Skip to main content

ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా.. 80 దేశాలతో ఈ సంస్థల ఒప్పందాలు..

వాస్తవానికి ఇప్పటికే ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ, ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా.. పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా దాదాపు 80 దేశాల్లో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇది మరింత విస్తృతం అవుతుంది. అంటే.. ఇకపై వీరు ప్రపంచంలో ఎక్కడైనా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు మార్గం ఏర్పడింది.
కార్పొరేట్‌కు హాట్‌ కేక్‌.. సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు.. స్వదేశంలోనే కార్పొ రేట్‌ సంస్థలకు హాట్‌ కేక్‌లుగా మారుతున్నారు. ప్రధానంగా అకౌంటింగ్, ఫైనాన్స్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగాల్లో కీలకమైన హోదాల్లో వీరిని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. సదరు ఇన్‌సిట్యూట్‌లతో కలిసి క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా రూ.లక్షల వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, కన్సల్టింగ్‌ సంస్థలు.. సీఏ, సీఎస్,సీఎంఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తు న్నాయి. ఐఐఎంలలో మేనేజ్‌మెంట్‌ పీజీ చేసిన వారికి దీటుగా అవకాశాలు, ప్యాకేజీలు అందిస్తున్నాయి.

ఇంకా చ‌ద‌వండి: part 3: ఈ కోర్సులతో సర్కారీ కొలువులూ.. అధ్యాపక వృత్తిలోకి వెళ్తే రూ. 60వేల వరకు ప్రారంభం వేతనం..
Published date : 29 Mar 2021 02:43PM

Photo Stories