త్రివిధ దళాల్లో కెరీర్ అవకాశాలు
Sakshi Education
ధైర్య సాహసాలు.. ఆత్మవిశ్వాసం.. దేశ సేవ చేయాలనే తపన.. సమాజంలో ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారా? అలాంటి యువతకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలు సరైన వేదికలుగా నిలుస్తున్నాయి. భారత రక్షణ దళాల్లో ప్రవేశం ద్వారా దేశ భద్రతలో పాలుపంచుకొనే అవకాశంతో పాటు కెరీర్ పరంగానూ ఉజ్వల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ కోర్సుల అర్హత లతో త్రివిధ దళాల్లో లభిస్తున్న కెరీర్ అవకాశాలపై ఫోకస్...
ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీలో ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ వరకు వివిధ కోర్సుల అర్హతతో పలు హోదాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
అవకాశాలు:
ఇండియన్ నేవీకి ఎంపికైన వారికి హోదాలను బట్టి శిక్షణ ఉంటుంది. 10+2 బీటెక్ ఎంట్రీ ద్వారా ఎంపికైతే ఐఎన్‌ఎస్ శివాజీ /కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చదవాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత నేవీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో పర్మనెంట్ కమిషన్ హోదాతో అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా ఎంపికైన వారికి ఎజిమలలోని నేవల్ అకాడమీలో నిర్దేశిత వ్యవధిలో శిక్షణనిచ్చి పర్మనెంట్ కమిషన్ ర్యాంకు కేటాయిస్తారు.
ఇంటర్మీడియెట్ అర్హతగా జరిగే సైలర్, ఆర్టిఫీషియర్ అప్రెంటీస్ ట్రైనీ పోస్ట్‌లకు ఎంపికైన వారికి ఐఎన్‌ఎస్-చిల్కాలో శిక్షణనిస్తారు.
వెబ్‌సైట్: www.nausenabharti.nic.in
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో బీటెక్, బీఈ అర్హతలతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌తో ఫ్లయింగ్ బ్రాంచ్‌లు, బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతగా గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పలు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. వీటికోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు (ఫిబ్రవరి/ఆగస్ట్) జరుగుతుంది. ఫిబ్రవరి పరీక్షకు డిసెంబర్‌లో, ఆగస్ట్ పరీక్షకు జూన్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వయసు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డెరైక్ట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇండియన్ ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్ హోదాతో కొలువులను పొందవచ్చు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఏటా రెండుసార్లు మార్చి/ఏప్రిల్, అక్టోబర్/నవంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎంపికైన వారికి ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ అనంతరం పర్మనెంట్ కమిషన్ హోదాలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం ఖరారు చేస్తారు.
యూనివర్సిటీ ఎంట్రీ స్కీం:
యూనివర్సిటీ ఎంట్రీ స్కీంలో బీటెక్ చివరి సంవత్సరం, తృతీయ సంవత్సరం విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాది శిక్షణ అనంతరం ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ హోదా కల్పిస్తారు.
యూపీఎస్‌సీ-రిక్రూట్‌మెంట్
ఎన్‌డీఏ/ఎన్‌ఏ ఎగ్జామినేషన్:
యూపీఎసీ ఏటా రెండు సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ/ నేవల్ అకాడమీల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. దీంట్లో విజయం సాధిస్తే లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో స్థిరపడొచ్చు.
ఎన్‌డీఏ.. అర్హతల వివరాలు
ఇండియన్ నేవీలో ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ వరకు వివిధ కోర్సుల అర్హతతో పలు హోదాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
అవకాశాలు:
- సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్
అర్హత: 55శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
- సీనియర్ సెకెండరీ రిక్రూటర్స్
అర్హత: ఇంటర్మీడియట్ (ఎంపీసీ) ఉత్తీర్ణత.
వయసు: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
- 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ
అర్హత: ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. గ్రూప్ సబ్జెక్ట్స్‌ల్లో 70 శాతం మార్కులు తప్పనిసరి.
వయసు: 16 1/2 సంవత్సరాలు - 19 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్స్‌లో ఉత్తీర్ణత
- యూనివర్సిటీ ఎంట్రీ స్కీం (షార్ట్ సర్వీస్ కమిషన్)
అర్హత: మెకానికల్, మెరైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సివిల్, నావల్ ఆర్కిటెక్చర్ తదితర 18 బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు. నాలుగో సెమిస్టర్ వరకు 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
వయసు: 19-25 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్
- షార్ట్ సర్వీస్ కమిషన్ (జీఎస్)
అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్
వయసు: 19-25 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ
- షార్ట్ సర్వీస్ కమిషన్ (సబ్ - మెరైన్ ఇంజనీరింగ్)
అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.
వయసు: 19 1/2 - 25 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్
- షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీ స్కీం
అర్హత: నావల్ ఆర్కిటెక్చర్/మెకానికల్ / సివిల్ / ఏరోనాటిక్స్/ మెటలర్జికల్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 21- 25 సంవత్సరాలు
- షార్ట్ సర్వీస్ కమిషన్ (సబ్ మెరైన్)
అర్హత: ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / కంట్రోల్ ఇంజనీరింగ్ / టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 19 1/2 - 25 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్
- స్పెషల్ నావల్ ఆర్కిటెక్ట్ ఎంట్రీ
అర్హత: నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయసు: 21 - 25 సంవత్సరాలు
ఎంపిక విధానం: క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా.
