Skip to main content

ఉజ్వల భవితకు కేరాఫ్ `సీఎస్`

కొత్త కంపెనీల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. కానీ, మరోవైపు కంపెనీల్లో కీలక వ్యవహారాలు పర్యవేక్షించే కంపెనీ సెక్రటరీ(సీఎస్)ల కొరత తీవ్రంగా ఉంది. ది ఇన్స్టిట్యూట్ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) అందిస్తోన్న సీఎస్ కోర్సుతో సాఫ్ట్వేర్ కొలువులకు దీటుగా కెర్ర్ను మలచుకోవచ్చు. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఐదుకోట్లు లేదా అంతకంటే ఎక్కువ మూలధనం కలిగిన ప్రతి కంపెనీ పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీలను నియమించుకోవాలి. ఈ నేపథ్యంలో కామర్స్ అనుబంధ కోర్సుల్లో మేటిగా నిలుస్తోన్న సీఎస్ కోర్సుపై స్పెషల్ ఫోకస్....
సీఎస్ కోర్సులో పౌండేషన్ పోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ పోగ్రామ్, ప్రొఫెషనల్ పోగ్రామ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ దశలుంటాయి.

పౌండేషన్ పోగ్రామ్ (మొదటిదశ)
  • అర్హత: ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగిన కోర్సులో (ఫైనార్ట్స్ మినహా) ఉత్తీర్ణత. సీఎస్ పౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా కోర్సును చదవొచ్చు.
  • పరీక్ష విధానం: సీపీటీ (సీఏ) ప్రవేశ పరీక్ష (ఎంట్రన్స్ ఎగ్జామ్) తరహాలోనే సీఎస్ పౌండేషన్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో 400 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. పరీక్షను ఒకే రోజు రెండు భాగాలుగా నిర్వహిస్తారు. ఉదయం రెండు పేపర్లు (200 మార్కులు), మధ్యాహ్నం రెండు పేపర్లు (200 మార్కులు) విడి విడిగా ఉంటాయి. ఉదయం నిర్వహించే పరీక్షలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మధ్యాహ్నం పరీక్షలో బిజినెస్ ఎకనామిక్స్, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (రెండో దశ)
  • అర్హత: సీఎస్ పౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాయొచ్చు. దీంతో పాటు సీఏ-సీపీటీ/సీఎంఏ పౌండేషన్/డిగ్రీ ఉత్తీర్ణులు ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసేందుకు అర్హులు.

మాడ్యూల్స్

పేపర్లు

మాడ్యూల్-1 (నాలుగు పేపర్లు)

1. కంపెనీ లా

 

2. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్

 

3. ఎకనామిక్ అండ్ కమర్షియల్ లాస్

 

4. టాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్

మాడ్యూల్-2 (మూడు పేపర్లు)

1. కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్

 

2. క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లాస్

 

3. ఇండస్ట్రియల్, లేబర్ అండ్ జనరల్ లాస్


రెండు మాడ్యూల్స్ (7 పేపర్లు) ఒకేసారి లేదా ఒక్కో మాడ్యూల్ని విడి విడిగా ఆరు నెలల తేడాతో రాయొచ్చు. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పోగ్రామ్ ఉత్తీర్ణత కోసం ప్రతి పేపర్లో 40 శాతం, అన్ని మాడ్యూల్స్ కలిపి (అన్ని పేపర్లు) 50 శాతం మార్కులు సాధించాలి.

మేనేజ్మెంట్ ట్రైనింగ్ (మూడో దశ)
ఎగ్జిక్యూటివ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 15 నెలలు మేనేజ్మెంట్ ట్రైనింగ్తో పాటు మరో మూడు నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ను ప్రొఫెషనల్ పోగ్రామ్ తర్వాత కూడా చేసే వెసులుబాటు ఉంది. ట్రైనింగ్ కోసం సీఎస్ ఇన్స్టిట్యూట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ప్రతిపాదించిన లేదా అనుమతించిన కంపెనీల్లో లేదా కంపెనీ సెక్రటరీల వద్ద ట్రైనింగ్ పొందవచ్చు. ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు రూ.2,000 నుంచి 5,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది.

