Skip to main content

ఎస్‌బీఐ ‘క్లరికల్’ కొలువుకు చదవండిలా...

బ్యాంకింగ్ ఉద్యోగ ఔత్సాహికులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నోటిఫికేషన్‌తో స్వాగతం పలుకుతోంది. ఇటీవల 2000 పీవో పోస్టులకు ప్రకటన విడుదలచేసిన ఎస్‌బీఐ తాజాగా 8904 క్లరికల్ కేడర్-జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్‌‌ట అండ్ సేల్స్) కొలువులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ లేకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఆధారంగానే ఈ ఉద్యోగాలను భర్తీచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 253, తెలంగాణలో 425 ఖాళీలు ఉన్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలతో పాటు పరీక్షలో విజయానికి సూచనలు...
అర్హతలు:
విద్యార్హతలు (2019, ఆగస్టు 31 నాటికి):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2019, ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు సంబంధించి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియలో మొత్తం మూడు దశలుంటాయి. ఇందులో భాగంగా ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ-మెయిన్), లోకల్ లాంగ్వేజ్ సంబంధిత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాష తెలిసి ఉండటం తప్పనిసరి. సదరు స్థానిక భాషను పది లేదా ఇంటర్‌లో ఒక సబ్జెక్టుగా చదివితే ఎలాంటి లాంగ్వేజ్ టెస్టులు ఉండవు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ :
ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

విభాగం

ప్రశ్నలు

మార్కులు

సమయం

ఇంగ్లిష్ లాంగ్వేజ్

30

30

20 ని.

న్యూమరికల్ ఎబిలిటీ

35

35

20 ని.

రీజనింగ్ ఎబిలిటీ

35

35

20 ని.

మొత్తం

100

100

60 ని.

  • సెక్షనల్ కటాఫ్ మార్కులు ఉండవు. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. ప్రతి కేటగిరీ నుంచి మొత్తం ఖాళీలకు దాదాపు పదిరెట్ల మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ ఎగ్జామినేషన్ :

విభాగం

ప్రశ్నలు

మార్కులు

సమయం

జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్

50

50

35 ని.

జనరల్ ఇంగ్లిష్

40

40

35 ని.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

50

50

45 ని.

రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్

50

60

45 ని.

మొత్తం

190

200

160 ని.


వేతనం :
ఎస్‌బీఐ తన ఉద్యోగులకు ఆకర్షణీయ వేతనాలు అందిస్తోంది. ఈ బ్యాంకులో ఉద్యోగం సాధించడం ద్వారా సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవచ్చు. క్లరికల్ స్థాయి ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లలోనే శాఖాపరమైన పరీక్షల ద్వారా ఆఫీసర్ స్థాయికి చేరుకోవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం.. రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లతో కలిపి రూ.13,075 బేసిక్ వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. ముంబయి వంటి మెట్రో నగరాల్లో అయితే డీఏ, ఇతర అలవెన్సులతో కలిపి మొదట్లో నెలకు దాదాపు రూ.25 వేల వేతనం అందుతుంది. ప్రాంతాన్నిబట్టి అలవెన్సులు మారుతాయి.

సన్నద్ధత :
బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో), క్లరికల్ కేడర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా సన్నద్ధమయ్యే అవకాశముంది. క్లరికల్‌తో పోల్చితే పీవో పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంటుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ :
  • ఇంగ్లిష్ సెక్షన్‌లో మంచి మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పటికప్పుడు చదివి, పరీక్షకు హాజరవడం వల్ల లాభం ఉండదు. వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. బేసిక్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
  • రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్/ సెంటెన్స్ జంబుల్/ఆడ్‌మన్ ఔట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • రీడింగ్ కాంప్రెహెన్షన్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలోనూ వొకాబ్యులరీ ఆధారిత ప్రశ్నలుంటాయి. క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ సెక్షన్లకు ఒకే లాజిక్ ఆధారంగా సమాధానాలు గుర్తించవచ్చు.
  • ఎప్పటికప్పుడు ప్రశ్నల సరళి మారుతున్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.

