ఐఐటీల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్
Sakshi Education
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్.. ఐఐటీల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభమైంది.
డిసెంబర్1వ తేదీన ఐఐటీ క్యాంపస్‌లలో... ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ ప్రారంభం కాగా.. తొలి దశ తొలి రెండు రోజుల్లో వందల సంఖ్యలో ఆఫర్లు లభించాయి. ముఖ్యంగా రూ.1.4 కోట్లతో మైక్రోసాఫ్ట్ భారీ ఆఫర్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో... ఐఐటీల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్ తాజా ట్రెండ్స్.. కంపెనీలు కోరుకుంటున్న స్కిల్స్‌పై విశ్లేషణ..
ముందుగా టాప్ ఐఐటీల్లో...
జాబ్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ‘ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఎలా ఉంటాయో? ఎలాంటి ఆఫర్స్ వస్తాయో?’ అనే ఆందోళన.. ఐఐటీ విద్యార్థుల్లో సైతం కనిపించింది. కానీ.. తాజాగా ప్రారంభమైన ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో కంపెనీల ఆఫర్లతో ఆ సందిగ్ధతకు తెరపడింది. ఎప్పటిలాగే రూ.లక్షల వేతనంతో డొమెస్టిక్ ఆఫర్లు, రూ.కోటికిపైగా వేతనంతో ఇంటర్నేషనల్ అవ కాశాలు లభించాయి. ముందుగా టాప్ ఐఐటీలుగా పేరొందిన ఢిల్లీ, ముంబై, చెన్నై, రూర్కీ క్యాంపస్‌లలో అడుగు పెట్టిన కంపెనీలు.. ప్రతిభావంతులకు ఆకర్షణీయ వేతనాలతో మంచి ఆఫర్స్ ఇచ్చాయి. ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్ తొలి దశ మొదటి రోజునే మూడు వందల మందికి పైగా విద్యార్థులకు ఆఫర్లు లభించాయి. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను బేరీజు వేసుకుంటే.. ఈ స్థాయిలో ఆఫర్లను ఊహించలేదని.. ఆయా క్యాంపస్‌ల ప్లేస్‌మెంట్ సెల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మైక్రోసాఫ్ట్ రూ.1.4 కోట్లు
ఐటీ రంగ దిగ్గజంగా భావించే మైక్రోసాఫ్ట్ సంస్థ.. రూ.1.4కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్ అందించడం విశేషం. ఐఐటీ ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థికి అమెరికాలోని తమ ప్రధాన కేంద్రంలో పని చేసేందుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ వేతనం మొత్తంలో బేసిక్ శాలరీ 1,08,000 డాలర్లు; పనితీరు ఆధారిత బోనస్ 21,600 డాలర్లు; జాయినింగ్ బోనస్ 15,000 డాలర్లు; 70 వేల డాలర్ల విలువ కలిగే స్టాక్ ఆప్షన్స్ కలిసి ఉన్నాయి. అదే విధంగా చెన్నై క్యాంపస్‌కు చెందిన విద్యార్థికి రూ.1.39 కోట్లతో ఆఫర్ చేతికందించింది. ఉబెర్ సంస్థ కూడా రూ.99.87 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ ఇచ్చింది. శాంసంగ్ కూడా 96.8 లక్షల వార్షిక వేతనంలో ఇంటర్నేషనల్ ఆఫర్‌ను అందించింది.
యాపిల్ సంస్థ తొలిసారి..
ఐఐటీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఈ ఏడాది ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. ప్రముఖ ఐ ఫోన్ దిగ్గజ సంస్థ యాపిల్.. ఐఐటీ క్యాంపస్‌లలో అడుగుపెట్టడం. ఈ సంస్థ దాదాపు అన్ని ఐఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించింది. రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల వార్షిక డొమెస్టిక్ వేతనంతో ఆఫర్లు చేతికందించింది.
ఆధిక్యంలో అమెజాన్...
అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. గతేడాది కంటే ఈ సం వత్సరం 25 శాతం అధికంగా ఆఫర్‌స ఇచ్చింది. వేతనాలను దాదాపు 20 శాతం పెంచింది. ఈ సంస్థ సగటున రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వార్షిక వేతనాన్ని ఖరారు చేసింది. అమెజాన్ అత్యధికంగా బిట్స్ విద్యార్థికి రూ.27.8 లక్షల వేతనం ఆఫర్ చేసింది. మరోవైపు అమెజాన్‌కు పోటీ సంస్థగా నిలిచిన ఫ్లిప్‌కార్ట్ అన్ని క్యాంపస్‌లలోనూ రిక్రూట్‌మెంట్స్ చేపట్టాలని నిర్ణయించినప్పటికీ.. వేతనాలు, ఆఫర్ల సంఖ్య విషయంలో అమెజాన్ తర్వాత స్థానానికే పరిమితం అవుతోంది. ఇప్పటివరకు అమెజాన్ అందించిన అత్యధిక వేతనం రూ.27.8 లక్షలు. కాగా, ఫ్లిప్‌కార్ట్ అత్యధిక ఆఫర్ రూ. 23.8 లక్షలుగా ఉంది.
20శాతంపైగా పెరిగిన వేతనం
డొమెస్టిక్(స్వదేశీ) ఆఫర్ల విషయంలోనూ వార్షిక వేతనాలు.. గతేడాది కంటే 20శాతం నుంచి 25 శాతం మధ్యలో పెరిగాయి. డొమెస్టిక్ ఆఫర్లు-వార్షిక వేతనాల పరంగా టవర్ రీసెర్చ్ సంస్థ ముందంజలో నిలిచింది. ఈ సంస్థ రూ.42 లక్షల నుంచి రూ.45 లక్షల వార్షిక వేతనాన్ని ప్రకటించింది. ఈ తర్వాత స్థానాల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా, ఉబెర్ ఇండియా, గోల్డ్‌మన్ శాచ్స్, ఐటీసీలు నిలిచాయి.
ప్రాధాన్యం.. సీఎస్‌ఈ
ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో పలు కంపెనీలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ) విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. ఆ తర్వాతి క్రమంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. సీఎస్‌ఈ విద్యార్థుల కోణంలో తొలి దశలో ఇప్పటివరకు.. మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ ఆఫర్స్ ఖరారు చేసిన పలు కంపెనీలు.. తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చాయి. సదరు విద్యార్థులకు సంస్థ గురించిన అవగాహన, ఇంటర్న్‌ట్రైనీగా అభ్యర్థులు చూపిన ప్రతిభ ఇందుకు దోహదం చేసింది.
ఈ నైపుణ్యాలకు పెద్దపీట..
సీఎస్‌ఈ విద్యార్థులకు భారీ మొత్తంతో వేతనాలు ఆఫర్ చేస్తున్న సంస్థలు.. దానికి అనుగుణంగానే సదరు విద్యార్థుల్లో ఆధునిక నైపుణ్యాలను లోతుగా పరిశీలిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బిగ్‌డేటా, ఐఓటీ అంశాల్లో పరిజ్ఞానం ఉన్న వారికి పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నైపుణ్యాలున్న విద్యార్థులు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి. ఆధునిక నైపుణ్యాలు లేని కొందరు విద్యార్థులను సైతం సంస్థలు రూ.30 లక్షల వరకు వార్షిక వేతనంతో ఐఓటీ విభాగాల్లో నియమించుకుంటున్నాయి. దీనికి సదరు సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటున్న అంశం.. అభ్యర్థుల్లోని లెర్నింగ్ అప్రోచ్. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థిలోని నేర్చుకునే తత్వాన్ని పరిశీలిస్తున్నాయి. ఇలా.. ఇప్పటివరకు దాదాపు ఇరవై శాతం మంది సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులు ఐఓటీ, ఏఐ జాబ్ ప్రొఫైల్స్ ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.
ఐఐటీ-హెచ్‌లో ఇలా...
ఐఐటీ-హైదరాబాద్‌లోనూ ఈ ఏడాది క్యాంపస్ డ్రైవ్స్ అత్యంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. తొలిదశ ఎంపిక ప్రక్రియకు దాదాపు 90 కంపెనీలు నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది కంటే ఇరవై కంపెనీలు అధికంగా రానున్నాయి. దాదాపు అందరికీ ఆఫర్‌స లభిస్తాయనే అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తుది దశనాటికి వంద శాతం :
ఐఐటీ క్యాంపస్‌లలో ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్ దాదాపు ఆరు నెలలపాటు కొనసాగుతుంది. డిసెంబర్ 1 నుంచి తదుపరి సంవత్సరం మే వరకు ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ జరుగుతుంది. మే నెలలో ముగిసే తుదిదశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ సమయానికి ఆఫర్ల సంఖ్య భారీగా ఉంటుందని.. ముఖ్యంగా కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు వంద శాతం అవకాశాలు ఖాయమని క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వార్షిక వేతనాల పరంగానూ గతేడాది కంటే 20 శాతం మేరకు ఎక్కువ లభించే అవకాశం ఉందంటున్నారు.
