Skip to main content

పరీక్ష లేకుండానే ఐడీబీఐ బ్యాంకు కొలువు..అర్హత వివరాలు తెలుసుకోండిలా..

బ్యాంకు కొలువుల కోసం ఎదురుచూసేవారికి మంచి అవకాశం. పరీక్ష లేకుండానే ఉద్యోగావకాశాన్ని కల్పిస్తోంది ఐడీబీఐ బ్యాంకు. ఇందులో భాగంగా మొత్తం 134 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)ల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 7వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకుల్లో వినియోగదారులకు వేగంగా, సులభ తరమైన సేవలను అందించడానికి స్పెషలిస్ట్ ఆఫీసర్ల (ఎస్‌వో) సేవలు కీలకంగా మారుతున్నాయి. టెక్నాల జీ, ట్రెజరర్, సెక్యూరిటీ, ఆపరేషన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, డేటా అనలిస్ట్ తదితర విభాగాల్లో పని చేయడానికి వీరిని నియమించుకుంటారు. ఇందులో భాగంగా ఆయా పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) 2021 సంవత్సరానికి గాను స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారానే ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 134
పోస్టుల వివరాలు

  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు(డీజీఎం- గ్రేడ్ డీ)-11 ఉన్నాయి. వీటిలో జనరల్-7, ఎస్సీ-1, ఓబీసీ-2, ఈడబ్ల్యూఎస్-1, పీడబ్ల్యూడీకి 05పోస్టులు కేటాయించారు.
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం-గ్రేడ్ సీ) పోస్టులు-52 ఉన్నాయి. వీటిలో జనరల్-23, ఎస్సీ-08, ఎస్టీ-03, ఓబీసీ-13, ఈడబ్ల్యూఎస్‌కు 05 పోస్టులు కేటాయించారు.
  • మేనేజర్ (గ్రేడ్ బీ) పోస్టులు 62 ఉండగా.. వీటిలో జనరల్-27, ఎస్సీ-1, ఎస్టీ-04 ఓబీసీ- 02 పోస్టులు ఉన్నాయి.
  • అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్ ఏ) పోస్టులు 09 ఉండగా.. ఇందులో జనరల్-06, ఎస్సీ-1, ఓబీసీకి 2 పోస్టులు కేటాయించారు.


పోస్టుల వారీగా విద్యార్హతలు..