ప్రొఫెషనల్ పోగ్రామ్ (నాలుగో దశ)
  • అర్హత: ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్లో ఉత్తీర్ణులైన లేదా ఎగ్జిక్యూటివ్ ఉత్తీర్ణతతో పాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

    మాడ్యూల్స్

    పేపర్లు

    మాడ్యూల్-1 (3 పేపర్లు)

    1. అడ్వాన్స్డ్ కంపెనీ లా అండ్ ప్రాక్టీస్

     

     

    2. సెక్రటేరియల్ ఆడిట్, కంప్లయన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలిజెన్స్

     

     

    3. కార్పొరేట్ రీ స్టక్చరింగ్, వాల్యుయేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ

     

    మ్యాడ్యూల్-2 (3 పేపర్లు)

    4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ ఆడిట్

     

     

    5. ఫైనాన్షియల్, ట్రెజరీ అండ్ ఫోరెక్స్ మేనేజ్మెంట్

     

     

    6. ఎథిక్స్, గవర్నెన్స్ అండ్ సస్టెయిన్బిలిటీ

     

    మాడ్యూల్-3 (3 పేపర్లు)

    7. అడ్వాన్స్డ్ టాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్

     

     

    8. డ్రాఫ్టింగ్, అప్పియరెన్సెస్ అండ్ ప్లీడింగ్స్

     

    9వ పేపర్గా కిందవాటిలో ఒక టాపిక్ను ఎంచుకోవచ్చు. బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్, క్యాపిటల్, కమోడిటీ అండ్ మనీ మార్కెట్, ఇన్సూరెన్స్ లా అండ్ ప్రాక్టీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా అండ్ ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ బిజినెస్ లాస్ అండ్ ప్రాక్టీస్.

  • రిజిస్ట్రేషన్: సీఎస్ కోర్సు ఔత్సాహిక విద్యార్థులు కోర్సుకు సంబంధించి ప్రతి దశకు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తానికి డీడీ తీసి, పూర్తిచేసిన దరఖాస్తుతో పాటు ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ ప్రాంతీయ కార్యాలయాలు లేదా చాప్టర్ల (బ్రాంచ్లు)లో అందజేయాలి. దీంతో పాటు సీఎస్ కోర్సు అన్ని దశలకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
    వివరాలకు: https://www.icsi.edu
ఏటా రెండుసార్లు
సీఎస్ పరీక్ష ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. డిసెంబర్లో పౌండేషన్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్ష ఫీజును సెప్టెంబర్ చివరి వరకు చెల్లించవచ్చు. అదే విధంగా జూన్లో పౌండేషన్ పరీక్ష రాసేవారు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మార్చి నెలాఖరు లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి అన్ని మ్యూడ్యూల్స్ కలిపి డిసెంబర్లో పరీక్ష రాసేందుకు ఫిబ్రవరి నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్,ప్రొఫెషనల్ పోగ్రామ్లకు సంబంధించి డిసెంబర్లో కేవలం ఒక్క మాడ్యూల్ రాయాలనుకుంటే మే చివరిలోగా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. ఫీజును సెప్టెంబర్ చివరి నాటికి చెల్లించాలి. ఇదే పరీక్షను(అన్ని మాడ్యూల్స్) జూన్లో రాసేందుకు ఆగస్టు 31లోగా, ఒక్క మాడ్యూల్నే రాసేవారు నవంబర్ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజును మార్చి 25లోపు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు మొత్తాలను https://www.icsi.edu/ ద్వారా ఆన్లైన్ విధానంలో చెల్లించవచ్చు.