న్యూమరికల్ ఎబిలిటీ/క్యూఏ:
  • కొంచెం శ్రమిస్తే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశమున్న విభాగమిది. బేసిక్స్‌పై అవగాహన లేకుంటే న్యూమరికల్ ఎబిలిటీలో స్కోరు చేయడం కష్టం. కాబట్టి తొలుత బేసిక్ కాన్సెప్టులను క్షుణ్నంగా తెలుసుకోవాలి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు వేగంగా చేయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. 30 వరకు ఎక్కాలు, 50 వరకు వర్గాలు-వర్గమూలాలు, 30 వరకు ఘనమూలాలను నేర్చుకోవాలి.
  • రేషియో, పర్సంటేజ్, యావరేజెస్ చాప్టర్లు కీలకమైనవి. వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు గుర్తించాలంటే వీటిపై పట్టు అవసరం. సిరీస్, సింప్లిఫికేషన్స్, అప్రాక్షిమేషన్స్, డేటా సఫీషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ కంపేరిజన్స్‌పై అభ్యర్థులు దృష్టిసారించాలి. మెయిన్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ (డీఐ) నుంచి ఎక్కువ ప్రశ్నలు (దాదాపు 25 ప్రశ్నలు) వచ్చే అవకాశం ఉంది.
  • సింప్లిఫికేషన్/అప్రాక్షిమేషన్ ప్రాబ్లమ్స్ (5 ప్రశ్నలు)ను తక్కువ సమయంలో సాధించవచ్చు. దీంతో పాటు నంబర్ సిరీస్ (5 ప్రశ్నలు) తేలికగా స్కోరు చేయడానికి వీలున్న విభాగం.

రీజనింగ్ ఎబిలిటీ, సీఏ :
  • అభ్యర్థుల తార్కిక ఆలోచనా సామర్థ్యం, విశ్లేషణా నైపుణ్యాలను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. సరైన ప్రాక్టీస్‌తో ఈ సెక్షన్‌లో మంచి స్కోరు సాధించొచ్చు. కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్, ఇన్‌పుట్ ఔట్‌పుట్, సిలాయిజమ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అండ్ పజిల్స్ (సర్క్యులర్, లీనియర్ అరేంజ్‌మెంట్స్, ఫ్లోర్ టెస్ట్స్); బ్లడ్ రిలేషన్స్; డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాల్సి ఉంటుంది.
  • సీటింగ్ ఆరేంజ్‌మెంట్స్ అండ్ పజిల్స్ (సర్క్యులర్, లీనియర్ అరేంజ్‌మెంట్స్, ఫ్లోర్ టెస్ట్స్, స్క్వేర్ అరేంజ్‌మెంట్) నుంచి గత మెయిన్ పరీక్షలో అధిక పశ్నలు వచ్చాయి. కాబట్టి వీటిపై దృష్టిసారించడం ముఖ్యం.
  • కోడింగ్ - డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అంశాల నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్థ కాఠిన్యతతో ఉంటాయి. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్ ముఖ్యం.
  • మెయిన్‌లో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (సీఏ) సెక్షన్ రీజనింగ్‌తో కలిసి ఉంది. ఇది మంచి స్కోరింగ్‌కు అవకాశమున్న విభాగం. దీనికి సన్నద్ధతలో భాగంగా కంప్యూటర్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్క్ లేయర్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్, పదజాలంపై దృష్టిసారించాలి. కీబోర్డ్ షార్ట్‌కట్ కీస్, అబ్రివేషన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ :
పరీక్షలో విజయానికి ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. మెయిన్‌లో దీనికి 50 మార్కులు కేటాయించారు. ఆర్థికశాస్త్ర పదజాలం, బ్యాంకింగ్ రంగ తాజా పరిణామాలు, బ్యాంకింగ్ విధానాలు తదితరాలపై దృష్టిసారించడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందులో సమకాలీన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటినుంచి 30 ప్రశ్నల వరకు రావొచ్చు. అందువల్ల తాజా ప్రభుత్వ విధానాలు, ఆర్‌బీఐ సంబంధిత అంశాలు, బ్యాంకింగ్ రంగంతో ముడిపడిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిసారించాలి. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ), డిఫెన్స్ టెక్నాలజీ, సదస్సులు, అవార్డులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, కమిటీలు-చైర్మన్లు, క్రీడలు-విజేతలు తదితరాల నుంచి కూడా ప్రశ్నలు ఎదురవుతాయి. పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం ద్వారా ఇందులో అధిక స్కోరు సాధించొచ్చు.
  • వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. తప్పులను గుర్తించి, సరిదిద్దుకోవాలి. బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి. గత పేపర్ల సాధన సన్నద్ధతకు ఉపయోగపడుతుంది.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
2019, మే 3.
దరఖాస్తు రుసుం: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ఎస్ అభ్యర్థులకు రూ.125.
ప్రిలిమినరీ పరీక్ష: 2019, జూన్.
మెయిన్ పరీక్ష తేదీ: 2019, ఆగస్టు 10.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sbi.co.in/careers
Published date : 15 Apr 2019 04:53PM

Photo Stories