Skip to main content

ఇండియన్ నేవీ...సవాళ్ల కెరీర్‌కు సరైన చోటు

ఇండియన్ నేవీ.. సముద్ర ఉపరితల, అంతర్భాగ, ఆకాశయానాల గుండా వచ్చే శత్రు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ.. నిరంతరం దేశ రక్షణలో నిమగ్నమవుతోంది.
 ఇంతటి బృహత్తర రక్షణ విధులను నిర్వహిస్తున్న నేవీకి ఎస్‌ఎస్‌సీ నుంచి ఎంటెక్ వరకు; బీఎస్సీ నుంచి ఎంఎస్సీ వరకు వివిధ అర్హతలున్న మానవ వనరుల అవసరం తప్పనిసరి. పట్టుదల, శ్రమించే గుణం ఉంటే.. పదోతరగతి నుంచి పీజీ వరకూ అర్హతతో ఎవరైనా నేవీలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేవీలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో యువత నేవీలో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా చాలెంజింగ్ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు!
ఇండియన్ నేవీలో ప్రధానంగా ఆఫీసర్, సైలర్ కేడర్లు, ఇతర ఉద్యోగాలు ఉంటాయి. ఆఫీసర్ కేడర్‌లో ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. సైలర్ కేడర్లో ఆర్టిఫీసర్ అప్రెంటీస్, ఎస్‌ఎస్‌ఆర్, మెట్రిక్ రిక్రూట్, మ్యుజీషియన్, స్పోర్ట్స్ తదితర కొలువులకు భర్తీ జరుగుతుంది.

ఎగ్జిక్యూటివ్ :
జనరల్ సర్వీస్..
జనరల్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియ మితులైన వారు వార్‌షిప్‌కి మార్గనిర్దేశం (లీడర్) చేస్తారు. షిప్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం; ఆధునిక యుద్ధ వ్యూహాల రచన తదితరాలు వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమల లోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపు గా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. విద్యార్హత: బీఈ/బీటెక్ (ఏదైనా బ్రాంచ్).

హైడ్రోగ్రఫీ :
హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్లు సముద్ర జలాల్లో సర్వే నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి అంతర్జాతీయ జలాలు, పరస్పర స్నేహసంబంధాల్లో భాగంగా మిత్ర దేశాలకు చెందిన సముద్ర జలాల్లోనూ సర్వేలు చేపడతారు. అంతేకాకుండా వీరు అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించే నావిగేషన్ చార్టులు ప్రపంచంలోని నావికులంతా ఉపయోగిస్తారు.
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారిలో కొందరిని గోవాలోని హైడ్రోగ్రఫీ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్.

పైలట్ :
సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపాల్సి ఉంటుంది. శత్రుదేశాల నౌకలు, జలాంతర్గాములను గుర్తించి, వాటిపై దాడి చేయడం వంటివి నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్ల ప్రధాన విధి. పైలట్లు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు; షిప్‌లు, సముద్ర ఒడ్డున ఉన్న నావల్ బేస్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్ లను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 22 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ/నావల్ ఎస్టాబ్లిష్‌మెంట్/ఇంధిరాగాంధీ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ)లో రెండు దశల్లో శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవం తంగా పూర్తిచేసిన వారికి వింగ్‌లు కేటాయిస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్. ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ను చదివుండాలి. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందుండాలి.

అబ్జర్వర్ :
అబ్జర్వర్ ఆఫీసర్లు యుద్ధ సమయాల్లో సముద్ర వాయుమార్గాలను పర్యవేక్షిస్తూ.. నేవీ సిబ్బందిని సమన్వయం చేస్తారు. దీంతోపాటు సోనిక్స్, రాడార్స్, కమ్యూనికేషన్ పరికరాలను ఆపరేట్ చేస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.

లాజిస్టిక్ :
లాజిస్టిక్ ఆఫీసర్.. బడ్జెట్ ప్రణాళిక, అంచనాలు, అమలు; షిప్‌లకు అవసరమైన రోజువారీ విడిభాగాలకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. దీంతోపాటు నేవీ సిబ్బందికి అవసరైన ఆహారం, దుస్తులు (యూనిఫామ్)వంటి ఏర్పా ట్లు చూస్తారు. లాజిస్టిక్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తారు.
శిక్షణ: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు; అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసిన వారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
విద్యార్హత: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ (ఐటీ) ఉత్తీర్ణత లేదా బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ (ఐటీ)తో పాటు ఫైనా న్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్/మెటీ రియల్ మేనేజ్‌మెంట్‌లలో పీజీ డిప్లొమా ఉండాలి.
ఫర్ వర్క్స్: బీఈ/బీటెక్ (సివిల్)/బీఆర్క్.

నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ :
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. విద్యార్హత: మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/మెటలర్జీ/నావల్ ఆర్కిటెక్చర్ స్పెషైలైజేషన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు తప్పనిసరి.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ :
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో ట్రైనింగ్ ఇస్తారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసిన వారికి సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
విద్యార్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ) లేదా బీఎస్సీ (ఐటీ) లేదా ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా ఎంఎస్సీ (కంప్యూటర్స్) లేదా బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ :
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉం టుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. వీటిని పూర్తిచేసిన వారు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో చేరుతారు.
విద్యార్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.

జడ్జ్ అడ్వకేట్, జ్యుడీషియల్ ఆఫీసర్ :
శిక్షణ; అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకడామీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌లలో శిక్షణ పూర్తిచేసుకున్నవారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
విద్యార్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్స్ యాక్ట్-1961 కింద న్యాయవాదిగా నమోదై ఉండాలి.

ఫిజికల్ ట్రైనింగ్ ఆఫీసర్ :
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ పూర్తిచేసిన వారికి సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
విద్యార్హత:
అథ్లెటిక్స్/క్రాస్-కంట్రీ/ట్రైత్లాన్/బ్యాడ్మింటన్/టెన్నిస్/స్క్వాష్/ఫుట్‌బాల్/హ్యాండ్‌బాల్/హాకీ/బాస్కెట్‌బాల్/వాలీబాల్/క్రికెట్/స్విమ్మింగ్/డైవింగ్/వాటర్ పోలో/కబడ్డీ/బాక్సింగ్ విభాగాల్లో జాతీయస్థాయి సీనియర్ లెవల్ చాంపియన్ షిప్స్ లేదా గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.

నేవల్ మ్యుజీషియన్స్ :
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ పూర్తిచేసిన వారు సబ్ లెఫ్టినెంట్ హోదాకు చేరుతారు.

3 మార్గాలు ద్వారా నోటిఫికేషన్లు..
3 మార్గాల్లో నేవీలో అధికారిగా చేరొచ్చు. అవి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలు; డెరైక్ట్ ఎంట్రీ పర్మినెంట్ కమిషన్/షార్ట్ సర్వీస్ కమిషన్; యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్.
1. యూపీఎస్సీ-ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ :
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ఎగ్జామ్-1కు ఏటా డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్‌లో రాత పరీక్ష ఉంటుంది. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ-2 పరీక్షకు జూన్/జూలైలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్/నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి : దరఖాస్తు సమయానికి 16 సంవత్సరాల ఆరునెలలు నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ: ఎంపికై న అభ్యర్థులకు ఇండియన్ నావల్ అకాడమీలో నాలుగేళ్ల బోధన, శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి బీటెక్ సర్టిఫికెట్ లభిస్తుంది.

సీడీఎస్‌ఈ :
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ)-1 పరీక్షకు నవంబర్‌లో; సీడీఎస్‌ఈ-2 పరీక్షకు జూలైలో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
విద్యార్హతలు: బీటెక్/బీఈ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
ఎన్‌సీసీ ఎంట్రీ: సీడీఎస్‌ఈ నోటిఫికేషన్, అడ్వర్టైజ్‌మెంట్‌కు అనుబంధంగా ఎన్‌సీసీ ఎంట్రీకి సంబంధించి ప్రకటన వెలువడుతుంది. ఎన్‌సీసీ ‘సి’సర్టిఫికెట్ ఉండి.. నిర్దేశిత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ విధానం ద్వారా ఎలాంటి పరీక్ష రాయకుండా నేరుగా నేవీలో ప్రవేశించొచ్చు.

