ఐటీ రంగం.. నియామకాల పరంగా మరోసారి మేటిగా నిలవనుంది. ఇప్పటికే టీసీఎస్ 55 వేల మందిని, ఇన్ఫోసిస్ 30 వేలకుపైగా, హెచ్‌సీఎల్, కాగ్నిజంట్ సొల్యూషన్స్ వంటి సంస్థలు 2015-16లో వేల సంఖ్యలో నియామకాలు చేపడతామని ప్రకటించాయి. దీంతో ఈ రంగంలో ఎంఎన్‌సీ నుంచి చిన్న తరహా సంస్థ వరకూ.. దాదాపు రెండు నుంచి మూడు లక్షల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. అంతేకాకుండా ఐటీ రంగంలోనూ ఈ ఏడాది క్లౌడ్ కంప్యూటింగ్, అనలిటిక్స్ విభాగాలకు ప్రాధాన్యం పెరగనుంది. ఇటీవల ముగిసిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థుల వర్క్ ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
టెలికం.. టాప్ రిక్రూటర్
ఎన్‌ఎస్‌డీసీ, ఇతర సంస్థల అంచనా ప్రకారం- 2015లో టెలికం రంగం టాప్ రిక్రూటర్‌గా నిలవనుంది. మొబైల్ ఫోన్స్ వినియోగం ఆరు శాతం పెరగడం, మారుమూల పల్లెలకు సైతం బ్రాడ్ బ్యాండ్ విస్తరణ, వంటి కారణాలతో టెలికాం రంగం 4.5 శాతం రెవెన్యూ వృద్ధి నమోదు చేసుకుంటోంది. దాంతో టెలికం రంగంలో రిక్రూట్‌మెంట్స్ భారీ స్థాయిలో జరగనున్నాయి.
అవకాశాల వేదికగా బీఎఫ్‌ఎస్‌ఐ
కొత్త సంవత్సరంలో భారీ అవకాశాలకు వేదికగా నిలవనున్న రంగం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. అవి.. ప్రైవేటు బ్యాంకులకు అనుమతులు, ఇన్సూరెన్స్ విభాగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు. దీంతో ఈ రంగంలో కొత్త కంపెనీలు రావడం ఖాయమైంది. ఆ మేరకు నియామకాలు కూడా పెరగనున్నాయి. సాధారణ గ్రాడ్యుయేట్ల నుంచి మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ వరకూ.. అన్ని అర్హతల అభ్యర్థులకు అవకాశాలు కల్పించే రంగంగానూ నిలవనుంది. కొత్త సంవత్సరంలో ఈ రంగంలో కనీసం 40 వేల నుంచి 50 వేల ఉద్యోగాలు (సేల్స్ నుంచి సెక్రటేరియల్ స్థాయి వరకు) ఉంటాయని అంచనా.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఎమర్జింగ్ సెక్టార్
ఇటీవల కాలంలో అభివృద్ధి బాటలో పయనిస్తున్న మరో రంగం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలు భారీ సంఖ్యలో విస్తరించనున్నాయి. ఆర్థిక సంక్షోభం పరిస్థితుల్లోనూ జీడీపీలో పది శాతం వృద్ధి నమోదు చేసుకున్న రంగం ఎంఎస్‌ఎంఈ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఫలితంగా మరింతగా వృద్ధి బాటలో పయనించనుంది. ఇదే కారణంగా నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. ముఖ్యంగా స్వల్పకాలిక ఒకేషనల్ కోర్సులు, ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల అభ్యర్థులకు చక్కటి వేదికగా నిలవనుంది. 2015లో రెండు లక్షల మేర అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
ఎవర్‌గ్రీన్.. ఎనర్జీ
దేశంలో ఇంధన రంగం కూడా కార్యకలాపాలు, నియామకాల పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి పలు పథకాల అమలు దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. దాంతో ఈ రంగం కూడా 2015లో టాప్ రిక్రూటర్స్ జాబితాలో నిలవనుంది. అదే విధంగా పెట్రోలియం, పెట్రోలియం అనుబంధ ఉత్పత్తి సంస్థల కార్యకలాపాలు కూడా పెరగనున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ సబ్జెక్ట్ ఉత్తీర్ణులకు ఈ ఏడాది వేల సంఖ్యలో అవకాశాలు లభించనున్నాయి.
