బీటెక్ పట్టా తర్వాత...
Sakshi Education
బీటెక్ చివరి సంవత్సరం..ఓవైపు చదువు పూర్తవనుందన్న ఆనందం..మరోవైపు ఉద్యోగం సొంతం చేసుకోవాలనే లక్ష్యం.. ఇంకోవైపు.. ఆవశ్యకమైన సరికొత్త నైపుణ్యాలు.. ఎన్ని అనుకూలతలున్నా..హైరింగ్ ట్రెండ్స్‌లో ప్రతికూలతలు.. మొత్తంగా.. జాబ్ మార్కెట్‌లో అవకాశాలపై ఆందోళన..
ఈ నేపథ్యంలో ఫైనలియర్ విద్యార్థులు ఉద్యోగ లక్ష్యంతో పాటు ప్రత్యామ్నాయాలు, నైపుణ్యాల సాధనపై కసరత్తు చేస్తేనే భవిష్యత్తు ఆశాజనకం అంటున్నారు నిపుణులు. వారి సలహాలు, సూచనలు..
కొన్నేళ్ల క్రితం వరకు బీటెక్ పూర్తవుతుందంటే.. అకడమిక్‌గా మంచి ప్రతిభ ఉన్న విద్యార్థుల్లో ఎనభై శాతం మందికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఖాయంగా కనిపించేది. కానీ.. సంస్థలు కోర్ బ్రాంచెస్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు కొత్త విధానాలకు రూపకల్పన చేయడం, భిన్న పద్ధతుల్లో సేవలందించేలా టెక్నాలజీలను అడాప్ట్ చేసుకుంటుండటంతో క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. ఏడాది కాలంగా కంపెనీల హైరింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ‘నూతన నైపుణ్యాల లేమి’ అనే కారణంతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నాయి. ‘బీటెక్ పూర్తవుతూనే క్యాంపస్ డ్రైవ్స్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు’ అనే భావనలో ఉన్న విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించేదే. ఇలాంటి దశలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని, ఫైనలియర్ విద్యార్థులు బ్రాంచ్‌తో సంబంధం లేకుండా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి కృషి చేయాలని, కార్పొరేట్ కొలువులే లక్ష్యంగా కాకుండా.. ఉన్నత విద్యావకాశాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలపైనా దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి తప్పనిసరి..
ప్రస్తుతం ఏ రంగాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. శరవేగంగా దూసుకొస్తూ కొలువులకు ముప్పుగా మారిన అంశం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’. దీనిని పరిగణనలోకి తీసుకుని రానున్న రోజుల్లో కంపెనీలు చేపట్టే హైరింగ్స్‌లో ముందుండాలంటే కొన్ని కొత్త టెక్నాలజీలపై శిక్షణ పొందడం అత్యంత ఆవశ్యకంగా మారింది. అవి..
క్లౌడ్ కంప్యూటింగ్ :
వాస్తవానికి ఈ మాట అయిదారేళ్ల క్రితమే మొదలైంది. ప్రారంభంలో కొన్ని ఐటీ సంస్థలకే పరిమితమైనా ఇప్పుడు అంతటా విస్తరించింది. ఐటీ సంస్థలన్నీ తమ క్లయింట్‌లకు సులువైన మార్గంలో సమర్థ సేవలకు క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. బీటెక్ విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవాలి. లేదంటే శిక్షణ తీసుకుని పరిజ్ఞానం పొందాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
కొత్త నైపుణ్యాలలో ప్రధానంగా నిలుస్తున్న అంశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆర్‌ఐ). ఒక టాస్క్ నిర్వహణలో మానవ ప్రమేయాన్ని తగ్గించి రోబోలు, వర్చువల్ టెక్నాలజీ వంటి వాటి ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక భారం తగ్గడమే కాక క్లయింట్ సంస్థలకు వేగంగా సేవలందించొచ్చనే భావనతో ఉన్నాయి. బీటెక్ విద్యార్థులు బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఆర్‌ఐ నైపుణ్యాల్లో శిక్షణ తీసుకుంటే.. జాబ్ మార్కెట్లోకి మంచి భరోసాతో అడుగుపెట్టడానికి ఆస్కారం లభిస్తుంది.
