కొత్త కొలువులకు...డేటా సైన్స్
డేటా సైన్స్ అంటే?
సమాచార ఉత్పత్తి జరగని ప్రాంతమంటూ ఉండదు. నేటి కంప్యూటర్ ప్రపంచంలో రోజురోజుకూ డిజిటల్ డేటా శరవేగంగా పెరు గుతోంది. ప్రస్తుతం దాదాపు 2.7 జెటాబైట్ల (ఒక జెటా బైట్=10007 బైట్లు) మేర ఉన్న డేటా, 2025 నాటికి 180 జెటాబైట్లకు చేరు తుందని అంచనా. ఈ డేటాలో ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేసిన ఫొటో దగ్గరి నుంచి ‘ఫార్చ్యూ న్ 500’ కంపెనీల ఆర్థిక సమాచారం వరకు ఏదైనా ఉండొచ్చు. అందుబాటులో ఉన్న ఈ సమాచారంలో అవసరమైన దాన్ని సేకరించి.. సాంఖ్యక (స్టాటిస్టికల్), పరిమాణాత్మక (క్వాంటిటేటివ్), సాంకేతిక (టెక్నికల్) పద్ధతులు ఉపయోగించి విశ్లేషించడాన్ని డేటా సైన్స్‌గా చెప్పొచ్చు. ఇందులో పనిచేసే నిపుణులను డేటా సైంటిస్టులుగా పిలుస్తారు. వ్యాపార కార్యకలాపాల విస్తృతికి, అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సైంటిస్టులు సంస్థలకు సహాయపడతారు.
ఏటా పెరుగుతున్న డిమాండ్...
ఈ–కామర్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, టెలికం... ఇలా వివిధ రంగాల కంపెనీలు విజయపథంలో నడిచేందుకు ‘డేటా సైన్స్’ను ఆసరాగా చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం డిమాండ్‌కు తగిన విధంగా మానవ వనరులు అందుబాటులో లేవు. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం బిగ్ డేటా టెక్నాలజీ, సర్వీసుల మార్కెట్ 26.4 శాతం వార్షిక వృద్ధితో 2018 నాటికి 41.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదే విధంగా డేటా సైంటిస్టుల డిమాండ్ 2020 నాటికి 28 శాతం మేర పెరగనున్నట్లు ఐబీఎం అంచనా వేసింది. జాబ్ పోర్టల్స్‌లో డేటా సైంటిస్టుల జాబ్ పోస్టింగ్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఐటీ రంగంలో ‘సన్ రైజ్’ !
సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు డేటా సైన్స్ సన్ రైజ్’ విభాగంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రోజురోజుకూ డేటా సైన్స్ విభాగంలోకి అడుగుపెడుతున్న ఐటీ కంపెనీలు అధికమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఐటీ రంగంలోనూ డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర డిమాండ్ ఏర్పడనుంది. ప్రస్తుతం ఉన్న ఐటీ ఉద్యోగుల్లో 50 శాతం మంది డేటా సైన్స్ వంటి ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకోకుంటే కెరీర్ పరంగా ఒడుదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణ ఐటీ నిపుణుడితో పోలిస్తే అదే వయసు, అనుభవం ఉన్న డేటా సైన్స్ నైపుణ్యాలున్న వ్యక్తికి 20 నుంచి 40 శాతం అధిక వేతనాలు లభిస్తున్నాయి. ఇలాంటి సానుకూల వాతావరణం కారణంగా డేటా సైన్స్ నైపుణ్యాలున్న వారికి సుస్థిర కెరీర్ సొంతమని చెప్పొచ్చు.
ప్రవేశ మార్గాలు..
- ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంబంధిత కోర్సులను యువత ముందుంచుతున్నాయి. ఇవి ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నికల్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మేళవింపుతో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్– కలకత్తా; ఐఐఎం–బెంగళూరు; ఐఐఎం–లక్నో; ఐఐటీ–హెచ్ తదితర సంస్థలు డేటా సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. సంస్థలు ఆన్ క్యాంపస్, ఆన్‌లైన్ బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో పైవేటు శిక్షణ సంస్థలు కూడా డేటా సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రముఖ సంస్థలతో పోల్చితే ఇవి తక్కువ ఫీజుల్లో కోర్సులను అందిస్తున్నాయి. అదే విధంగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌లో ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. త్వరలోనే అధిక సంఖ్యలో యూనివర్సిటీలు డేటా సైన్స్ సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టే అవకాశముంది.
- కోర్సుల్లో ప్రవేశాలకు కొన్ని ఇంజనీరింగ్/బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్ డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్దేశిస్తున్నాయి. పని అనుభవం ఉన్నవారికి కూడా ప్రత్యేకంగా కోర్సులు ఉంటున్నాయి.
కరిక్యులం వివరాలు...
డేటా సైన్స్ బేసిక్స్ (డేటా క్వెరీస్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ తదితర); ఎక్స్‌సెల్; డేటా సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వే జెస్; మెషీన్ లెర్నింగ్, ఆర్–ఫర్ డేటా సైన్స్; ఫైథాన్ ఫర్ డేటాసైన్స్; హడూప్; స్పార్క్; ఎస్‌క్యూఎల్ డేటా బేస్/కోడింగ్; ఎస్‌ఏఎస్; అండర్ స్టాడింగ్ స్టాటిస్టిక్స్; కోర్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ తదితర అంశాలను కరిక్యు లంలో భాగంగా బోధిస్తున్నాయి. డేటా సైన్స్ కోర్సుల్లో ప్రాక్టికల్స్, రియల్‌టైమ్ ప్రాజెక్టులు ముఖ్యమైనవి.
ఉద్యోగావకాశాలు...
డేటా సైంటిస్టు ఉద్యోగాన్ని 21వ శతాబ్దపు సెక్సీయెస్ట్ జాబ్‌గా హార్వర్డ్ బిజినెస్ రివ్యూ (హెచ్‌బీఆర్) అభివ ర్ణించింది. డేటా సైన్స్ నైపుణ్యాలున్న వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; ఈ–కామర్స్; ఫార్మా/హెల్త్ కేర్; ఐటీ–ఐటీఈఎస్; ఎనర్జీ, యుటి లిటీస్; మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్; రిటైల్, సీపీజీ; ఆటోమొబైల్; ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ తదితర రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2016లో డేటా అనలిటిక్స్‌లోని 42 శాతం ఉద్యోగాలను బ్యాంకింగ్ రంగం అందించగా, ఇది 2017లో 46 శాతంగా నమోదైంది. డేటా ఉద్యోగాల కల్పనలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, హెచ్‌సీఎల్, ఐబీఎం, గోల్డ్‌మన్ శాచ్, యాక్సెంచర్, కేపీఎంజీ, ఈ అండ్ వై, క్యాప్‌జెమిని తదితర సంస్థలు ముం దంజలో ఉన్నాయి. ఢిల్లీ/గుర్గావ్, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాలు డేటా ఉద్యోగాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్, వేతనాలు :
- సంపాదించిన నైపుణ్యాల ఆధారంగా సంస్థల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అవి.. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, అనలిటిక్స్ మేనేజర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, ఎస్‌ఏఎస్ అనలిస్టు, డేటా కన్సల్టెంట్, డేటా డెవలపర్, బిగ్ డేటా ఇంజనీర్ తదితర ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు ఉంటాయి.
- కార్పొరేట్ కంపెనీలు ప్రతిభ, అనుభవం ఆధారంగా వేతనాలు అందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న డేటా సైన్స్ నిపుణులకు కంపెనీలు సగటున రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం అందిస్తున్నాయి.
- l SAS, R
- Python coding
- Hadoop platform
- SQL database/coding
- Excel, SQL Server, Azure Machine Learning etc.
- Working with unstructured data.