Indian Coast Guard Recruitment: తీర దళంలో.. కమాండెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా కలిగిన పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు తొలుత శిక్షణ ఉంటుంది. శిక్షణ సైతం విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. తీరదళంలో కొలువు ఖాయమైనట్లే!!
- మొత్తం పోస్టుల సంఖ్య: 50
- పోస్టుల వివరాలు: జనరల్ డ్యూటీ(మేల్)–30, కమర్షియల్ పైలట్ ఎంట్రీ(సీపీఎల్–ఎస్‌ఎస్‌ఏ)(పురుష/మహిళా)–10, టెక్నికల్(ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్)(మేల్)–10.
అర్హతలు
- జనరల్ డ్యూటీ(మేల్): విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
- కమర్షియల్ పైలట్ ఎంట్రీ((సీపీఎల్–ఎస్‌ఎస్‌ఏ) (మేల్/ఫిమేల్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. వయసు: 01.07.1997 నుంచి 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి.
- టెక్నికల్(ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్)(మేల్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
- ఎంపిక ప్రక్రియలో స్టేజ్1, స్టేజ్ 2 ఉంటాయి.
- స్టేజ్1లో.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థుల్ని ప్రిలిమినరీ సెలక్షన్‌కు ఎంపికచేస్తారు.
చదవండి: Indian Coast Guard Recruitment: 50 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ప్రిలిమినరీ సెలక్షన్
ప్రిలిమినరీ సెలక్షన్‌లో.. మెంటల్ ఎబిలిటీ టెస్ట్/కాగ్నిటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ టెస్ట్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఉంటాయి. అప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఆ తర్వాత పిక్చర్ పర్‌సెప్షన్ టెస్ట్ అండ్ డిస్కషన్ టెస్ట్‌లో అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ మాట్లాడటం, చర్చించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్‌కు పిలుస్తారు. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి.
మెడికల్ స్టాండర్డ్స్
- అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ): కనీసం 157 సెం.మీ ఎత్తు, ఐసైట్–6/6, 6/6 (గ్లాసెస్‌తో ఐతే), 6/6, 6/9 (గ్లాసెస్ లేకుండా) ఉండాలి.
- అసిస్టెంట్ కమాండెంట్(జనరల్ డ్యూటీ–పైలెట్): కనీసం 162.5 సెం.మీ. ఎత్తు, అలాగే లెగ్ లెంత్ 99 సెం.మీ. ఉండాలి.
- శరీరంలోని ఏ భాగంలో కూడా పర్మనెంట్ టాటులు ఉండకూడదు. దీనికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ట్రైబల్స్/ఇతర కమ్యూనిటీలకు మినహాయింపు లభిస్తుంది.
కెరీర్
అసిస్టెంట్ కమాండెంట్‌గా విధుల్లో చేరిన అభ్యర్థులు అనుభవం, ప్రతిభ ఆధారంగా ఉన్నతస్థాయి పదవులను అందుకునే అవకాశం ఉంది. డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ వంటి కీలక స్థానాలకు చేరుకోవచ్చు.
చదవండి: Indian Air Force Recruitment: ఎయిర్‌ఫోర్స్‌లో 317 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
వేతనం
అసిస్టెంట్ కమాండెంట్ వేతనం 10వ స్కేల్ ప్రకా రం అందజేస్తారు. వీరు ప్రారంభ వేతనంగా రూ.56,100 పొందుతారు.అనుభవం,పేస్కేల్ ప్రకారం వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. వేతనంతోపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అలవెన్సులు లభిస్తాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 17.12.2021
- అడ్మిట్ కార్డ్: డిసెంబర్ 28, 2021
- పరీక్ష తేదీలు: స్టేజ్ 1 పరీక్షలు జనవరి 2022లో జరుగుతాయి.
- వెబ్‌సైట్: https://www.joinindiancoastguard.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్