డేటా అనలిటిక్స్, బిగ్ డేటా :
ఇంజనీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా ఫైనలియర్ వారు దృష్టిపెట్టాల్సిన మరో విభాగం డేటా అనలిటిక్స్, బిగ్ డేటా. ప్రస్తుతం కంపెనీలన్నీ వినియోగదారుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా నిరంతరం కొత్త ఉత్పత్తులు, సేవలు అందించాలని.. మార్కెట్లో ముందంజలో నిలవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో వాటిని ఇట్టే గుర్తించే అవకాశం ఉన్న డేటా అనలిటిక్స్, బిగ్ డేటా టూల్స్‌ను వినియోగించడం అధికమైంది.
ఉన్నత విద్యపై దృష్టి...
ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్ని నైపుణ్యాలను సొంతం చేసుకున్నా.. ఆఫర్స్‌పరంగా భరోసా కనిపించని పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్నత విద్యపై దృష్టిపెట్టాలి.
మీతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించే అవకాశం స్టార్టప్ ఏర్పాటు. మీ వ్యాపార ఆలోచన నేటి తరం పరిస్థితులకు అనుగుణంగా, అద్భుతంగా ఉంటే.. నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రభుత్వ పథకాలు మొదలు, ప్రైవేటు రంగంలో ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. టై, నాస్కామ్, సీఐఐ వంటి సంస్థలు స్టార్టప్ ఔత్సాహికులకు ఏంజెల్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు లభించేలా చొరవ తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలలో బీటెక్ స్థాయిలోనే స్టార్టప్స్‌పై ఆలోచించి కార్యరూపం ఇవ్వడంలో చాలామంది విజయవంతం అవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి :
ఇప్పుడు ప్రైవేటు రంగంతో పాటు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్స్ నియామకాలు క్రమంతప్పకుండా జరుగుతున్నాయి. అఖిల భారత స్థాయిలో ఐఈఎస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ ఇంజనీర్ హోదాలను సొంతం చేసుకోవచ్చు.
రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సైతం పలు శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ చేపడుతుంటాయి. వాటికి కూడా సిద్ధం కావొచ్చు.
గేట్ స్కోర్‌తోనే పీఎస్‌యూల్లో....
గేట్ స్కోర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్ట్‌ల భర్తీ చేపడుతున్నాయి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఇవి కార్పొరేట్ కొలువులకు దీటైన అవకాశాలే. వీటిలో వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌పై దృష్టి...
బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌పైనా దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో పొందాల్సిన స్కిల్స్ ప్రాధాన్యతలవారీగా..
అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి గ్రేడ్ పాయింట్లు, ప్రాజెక్ట్ వర్క్‌పైనే ఫైనలియర్ విద్యార్థులు దృష్టిపెడతారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశాలు.. జాబ్ మార్కెట్ అవకాశాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు. ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఇతర అవకాశాలు/మార్గాలను అన్వేషించాలి. తద్వారా బీటెక్ పూర్తయి క్యాంపస్ దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.
- ప్రొఫెసర్ బి. వెంకటేశం, ఐఐటీ-హెచ్
ఆన్‌లైన్ రిసోర్సెస్ వినియోగించుకోవాలి...
ఫైనలియర్ విద్యార్థులు ఆన్‌లైన్ రిసోర్సెస్‌ను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్న మూక్స్‌వైపు దృష్టిపెట్టాలి. వీటి ద్వారా పరిశ్రమ వర్గాల, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన నిపుణులు అందించే లెక్చర్స్‌ను వినే, సంబంధిత రంగాల్లో తాజా నైపుణ్యాలపై శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు బిగ్ డేటాకు సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు మూక్స్‌ను అందిస్తున్నాయి. ఇలా.. కేవలం అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. వాస్తవ పరిస్థితులపై కసరత్తు చేస్తే కెరీర్‌ను మెరుగ్గా మలుచుకోవచ్చు.
- ప్రొఫెసర్. బి. కృష్ణమూర్తి, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, ప్లేస్‌మెంట్ సెల్, బిట్స్ పిలానీ

- గేట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం దిశగా కృషి చేస్తే.. ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రవేశం పొందొచ్చు. గేట్ ద్వారా వెళ్లిన విద్యార్థులకు నెలకు నెలకు రూ.12,400 ఉపకార వేతనం వస్తుంది.
