కెరీర్ గైడెన్స్.. ఫైర్ ఇంజనీరింగ్
Sakshi Education
బహుళ అంతస్తులు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు.. భారీగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం.. వంటి కారణాలతో కెరీర్ పరంగా అవకాశాలకు వేదికగా నిలుస్తున్న మరో విభాగం ఫైర్ ఇంజనీరింగ్. ఇంటర్మీడియెట్ అర్హతతో కూడా అడుగుపెట్టగలిగే ఫైర్ ఇంజనీరింగ్‌లో చేరితే ‘ఫ్యూచర్‌కు నో ఫియర్’ అనే విధంగా ఈ రంగం విస్తరిస్తోంది.
సాధారణ పరిభాషలో ఫైర్ ఇంజనీరింగ్‌గా పిలిచే కోర్సును సాంకేతికంగా మాత్రం ‘ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్’గా పేర్కొంటారు. కేవలం అగ్ని ప్రమాదాల నివారణే కాకుండా.. అకస్మాత్తుగా సంభవించే ప్రకతి వైపరీత్యాలు వంటి ఘటనల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం భారీ ఎత్తున సంభవించకుండా నిరోధించే నైపుణ్యాలను ఫైర్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఫైర్ ఇంజనీరింగ్‌కు సంబంధించి డిప్లొమా, డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇలా పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల వివరాలు:
బ్యాచిలర్ స్థాయిలో బీఎస్సీ (ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్), బీటెక్ (ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రెవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. కానీ ప్రభుత్వ పరంగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ (నాగ్‌పూర్)లో మాత్రమే బీటెక్ కోర్సు ఉంది. దీనిలో ప్రవేశానికి బీఎస్సీ (ఎంపీసీ)లో ఉత్తీర్ణత సాధించాలి.
వివరాలకు: https://nfscnagpur.nic.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ప్రీమియర్ షీల్డ్‌లతో అవగాహన ద్వారా ఆరు నెలల వ్యవధి గల అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ఇన్ ఫైర్ సేఫ్టీ కోర్సును ప్రారంభించింది.
వివరాలకు: www.ignou.ac.in
ఉన్నత విద్యావకాశాలు:
ఇంటర్మీడియెట్ అర్హతగా ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా, బీటెక్, బీఎస్సీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఉన్నత విద్యావకాశాలు కూడా ఎక్కువే. కేవలం ఫైర్ ఇంజనీరింగ్ అని కాకుండా సేఫ్టీ మేనేజ్‌మెంట్ పరిధిలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
విస్తత అవకాశాలు:
ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో సర్టిఫికెట్లు పొందిన వారికి ఆయా సర్టిఫికెట్ల స్థాయిని బట్టి ఉద్యోగాలు లభిస్తాయి. ఏ స్థాయి సర్టిఫికెట్ చేతిలో ఉన్నా.. జాబ్ గ్యారంటీ అనేది నిస్సందేహం. మైనింగ్, పవర్ స్టేషన్స్, హాస్పిటల్స్, చమురు ఉత్పత్తి రంగాల్లోని ప్రెవేటు పరిశ్రమలతోపాటు, ప్రభుత్వ సంస్థలోనూ వీరికి అవకాశాలు లభిస్తాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా చెర్నోబిల్, భోపాల్ దుర్ఘటనలు, 2006 సునామీ తర్వాత కాలంలో విపత్తు నిర్వహణపై అటు ప్రభుత్వం, ఇటు ప్రెవేటు రంగాలు ప్రత్యేక దష్టి కేంద్రీకరించాయి. ఈ నేపథ్యంలో ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో నిపుణులైన అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది.
టాప్ రిక్రూటర్స్:
ప్రస్తుతం మన దేశంలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీఓ, ఇస్రో వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా గ్రూప్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పారిశ్రామిక సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. కేవలం ఉత్పత్తి ఆధార పరిశ్రమల్లోనే కాకుండా మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో కూడా ఫైర్ అండ్ సేఫ్టీ ఉత్తీర్ణులకు ఉద్యోగాలు లభిస్తాయి.
కెరీర్:
డిప్లొమా సర్టిఫికెట్‌తో అడుగుపెట్టిన అభ్యర్థికి కెరీర్ ప్రారంభంలో కనీసం నెలకు రూ. 12 వేల నుంచి 15 వేల జీతం లభిస్తోంది. ఫైర్‌మన్ హోదాతో కెరీర్ ప్రారంభించిన అభ్యర్థి.. అర్హత అనుభవం ఆధారంగా ఫైర్ సూపర్‌వైజర్, సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ సూపర్‌వైజర్, సేఫ్టీ వార్డెన్, సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్, సేఫ్టీ ఆడిటర్, సేఫ్టీ ఇన్‌ఛార్జ్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. అదే విధంగా బీటెక్ అర్హతతో ఈ రంగంలో అడుగుపెట్టిన అభ్యర్థులు ప్రారంభంలోనే సేఫ్టీ ఇంజనీర్స్‌గా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్స్, డిజైన్ ఇంజనీర్స్, ఎస్టిమేషన్ ఇంజనీర్ (ఫైర్ ప్రొటెక్షన్) వంటి హోదాలకు ఎదగొచ్చు.
స్కిల్స్ తప్పనిసరి:
ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో సర్టిఫికెట్ పొందితే జాబ్ గ్యారంటీ. అయితే ఈ రంగంలో రాణించాలంటే మాత్రం కొన్ని స్కిల్స్ తప్పనిసరి. అవి.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం, ప్రమాదాల సమయంలో క్షణాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన చాతుర్యత. అంతేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఫైర్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు :
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
కోర్సు: బీటెక్ (ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్):
అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) ఉత్తీర్ణత.
వ్యవధి: నాలుగేళ్లు:
ప్రవేశం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.cusat.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్-డెహ్రాడూన్
కోర్సు: బీటెక్ (ఫైర్ సేఫ్టీ అండ్ ఇంజనీరింగ్)

ప్రవేశం: జేఈఈ ర్యాంకు/వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా.
వెబ్‌సైట్: www.upes.ac.in
హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్
వెబ్‌సైట్: www.hifehyd.webs.com
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్-నాగ్‌పూర్
కోర్సు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
వ్యవధి: ఒక సంవత్సరం
వెబ్‌సైట్: www.ife.org.in
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (ఫైర్ సేఫ్టీ ఫోరమ్)-కేరళ.
ఈ ఇన్‌స్టిట్యూట్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో కోర్సులు నిర్వహిస్తుంది.
కోర్సులు:
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
వ్యవధి: ఆరు నెలలు
సర్టిఫికెట్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఆరు నెలలు
డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఒక సంవత్సరం
డిప్లొమా ఒన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఒక సంవత్సరం
వెబ్‌సైట్: www.fireandsafetyforum.com
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ -విశాఖపట్నం.
వెబ్‌సైట్: www.nifsindia.net
ఎన్‌సీటీటీ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ -హైదరాబాద్
వెబ్‌సైట్: www.ncttcfse.com

Published date : 01 Mar 2013 02:02PM