2. డైరె క్ట్ ఎంట్రీ పర్మినెంట్ కమిషన్/షార్ట్ సర్వీస్ కమిషన్
  • పర్మినెంట్ కమిషన్ (క్యాడెట్ ఎంట్రీ) విధానం కింద ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్) నోటిఫికేషన్ విడుదలవుతుంది.
  • డెరైక్ట్ ఎంట్రీ షార్ట్ సర్వీస్ కమిషన్ (గ్రాడ్యుయేట్ ఎంట్రీ) విధానంలో ఏటా రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదలవుతాయి. వీటిద్వారా అబ్జర్వర్ ఉద్యోగాలను భర్తీచేస్తారు.
  • డెరైక్ట్ ఎంట్రీ షార్ట్ సర్వీస్ కమిషన్ (గ్రాడ్యుయేట్ ఎంట్రీ) కింద ఆయా నెలల్లో పలు నోటిఫికేషన్లు విడుదలవుతాయి.
3. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్)
యూఈఎస్ ద్వారా ఏడాదికి ఒకసారి పర్మినెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్‌లలో నియామకాలు జరుపుతారు. వివిధ బృందాలు దేశంలోని అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించి.. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వాటిలో ప్రతిభచూపినవారికి నియామకాలు ఖరారు చేస్తారు.
విద్యార్హత: మెకానికల్, మెరైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సివిల్, నావల్ ఆర్కిటెక్చర్ తదితర 18 బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు. నాలుగో సెమిస్టర్ వరకు 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
వయసు: 19-25 ఏళ్లు.

ఇంజనీరింగ్ :
ఇంజనీర్ ఆఫీసర్ (జనరల్ సర్వీస్) :
విద్యార్హత: మెరైన్/మెకానికల్/ఏరోనాటికల్/ ప్రొడక్షన్/మెటలర్జీ/కంట్రోల్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు తప్పనిసరి.

సబ్‌మెరైన్ టెక్నికల్ ఆఫీసర్ :
విద్యార్హత: మెకానికల్/మెరైన్/ఆటోమోటివ్/మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్/ మెటలర్జీ/ఏరోనాటికల్/ఏరోస్పేస్/బీఎస్ మెరైన్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 55 శాతం ఉత్తీర్ణత తప్పనిసరి.

నావల్ ఆర్కిటెక్ట్ ఆఫీసర్ :
విద్యార్హత: మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/ మెటలర్జీ/నావల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 60 శాతం ఉత్తీర్ణత ఉండాలి.

ఎలక్ట్రికల్ :
ఎలక్ట్రికల్ ఆఫీసర్ (జనరల్ సర్వీస్):

విద్యార్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలీ కమ్యూనికే షన్ స్పెషలైజేషన్ల తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణ త. 60 శాతం ఉత్తీర్ణత తప్ప నిసరి.

ఎలక్ట్రికల్ ఆఫీసర్(సబ్‌మెరైన్) :
విద్యార్హత:
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీ కమ్యూ నికేషన్/కంట్రోల్/పవర్ ఇంజనీరింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్లతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి.

ఎడ్యుకేషన్ :
ఎడ్యుకేషన్ ఆఫీసర్:
కనీసం ద్వితీయ శ్రేణితో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఇంగ్లిష్/కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత లేదా ఇంజనీర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత లేదా ఎకనామిక్స్/హిస్టరీ/ పొలిటికల్ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణత.

సైలర్ :
సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్), మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్), మ్యుజీషియన్ (ఎంయూఎస్), స్పోర్ట్స్ ఎంట్రీ, ఆర్టిఫిసర్ అప్రెంటీసెస్ (ఏఏ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు డిసెంబర్/జనవరి, జూన్/జూలైలో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, జాతీయ, స్థానిక దినపత్రికల్లో ప్రచురితమవుతాయి. ఆయా ఉద్యోగాలు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ తదితర కోర్సుల అర్హతతో పలు హోదాల్లో అవకాశాలు లభిస్తున్నారుు.
ఆర్టిఫిసెర్ అప్రెంటీస్ :
విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బ యాలజీ/కంప్యూటర్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు పొంది ఉండాలి.

సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఆర్) :
విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. వయసు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి.

మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) :
చెఫ్, స్టీవర్డ్, శానిటరీ హైజీనిస్ట్ (ఎంఆర్).
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత. వయసు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి.

మ్యుజీషియన్ (ఎంఆర్) :
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌కి సంబంధించి నిర్దేశిత అర్హతలు ఉండాలి.
వయసు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయానికి 17-25 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వివిధ నోటిఫికేషన్ల ద్వారా సివిల్ విభాగం కింద ప్యూన్, సఫాయివాలా, వాచ్‌మెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎల్‌డీసీ, ఛార్జ్‌మెన్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
  • నేవీలో అధికారి లేదా సైలర్ కేడర్లలోని ఏ ఉద్యోగంలో చేరాలన్నా.. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఫిజికల్, మెడి కల్‌టెస్ట్‌ల్లో అర్హత సాధించాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
Published date : 28 Sep 2018 01:26PM

Photo Stories