ఐటీ నవ్య పథాలు.. భవ్య కెరీర్లు..
Sakshi Education
ఐటీ రంగంలో ఉద్యోగాలు అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ జాబ్స్ అనే భావన నెలకొని ఉంది.. కానీ నైపుణ్యం ఉంటే చాలు అందలం ఎక్కించేందుకు కన్సల్టింగ్, రీసెర్‌చ, అనలిటిక్స్ వంటి ఎన్నో కెరీర్ మార్గాలు ఉన్నాయి. వాటిపై ఈ వారం ఫోకస్...
ఐటీ జాబ్స్ అంటే కేవలం డెవలప్‌మెంట్/ టెస్టింగ్ ఉద్యోగాలు అనే భావన నెలకొని ఉంది. కానీ అన్వేషిస్తే డెవలప్‌మెంట్/టెస్టింగ్ కాకుండా ఎన్నో విభిన్న అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటే కోడింగ్‌లో కాస్త నైపుణ్యం, డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌లో అంతగా ప్రావీణ్యం లేకున్నా ఐటీ డెవలప్‌మెంట్‌లో వచ్చిన మార్పుల కారణంగా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు ఉంటే.. కన్సల్టింగ్, రీసెర్చ్, అనలిటిక్స్ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను అందుకోవచ్చు. ఆయా రంగాలకు సంబంధించి బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్ అనే పదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ అవకాశాలను కల్పిస్తున్న వివిధ రంగాలు..
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/కోడింగ్ జాబ్స్:
కోడింగ్, అల్గారిథమ్స్ వంటి అంశాల్లో మెరుగ్గా ఉంటే ఐటీ సర్వీసెస్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో డెవలప్‌మెంట్ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నామనేది కాదు.. ప్రాబ్లమ్ సాల్వింగ్ డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌ను ఏవిధంగా అన్వయించగలుగుతున్నామనేది కీలకం. కేవలం డేటాస్ట్రక్చర్స్‌పై అవగాహన ఉంటే సరిపోదు. ఏ ప్రాబ్లమ్‌కు ఎటువంటి డేటాస్ట్రక్చర్‌ను ఉపయోగించాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. ఎందుకంటే కంపెనీలు కోడింగ్‌లో అత్యున్నత నైపుణ్యం ఉన్న వారి కోసం చూస్తుంటాయి. రిక్రూట్‌మెంట్ సమయంలో టెక్నికల్/కోడింగ్ అంశాల్లో మిగతా వారి కంటే మీరు ఎంత సమర్థులు అనే అంశాన్ని కంపెనీలు పరిశీలిస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రోగ్రామ్ రాయడంపై అవగాహన ఉంటే సరిపోదు. వినియోగదారులను సంతృప్తి పరిచేవిధంగా ప్రోగ్రామ్ రాసేందుకు సరైన అల్గారిథమ్స్ తెలిసి ఉండడం అవసరం అని గుర్తించాలి. మరో కీలకాంశం అందరూ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పని చేస్తుంటారు. కానీ వేతనాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం.. ఆయా కంపెనీల్లో అభ్యర్థులు పని చేస్తున్న విభాగాలను బట్టి వేతనాల్లో తేడా ఉంటుంది. ఉదాహరణకు అప్లికేషన్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఎక్కువ కోడింగ్ అవసరం. కాబట్టి ఈ విభాగాల్లో పని చేసే వారికి అధిక వేతనాలు ఉంటాయి. అదే సపోర్టింగ్, మెయింటనెన్‌స విభాగాల్లో కోడింగ్‌తో అంత అవసరం ఉండదు. కాబట్టి వేతనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కోడింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడం ఉన్నత కెరీర్‌కు మార్గం వేస్తుంది.