  • ఏజీఎం(మొబైల్ బ్యాంకింగ్/ఇన్నోవేషన్), అసి స్టెంట్ మేనేజర్(డిజిటల్ బ్యాంకింగ్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు... బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్- టెలీ కమ్యూనికేషన్స్/కంప్యూ టర్ సైన్స్/ఎలక్ట్రికల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎల క్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్) లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తిచేసిన వారై ఉండాలి. ఏజీఎం పోస్టులకు కనీసం ఏడేళ్ల పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం అనుభవం అవసరం లేదు. కానీ పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.
  • మేనేజర్ (మొబైల్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్; బ్యాం కింగ్(ఎఫ్‌ఆర్‌ఎంజీ)), అసిస్టెంట్ మేనేజర్ (మొబైల్ బ్యాంకింగ్(ఎఫ్‌ఆర్‌ఎంజీ)) పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు... బీఈ/బీటెక్ (ఎలక్ట్రా నిక్స్-టెలికమ్యునికేషన్/కంప్యూటర్‌సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్- కమ్యునికే షన్) లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన యూనివర్సి టీ నుంచి ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబంధిత రంగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
  • మేనేజర్(కార్డ్ ప్రొడక్స్, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరర్(ఎఫ్‌ఆర్‌ఎంజీ), అసిస్టెంట్ జనరల్ మేనే జర్(మర్చంట్ అక్వైరింగ్, కార్డ్ ప్రొడక్స్, మార్కె టింగ్) విభాగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. బీఈ/బీటెక్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏజీఎం (మార్కె టింగ్)లో ఎంబీఏ/పీడీడీఎం/పీజీడీబీఏ/ (మార్కె టింగ్) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. మేనే జర్ పోస్టులకు కనీసం నాలుగేళ్ల, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు ఏడేళ్ల పని అనుభవం తప్పనిసరి.
  • మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్(సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. ఏదైనా డిగ్రీలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీ ర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 50శా తం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. అలాగే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కెప్టెన్/మేజర్ స్థాయిలో కనీసం నాలుగేళ్ల నుంచి పదేళ్ల పని చేసిన అనుభవం ఉండాలి. లేదా పారా మిలిటరీలో నాలుగేళ్ల నుంచి పదేళ్ల పనిచేసి ఉండాలి.
  • మేనేజర్ (డేటాఅనలిటిక్స్(ఎఫ్‌ఆర్‌ఎంజీ) పోస్టుల కు దరఖాస్తు చేయాలనుకునే వారు.. బీఎస్సీ హానర్స్(మ్యాథ్స్/స్టాటిస్టిక్స్),బీటెక్/బీఈ (ఎల క్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డేటాఅనలిటిక్స్/డేటాసైన్స్‌ల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇందులో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దీనికి కనీసం నాలుగేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
  • మేనేజర్ (అనలిస్ట్(ఎఫ్‌ఆర్‌ఎంజీ) పోస్టులకు దర ఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. బీకాం/ బీఎస్సీ/కంప్యూటర్ సైన్స్/బీబీఏ(బ్యాంకింగ్, ఫైనాన్స్) పూర్తి చేసి ఉండాలి. ఫ్రాడ్/ఫైనాన్సి యల్ క్రైమ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే కనీసం నాలుగేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజర్ (కార్డ్ బేస్డ్ బిజినెస్,యూపీఐ/ ఏఈపీఎస్/క్యూఆర్ కోడ్స్( ఎఫ్‌ఆర్‌ఎంజీ) పోస్టుల కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
  • డీజీఏం,ఏజీఎం(కన్వెషనల్ మీడియా,సోషల్/ డిజి టల్ మీడియా) డీజీఎం, ఏజీఎం, మేనేజర్ (ఎకాన మిస్ట్) పోస్టులకు దరఖాస్తు చేసేవారు కమ్యూని కేషన్స్‌లో పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూని వర్సిటీ నుంచి సీడీపీఏ పూర్తి చేయాలి. డీజీఎం (ఎకానమిస్ట్) పోస్టుల్లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థుల కు ప్రాధాన్యం లభిస్తుంది. ఏజీఎం అభ్యర్థులకు కనీసం ఏడేళ్లు పని అనుభ వం ఉండాలి. అలాగే డీజీఎం వారికి పదేళ్ల పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు నాలుగేళ్ల పని అనుభవం తప్పనిసరి.
  • మేనేజర్(ఎంటర్ ప్రైజెస్ డేటావేర్ హౌజ్, వెండర్ మేనేజ్‌మెంట్, డిమాండ్ మేనేజ్‌మెంట్ ), డీజీఎం (ఏటీఎం, ఇంటర్నల్ అప్లికేషన్స్, వెండర్ మేనేజ్ మెంట్, కోర్ బ్యాంకింగ్, ఐటీ నెట్‌వర్క్, డిమాండ్ మేనేజ్‌మెంట్), ఏజీఎం(ఏటీఎం, పేమెంట్ సిస్టమ్, నెట్ బ్యాంకింగ్, ఇంటర్నల్ అప్లికేషన్స్, కోర్ బ్యాంకింగ్, డిమాండ్ మేనే జ్‌మెంట్, వెండర్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎంటర్ ప్రైజెస్ డేటావేర్ హౌజ్, ఎంటర్ ప్రైజెస్ డేటా ఆఫీసర్) పోస్టులకు ఇంజనీరింగ్ ఫుల్‌టైమ్ కోర్సు మాస్టర్స్/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మేనేజర్ పోస్టులకు నాలుగేళ్లు,డీజీఎంలకు పదే ళ్లు, ఏజీఎంలకు ఏడేళ్లు పని అనుభవం ఉండాలి.
  • మేనేజర్ కాంప్లియెన్స్, లీగల్, ఏజీఎం కాంప్లి యెన్స్, లీగల్, అసిస్టెంట్ మేనేజర్ కాంప్లియెన్స్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. 60 శాతం మార్కులతో కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజర్ పోస్టులకు నాలుగేళ్లు, ఏజీఎంలకు ఏడేళ్లు పని అనుభవం ఉండాలి.
  • మేనేజర్(లీగల్) పోస్టులకు దరఖాస్తు చేయాలను కునే అభ్యర్థులు.. 60శాతం మార్కులతో లా చేసి ఉండాలి. అలాగే బార్ అసోసియేషన్‌లో సభ్య త్వంతోపాటు అడ్వకేట్‌గా 4 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
  • ఏజీఎం(ట్రెజరీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల నుకునే వారు.. ఫుల్‌టైమ్ ఎంబీఏ (ఫైనాన్స్) చేసి ఉండాలి. ట్రెజరీగా ఏడేళ్ల అనుభవం ఉండాలి.
  • మేనేజర్(ట్రెజరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ/బీఏ(మ్యాథ్స్, స్టాటస్టిక్స్), బీఈ/ బీటెక్ లేదా ఎమ్మెస్సీ/ఎంఏ(మ్యాథ్స్, స్టాటస్టిక్స్), ఫుల్‌టైమ్ ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. అలాగే నాలుగేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.


వయసు..
ఐడీబీఐ భర్తీ చేసే ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల పోస్టులకు వేర్వేరు వయోపరిమితులు ఉన్నాయి. ఆయా పోస్టులను బట్టి కనీస వయసు 21ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగు లకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఇంకా చదవండి: part 2: ఐడీబీఐ బ్యాంకు ఎస్‌వో పోస్టుల వేతనాలు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 31 Dec 2020 12:39PM

Photo Stories