215 పోస్టులకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ విడుదల.. ఇలా చదివితే విజయం సాధించడం సులువు..
Sakshi Education
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)కు ప్రకటన వెలువడింది.
తాజాగా యూపీఎస్సీ ఈఎస్‌ఈ–2021 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా యూపీఎస్సీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డొమైన్స్‌లో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ల నియామకాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో.. పరీక్షార్థులకు ఉపయోగపడేలా ఈఎస్‌ఈ పరీక్ష విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
మొత్తం పోస్టుల సంఖ్య : 215
అర్హతలు: ఈఎస్‌ఈ 2021 నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కేంద్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2021, జనవరి 1 నాటికి 21–30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
మూడు దశల్లో ఎంపిక..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదట స్టేజ్–1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి స్టేజ్–2లో మెయిన్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. స్టేజ్–3లో ఇంటర్వూ్యలు జరుగుతాయి.
స్టేజ్–1 ప్రిలిమినరీ 500 మార్కులు..
స్టేజ్–1 (ప్రిలిమినరీ)లో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు మొత్తం 500 మార్కులకు ఉంటాయి. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ అప్టిట్యూడ్ 200 మార్కులకు, పేపర్ 2 ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు సంబంధించి 300 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు ఆరు నుంచి ఏడు మందికి మెయిన్‌కు అర్హత లభిస్తుంది.
స్టేజ్ 2 మెయిన్ 600 మార్కులు..
స్టేజ్–2(మెయిన్)లో.. రెండు డిస్క్రిప్టివ్ తరహా పేపర్లు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌పై ఉంటాయి. ఒక్కోటి 300 మార్కులకు చొప్పున మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమ్స్+మెయిన్‌లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వూ్య)కు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వూ్యకు పిలుస్తారు.
స్టేజ్ 3 పర్సనాలిటీ టెస్ట్ 200 మార్కులు..
పర్సనాలిటీ(ఇంటర్వూ్య) టెస్టు 200 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్+మెయిన్+ పర్సనాలిటీ టెస్టు(500+600+ 200)ల్లో ప్రతిభ చూపిన వారికి తుది జాబితాలో చోటు దక్కుతుంది.
ప్రిలిమినరీ–పరీక్ష విధానం..
ప్రతి పేపర్‌కు కనీస క్వాలిఫయింగ్ మార్కులను యూపీఎస్సీ నిర్ణయిస్తుంది.
మెయిన్– పరీక్ష విధానం..
ఒక్కో పేపర్‌ను 3 గంటల వ్యవధిలో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
సిలబస్..
సివిల్ ఇంజనీరింగ్: పేపర్ 1: బిల్డింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ కాంక్ట్రీట్ అండ్ మసోన్రీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్.
పేపర్ 2: ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రాలిక్ మెషీన్స్ అండ్ హైడ్రోపవర్, హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అండ్ జియాలజీ, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్.
మెకానికల్..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ పరీక్షకు ఇంకా దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుటి నుంచే సిలబస్‌ను అనుసరించి ప్రణాళికా బద్దంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పటికే గేట్ రాసిన అభ్యర్థులకు ఈఎస్‌ఈ ప్రిపరేషన్ కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కారణం ఈఎస్‌ఈ, గేట్ సిలబస్, సన్నద్ధత దాదాపు ఒకే విధంగా ఉండటమే. కాని కొంతమంది అభ్యర్థులు ఇంటి వద్ద ఉండి ప్రిపేరవుతున్నప్పుడే కాదు.. తరగతులకు హాజరవుతున్నప్పుడు కూడా సిలబస్‌ను పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా ప్రిపరేషన్ అసంపూర్ణంగా మారుతోంది.ఈ తరహా విధానం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్ మొత్తం పూర్తి చేసేలా ప్రిపరేషన్ సాగించాలి. సిలబస్‌పై పూర్తిగా దృష్టిపెట్టి ఏకాగ్రతతో అధ్యయనం చేయాలి.అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది.
ప్రశ్నల సాధన..
మొదట ముఖ్యంగా సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి.ఆ తర్వాత గత ఈఎస్‌ఈ ప్రశ్నలు, గత గేట్ ప్రశ్నలు సాధన చేయాలి. తద్వారా ప్రిపరేషన్ స్థాయిపై అవగాహన వస్తుంది. వాస్తవానికి తరగతి గది బోధన, నేర్చుకున్న అంశాల ద్వారా పరీక్షలో విజయం సాధించొచ్చు. అయితే వాటితోపాటు ఇతర అంశాలను కూడా చదివితే పోటీ పరీక్షలో అదనపు ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను పరిశీలించాలి. కొత్త ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌పీటీఈఎల్ వీడియోలు వీక్షించడం వంటివి లాభిస్తుంది.
ఆన్‌లైన్ పరీక్షలు..
పరీక్ష సన్నాహాల్లో ఆన్‌లైన్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆన్‌లైన్ టెస్టులకు హాజరవ్వాలి. తద్వారా స్వీయ సన్నద్ధతను మరింతగా మెరుగుపరచుకోవచ్చు. అలాగే సబ్జెక్టుల్లోని ఏయే అంశాల్లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిపై దృష్టిపెట్టవచ్చు.
ప్రశాంతంగా..
ఈఎస్‌ఈ ప్రిపరేషన్ ఓ దీర్ఘకాలిక ప్రక్రియ. ఈ ప్రయాణంలో అనేక అంశాలు అభ్యర్థుల మార్గానికి అడ్డుపడుతుంటాయి. ఇందులో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి.. నిరుత్సాహం కలిగించేవీ ఉంటాయి. కాబట్టి పరీక్షార్థులు ప్రతికూల ఆలోచ నలకు దూరంగా ఉండాలి. క్రమంతప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తూ మానసిక ఉల్లాసం పొందాలి.