2018 హైలెట్స్
1. మైక్రోసాఫ్ట్
2. ఉబెర్
3. శాంసంగ్
4. యాహూ
5. యాపిల్
6. జేపీ మోర్గాన్ ఛేజ్
7. టవర్ రీసెర్చ్
8. గోల్డ్‌మ్యాన్ శాచ్చ్
9. వెబ్‌స్టాఫ్ కో లిమిటెడ్
10. రుబ్రిక్
ఆశాజనకంగానే..
ప్రస్తుతం ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో పరిస్థితులు ఆశాజన కంగానే కనిపిస్తున్నాయి. కేవలం టెక్నికల్ డొమైన్‌లోనే కాకుండా.. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, సర్వీస్ సెక్టార్‌లకు చెందిన సంస్థలు కూడా ఐఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌కు వస్తున్నాయి. ఐఐటీ- హైదరాబాద్ విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. పీపీఓల సమయంలోనే పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. ఐఐటీ హైదరాబాద్‌లో తొలిదశ ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్ ఈ నెల 22 వరకు జరుగుతుంది. ఈ దశలో ఎంపిక కాని విద్యార్థులు నిరాశ చెందకుండా.. కంపెనీల అవసరాలను గుర్తించి తదుపరి దశ నాటికి వాటిని మెరుగుపరచుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్. ఏముల ప్రదీప్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ (ప్లేస్‌మెంట్స్), ఐఐటీ-హెచ్

- రూ.1.4 కోట్లు, రూ.1.39 కోట్ల వార్షిక వేతనంతో ఇద్దరికి ఇంటర్నేషనల్ ఆఫర్ అందించిన మైక్రోసాఫ్ట్ సంస్థ.
- తొలిసారి ఐఐటీ ప్రాంగణాల్లో అడుగు పెట్టిన యాపిల్ సంస్థ.
- సగటున రూ.75 లక్షల నుంచి రూ. కోటి మధ్యలో ఇంటర్నేషనల్ ఆఫర్లు.
- సగటున రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్యలో డొమెస్టిక్ ఆఫర్లు.
- గరిష్టంగా రూ.47 లక్షలతో స్వదేశీ ఆఫర్.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ నైపుణ్యాలున్న వారికి 30 శాతం మేర అధిక వేతనాలు.
- ప్రతి క్యాంపస్‌లోనూ 70 నుంచి వంద కంపెనీల నమోదు.
- పీఎస్‌యూలు సైతం రూ.40 లక్షల వరకు ఆఫర్లు అందించినట్లు సమాచారం.
1. మైక్రోసాఫ్ట్
2. ఉబెర్
3. శాంసంగ్
4. యాహూ
5. యాపిల్
6. జేపీ మోర్గాన్ ఛేజ్
7. టవర్ రీసెర్చ్
8. గోల్డ్‌మ్యాన్ శాచ్చ్
9. వెబ్‌స్టాఫ్ కో లిమిటెడ్
10. రుబ్రిక్
ఆశాజనకంగానే..
ప్రస్తుతం ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో పరిస్థితులు ఆశాజన కంగానే కనిపిస్తున్నాయి. కేవలం టెక్నికల్ డొమైన్‌లోనే కాకుండా.. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, సర్వీస్ సెక్టార్‌లకు చెందిన సంస్థలు కూడా ఐఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌కు వస్తున్నాయి. ఐఐటీ- హైదరాబాద్ విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. పీపీఓల సమయంలోనే పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. ఐఐటీ హైదరాబాద్‌లో తొలిదశ ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్ ఈ నెల 22 వరకు జరుగుతుంది. ఈ దశలో ఎంపిక కాని విద్యార్థులు నిరాశ చెందకుండా.. కంపెనీల అవసరాలను గుర్తించి తదుపరి దశ నాటికి వాటిని మెరుగుపరచుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్. ఏముల ప్రదీప్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ (ప్లేస్‌మెంట్స్), ఐఐటీ-హెచ్
Published date : 08 Dec 2017 06:01PM