Skip to main content

కెనరా బ్యాంకు-పీవో విజయానికి మార్గాలు...

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు పీవో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి తీపి కబురు మోసుకొస్తూ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు 800 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఐబీపీఎస్ పీవో వంటి వివిధ బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులు.. గ్రాడ్యుయేషన్ అర్హతతో కెనరా బ్యాంకు పీవో పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు.
పీజీడీబీఎఫ్ కోర్సు :
  • కెనరా బ్యాంకు పీవో పోస్టులకు ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధి ఉండే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీ బీఎఫ్) కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • ఏడాది కాలంలో 9 నెలల పాటు క్లాసురూం శిక్షణ ఉంటుంది. తర్వాత 3 నెలలపాటు ఏదైనా కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలి.
  • ఈ కోర్సుకు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది కోర్సుకు రూ.3,54,000 లేదా రూ.4,13,000 (ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును విద్యార్థులు తమ సొంత డబ్బులతో లేదా బ్యాంకు మంజూరు చేసే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లించవచ్చు.
  • బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లో లేదా ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్‌లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాలపై పూర్తిస్థాయి శిక్షణతోపాటు పీజీ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.
  • శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు కెనరా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు కేటాయిస్తారు.
  • కోర్సు అనంతరం కనీసం ఐదేళ్ల పాటు విధిగా కెనరా బ్యాంకులోనే పనిచేస్తామని హామీ ఇస్తూ రూ.లక్ష బాండ్ సమర్చించాలి.

ఫీజు తిరిగి చెల్లింపు :
కోర్సుకోసం చెల్లించిన మొత్తాన్ని బ్యాంకు...అభ్యర్థులకు ‘లాయల్టీ బోనస్’ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం బాండ్ ముగిసిన తర్వాత నుంచి వాయిదా పద్ధతిలో ఫీజును తిరిగి చెల్లిస్తారు.

వేతనం :
శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరిన వారికి మూల వేతనం రూ.23,700 లభిస్తుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక విధానం :
తొలుత ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత మార్కులు సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో బృంద చర్చ(జీడీ), మౌఖిక పరీక్షలకు ఎంపిక చేస్తారు. తుది జాబితా రూపకల్పనలో ఆన్‌లైన్ టెస్టు మార్కులకు 50 శాతం, బృందచర్చలకు 20 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

సబ్జెక్ట్

ప్రశ్నలు

మార్కులు

రీజనింగ్

50

50

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

50

50

ఇంగ్లిష్ లాంగ్వేజ్

50

50

జనరల్ అవేర్‌నెస్

50

50

మొత్తం

200

200


ప్రిపరేషన్ టిప్స్..
రీజనింగ్ :
ఈ విభాగంలో స్కోరింగ్‌కు ఎక్కువ అవకాశం ఉంటుంది. హైలెవల్ పజిల్స్, సీటింగ్ అరెంజ్ మెంట్, స్టేట్‌మెంట్స్-ఆర్గ్యుమెంట్స్, సిలాయిజ మ్స్, ఇన్ ఈక్వాలిటీస్, డెరైక్షన్ సెన్స్, డేటా సఫిషియెన్సీ, ఇన్‌పుట్- అవుట్‌పుట్, అనాలజీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ తదితర చాప్టర్లను ప్రాక్టీస్ చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
  • శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, మెన్సురేషన్; అప్రాక్సి మేషన్, డేటా సఫిషియన్సీ, డేటా అనాలిసిస్, నంబర్ సిరీస్-రాంగ్ నంబర్ సిరీస్, ప్రాబబిలిటీ, క్వాడ్రాటిక్ ఈక్వే షన్స్ అంశాలు ముఖ్యమైనవి.
  • సింప్లిఫికేషన్‌ను తక్కువ సమయంలో పూర్తిచేసేలా సాధన చేయాలి. మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా సింప్లిఫికేషన్‌ను తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ :
ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలంటే.. రోజువారీ ఆంగ్ల దినపత్రిక చదవడం, జాతీయస్థాయి మీడియా వార్తలు వినడం, ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లిష్ విభాగంలో ముఖ్యమైన చాప్టర్లు.. రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జంబుల్డ్ సెంటెన్స్, ఎర్రర్ లొకేషన్స్, ప్రేజల్ రీప్లేస్‌మెంట్.

జనరల్ అవేర్‌నెస్..
ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్‌నెస్, స్టాటిక్ జీకే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్‌బీఐ సమీక్షలు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్న లు రావొచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకా లు, దేశాలు-అధినేతలు-కరెన్సీ, అవార్డులు, క్రీడలు, ఉపగ్రహ ప్రయోగాలు తదితరాలను తెలుసుకోవాలి.
  • ఐబీపీఎస్ క్లర్క్స్, పీవో మెయిన్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారు ఏకకాలంలో ఆయా పరీక్షలతో పాటు కెనరా బ్యాంకు పీవోకు ప్రిపేర్ కావచ్చు.

ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
నవంబర్ 13, 2018
పరీక్ష తేదీ (ఆన్‌లైన్ పరీక్ష): డిసెంబర్ 23, 2018
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://canarabank.com
Published date : 08 Nov 2018 05:49PM

Photo Stories