ఇంజనీరింగ్ విద్యకు..ఉత్తమ స్వదేశీ గమ్యాలు
Sakshi Education
దేశంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్‌లు.. వాటికి నెలవైన మరెన్నో నగరాలు ఉన్నాయి. కానీ ఔత్సాహిక విద్యార్థుల్లో అత్యధిక శాతం మందికి గమ్యస్థానాలుగా నిలుస్తున్న నగరాలు మాత్రం కొన్నే. ఆయా నగరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు బోధనపరంగా పాటిస్తున్న ప్రమాణాలు.. ఆర్ అండ్ డీ అవకాశాలు.. పరిశ్రమలతో అనుసంధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి కారణాలతో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా రవాణా, నివాస సదుపాయాలు లభించడంతోపాటు జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం వల్ల ఆయా నగరాలపై విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. బీటెక్ ఔత్సాహిక విద్యార్థులకు ఫేవరెట్‌లుగా నిలుస్తున్న సిటీలపై విశ్లేషణ...
ముంబైకే మొదటి ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఔత్సాహికుల హాట్ ఫేవరెట్ నగరం ముంబై. ఇక్కడ ప్రతిష్టాత్మక ఐఐటీ ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ఐఐటీ-ముంబై జాతీయ సంస్థలతోనే కాకుండా అంతర్జాతీయ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది. స్పాన్సర్డ్ రీసెర్చ్, కన్సల్టెన్సీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తోంది. ఫలితంగా ఐఐటీ ఔత్సాహిక విద్యార్థుల్లో మొదటి ప్రాధాన్యంగా దీన్నే ఎంచుకుంటున్నారు. గత మూడేళ్లుగా జేఈఈ అడ్వాన్‌సడ్ టాప్-100 ర్యాంకర్లలో మెజారిటీ విద్యార్థులు ముంబైను ఎంపిక చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడంతోపాటు అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు స్థానిక పరిశ్రమలు /కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అపార అవకాశాలు దక్కుతున్నాయి. అటు పరిశ్రమ వర్గాల్లోనూ ముంబై కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా 90 నుంచి 95 శాతం మధ్యలో సుస్థిరంగా ఉంటున్నాయి. వీటితోపాటు అన్ని ప్రాంతాలకు చక్కటి రవాణా సదుపాయాలు, నెలకు రూ.15 వేలకు మించని నివాస ఖర్చులు కూడా విద్యార్థులను ముంబైని ఎంచుకునేలా చేస్తున్నాయి.
దేశానికే తలమానికం.. ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని (నేషనల్ క్యాపిటల్ రీజియన్ - ఎన్‌సీఆర్).. ఇంజనీరింగ్ కళాశాలలు.. ఎవర్‌గ్రీన్‌గా పేరొందుతున్నాయి. ఐఐటీ-ఢిల్లీతోపాటు.. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ (జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ), ఐటీఎం యూనివర్సిటీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఇక్కడ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. అన్నిటికంటే ముఖ్యంగా ఐఐటీ-ఢిల్లీలోని రీసెర్చ్ కార్యకలాపాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి చేపడుతున్న జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వంటివి విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తు ప్లేస్‌మెంట్స్‌కు బలమైన పునాది వేస్తున్నాయి.
దక్షిణాన.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు
దక్షిణ భారతదేశంలోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ).. పలు ప్రముఖ నగరాలు ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కటి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో.. చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ ముందంజలో ఉంది. దీంతోపాటు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, సైబరాబాద్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన హైదరాబాద్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దే క్రమంలో పలు కళాశాలలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ భరోసా లభిస్తోంది. తెలంగాణలో ఐఐటీ, ఐఐఐటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్, నిట్ - వరంగల్; ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్‌టీయూ-కాకినాడ, అనంతపురం క్యాంపస్ కళాశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటివి విద్యార్థులకు ముఖ్య గమ్యాలుగా నిలుస్తున్నాయి. తమిళనాడులో అన్నా యూనివర్సిటీ - చెన్నై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం కూడా ముఖ్యమైనవే.
