దేశ సేవకు ఉత్తమ మార్గం - ఎన్‌డీఏ & ఎన్‌ఏ
Sakshi Education
చిన్న వయసులోనే ఆఫీసర్ హోదాతో దేశ రక్షణ దళాల్లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష .నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ కాడమీ(ఎన్‌డీఏ-ఎన్‌ఏ) ఎగ్జామినేషన్-1, 2018కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
పురుష, అవివాహిత అభ్యర్థులు ఇంటర్ అర్హతతోనే త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ఆఫీసర్ స్థాయి కొలువు అందుకోవచ్చు. డిగ్రీపట్టాతోపాటు సుస్థిరమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఎన్‌డీఏ-ఎన్‌ఏ ప్రకటన వెలువడిన నేపథ్యంలో
సంబంధిత సమాచారం...
ఖాళీల వివరాలు..
మొత్తం: 415
ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ): ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత.
ఎన్‌డీఏ(ఎయిర్‌ఫోర్స్, నేవల్), నేవల్ అకాడ మీ(10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత.
గమనిక: నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతోన్న విద్యార్థులూ అర్హులే.
వయసు: 1999,జూలై2-2002,జూలై1 మధ్య జన్మించిన అవివాహిత పురుషుల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు రుసుం: రూ.100(ఎస్సీ, ఎస్టీలు, ఇతర నిర్దేశిత కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుం లేదు). ఫీజు మొత్తాన్ని ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల నుంచి డిపాజిట్/నెట్ బ్యాకింగ్/డెబిట్, క్రెడిట్ కార్డులు ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ఇలా..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండంచెల్లో ఉం టుంది. మొదటి దశలో యూపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో యూపీఎస్సీ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు.. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ముందు ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం :
ఇందులో రెండు పేపర్లుంటాయి.
1. మ్యాథ్స్ (300 మార్కులు) - 2.30 గంటలు
2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు) - 2.30 గంటలు
రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఎ, పార్ట్- బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బిలో జనరల్ నాలెడ్‌జ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ :
రాత పరీక్ష లానే సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కూ 900 మార్కులు కేటాయించారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్-1లో ఉత్తీర్ణత సాధించిన వారి ని రెండో దశకు ఆహ్వానిస్తారు. స్టేజ్-1లో పిక్చర్ పర్‌పెక్షన్ టెస్ట్, డిస్క్రిపిక్షన్ టెస్టులు ఉంటాయి. వీటిల్లో కనబర్చే ప్రతిభ ఆధారం గా రెండో స్టేజ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ దశలో నాలు గు రోజులపాటు వివిధ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, సైకాలజీ టెస్టులు, ఇతర కాన్ఫ రెన్సులు ఉంటాయి. ఈ దశలో ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, సైకాలజిస్టులు విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తారు. తుదిగా అభ్యర్థి మానసిక సామర్థ్యం, తెలివితేట లు, సమాజంపై అవగాహన, వర్తమాన వ్యవహారాలపై ఆసక్తి... ఇవన్నీ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. వీటిల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తే తుదిగా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. నిర్దేశిత ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. ఏ విధమైన శారీరక లోపాలు ఉండకూడదు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ...
దీనికి ఎంపికై న అభ్యర్థులు పుణె ఎన్‌డీఏలో మూడేళ్ల కోర్సు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ అకడమిక్‌తోపాటు శారీరక అంశాల్లోనూ శిక్షణ ఇస్తా రు. ఇందులో రెండున్నర ఏళ్లు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికీ ఒకే విధమై న శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకున్న ఆర్మీ కాడెట్స్ అభ్యర్థులకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్), బీఏ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కాడెట్స్‌కు బీటెక్ డిగ్రీ ఇస్తారు.
ఉన్నత హోదాలు..
ఎన్‌డీఏ ద్వారా కోర్సులో చేరే విద్యార్థులు అత్యున్నత స్థాయిలకు చేరుకునే వీలు ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, ఫిబ్రవరి 5(సాయంత్రం 6 వరకు)
పరీక్ష తేదీ: 2018, ఏప్రిల్ 22
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.upsconline.nic.in
సంబంధిత సమాచారం...
ఖాళీల వివరాలు..
మొత్తం: 415
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ): 360 (ఆర్మీ-208, నేవీ-60, ఎయిర్‌ఫోర్స్-92);
- ఇండియన్ నేవల్ అకాడమీ(10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం): 55

- రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లో కనబర్చే ప్రతిభ ఆధారంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌ఎడీ), నేవల్ అకాడమీ(10+2 స్కీం) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ప్రవేశాలకు ప్రత్యేకంగా పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ...
దీనికి ఎంపికై న అభ్యర్థులు పుణె ఎన్‌డీఏలో మూడేళ్ల కోర్సు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ అకడమిక్‌తోపాటు శారీరక అంశాల్లోనూ శిక్షణ ఇస్తా రు. ఇందులో రెండున్నర ఏళ్లు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికీ ఒకే విధమై న శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకున్న ఆర్మీ కాడెట్స్ అభ్యర్థులకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్), బీఏ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కాడెట్స్‌కు బీటెక్ డిగ్రీ ఇస్తారు.
- ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ క్యాడెట్‌లకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో, నేవీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏడాదిన్నరపాటు ప్లైయింగ్‌లో శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్‌లో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.
ఉన్నత హోదాలు..
ఎన్‌డీఏ ద్వారా కోర్సులో చేరే విద్యార్థులు అత్యున్నత స్థాయిలకు చేరుకునే వీలు ఉంది.
ఆర్మీ | నేవీ | ఎయిర్‌ఫోర్స్ |
లెఫ్టినెంట్ | సబ్ లెఫ్టినెంట్ | ఫ్లైయింగ్ ఆఫీసర్ |
కెప్టెన్ | లెఫ్టినెంట్ | ఫ్లైట్ లెఫ్టినెంట్ |
మేజర్ | లెఫ్టినెంట్ కమాండర్ | స్క్వాడ్రన్ లీడర్ |
లెఫ్టినెంట్ కల్నల్ | కమాండర్ | వింగ్ కమాండర్ |
కల్నల్ (సెలక్షన్) | కెప్టెన్ (సెలక్షన్) | గ్రూప్ కెప్టెన్ (సెలక్షన్) |
కల్నల్ (టైమ్‌స్కేల్) | కెప్టెన్ (టైమ్‌స్కేల్) | గ్రూప్ కెప్టెన్ (టైమ్‌స్కేల్) |
బ్రిగేడియర్ | కమోడర్ | ఎయిర్ కమోడర్ |
మేజర్ జనరల్ | రేర్ అడ్మిరల్ | ఎయిర్ వైస్‌మార్షల్ |
లెఫ్టినెంట్ జనరల్ | వైస్ అడ్మిరల్ | ఎయిర్‌మార్షల్ |
జనరల్ | అడ్మిరల్ | ఎయిర్‌చీఫ్ మార్షల్ |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, ఫిబ్రవరి 5(సాయంత్రం 6 వరకు)
పరీక్ష తేదీ: 2018, ఏప్రిల్ 22
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.upsconline.nic.in
Published date : 24 Jan 2018 02:05PM