ఇవి కీలకం..

పేపర్ | విభాగం | సమయం | మార్కులు |
పేపర్ 1 | జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ | 2 గంటలు | 200 |
పేపర్ 11 | ఇంజనీరింగ్ బ్రాంచ్ | 3 గంటలు | 300 |
మొత్తం |
|
| 500 |
ప్రతి పేపర్‌కు కనీస క్వాలిఫయింగ్ మార్కులను యూపీఎస్సీ నిర్ణయిస్తుంది.
మెయిన్– పరీక్ష విధానం..
ఒక్కో పేపర్‌ను 3 గంటల వ్యవధిలో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
పేపర్ | సబ్జెక్టు | మార్కులు | |
పేపర్ 1 | సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ | 300 | |
పేపర్ 2 | సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ | 300 | |
మొత్తం |
|
| 300 |
సిలబస్..
సివిల్ ఇంజనీరింగ్: పేపర్ 1: బిల్డింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ కాంక్ట్రీట్ అండ్ మసోన్రీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్.
పేపర్ 2: ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రాలిక్ మెషీన్స్ అండ్ హైడ్రోపవర్, హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అండ్ జియాలజీ, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్.
మెకానికల్..
- పేపర్ 1: ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, టర్బో మెషినరీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రెన్యువబుల్ సోర్సెస్ ఆఫ్ ఇంజనీరింగ్.
- పేపర్ 2: ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెకానిజమ్స్ అండ్ మెషీన్స్, డిజైన్ ఆఫ్ మెషీన్ ఎలిమెంట్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ అండ్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్.
- పేపర్ 1: ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ మెటీరి యల్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్, కంప్యూటర్ ఫండమెం టల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
- పేపర్ 2: అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్.
- పేపర్ 1: బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, నెట్‌వర్క్ థియరీ, అనలాగ్ డిజిటల్ సర్క్యూట్స్.
- పేపర్ 2: అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టాపిక్స్.
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ పరీక్షకు ఇంకా దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుటి నుంచే సిలబస్‌ను అనుసరించి ప్రణాళికా బద్దంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పటికే గేట్ రాసిన అభ్యర్థులకు ఈఎస్‌ఈ ప్రిపరేషన్ కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కారణం ఈఎస్‌ఈ, గేట్ సిలబస్, సన్నద్ధత దాదాపు ఒకే విధంగా ఉండటమే. కాని కొంతమంది అభ్యర్థులు ఇంటి వద్ద ఉండి ప్రిపేరవుతున్నప్పుడే కాదు.. తరగతులకు హాజరవుతున్నప్పుడు కూడా సిలబస్‌ను పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా ప్రిపరేషన్ అసంపూర్ణంగా మారుతోంది.ఈ తరహా విధానం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్ మొత్తం పూర్తి చేసేలా ప్రిపరేషన్ సాగించాలి. సిలబస్‌పై పూర్తిగా దృష్టిపెట్టి ఏకాగ్రతతో అధ్యయనం చేయాలి.అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది.
ప్రశ్నల సాధన..
మొదట ముఖ్యంగా సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి.ఆ తర్వాత గత ఈఎస్‌ఈ ప్రశ్నలు, గత గేట్ ప్రశ్నలు సాధన చేయాలి. తద్వారా ప్రిపరేషన్ స్థాయిపై అవగాహన వస్తుంది. వాస్తవానికి తరగతి గది బోధన, నేర్చుకున్న అంశాల ద్వారా పరీక్షలో విజయం సాధించొచ్చు. అయితే వాటితోపాటు ఇతర అంశాలను కూడా చదివితే పోటీ పరీక్షలో అదనపు ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను పరిశీలించాలి. కొత్త ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌పీటీఈఎల్ వీడియోలు వీక్షించడం వంటివి లాభిస్తుంది.
ఆన్‌లైన్ పరీక్షలు..
పరీక్ష సన్నాహాల్లో ఆన్‌లైన్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆన్‌లైన్ టెస్టులకు హాజరవ్వాలి. తద్వారా స్వీయ సన్నద్ధతను మరింతగా మెరుగుపరచుకోవచ్చు. అలాగే సబ్జెక్టుల్లోని ఏయే అంశాల్లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిపై దృష్టిపెట్టవచ్చు.
ప్రశాంతంగా..
ఈఎస్‌ఈ ప్రిపరేషన్ ఓ దీర్ఘకాలిక ప్రక్రియ. ఈ ప్రయాణంలో అనేక అంశాలు అభ్యర్థుల మార్గానికి అడ్డుపడుతుంటాయి. ఇందులో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి.. నిరుత్సాహం కలిగించేవీ ఉంటాయి. కాబట్టి పరీక్షార్థులు ప్రతికూల ఆలోచ నలకు దూరంగా ఉండాలి. క్రమంతప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తూ మానసిక ఉల్లాసం పొందాలి.
ఇవి కీలకం..
- కాన్సెప్టులపై అవగాహన ముఖ్యం.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం పెంచుకోవాలి.
- గత గేట్, ఈఎస్‌ఈ ప్రశ్న పత్రాలు సాధన చేయాలి.
- రైటింగ్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి.
- ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయాలి.
- ఈఎస్‌ఈ పరీక్ష శైలిపై అవగాహన అవసరం.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 27, 2021
- దరఖాస్తు ఫీజు: రూ.200, మహిళా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది.
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూలై 18, 2021
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
Published date : 13 Apr 2021 01:54PM