వైమానిక దళంలో గ్రూప్-ఎక్స్,గ్రూప్-వై ఉద్యోగాల అర్హతలు, ఎంపిక విధానం
Sakshi Education
ఇంటర్ లేదా డిప్లామా పూర్తిచేసిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. ఈ నేపథ్యంలో.. ఎయిర్‌ఫోర్స్ గ్రూప్-ఎక్స్,గ్రూప్-వై.. కొలువులకు అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం..
గ్రూప్ -ఎక్స్,గ్రూప్- వై:
టెక్నికల్ ఫిల్డ్‌లో పనిచేయడానికి గ్రూప్ ఎక్స్ ట్రేడ్ పోస్టులు.. పాలన సంబంధ విషయాల్లో పనిచేయడానికి గ్రూప్ వై పోస్టులను.. భారత వైమానిక దళం భర్తీ చేయనుంది.
అర్హతలు :
గ్రూప్-ఎక్స్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యలో (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా) 50 శాతం మార్కు లతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమాలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమాలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.
గ్రూప్-వై: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ (లేదా) తత్సమాన కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్‌ను 50 శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ సబ్జెకులో 50 శాతం మార్కులు పొందాలి.
గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 02, 2020
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 20, 2020
పరీక్ష ఫీజు: రూ.250
పరీక్ష తేదీలు: 2020 మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://airmenselection.cdac.in,
www.careerindianairforce.cdac.in

- గ్రూప్-వై మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 10+2/ ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో 50శాతం మార్కులు తప్పనిసరి.
- డిప్లొమా విద్యార్థులు గ్రూప్-ఎక్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- జనవరి 17, 2000 నుంచి డిసెంబర్ 30, 2003 మధ్య జన్మించి ఉండాలి. 21 ఏళ్లు మించ కూడదు.
- ఎత్తు కనీసం 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. కంటి, వినికిడి, దంత సమస్యలు ఉండకూడదు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెండు దశలు ఫేజ్-1, ఫేజ్-2ల్లో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫేజ్-1లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్-1 అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్-2కు ఎంపిక చేస్తారు.
- ఫేజ్-1 గ్రూప్ ఎక్స్: ఈ పోస్టులకు ఫిజిక్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.
- ఫేజ్-1 గ్రూప్ వై: ఈ పోస్టులకు ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్‌పై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు.
- ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫిజిక్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్ జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తే.. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల నుంచి 1/4మార్కుల కోత ఉంటుంది.
- ఫేజ్-1 పరీక్ష జరిగిన 25 రోజుల అనంతరం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు.
- ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్‌కు తమ సర్టిఫికెట్లను తీసుకొని వెళ్లాలి.
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫేజ్-2కు సంబంధించి ఫిజికల్ ఫిట్‌నెస్‌లో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఆరున్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. అలాగే నిర్ణీత కాల వ్యవధిలో 10 పుష్‌అప్స్, 10 సిట్ అప్స్, 20 స్క్వాట్స్ పూర్తిచేయాలి.
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(ఫీఎఫ్‌టీ) లో అర్హత సాధించిన అభ్యర్థులకు అడాప్టబిలిటీ టెస్ట్-1 , టెస్ట్-2 ఉంటాయి. అభ్యర్థి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తారు. టెస్ట్-1 మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు టెస్ట్-2 జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగంలో భాగంగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిలిటరీ వాతావరణ మార్పులకు అభ్యర్థులు అలవాటు పడగలరా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ రెండు టెస్ట్‌ల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి ట్రెయినింగ్ కోసం ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 02, 2020
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 20, 2020
పరీక్ష ఫీజు: రూ.250
పరీక్ష తేదీలు: 2020 మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://airmenselection.cdac.in,
www.careerindianairforce.cdac.in
Published date : 06 Jan 2020 05:00PM