కన్సల్టింగ్ జాబ్స్:
సాధారణంగా కన్సల్టింగ్‌కు సంబంధించి బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలు, టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలు ఉంటాయి. బిజినెస్/మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీల్లో కేవలం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే భావన ఉంది. కానీ అది సరికాదు. ఎందుకంటే ప్రముఖ బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్న సందర్భాలు ఎన్నో. టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఏడాది టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. మొదట టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో చేరి తగిన అనుభవం సంపాదించిన తర్వాత బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలోకి మారొచ్చు. కన్సల్టింగ్ కంపెనీలు రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, కేస్ ఆధారిత ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక్కడ సమాధానం కంటే దాన్ని సాధించేందుకు అనుసరించిన లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడాలనే ఆస్తకి ఉంటే కన్సల్టింగ్‌ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఉంటుంది. ఒక డేటాను విశ్లేషించి అర్థవంతమైన డేటాను రూపొందించే పనిని ఈ విభాగం నిర్వహిస్తుంది. ఇందులో డెవలప్‌మెంట్‌తోపాటు అనలిటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల బిజినెస్ మోడల్స్‌ను రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించడానికి అనలిటిక్స్ అవసరం. కాబట్టి డెవలప్‌మెంట్, అనలిటిక్స్‌పై అవగాహన ఉంటే ఈ రంగంలో మరింత రాణించవచ్చు. సర్వేలు నిర్వహించడం, సేకరించిన డేటాను విశ్లేషించడం వంటి లక్షణాలు ఉంటే ఈ తరహా కంపెనీల్లో అవకాశాలను అందుకోవచ్చు. ప్రతి ఏడాది రీసెర్చ్ అనలిటిక్స్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
కొన్ని టెక్నాలజీ కంపెనీలకు సొంతంగా అనలిటిక్స్ విభాగం ఉంటోంది. వీరు కేవలం కంపెనీ వ్యవహారాలకే పరిమితం కాకుండా వారి క్లయింట్స్‌కు కావల్సినప్పుడు తమ సేవలను కూడా అందిస్తుంటారు. ఇటువంటి కంపెనీల్లో ప్రవేశించాలంటే కోడింగ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. దీంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నైపుణ్యాలు ఉంటే మెరుగైన అవకాశాలను అందుకోవచ్చు. కోడింగ్/ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంతగా లేకున్నా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను రిక్రూట్ చేసుకుని కంపెనీలు టెక్నాలజీ, కోడింగ్ అంశాల్లో శిక్షణనిస్తాయి.
ఈ రంగంలో అవకాశాలను దక్కించుకోవాలంటే కోడింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలు అవసరం. మ్యాథమెటికల్ మోడల్స్ రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించేందుకు అనలిటిక్స్ అవసరం. కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అర్హతలు ఉన్న వారికి ఈ రంగం సరిగ్గా సరిపోతుంది.
క్లౌడ్ కంప్యూటింగ్:
క్లౌడ్ కంప్యూటింగ్‌లో అప్లికేషన్‌స ఏవిధంగా రాయాలి, అప్లికేషన్‌స రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు అనే అంశాలను అవగాహన చేసుకోవడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్‌పై అవగాహన పొందొచ్చు. ఉదాహరణకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, తదితర సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఒక రకమైన టెక్నాలజీ షిఫ్ట్‌గా పేర్కొనవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌సగా స్థిరపడాలనుకునే వారికి క్లౌడ్ కంప్యూటింగ్ చక్కగా సరిపోతుంది. ఈ రంగానికి కూడా కోడింగ్ అవసరం. ఈ రంగంలో పని చేసే వారిని డెవలపర్ హోదాలో రిక్రూట్ చేసుకుంటారు. వీరు క్లౌడ్‌కు సంబంధించిన కోడ్ రాయాలి. క్లౌడ్‌కు సంబంధించి అప్లికేషన్‌స రాయడం, కోడింగ్, టెక్నాలజీపై ఆస్తకి ఉంటే ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని కాలేజీలు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఆప్షన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాధాన్యం
ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్/ఐటీ విద్యార్థులు ప్రస్తుత తరుణంలో ప్లేస్‌మెంట్ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీలు గతంతో పోల్చినప్పుడు రిక్రూట్‌మెంట్‌ను పరిమితం చేసుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఈ విషయంలో మినహాయింపు లభించటం లేదు. ఈ సమయంలో నూతనంగా ప్రాచుర్యంలోకి వస్తున్న అనలిటిక్స్, కన్సల్టింగ్ అవకాశాలపై అవగాహన ఉండడం విద్యార్థులకు కెరీర్ పరంగా ఇతోధిక సహాయం చేస్తుంది.
ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌తోపాటు మ్యాథమెటిక్స్ పరంగా మంచి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్/టెక్నాలజీ నేపథ్యం ఉన్న విద్యార్థి అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే డేటా అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగాలకు కంప్యుటేషనల్‌తోపాటు అనలిటికల్ నైపుణ్యాలు అవసరం. ఇటువంటి నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వ్యాపార నమూనాల (బిజినెస్ మోడల్స్) నిర్వహణలో తార్కిక వివేచనతోపాటు మ్యాథమెటికల్ నైపుణ్యాలు అవసరం. ఈ నేపథ్యంలో కావల్సిన కోడింగ్, అనలిటిక్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థిలో ఉంటాయని సంబంధిత కంపెనీలు భావిస్తాయి. కాబట్టి కంపెనీలు ఫ్రెష్ ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.
అర్హతలు - నైపుణ్యాలు

- టాప్ రిక్రూటర్స్: బెయిన్ అండ్ కంపెనీ, అసెంచర్, డెలాయిట్, కేపీఎంజీ, ఎ.టి.కర్నీ.. ఇంకా మరెన్నో.
కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఉంటుంది. ఒక డేటాను విశ్లేషించి అర్థవంతమైన డేటాను రూపొందించే పనిని ఈ విభాగం నిర్వహిస్తుంది. ఇందులో డెవలప్‌మెంట్‌తోపాటు అనలిటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల బిజినెస్ మోడల్స్‌ను రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించడానికి అనలిటిక్స్ అవసరం. కాబట్టి డెవలప్‌మెంట్, అనలిటిక్స్‌పై అవగాహన ఉంటే ఈ రంగంలో మరింత రాణించవచ్చు. సర్వేలు నిర్వహించడం, సేకరించిన డేటాను విశ్లేషించడం వంటి లక్షణాలు ఉంటే ఈ తరహా కంపెనీల్లో అవకాశాలను అందుకోవచ్చు. ప్రతి ఏడాది రీసెర్చ్ అనలిటిక్స్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
- టాప్ రిక్రూటర్స్: టెరాడేటా, థరోగుడ్, ఇన్ఫర్మేటికా, వరల్డ్‌క్వాంట్ రీసెర్చ్ మరెన్నో.
కొన్ని టెక్నాలజీ కంపెనీలకు సొంతంగా అనలిటిక్స్ విభాగం ఉంటోంది. వీరు కేవలం కంపెనీ వ్యవహారాలకే పరిమితం కాకుండా వారి క్లయింట్స్‌కు కావల్సినప్పుడు తమ సేవలను కూడా అందిస్తుంటారు. ఇటువంటి కంపెనీల్లో ప్రవేశించాలంటే కోడింగ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. దీంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నైపుణ్యాలు ఉంటే మెరుగైన అవకాశాలను అందుకోవచ్చు. కోడింగ్/ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంతగా లేకున్నా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను రిక్రూట్ చేసుకుని కంపెనీలు టెక్నాలజీ, కోడింగ్ అంశాల్లో శిక్షణనిస్తాయి.
- కేపీవో (నాలెడ్‌జ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్) ఈ కంపెనీలు తమ క్లయింట్స్‌కు సంబంధించిన వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతాయి. ఇటువంటి కంపెనీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
- మరి కొన్ని కంపెనీలు ఏదో ఒక ప్రత్యేక (స్పెషలైజ్డ్) విభాగానికి మాత్రమే పరిమితమవుతాయి. ఉదాహరణకు మార్కెటింగ్ అనలిటిక్స్ కంపెనీలు. ఇటువంటి కంపెనీలు కేవలం విశ్లేషణకు మాత్రమే పరిమితమవుతాయి. ఇటువంటి కంపెనీల్లో పని చేయడం ద్వారా వ్యాపార, మార్కెట్ రంగాలను విశ్లేషణాత్మక దృక్పథంతో అవగాహన చేసుకోవచ్చు.
- టాప్ రిక్రూటర్స్: మ్యూసిగ్మా, లేటెంట్‌వ్యూ, జెన్‌ప్యాక్ట్ అనలిటిక్స్, టీసీఎస్ అనలిటిక్స్, గ్లోబల్ అనలిటిక్స్.. ఇంకా మరెన్నో.
ఈ రంగంలో అవకాశాలను దక్కించుకోవాలంటే కోడింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలు అవసరం. మ్యాథమెటికల్ మోడల్స్ రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించేందుకు అనలిటిక్స్ అవసరం. కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అర్హతలు ఉన్న వారికి ఈ రంగం సరిగ్గా సరిపోతుంది.
