Skip to main content

ఎస్‌బీఐ పీవో ఎగ్జామ్‌ సిలబస్, పరీక్ష విధానం ఇలా..

భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తరుణంలో పరీక్ష విధానం, సిలబస్ వివరాలిలా..
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ..
ప్రిలిమినరీలో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్ వాల్యూస్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, పర్ముటేషన్-కాంబినేషన్స్‌,ప్రాబబిలిటీలతోపాటు అరిథ్‌మెటిక్ టాపిక్స్ ఉంటాయి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్..
ఇది ప్రిలిమ్స్, మెయిన్‌లతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్‌లోనూ ఉంది. కాబట్టి దీన్ని ముఖ్య విభాగంగా గుర్తించాలి. అభ్యర్థులు గ్రామర్‌పై పట్టు పెంచుకోవాలి. పాసేజ్‌ను వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు త్వరగా సాధించొచ్చు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లను సాధన చేయాలి.

జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్..
వర్తమాన అంశాలు, బ్యాంకింగ్ పదజాలం, స్టాండర్డ్ జీకేల నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గత ఐదారు నెలల కరెంట్ అఫైర్స్‌పై పట్టుసాధించాలి.

డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ ప్రెటేషన్..
మెయిన్‌లోని ఈ విభాగం కోసం అరిథ్‌మెటిక్ టాపిక్స్‌పై పట్టుసాధించాలి. టేబుల్స్, లైన్ గ్రాఫ్‌లు, బార్ డయాగ్రమ్‌లు, పైచార్టులు, కేస్‌లెట్స్ నుంచి ఎక్కువ పశ్నలొస్తాయి. ఇందులో ఎక్కువ మార్కులు పొందాలంటే.. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయడం వచ్చుండాలి. దీనికోసం బాగా ప్రాక్టీస్ చేయాలి.

రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్..
ప్రిలిమ్స్, మెయిన్.. రెండింట్లోనూ రీజనింగ్ ఉంది. ఎస్‌బీఐ పీఓ రీజనింగ్ ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్ సంబంధిత ప్రశ్నల్లోని ఆప్షన్లు అన్నీ సరైనవిగా భ్రమింపజేసేలా ఉంటాయి. కంప్యూటర్‌కు సంబంధించి 5-10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ముఖ్య సమాచారం..
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 4
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 31, జనవరి 2, 4, 5
  • ఫలితాల వెల్లడి: జనవరి మూడోవారం, 2021
  • మెయిన్ పరీక్ష: జనవరి 29, 2021
  • ఫలితాల వెల్లడి: 2021, ఫిబ్రవరి 3 లేదా 4వ వారం
  • ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/మార్చి 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sbi.co.in/web/careers  

ప్రిలిమ్స్ పరీక్ష..

విభాగం

ప్రశ్నలు

సమయం

ఇంగ్లిష్ లాంగ్వేజ్

30

20 నిమిషాలు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

35

20 నిమిషాలు

రీజనింగ్ ఎబిలిటీ

35

20 నిమిషాలు

మొత్తం

100

60 నిమిషాలు


మెయిన్ ఎగ్జామ్..

విభాగం

ప్రశ్నలు

మార్కులు

సమయం

రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్

45

60

60 ని.

డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్

35

60

45 ని.

జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్

40

40

35 ని.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

35

40

40 ని.

మొత్తం

155

200

3 గం.


డిస్క్రిప్టివ్ టెస్టు: దీన్ని ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 50 మార్కులకు నిర్వహిస్తారు. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సేపై రెండు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 30 నిమిషాలు.

ఇంకా చదవండి: ఎస్‌బీఐలో 2000 పీవో ఉద్యోగాలు.. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇలా!
Published date : 24 Nov 2020 03:22PM

Photo Stories