ఇండియన్ నేవీకి ఎంపికైన వారికి హోదాలను బట్టి శిక్షణ ఉంటుంది. 10+2 బీటెక్ ఎంట్రీ ద్వారా ఎంపికైతే ఐఎన్‌ఎస్ శివాజీ /కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చదవాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత నేవీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో పర్మనెంట్ కమిషన్ హోదాతో అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా ఎంపికైన వారికి ఎజిమలలోని నేవల్ అకాడమీలో నిర్దేశిత వ్యవధిలో శిక్షణనిచ్చి పర్మనెంట్ కమిషన్ ర్యాంకు కేటాయిస్తారు.
ఇంటర్మీడియెట్ అర్హతగా జరిగే సైలర్, ఆర్టిఫీషియర్ అప్రెంటీస్ ట్రైనీ పోస్ట్‌లకు ఎంపికైన వారికి ఐఎన్‌ఎస్-చిల్కాలో శిక్షణనిస్తారు.
వెబ్‌సైట్: www.nausenabharti.nic.in
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్స్)
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ)ఉత్తీర్ణత
వయసు: 17-22 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య, మెడికల్ టెస్టులు ఉంటాయి.
- గ్రూప్-వై (నాన్‌టెక్నికల్)
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 17-25 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులు ఉంటాయి.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో బీటెక్, బీఈ అర్హతలతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌తో ఫ్లయింగ్ బ్రాంచ్‌లు, బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతగా గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పలు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. వీటికోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు (ఫిబ్రవరి/ఆగస్ట్) జరుగుతుంది. ఫిబ్రవరి పరీక్షకు డిసెంబర్‌లో, ఆగస్ట్ పరీక్షకు జూన్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వయసు:
- ఫ్లయింగ్ బ్రాంచ్: 20 - 24 సంవత్సరాలు
- టెక్నికల్ బ్రాంచ్: 20 - 26 సంవత్సరాలు
- గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్: 20 - 26 సంవత్సరాలు
- వివరాలకు: www.careerairforce.nic.in
- 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
వయసు: 16 1/2-19 1/2 ఏళ్లు
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ)ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా
- సోల్జర్ టెక్నికల్
అర్హత: ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష
- క్లర్క్, స్టోర్ కీపర్
అర్హత: 50శాతం మార్కులతో ఇంటర్(అన్ని గ్రూపులు) ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు రావాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్షలు ఉంటాయి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డెరైక్ట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇండియన్ ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్ హోదాతో కొలువులను పొందవచ్చు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఏటా రెండుసార్లు మార్చి/ఏప్రిల్, అక్టోబర్/నవంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎంపికైన వారికి ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ అనంతరం పర్మనెంట్ కమిషన్ హోదాలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం ఖరారు చేస్తారు.
యూనివర్సిటీ ఎంట్రీ స్కీం:
యూనివర్సిటీ ఎంట్రీ స్కీంలో బీటెక్ చివరి సంవత్సరం, తృతీయ సంవత్సరం విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాది శిక్షణ అనంతరం ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ హోదా కల్పిస్తారు.
యూపీఎస్‌సీ-రిక్రూట్‌మెంట్
ఎన్‌డీఏ/ఎన్‌ఏ ఎగ్జామినేషన్:
యూపీఎసీ ఏటా రెండు సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ/ నేవల్ అకాడమీల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. దీంట్లో విజయం సాధిస్తే లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో స్థిరపడొచ్చు.
ఎన్‌డీఏ.. అర్హతల వివరాలు
- ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
- ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
- వయసు: 161/2 నుంచి 19సంవత్సరాల మధ్య ఉండాలి.
- శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు విభాగాల ఆధారంగా ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో మూడేళ్లపాటు శిక్షణ, భోదనలు ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జేఎన్‌యూ ఢిల్లీ బీఏ / బీఎస్సీ సర్టిఫికె ట్లను అందిస్తుంది. నేవల్ అకాడెమీకి ఎంపికైన వారికి నాలుగేళ్ల శిక్షణ అనంతరం బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు.
- వెబ్‌సైట్: www.upsc.gov.in
సీడీఎస్
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్... ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కెరీర్ అవకాశాలు కల్పిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు విభాగం ఆధారంగా ఏడాదిన్నర వ్యవధిలో శిక్షణ ఉంటుంది. ఆర్మీ ఔత్సాహికులకు ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్), ఎయిర్‌ఫోర్స్ ఔత్సాహికులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్), ఆఫీసర్స్ ట్రైనీ ఔత్సాహికులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై), నేవీ ఔత్సాహికులకు నావల్ అకాడమీ (గోవా)లలో శిక్షణ నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు (మే, అక్టోబర్) నిర్వహించే సీడీఎస్ పరీక్షకు మార్చి/ఏప్రిల్, అక్టోబర్/నవంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వివరాలకు: www.upsc.gov.in

అద్భుత అవకాశాలు డిఫెన్స్ రంగంలో ఇంటర్మీడియెట్ అర్హత నుంచే పర్మనెంట్ కమిషన్ హోదా కల్పించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్ అర్హతగా ప్రవేశం కల్పించే పలు విభాగాల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణతోపాటు, అకడమిక్ బోధన ద్వారా బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్లు పొందే సౌలభ్యం కూడా ఉంది. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే వీటి గురించి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో అవగాహన కొంత తక్కువగా ఉంది. అవగాహనతో అడుగేస్తే అద్భుత కెరీర్ సొంతం చేసుకోవచ్చు. - కల్నల్ బి.వై.కన్నౌర్, కెవెలియర్ ఇండియా, ఎస్‌ఎస్‌బీ ట్రైనింగ్ సెంటర్. |
Published date : 17 Dec 2015 06:07PM