అత్యున్నత కెరీర్‌కు..ప్యా‘కింగ్’
Sakshi Education
ప్యాకేజింగ్.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ కెరీర్. మనం ఉదయాన లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాడే ప్రతి వస్తువునూ గమనించండి.. ప్యాకింగ్ లేని వస్తువు ఏదైనా ఉందేమోనని. ఒక్కటి కూడా కనిపించదు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది.. ప్యాకేజింగ్. నగరం కేంద్రంగా ఎన్నో కంపెనీలు వివిధ చిన్నా, పెద్ద వస్తువులను తయారు చేస్తున్నాయి. వీటి తయారీ ఒకెత్తయితే.. ఆయా వస్తువులు వినియోగదారుడిని ఆకట్టుకునేలా ప్యాక్ చేయడం మరో ఎత్తు. ఈ కారణంతో కంపెనీలు ప్యాకింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ప్యాకేజింగ్ రంగంలో నిష్ణాతులను నియమించుకుని భారీ స్థాయిలో వేతనాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వంటివి ప్యాకింగ్‌లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే ఏ రంగానికీ తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
అవకాశాలెన్నో.. అందిపుచ్చుకునేవారేరీ?
గుండుసూది మొదలుకొని టూత్ పేస్టులు, సబ్బులు, పౌడర్లు, సెంట్లు, షేవింగ్ సామగ్రి, దుస్తులు, బూట్లు, చెప్పులు, స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలు, పిల్లలాడుకునే బొమ్మలు, అగర్‌బత్తీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు, వివిధ వ్యాధుల నివారణ మందులు, రైతులు పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు,.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రతిదానికీ ప్యాకింగ్ ఉండాల్సిందే. అందుకే ఏ రంగానికైనా ఆర్థిక మాంద్యం ఉందేమో కానీ.. ప్యాకేజింగ్ రంగానికి లేదు. సమయంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులూ ఉద్యోగాలందించే విభాగం ప్యాకేజింగ్. మన దేశంలో చిన్నా, పెద్దా అన్నీ కలుపుకుని దాదాపు 22,000 వరకు ప్యాకేజింగ్ కంపెనీలుంటాయని అంచనా! నగరాల్లో ప్రతి ప్రాంతంలోనూ రిటైల్ మాల్స్ ఏర్పాటు చేసిన కంపెనీల దృష్టి ఇప్పుడు ఓ మాదిరి పట్టణాలపై కూడా పడింది. అంతేకాకుండా ఆన్‌లైన్ షాపింగ్.. రిటైల్ రంగానికి దీటుగా వర్థిల్లుతోంది. నేటి బిజీ జీవితంలో దుకాణానికి వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చే తీరిక, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఈ నే పథ్యంలోనే అందరూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. వస్తువులను ఆయా వినియోగదారులు ఉన్నచోటకి సురక్షితంగా, చెడిపోకుండా పంపాలంటే తగిన ప్యాకింగ్ తప్పనిసరి. ఇలా అటు రిటైల్ రంగంలోనూ, ఇటు ఈ-కామర్స్ కోణంలోనూ ప్యాకేజింగ్ నిపుణులకు అవకాశాలకు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. 2011 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ప్యాకేజింగ్ మార్కెట్‌గా భారత్ నిలిచింది. 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. వచ్చే నాలుగు, ఐదేళ్లలో ఏటా ఈ రంగం 12.3 శాతం వృద్ధిరేటుతో పురోగమించడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
ప్యాకేజింగ్‌లో విభాగాలు
ప్యాకేజింగ్ అంటే వస్తువులను ప్యాకింగ్ చేయడం మాత్రమే కాదు. ఇందులో మరెన్నో విభాగాలు ఉంటాయి. ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులను పరిశీలించడం, ఆయా వస్తువులకు సరిపోయే ప్యాకేజింగ్ పద్ధతులను ఎంపిక చేయడం, వినియోగదారుడిని ఆకట్టుకునే డిజైన్‌ను రూపొందించడం, ఆ ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుందో..లేదో పరీక్షించడం, ప్యాకింగ్ నాణ్యతను పరిశీలించడం, పర్యావరణానికి హాని కలిగించని వాటిని ఉపయోగించడం, ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, పోటీ సంస్థలను అధిగమించడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. ఇలా ప్యాకేజింగ్ రంగంలో ఎన్నో విభాగాలు.. అందులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలుంటాయి. స్వయం ఉపాధికి సమృద్ధిగా అవకాశాలున్న రంగం.. ప్యాకేజింగ్.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్
ప్యాకేజింగ్ రంగంలో.. నిష్ణాతులను అందించడానికి, ప్యాకేజింగ్ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య మంత్రిత్వశాఖ 1966లో ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ). ఆహార, వాణిజ్య, ఫార్మా, ఇతర రంగాల కంపెనీల ఉత్పత్తులకు పటిష్ట ప్యాకేజింగ్ రూపొందించడం.. విదేశాలకు ఎగుమతయ్యే ఆహార వస్తువులు, పదార్థాలు, రసాయనాలు, ఆభరణాలకు ప్యాకేజింగ్ చేసే నిష్ణాతులను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం. ముంబై ప్రధాన క్యాంపస్‌గా దేశవ్యాప్తంగా ఐఐపీకి మరో 4 క్యాంపస్‌లున్నాయి. అవి. హైదరాబాద్ (సనత్‌నగర్), ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. ఈ సంస్థ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేయడంలో దేశవ్యాప్తంగా పేరుగాంచింది.
వెబ్‌సైట్: www.iip-in.com
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఫుల్‌టైం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్
వ్యవధి: 3 నెలలు.
అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: మొదట వచ్చినవారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు.
ఫుల్‌టైం పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
వ్యవధి:రెండేళ్లు. మొత్తం సీట్లు: హైదరాబాద్ క్యాంపస్‌లో 60, ముంబైలో 80, ఢిల్లీ-80, కోల్‌కతా-60
అర్హత: సైన్స్/ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్/సంబంధిత సబ్జెక్టులలో ద్వితీయశ్రేణిలో గ్రాడ్యుయేషన్ (12+3) విధానంలో ఉత్తీర్ణత. ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరు పర్సనల్ ఇంటర్వ్యూ నాటికి ఉత్తీర్ణులై ఉంటేనే ప్రవేశం లభిస్తుంది.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, ప్రవేశపరీక్ష, మౌఖిక పరీక్షల ఆధారంగా. ప్రవేశపరీక్షను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు. మౌఖిక పరీక్ష ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతాల్లో ఉంటుంది.
ప్రవేశ పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులపై గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. ఇవేకాకుండా దూరవిద్య విధానంలో కూడా ఐఐపీ కోర్సులు నిర్వహిస్తోంది. ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌కు పార్ట్‌టైం, వీకెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
పాలిటెక్నిక్ ద్వారా..
మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్)’ ద్వారా మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. హైదరాబాద్ (రామంతాపూర్)లో ఉన్న జేఎన్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత విద్యార్థులందరికీ దాదాపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారు.
కోర్సుల్లో ఏం నేర్పుతారు?
కంపెనీలు, పరిశ్రమలు ఏ ఉత్పత్తిని బయటకు తీసుకువచ్చినా... వాటిని వినియోగదారుడు ఇష్టపడేలా చేయడంలో ప్యాకేజింగ్‌దే కీలకపాత్ర. ప్యాకేజీ ఎంత బాగుంటుందనేదానిపైనే అమ్మకాలు ఆధారపడి ఉంటాయి. అందుకే కోర్సులో ప్యాకేజింగ్ అంటే? దాని అవసరం? అందులో దశలు? ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం? కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి? ఆహార పదార్థాలకు అనువైన ప్యాకేజింగ్ ఏది? ఏ మోతాదులో చేయాలి? వంటివి నేర్పుతారు.
డిమాండ్ ఉన్న కెరీర్
ఢిల్లీ మార్కెట్ నుంచి గల్లీ మార్కెట్ వరకు వివిధ వస్తువులు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. ఈ వస్తువులు వినియోగదారులను ఆకర్షించడానికి పొందికైన, ఆకర్షణీయమైన ప్యాకింగ్ తప్పనిసరి. ఈ రంగంలో డిమాండ్‌కు తగిన విధంగా నిపుణులు లేరు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ కోర్సు ఉత్తీర్ణుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల్లో సైతం వీరికి మంచి అవకాశాలున్నాయి. ప్రారంభంలోనే భారీ వేతనాలు అందుకోవచ్చు. ఓ మాదిరి కంపెనీల్లో రూ.25,000 నుంచి వేతనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి లక్షల్లో సంపాదించొచ్చు. ఈ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత ఆర్థిక స్థోమత ఉంటే సొంతంగా ప్యాకేజింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కెరీర్‌లో మరింత రాణించొచ్చు.
ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీలు:
ఐఐపీలో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు ఇవ్వడానికి వివిధ కంపెనీలు పోటీపడుతున్నాయి. వాటిలో హరిత-ఎన్‌టీఐ, నెస్లే ఇండియా లిమిటెడ్, ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్, క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్, క్యాస్ట్రాల్, కోకాకోలా, సిప్లా, డాబర్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, గుజరాత్ గ్లాస్ లిమిటెడ్, హిమాలయ డ్రగ్, హిందూస్థాన్ యూనిలీవర్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐటీసీ, జాన్సన్ అండ్ జాన్సన్, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్, మాట్రిక్స్, ది పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలున్నాయి.

ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్! శ్రీతయారీ, రిటైల్ రంగంలో అభివృద్ధి నేపథ్యంలో ప్యాకేజింగ్ విభాగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఉత్పత్తులు విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ నిపుణుల కృషి ఎంతో ఉంటుంది. కాబట్టి మెకానికల్, ఫార్మాస్యూటికల్, ఫెర్టిలైజర్, అగ్రికల్చర్, టాయ్స్‌తోపాటు దాదాపు అన్ని పరిశ్రమలూ ప్యాకేజింగ్ టెక్నోక్రాట్స్‌ను నియమించుకుంటున్నాయి. వీరికి కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇతర ఉద్యోగాల్లో మాదిరి ప్యాకేజింగ్ కొలువుల్లోనూ వివిధ స్థాయిలుంటాయి. గ్రౌండ్ లెవల్ టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లుగా ప్యాకేజింగ్ కంపెనీల్లో చేరొచ్చు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ తర్వాత ఒకేషనల్, స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ప్యాకేజింగ్ ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్‌గా పేర్కొనొచ్చు. ఉత్పత్తుల డిజైన్‌కు అనుగుణంగా ఉండేలా స్ట్రక్చరింగ్ కోసం ఇంజనీరింగ్ దృక్పథం తోడ్పడుతుంది. ప్రారంభంలోనే ఏడాదికి కనీసం రూ.3 లక్షల వేతనం లభిస్తోంది. ప్యాకేజింగ్‌లో శిక్షణ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా రాణించొచ్చ్ణు ఎ.వి.పి.ఎస్. చక్రవర్తి, చైర్మన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్- హైదరాబాద్ బ్రాంచ్. |
Published date : 04 Oct 2014 12:57PM