- పీహెచ్‌డీలో అడుగుపెడితే.. రెండేళ్లు జేఆర్‌ఎఫ్ నెలకు రూ. 25 వేలు, తర్వాత మూడేళ్లు ఎస్‌ఆర్‌ఎఫ్ నెలకు రూ. 28 వేల ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది.
మీతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించే అవకాశం స్టార్టప్ ఏర్పాటు. మీ వ్యాపార ఆలోచన నేటి తరం పరిస్థితులకు అనుగుణంగా, అద్భుతంగా ఉంటే.. నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రభుత్వ పథకాలు మొదలు, ప్రైవేటు రంగంలో ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. టై, నాస్కామ్, సీఐఐ వంటి సంస్థలు స్టార్టప్ ఔత్సాహికులకు ఏంజెల్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు లభించేలా చొరవ తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలలో బీటెక్ స్థాయిలోనే స్టార్టప్స్‌పై ఆలోచించి కార్యరూపం ఇవ్వడంలో చాలామంది విజయవంతం అవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి :
ఇప్పుడు ప్రైవేటు రంగంతో పాటు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్స్ నియామకాలు క్రమంతప్పకుండా జరుగుతున్నాయి. అఖిల భారత స్థాయిలో ఐఈఎస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ ఇంజనీర్ హోదాలను సొంతం చేసుకోవచ్చు.
రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సైతం పలు శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ చేపడుతుంటాయి. వాటికి కూడా సిద్ధం కావొచ్చు.
గేట్ స్కోర్‌తోనే పీఎస్‌యూల్లో....
గేట్ స్కోర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్ట్‌ల భర్తీ చేపడుతున్నాయి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఇవి కార్పొరేట్ కొలువులకు దీటైన అవకాశాలే. వీటిలో వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌పై దృష్టి...
బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌పైనా దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో పొందాల్సిన స్కిల్స్ ప్రాధాన్యతలవారీగా..
- అప్లికేషన్ స్కిల్స్
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
- కమ్యూనికేషన్ స్కిల్స్/సాఫ్ట్ స్కిల్స్
- టీమ్ కల్చర్ స్కిల్స్
- డెసిషన్ మేకింగ్ స్కిల్స్
- ఉన్నత విద్య (పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎంఎస్ బై రీసెర్చ్)
- గవర్నమెంట్ జాబ్స్
- పీఎస్‌యూ జాబ్స్
- స్టార్టప్స్ ఏర్పాటు
- మూక్స్ ద్వారా కొత్త నైపుణ్యాల సాధన
అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి గ్రేడ్ పాయింట్లు, ప్రాజెక్ట్ వర్క్‌పైనే ఫైనలియర్ విద్యార్థులు దృష్టిపెడతారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశాలు.. జాబ్ మార్కెట్ అవకాశాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు. ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఇతర అవకాశాలు/మార్గాలను అన్వేషించాలి. తద్వారా బీటెక్ పూర్తయి క్యాంపస్ దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.
- ప్రొఫెసర్ బి. వెంకటేశం, ఐఐటీ-హెచ్
ఆన్‌లైన్ రిసోర్సెస్ వినియోగించుకోవాలి...
ఫైనలియర్ విద్యార్థులు ఆన్‌లైన్ రిసోర్సెస్‌ను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్న మూక్స్‌వైపు దృష్టిపెట్టాలి. వీటి ద్వారా పరిశ్రమ వర్గాల, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన నిపుణులు అందించే లెక్చర్స్‌ను వినే, సంబంధిత రంగాల్లో తాజా నైపుణ్యాలపై శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు బిగ్ డేటాకు సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు మూక్స్‌ను అందిస్తున్నాయి. ఇలా.. కేవలం అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. వాస్తవ పరిస్థితులపై కసరత్తు చేస్తే కెరీర్‌ను మెరుగ్గా మలుచుకోవచ్చు.
- ప్రొఫెసర్. బి. కృష్ణమూర్తి, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, ప్లేస్‌మెంట్ సెల్, బిట్స్ పిలానీ
Published date : 30 Aug 2017 01:28PM