రిజిస్ట్రేషన్ (ఫీజులు)
సీఎస్ పౌండేషన్ పోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.4,500, సీఏ, సీపీటీ ఉత్తర్ణులైన కామర్స్ గ్రాడ్యుయేట్లకు ఎగ్జిక్యూటివ్ పోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 9,000, కామర్సేతర గ్రూపుల వారికి రూ.10,000, సీఎస్ పౌండేషన్ ఉత్తీర్ణులైన వారికి రూ.8,500. ప్రొఫెషనల్ పోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 12,000.

పరీక్ష ఫీజులు
  • పౌండేషన్: రూ.1200
  • ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్: రూ.1200 (ఒక్కో మాడ్యూల్కి)
  • ప్రొఫెషనల్ ప్రోగ్రామ్: రూ.1200 (ఒక్కో మాడ్యూల్కి)
  • ఆర్థిక ప్రోత్సాహకాలు: కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐసీఎస్ఐ అనేక అవార్డులు అందిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వారికి ఉపకారవేతనాలు అందించి ప్రోత్సహిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
  • ఇతర కామర్స్ కోర్సులైన... సీఏ, సీఎంఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సీఎస్ కోర్సులో కొన్ని పేపర్ల మినహాయింపు ఉంటుంది.
  • కోచింగ్: కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ కార్యాలయాలు, చాప్టర్లలో కోచింగ్ అందుబాటులో ఉంది. దీంతో పాటు ‘ది ఇన్స్టిటూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’.. ఈ-లెర్నింగ్ పోగ్రామ్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది.
ఉద్యోగావకాశాలు
దేశంలో దాదాపు ఐదు నుంచి ఏడు లక్షల కంపెనీలకు కంపెనీ సెక్రటరీల అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం మన దేశంలో కంపెనీ సెక్రటరీల సంఖ్య 35 వేల లోపే ఉంది. దీంతో కంపెనీ సెక్రటరీ కోర్సు చేసిన వారికి జాబ్మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కంపెనీల్లో కీలక హోదాలతో కొలువులు లభిస్తున్నాయి. బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సలహాదారు, కంపెనీ రిజిస్ట్రార్, కంపెనీకి న్యాయ సలహాదారు, కంపెనీ విధానాల రూపకర్త, కంపెనీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కంపెనీ ప్రిన్స్పల్ సెక్రటరీ వంటి హోదాలతో ఉద్యోగాల్లో చేరవచ్చు. కంపెనీ సెక్రటరీలు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. వీటికి అదనంగా సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ఉంది.
  • విదేశీ అవకాశాలు: మనదేశంలో సీఎస్ సాధించిన కంపెనీ సెక్రటరీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. భారత ప్రభుత్వం సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, మారిషస్, యూకే వంటి దేశాలతో పలు ఆర్థిక, ద్వైపాక్షిక ఉమ్మడి పరస్పర సహకార ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో కంపెనీ సెక్రటరీలకు స్వదేశంతో పాటు విదేశాల్లోనూ అవకాశాలు పెరిగాయి.
  • వేతనాలు: న్యూఢిల్లీలోని ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యాలయంలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో సీఎస్ కోర్సు పూర్తి చేసిన వారికి కంపెనీలు రూ.మూడు నుంచి ఐదు లక్షల వరకు వార్షిక ప్యాకేజీలుగా అందించాయి. ప్రస్తుతం వివిధ బహుళ జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వారు రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వార్షిక వేతనంగా పొందుతున్నారు.
ఎవరిని సంప్రదించాలి
ఐసీఎస్ఐ ప్రాంతీయ కార్యాలయాలు కోల్కతా న్యూఢిల్లీ, ముంబైలలో ఉన్నాయి. ఐసీఎస్ఐ దక్షిణ ప్రాంతీయ కార్యాలయం చెన్నైలో ఉంది. వీటితో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇన్స్టిట్యూట్ చాప్టర్స్ (బ్రాంచ్లు) ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఇన్స్టిట్యూట్ చాప్టర్స్ ఉన్నాయి.
వివరాలకు: www.icsi.edu
Published date : 04 Dec 2015 11:55AM

Photo Stories