‘డీఆర్‌డీవో’ అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు ఇవే..
Sakshi Education
డీఆర్‌డీవో... డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. దేశ రక్షణే ధ్యేయంగా పరిశోధనలు చేసే సంస్థ.
ఓ వైపు దేశం గర్వించదగ్గ పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో.. డీఆర్‌డీవో అందిస్తున్న పలు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌ల గురించి తెలుసుకుందాం..
రీసెర్చ్ ఫెలోషిప్:
యువ ప్రతిభావంతులను పరిశోధనల వైపు ఆకర్షించేందుకు డీఆర్‌డీవో రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఫెలోషిప్‌లకు డెరైక్టర్ ఆఫ్ ల్యాబొరేటరీస్/ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల్లోని రీసెర్చ్ దృక్పథాలు, కాన్సెప్టులపై స్పష్టత, శాస్త్రీయ తృష్ణ, అనలిటికల్ స్కిల్స్, రీజనింగ్, సైంటిఫిక్, టెక్నికల్ పరిజ్ఞానం-వాటి అన్వయ సామర్థ్యాలను పరీక్షిస్తారు. యూజీసీ నెట్/గేట్‌లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఫెలోషిప్ రకాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్):
అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సైన్స్/సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను ప్రథమ శ్రేణి లేదా తత్సమాన గ్రేడులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు
స్కాలర్‌షిప్: నెలకు రూ.16,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది.
సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్):
అర్హత: మెడికల్ సైన్స్(ఎంబీబీఎస్), డెంటల్ సైన్స్/సర్జరీ(బీడీఎస్)లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను ప్రథమ శ్రేణి(తత్సమాన గ్రేడు)తో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు
స్కాలర్‌షిప్: నెలకు రూ.18,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది.
రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ) :
అర్హత: సైన్సు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, మెడికల్ సైన్స్‌లో ఎండీ/ఎంఎస్ లేదా రీసెర్చ్ లేదా టీచింగ్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌లల్లో రెండేళ్ల అనుభవం కలిగిన ఎంటెక్/ఎంఈ ఉత్తీర్ణులు ఈ ఫెలోషిప్ పొందేందుకు అర్హులు. అర్హత డిగ్రీలో ప్రథమ శ్రేణి లేదా తత్సమాన గ్రేడు తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.
స్కాలర్‌షిప్: నెలకు రూ.24,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది.
గరిష్ట వయోపరిమితికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్లు వయోసడలింపు ఉంటుంది.
గ్రాంట్ : నెలవారీ స్కాలర్‌షిప్‌తోపాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ అభ్యర్థులకు ఏడాది రూ 15,000, రీసెర్చ్ అసోసియేట్లకు ఏడాదికి రూ.20,000 కంటిన్‌జెన్సీ గ్రాంట్ లభిస్తుంది.
దరఖాస్తు ప్రకటన: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ఇస్తారు. అందులో దరఖాస్తు విధానంతోపాటు ఇతర వివరాలు పేర్కొంటారు.
స్కాలర్‌షిప్ స్కీమ్ (బీటెక్/ఎంటెక్) :
ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్), పీఈసీ చంఢీఘర్‌లలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (అండర్ గ్రాడ్యుయేషన్) చదువుతున్న విద్యార్థులు; ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్), ఇతర ఇన్‌స్టిట్యూట్స్, ప్రముఖ కళాశాలల్లో ఏరో ఇంజనీరింగ్/ఏవియానిక్స్ (పోస్టు గ్రాడ్యుయేషన్) చదువుతున్న విద్యార్థులు అర్హులు.
బీటెక్ ఏఆర్, డీబీ స్కాలర్‌షిప్ :
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 50
స్కాలర్‌షిప్ మొత్తం: నాలుగేళ్లపాటు నెలకు రూ.5000 లభిస్తుంది. దీంతోపాటు ఏడాదికి బుక్ అలవెన్స్ కింద రూ.10,000 చెల్లిస్తారు.
స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు తమ మేజర్ ప్రాజెక్టు వర్క్‌లను డీఆర్‌డీవో/ప్రభుత్వ ల్యాబ్‌ల్లో లేదా ఏఆర్,డీబీ నిధుల పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సులో అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులను కొనసాగించడం తప్పనిసరి.
ఎంటెక్ ఏఆర్,డీబీ స్కాలర్‌షిప్ :
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 50
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంహెచ్‌ఆర్‌డీ స్కాలర్‌షిప్ కంటే 20 శాతం ఆధికంగా ఉంటుంది. స్కాలర్‌షిప్ వ్యవధి రెండేళ్లు. దీంతోపాటు బుక్ అలవెన్స్ కింద ఏడాదికి రూ.10,000 లభిస్తుంది.
అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. దీంతోపాటు పీజీలో కనీసం 70 శాతం మార్కులు రావాలి.
ఎంపిక ప్రక్రియ(ఎంటెక్): నిపుణుల కమిటీ బీటెక్/బీఈ ఉత్తీర్ణులైన(ప్రథమ శ్రేణిలో) విద్యార్థుల అకడెమిక్ వివరాలను పరిశీలించి ఏడాది స్కాలర్‌షిప్‌కు సిఫార్సు చేస్తుంది.
వెబ్‌సైట్: www.drdo.gov.in
మహిళా స్కాలర్‌షిప్‌లు:
డీఆర్‌డీవో మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఏరోస్పేస్, ఏరోనాటికల్, స్పేస్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‌ల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2019-20 సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ కొద్ధి రోజుల క్రితమే ముగిసింది. భవిష్యత్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా స్కాలర్‌షిప్ వివరాలు...
అండర్ గ్రాడ్యుయేషన్ :
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 20
స్కాలర్‌షిప్ మొత్తం: ఏడాదికి రూ.1,20,000 లేదా సంవత్సరం ఫీజు(ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది వర్తిస్తుంది)
అర్హత: నాలుగేళ్ల బీటెక్/బీఈ/బీఎస్సీ(ఇంజనీరింగ్) కోర్సుల (ఫుల్ టైమ్) మొదటి సంవత్సరంలో చేరిన అభ్యర్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. జేఈఈ (మెయిన్) స్కోరు ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
పోస్టు గ్రాడ్యుయేషన్ :
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 10
స్కాలర్‌షిప్ మొత్తం: ఏడాదికి రూ.1,86,000(నెలకు రూ.15,500)
అర్హత: ఎంటెక్/ఎంఈ ప్రథమ సంవత్సరంలో చేరి ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. వ్యాలిడ్ గేట్ స్కోరు ఉండాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: rac.gov.in

Published date : 03 Dec 2019 02:41PM