ఆతిథ్యానికి ఊతం
అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, వ్యక్తిగత కోణాల్లో భారత్ ప్రస్తుతం బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో దేశంలో హాస్పిటాలిటీ అండ్ టూరిజం(ఆతిథ్యం, పర్యాటకం) రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం కంపెనీలు తమ శాఖలను భారత్‌లో నెలకొల్పడం, వాటి పర్యవేక్షణ కోసం రాకపోకలు సాగిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. భారత్‌లోని పర్యాటక ప్రదేశాలు ఆకర్షణీయంగా నిలుస్తుండటంతో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా స్థానికంగానూ ప్రజలు ఇప్పుడు విహార యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆతిథ్యం, పర్యాటకం, వీటికి అనుబంధంగా ఉన్న హోటల్ మేనేజ్‌మెంట్ రంగాలు సుస్థిర వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. సగటున 20 శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్నాయి. ఈ రంగంలోని సంస్థలు గత మూడేళ్లుగా ఏటా సగటున 50 వేల మందిని నియమించుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా.
ఇలా మొత్తం మీద కొత్త సంవత్సరం కొలువుల సంవత్సరంగా నిలవనుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచి ఆయా రంగాలు, లభించే ఉద్యోగాలు, సంబంధిత అర్హతలపై కసరత్తు ప్రారంభించి ఆ మేరకు సన్నద్ధం కావాలి. తాము ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టి అవసరమైతే శిక్షణ తీసుకోవాలి.
ఫ్రెషర్స్‌కు పెద్ద పీట
కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నియామకాలకు సిద్ధమవుతున్న సంస్థలు తాజా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేయనున్నాయి. సీఐఐ నిర్వహించిన సర్వే ప్రకారం- మొత్తం నియామకాల్లో 80 శాతం ఫ్రెషర్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. అదే విధంగా ఎంట్రీ లెవల్‌లో అందించే వేతనాల మొత్తాన్ని కూడా గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 10 నుంచి 12 శాతం మేర పెంచనున్నాయి. నాన్-ఫ్రెషర్స్ విషయంలో అనుభవమే కాకుండా వయసుకు కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. 30 ఏళ్లలోపు వారిని నియమించుకునేందుకే ఎక్కువ శాతం కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. బీపీఓ/కేపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో కంపెనీలు 25 ఏళ్లలోపు వారికే ప్రాధాన్యమిస్తున్నాయి. అంటే.. మొత్తం మీద కంపెనీలు యువశక్తిని కోరుకుంటున్నాయి.
ఐటీఐ నుంచి ఐఐటీ వరకు
ఈ ఏడాది ఉద్యోగార్థుల పరంగా మరో ఆకర్షణీయమైన అంశం.. ఐటీఐ సర్టిఫికెట్ నుంచి ఐఐటీ/ఐఐఎంలలో ఇంజనీరింగ్ /మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు పొందిన అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులోకి రానుండటం. ఎంఎస్‌ఎంఈ రంగం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ వరకు అన్ని కోర్సుల విద్యార్థులకు తమ అర్హతలకు సరితూగే అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా జనరల్ గ్రాడ్యుయేట్స్‌కు కూడా జాయ్‌ఫుల్ ఇయర్‌గా 2015 నిలవనుంది. ముఖ్యంగా బీపీఓ, కేపీఓ, ఐటీ అనుబంధ సర్వీసుల విభాగాల్లో జనరల్ గ్రాడ్యుయేట్స్‌ను పెద్ద సంఖ్యలో నియమించుకునేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
మారుతున్న అన్వేషణ మార్గాలు
ఇటీవల కాలంలో కంపెనీలు టాలెంట్ సెర్చ్ మార్గాల విషయంలో విభిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, వాక్-ఇన్-ఇంటర్వ్యూస్ వంటి పద్ధతులతోపాటు కొత్తగా సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మెరుగైన మార్గంగా భావిస్తున్నాయి. వాటిలోని వ్యక్తుల ప్రొఫైల్స్ ఆధారంగా నేరుగా ఇంటర్వ్యూ లెటర్స్ పంపుతున్నాయి. సోషల్ మీడియా మాధ్యమాన్ని ఈ ఏడాది మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక విద్యార్థులు తమ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్‌ను అప్‌లోడ్ చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన.
నైపుణ్యాలకు ప్రాధాన్యం
మారుతున్న ప్రాథమ్యాలు, అవసరాల నేపథ్యంలో కంపెనీలు అభ్యర్థుల నుంచి అకడమిక్‌తోపాటు ఇతర నైపుణ్యాలను కూడా కోరుకుంటున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేయాలి. సమకాలీన అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల ఐఐటీల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్‌లో అభ్యర్థులను కోర్ అంశాలతోపాటు.. పలు కాంటెంపరరీ అంశాలపైనా స్పందించాలని కోరారు. కారణం.. ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవల లక్ష్యం.. సామాజిక అవసరాలు, సామాన్య ప్రజలే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక విద్యార్థులు సంబంధిత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సాధారణంగా కంపెనీలు ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మూడో త్రైమాసికంలో.. 2015-16కు సంబంధించి సెప్టెంబర్ నుంచి నియామకాల దిశగా చర్యలు వేగవంతం చేస్తాయి. అంటే.. ఔత్సాహిక అభ్యర్థులకు ఇంకా ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో ఆ నైపుణ్యాల సాధనకు కృషి చే యడం మంచిది.