వెలుగులీనుతున్నవి ఇవే
దశాబ్దాల చరిత్ర కలిగిన ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్న నగరాలతోపాటు ఇటీవల కాలంలో దేశంలో టైర్-2, టైర్-3 పట్టణాలు కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నాగ్‌పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, నోయిడా, గుర్గావ్, పుణె వంటివి ముందంజలో నిలుస్తున్నాయి. ప్రతి పది కళాశాలల్లో 2.25 శాతం కళాశాలలు టైర్ - 2 నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్ అండ్ డీ ఓరియెంటెడ్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌తోపాటు ఐటీ, ఐటీఈఎస్/ బీపీఓ సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ సంస్థలు తమ సమీప ప్రాంతాల్లోని కళాశాలలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్నాయి.
సంస్థల కోణంలో ఇలా
సంస్థలు కూడా తమ అవసరాలను తీర్చే మానవ వనరులు లభించే విషయంలో కొన్ని నగరాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాయి. ఈ క్రమంలో బెంగళూరు, పుణె, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, త్రివేండ్రంలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా తాజా ప్రతిభావంతుల విషయంలో ఈ నగరాల్లోని విద్యార్థులు బాగా రాణిస్తున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ, ఐటీఈఎస్ సంస్థల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది.
తూర్పులో ప్రముఖ విద్యా సంస్థలు ఇవే
తూర్పు భారత్‌లో.. ఐఐటీ-ఖరగ్‌పూర్, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ-రూర్కెలా, ఐఎస్‌ఎం-ధన్‌బాద్, ఎన్‌ఐటీ - దుర్గాపూర్.. ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యాలుగా నిలుస్తున్నాయి. ఇందుకు కారణం.. పరిశోధనలు, ప్లేస్‌మెంట్స్, మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా సౌకర్యాలే. ఈ సిటీల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
ఎన్‌ఐటీల్లోనూ.. కొన్నిటికే ప్రాధాన్యం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల విషయంలోనూ విద్యార్థులు కొన్ని ఎన్‌ఐటీలపైనే అధిక ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 30 ఎన్‌ఐటీల్లో సూరత్‌కల్, తిరుచిరాపల్లి, కాలికట్, సూరత్, రాయ్‌పూర్, భోపాల్, అగర్తలా, అలహాబాద్, జైపూర్, కురుక్షేత్ర, నాగ్‌పూర్‌లు ముందంజలో నిలుస్తున్నాయి.

ప్రాధాన్యతలు మారుతున్నాయి నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. తమ నివాస ప్రాంతాలకు సమీపంలోని కళాశాలల్లోనే చేరాలనే ఆలోచన నుంచి బయటికొస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలపై దృష్టి సారించి వాటిలో నాణ్యమైన కళాశాలల్లో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒక విధంగా ఈ దృక్పథం ఆహ్వానించదగినదే. ఇన్‌స్టిట్యూట్‌ల కోణంలోనూ పోటీతత్వం పెంపొంది.. అవి.. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెడతాయి. ఫలితంగా విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. - బి. చెన్నకేశవరావు ప్రిన్సిపాల్, సీబీఐటీ, హైదరాబాద్ |
అన్నింటిలో కొన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రతిఏటా కొత్తగా వందల సంఖ్యలో మరిన్ని కళాశాలలు వస్తున్నాయి. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ‘బెస్ట్ ఫ్రం మోస్ట్’ను కనుగొనాలి. అవి కొంత దూరమైనా చేరేందుకు వెనుకంజ వేయకూడదు. సొంత ఊరు కాకపోతే దేశంలో ఏ ప్రాంతమైనా ఒకటే అని గుర్తించాలి. ప్రభుత్వ రంగంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు.. ప్రైవేటు రంగంలోనూ దశాబ్దాల చరిత్ర కలిగి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆదరణ పొందుతున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్నో ఉన్నాయి. వీటిలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్‌స కూడా ఒకటి. అయితే విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోని కళాశాలల్లో ప్రవేశించేటప్పుడు.. అక్కడి మౌలిక సదుపాయాలు, సంస్కృతి-సంప్రదాయాలపై అవగాహన పొందాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాణించగలరు. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు డెరైక్టర్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్ |
పరిజ్ఞానానికి ప్రాధాన్యం విద్యార్థుల ముందు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫ్యాకల్టీ, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, ప్లేస్‌మెంట్స్ చరిత్ర కలిగిన ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కడ చేరినా.. పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తాము చేరిన కళాశాలలోని సదుపాయాలన్నింటినీ సమర్థంగా సద్వినియోగం చేసుకుంటేనే సరైన నైపుణ్యాలు లభిస్తాయి. - ప్రొఫెసర్॥వి.ఎస్.ఎస్. కుమార్ ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ |
Published date : 04 Aug 2014 11:45AM