క్లౌడ్ కంప్యూటింగ్:
క్లౌడ్ కంప్యూటింగ్‌లో అప్లికేషన్‌స ఏవిధంగా రాయాలి, అప్లికేషన్‌స రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు అనే అంశాలను అవగాహన చేసుకోవడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్‌పై అవగాహన పొందొచ్చు. ఉదాహరణకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, తదితర సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఒక రకమైన టెక్నాలజీ షిఫ్ట్‌గా పేర్కొనవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌సగా స్థిరపడాలనుకునే వారికి క్లౌడ్ కంప్యూటింగ్ చక్కగా సరిపోతుంది. ఈ రంగానికి కూడా కోడింగ్ అవసరం. ఈ రంగంలో పని చేసే వారిని డెవలపర్ హోదాలో రిక్రూట్ చేసుకుంటారు. వీరు క్లౌడ్‌కు సంబంధించిన కోడ్ రాయాలి. క్లౌడ్‌కు సంబంధించి అప్లికేషన్‌స రాయడం, కోడింగ్, టెక్నాలజీపై ఆస్తకి ఉంటే ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని కాలేజీలు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఆప్షన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాధాన్యం
ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్/ఐటీ విద్యార్థులు ప్రస్తుత తరుణంలో ప్లేస్‌మెంట్ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీలు గతంతో పోల్చినప్పుడు రిక్రూట్‌మెంట్‌ను పరిమితం చేసుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఈ విషయంలో మినహాయింపు లభించటం లేదు. ఈ సమయంలో నూతనంగా ప్రాచుర్యంలోకి వస్తున్న అనలిటిక్స్, కన్సల్టింగ్ అవకాశాలపై అవగాహన ఉండడం విద్యార్థులకు కెరీర్ పరంగా ఇతోధిక సహాయం చేస్తుంది.
ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌తోపాటు మ్యాథమెటిక్స్ పరంగా మంచి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్/టెక్నాలజీ నేపథ్యం ఉన్న విద్యార్థి అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే డేటా అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగాలకు కంప్యుటేషనల్‌తోపాటు అనలిటికల్ నైపుణ్యాలు అవసరం. ఇటువంటి నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వ్యాపార నమూనాల (బిజినెస్ మోడల్స్) నిర్వహణలో తార్కిక వివేచనతోపాటు మ్యాథమెటికల్ నైపుణ్యాలు అవసరం. ఈ నేపథ్యంలో కావల్సిన కోడింగ్, అనలిటిక్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థిలో ఉంటాయని సంబంధిత కంపెనీలు భావిస్తాయి. కాబట్టి కంపెనీలు ఫ్రెష్ ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.
అర్హతలు - నైపుణ్యాలు
- బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా కోడింగ్‌లో ప్రావీణ్యంగల ఇంజనీరింగ్ విద్యార్థులను అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. వారికి ప్రాధాన్యతతో కూడిన బాధ్యతలను అప్పగిస్తున్నాయి.
- ఇక్కడ ప్రస్తావించిన కంపెనీల్లో కోడ్ రాయడంతోపాటు వ్యాపార అవసరాలకనుగుణంగా నమూనాలను రూపొందిస్తుంటారు. కాబట్టి ఇటువంటి కంపెనీల్లో ప్రవేశించాలంటే కోడింగ్‌తోపాటు, వ్యాపార వ్యవహారాలను అవగాహన చేసుకునే నైపుణ్యత ఉండాలి.
- మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యం, విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం, వివిధ వ్యాపారాల నిర్వహణ సంబంధిత అంశాలను అవగాహన చేసుకునే చాతుర్యం. కోడింగ్, అనలిటిక్స్ రెండు అంశాల్లో ప్రావీణ్యం ఉండడం అదనపు అర్హతగా ప్రయోజనం చేకూరుస్తుంది.
- క్లయింట్స్ నుంచి వచ్చే ఒత్తిడిని సమర్థంగా తట్టుకునే స్వభావం, ప్రయాణాల పట్ల ఆసక్తి, ఉద్యోగులను జట్టుగా నడిపే సామర్థ్యం.
- అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఆఫర్ చేసే వేతనాలు కంపెనీలను బట్టి మారుతుంటాయి.
- కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఉత్సాహం, దీర్ఘకాల సర్వీస్, పనిచేస్తున్న కంపెనీలో భాగస్వామి(పార్‌టనర్)గా చేరే అవకాశం కూడా లభిస్తుంది
Published date : 06 Feb 2014 03:40PM