Skip to main content

కొలువునిచ్చే ఐటీ సర్టిఫికేషన్‌లు!

సమాచార సాంకేతిక(ఐటీ) రంగం అభివృద్ధితో ఎన్నెన్నో నూతన టెక్నాలజీలు ఆవిర్భవిస్తూ, సరికొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉందో తెలుసుకొని, సంబంధిత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో కొలువు కలలను సాకారం చేసే ఐటీ సర్టిఫికేషన్లపై నేటి యువత మొగ్గు చూపుతోంది. ఐటీ సర్టిఫికేషన్లు... అభ్యర్థులకు నైపుణ్యవంతులుగా గుర్తింపునిచ్చి, నచ్చిన కొలువును సొంతం చేసుకునేందుకు దోహదపడు తున్నాయి. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నిచ్చెన వేస్తున్నాయి. కంపెనీలు సైతం సర్టిఫికేష న్లకు ప్రాధాన్యతనిస్తుండడంతో ఆయా కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో విభిన్న సర్టిఫికే షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సిస్కో, మైక్రోసాఫ్ట్ అందించే ప్రముఖ కోర్సులు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టాప్ సర్టిఫికేషన్ల సమాచారం...

సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ)
ఏ ఎంట్రీ లెవల్ నెట్‌వర్క్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సులో చేరుతున్నారు. ఈ సర్టిఫికేషన్ పొందిన వారికి మంచి ఉద్యోగావకాశాలుండడమే కారణం.
  • కోర్సులో విద్యార్థులు ప్రధానంగా నెట్‌వర్క్స్ ఆపరేషన్స్, ట్రబుల్ షూటింగ్‌పై చదువుతారు. లోకల్ ఏరియా నెట్‌వర్క్(లాన్), వైడ్ ఏరియా నెట్‌వర్క్(వాన్) డిజైన్‌కు సంబంధించిన అడ్వాన్స్‌డ్ అంశాల గురించి నేర్చుకుంటారు.
  • ఐపీ అడ్రస్‌లు, రూటర్లు, వాటి ప్రక్రియలు, వీలాన్, డబ్ల్యూలాన్, నెట్‌వర్క్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై నైపుణ్యాలు పొందుతారు.
  • వివరాలకు వెబ్‌సైట్: www.cisco.com/web/learning/certifications/associate/ccna/index.html
మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ అసోసియేట్ (ఎంసీఎస్‌ఏ):
  • నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ అనాలిసిస్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాలతోపాటు విభిన్న ఐటీ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనుకునేవారు ఈ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
  • 90 శాతానికి పైగా కంపెనీలు ఎంసీఎస్‌ఏ సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
  • అడ్వాన్స్‌డ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించే ముందు ఈ కోర్సును నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అర్థం చేసుకోవడానికి, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.
  • వివరాలకు వెబ్‌సైట్: www.microsoft.com/learning/en-in/mcsa-certification.aspx
ఎంసీఎస్‌ఈ- షేర్‌పాయింట్:
  • సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సహకరించే మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్లాట్‌ఫాం. దీన్ని ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ సమ్మేళనంగా చెప్పొచ్చు. షేర్‌పాయింట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబ్‌సైట్లను రూపొందించవచ్చు. షేర్‌పాయింట్ ఇటు అప్లికేషన్ ప్లాట్‌ఫాంగానూ అటు డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫాంగానూ సమర్థవంతమైంది.
  • షేర్‌పాయింట్ కోర్సు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు డాట్ నెట్ పరిజ్ఞానం అవసరం. కోర్సులో భాగంగా షేర్‌పాయింట్ విశ్లేషణ, మేనేజింగ్ సైట్ కలెక్షన్స్ అండ్ సైట్స్, బిజినెస్ కనెక్టివిటీ సర్వీసెస్, ఎంటర్‌ప్రైజ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను అభ్యర్థులు నేర్చుకుంటారు.
  • షేర్‌పాయింట్ పరిజ్ఞానం సంపాదించిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
  • వివరాలకు వెబ్‌సైట్: www.microsoft.com/learning/en-in/mcse-sharepoint-certification.aspx
సీసీఎన్‌ఏ సెక్యూరిటీ:
  • ఈ సర్టిఫికేషన్‌లు నెట్‌వర్క్ సెక్యూరిటీకి పునాది లాంటివి. ఐటీ సెక్యూరిటీ రంగంలో రాణించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరుతున్నారు.
  • సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, థ్రెట్స్‌ను గుర్తించడం, ఇన్‌స్టలేషన్, ట్రబుల్ షూటింగ్ తదితర అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.
  • విభిన్న నెట్‌వర్క్‌లకు చెందిన ఐటీ సమస్యల అంచనా, అవగాహన, పరిష్కారానికి ఈ సర్టిఫికేషన్ దోహదపడుతుంది.
  • వివరాలకు వెబ్‌సైట్: www.cisco.com/web/learning/certifications/associate/ccna_security/index.html
సిస్కో సర్టిఫైడ్ ఎంట్రీ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్(సీసీఈఎన్‌టీ):
  • సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్(సీసీఎన్‌ఏ) సర్టిఫికేషన్ పొందాలనుకునేవారు ముందుగా ఈ సర్టిఫికేషన్ పూర్తిచేయడానికి ఆసక్తి చూపుతారు.
  • చిన్న వ్యాపారాల్లో ఐటీ నెట్‌వర్క్స్‌తోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఈ సర్టిఫికేషన్ మరిన్ని అవకాశాలను అందిస్తోంది.
  • ఓఎస్‌ఐ మోడల్స్, డీఎన్‌ఎస్, ఎన్‌ఏటీ, రూటర్ కాన్ఫిగరేషన్, జనరల్ రూటింగ్ ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
  • వివరాలకు వెబ్‌సైట్: www.cisco.com/web/learning/certifications/entry/ccent/index.html
దరఖాస్తు:
సర్టిఫికేషన్ల కోసం రాయాల్సిన దాదాపు అన్ని పరీక్షల నూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్షకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధిస్తే సర్టిఫైడ్ అసోసియేట్/ ప్రొఫెషనల్‌గా గుర్తింపు లభిస్తుంది. తద్వారా పుష్కలమైన అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

సర్టిఫికేషన్లతో ఉజ్వల భవిష్యత్తు
‘‘మార్కెట్‌లో సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ తదితర సర్టిఫికేషన్‌‌స చేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులూ సర్టిఫికేషన్ రాయొచ్చు. ఈ సర్టిఫికేషన్‌లను రాయడానికి డిగ్రీ అర్హత కానప్పటికీ బ్యాచిలర్‌‌స డిగ్రీ కోర్సు కనీస అర్హతగా ఉండి ఏదో ఒక నెట్‌వర్కింగ్ సర్టిఫికేషన్ పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకో వచ్చు. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఆయా సర్టిఫికేషన్లలో శిక్షణనందిస్తున్నాయి. ఏదైనా సర్టిఫికేషన్ సాధించి, మంచి క మ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉంటే కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు’’
- అహ్మద్, నెట్‌మ్యాట్రిక్ సొల్యూషన్స్, మాసాబ్‌ట్యాంక్
Published date : 19 Jul 2014 11:27AM

Photo Stories