కార్పొరేట్ జాబ్స్ వదిలి.. సోషల్ సెక్టార్ వైపు అడుగులు వేస్తున్న యువత!
Sakshi Education
మన దేశంలో.. నేటికీ సామాజిక అభివృద్ధి పరంగా ఎన్నో సమస్యలు! కనీస అవసరాలుగా భావించే విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు అందడంలో అనేక ఆటంకాలు!! ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నా.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేసే నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది! కార్పొరేట్ కంపెనీలు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా సామాజిక ప్రగతికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయా సీఎస్‌ఆర్ కార్యకలాపాల అమలులోనూ మానవ వనరుల కొరత వెంటాడుతోంది! ఈ నేపథ్యంలో.. సామాజిక రంగంలో అవకాశాలు, అందుకునేందుకు మార్గాలు, అందుబాటులో ఉన్న కోర్సుల గురించి తెలుసుకుందాం...
Published date : 04 Feb 2022 03:06PM