Skip to main content

కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు ఇచ్చే క్రమంలో వేయి మార్కుల విధానం.. ఉపయోగం ఏంటో తెలుసా?

ఎన్‌బీఏ నిర్దిష్టంగా ఒక ప్రోగ్రామ్‌కు గుర్తింపు ఇచ్చే క్రమంలో వేయి మార్కుల స్కోరింగ్ విధానాన్ని అనుసరిస్తుంది.

ఆ మేరకు న్యాక్ తరహాలో ప్రామాణికాలను నిర్దేశించి.. ఒక్కో ప్రామాణికానికి నిర్దిష్ట స్కోర్ పాయింట్లు కేటాయిస్తుంది. అలా పొందిన స్కోర్ల ఆధారంగా సదరు ప్రోగ్రామ్‌కు గుర్తింపు కాల పరిమితిని ఇస్తుంది. ఉదాహరణకు ఒక ప్రోగ్రామ్ 750కు పైగా పాయింట్లు పొందితే అయిదేళ్లు; 600 నుంచి 750 మధ్యలో పాయింట్లు సాధిస్తే రెండేళ్ల కాల పరిమితితో గుర్తింపు లభిస్తుంది.

ఎన్‌బీఏతో మేలు ఇలా..
ఎన్‌బీఏ గుర్తింపుతో విద్యార్థులకు న్యాక్ గుర్తింపు తరహాలోనే పలు ప్రయోజనాలు ఉన్నాయి. రీసెర్చ్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకునేందుకు ప్రొఫెసర్లకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా రీసెర్చ్‌కు అనుమతి పొందిన ప్రొఫెసర్ దగ్గర ఇంటర్న్‌గా చేరే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది. దానిద్వారా కాలేజీలోనే ఆర్ అండ్ డీ నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం సొంతమవుతుంది.

గుర్తింపు కాల పరిమితి..
న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కళాశాలల్లో చేరే విద్యార్థులు వాటి గుర్తింపు కాల పరిమితిపైనా దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. న్యాక్ ఇచ్చే గుర్తింపు గరిష్టంగా అయిదేళ్ల వ్యవధికి, ఎన్‌బీఏ ఇచ్చే గుర్తింపు గరిష్టంగా అయిదేళ్లు, కనిష్టంగా రెండేళ్లుగా ఉంటుంది. విద్యార్థులు తాము కళాశాల, బ్రాంచ్‌లో చేరే సమయానికి.. సదరు గుర్తింపు కాల పరిమితి ఉందో? లేదో? తెలుసుకోవాలి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు తమకు న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు ఉందని పేర్కొంటాయి. కానీ కాల పరిమితిని వెల్లడించవు. ఇలాంటప్పుడు విద్యార్థులు సదరు కళాశాల వెబ్‌సైట్, న్యాక్, ఎన్‌బీఏ వెబ్‌సైట్‌లను వీక్షించి కాల పరిమితి గురించి తెలుసుకోవచ్చు. 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nbaind.org/Home

ఇంకా తెలుసుకోండి: part 5: పస్తుత పరిస్థితుల్లో వాటికి న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపుఎంతో అవసరం..!

Published date : 15 Oct 2020 04:24PM

Photo Stories