Skip to main content

ఎన్డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ప్రత్యేకం

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి మంచి మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) పరీక్ష.
యూపీఎస్సీ ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్ అర్హతతో త్రివిధ దళాల్లో అధికారిగా కెరీర్‌ను సుస్థిరం చేసుకోవడంతో పాటు దేశ రక్షణలో భాగస్వామి అయ్యేందుకు వీలుకల్పిస్తోంది. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ద్వారా పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో 136వ కోర్సు లేదా ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ 98వ కోర్సులో ప్రవేశం పొందొచ్చు.

ఖాళీల వివరాలు:
మొత్తం:
375.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ): 320
(ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70);
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 55

విద్యార్హత:
  • ఎన్‌డీఏ (ఆర్మీ వింగ్): స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు లేదా యూనివర్సిటీ పరిధిలో 10+2 ఉత్తీర్ణత.
  • ఎన్‌డీఏ (ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలు), ఇండియన్ నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత.

వయోపరిమితి: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వీరు 1997, జనవరి 2 -2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. నిర్దేశించిన విధంగా తగిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: రాతపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) నిర్వ హించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీటెస్ట్ ఆధారంగా.

రాత పరీక్ష విధానం:

సబ్జెక్టు

సమయం

మార్కులు

మ్యాథమెటిక్స్

2½ గంటలు

300

జనరల్ ఎబిలిటీ

2½ గంటలు

600

మొత్తం

900


  • ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ విభాగాల్లోని ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.
  • జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో రెండు విభాగాలుంటాయి. వీటిలో 200 మార్కులకు ఇంగ్లిష్, 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు జవాబుకు సరైన సమాధానాలకు ఇచ్చే మార్కుల నుంచి 0.33 మార్కులు కోత విధిస్తారు.

ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్:
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఈ పరీక్షలు/ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో రెండు దశలుంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే రెండో దశ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు.
  • మొదటి రోజు: ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్, నాన్ వెర్బల్), పిక్చర్ పెర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్.
  • రెండో రోజు: సైకలాజికల్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టె స్ట్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్.
  • మూడో రోజు: గ్రూప్ డిస్కషన్, ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, గ్రూప్ అబ్‌స్టెకల్ రేస్, లెక్చరేట్.
  • నాలుగో రోజు: ఇండివిడ్యువల్ అబ్‌స్టెకల్స్, కమాండ్ టాస్క్, ఫైనల్ గ్రూప్ టాస్క్.
  • ఐదో రోజు: కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి.

శిక్షణ వివరాలు
అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైన వారిని సర్వీస్‌తో నిమిత్తం లేకుండా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణకు ఎంపిక చేస్తారు. దీన్ని మూడేళ్లపాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రెండున్నరేళ్లు ఈ మూడు సర్వీస్‌లకూ శిక్షణ ఒకేవిధంగా ఉంటుంది. డిగ్రీ తరగతులతోపాటు సంబంధిత శిక్షణ ఉంటుంది. చివర్లో అభ్యర్థుల ఎంపికను అనుసరించి బీఎస్సీ/బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీఏ డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. తర్వాత ఆర్మీ క్యాడెట్లు ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్), నేవల్ క్యాడెట్లు ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లో సంబంధిత అంశాల్లో ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. ఈ సమయంలో నెలకు రూ.21 వేల వేతనం చెల్లిస్తారు.
  • నేవల్ అకాడమీకి ఎంపికైన వారు నాలుగేళ్లపాటు ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల)లో శిక్షణ పొందుతారు. తర్వాత వీరికి బీటెక్ డిగ్రీ అందిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యతేదీలు:
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 17, 2015.
  • పరీక్ష తేదీ: సెప్టెంబరు 27, 2015.
  • వెబ్‌సైట్: upsconline.nic.in
Published date : 01 Jul 2015 12:21PM

Photo Stories