=======================================================
వృత్తి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్ ఖాయం
ఈ సంవత్సరం అన్ని రంగాలు, అన్ని స్థాయిల్లో భారీ సంఖ్యలో నియామకాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే కంపెనీలు అభ్యర్థుల నుంచి తాము కోరుకుంటున్న నైపుణ్యాల విషయంలో స్పష్టంగా, పటిష్ట నిబంధనలతో ముందుకు వెళుతున్నాయి. కాబట్టి ఒకేషనల్ కోర్సులు, ఐటీఐ, డిప్లొమా వంటి ఇతర కోర్సుల అభ్యర్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఇప్పటి నుంచే కృషి చేయాలి. అవసరమైతే ఎన్‌ఎస్‌డీసీ, ఎన్‌సీటీవీ వంటి సంస్థలు అందించే స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి.
సి.ప్రేమ్ ఆనంద్, సీఓఓ,
ఎవరాన్ స్కిల్ డెవలప్‌మెంట్ లిమిటెడ్
======================================================
బిల్డ్ యువర్ నెట్‌వర్క్
కంపెనీలు ప్రకటనలు ఇచ్చే వరకు ఉద్యోగార్థులు వేచి చూడకుండా ముందస్తుగానే సంబంధిత ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీనికోసం ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను డెవలప్ చేసుకోవాలి. ఇందుకు సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకోవాలి. దీంతోపాటు జాబ్ సెర్చ్ ఇంజన్స్‌లోనూ ప్రొఫైల్ అప్‌లోడ్ చేసుకోవడం కూడా లాభిస్తుంది. కంపెనీలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియకయ్యే వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్స్‌కు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. సంబంధిత రంగంలో తాజా పరిణామాలపై అవగాహన ఉందనే విషయం స్పష్టం చేసేలా ప్రొఫైల్‌ను రూపొందించుకుంటే మరింత మేలు.
ఉత్పల్ శ్రీవాస్తవ్, సెంటర్ హెడ్,
రాండ్‌స్టాండ్ ఇండియా, హైదరాబాద్

ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండగా, బీమా రంగంలో కొత్త కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశముంది. కలిసొచ్చే అంశం పదో తరగతి చదివిన వారి నుంచి ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ కోర్సులు (యాక్చుయేరియల్ సెన్సైస్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ తదితర) చదివిన వారి వరకూ.. ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత నైపుణ్యాలు, అకడమిక్ అర్హతల ఆధారంగా అవకాశాలు లభించడం. నలుగురిలో కలిసిపోయే చొరవ, వాక్చాతుర్యం వంటివి ఉంటే సాధారణ ఏజెంట్‌గా అడుగుపెట్టి మార్కెటింగ్ హెడ్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఈ రంగంలో లభిస్తుంది.
కె.సురేశ్, ఫౌండర్ టీం
మెంబర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్
===================================================
టెలికం రంగంలో టెక్నికల్ స్కిల్స్
టెలికం రంగంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు చక్కటి అవకాశాలు లభించడం ఖాయం. అభ్యర్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా ఈ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలు (ఉదా: 3జీ, 4జీ తదితర) వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకుంటే మంచి అవకాశాలు ఖాయం.
సుబీర్ శర్మ, డీజీఎం,
టాటా కమ్యూనికేషన్స్
====================================================
స్వయం ఉపాధిలో సుస్థిరతకు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రోత్సహించే దిశగా, స్వయం ఉపాధికి ఊతమిచ్చే విధంగా ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు ఎంఎస్‌ఎంఈ, నిమ్స్‌మే, సెట్విన్ తదితర సంస్థలు అందించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని నైపుణ్యాలు సాధిస్తే సంబంధిత రంగంలో సొంత సంస్థలు స్థాపించుకుని సుస్థిర భవితకు మార్గం వేసుకోవచ్చు. వీటిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు స్వయం ఉపాధి దిశగా సొంత సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక చేయూత కూడా లభిస్తుంది.
జి. శ్రీనివాసరావు, డిప్యూటీ డెరైక్టర్, ఎంఎస్‌ఎంఈ

Published date : 05 Jan 2015 03:43PM