బ్యాంకు కొలువులు...అందుకునే మార్గాలు
Sakshi Education
బ్యాంకులు... నిరుద్యోగ యువతకు ఎడారిలో ఒయాసిస్సుల్లా కనిపిస్తున్నాయి. క్లరికల్ కేడర్ కొలువులు మొదలు.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల వరకు..ఎప్పటికప్పుడు ఏదో ఒక బ్యాంకు నుంచి నియామక ప్రకటన వెలువడుతోంది!
సంప్రదాయ గ్రాడ్యుయేట్లు మొదలు.. టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులకు సైతం ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగం ఆశాదీపంగా మారుతోంది. కొద్ది రోజుల కిందట రెండువేల పీవో ఖాళీలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లభించే బ్యాంకు ఉద్యోగాలు.. వాటిని అందుకునే మార్గాల గురించి తెలుసుకుందాం...
ఆకర్షణీయ వేతనాలు.. బంగారు భవిష్యత్తు.. నాలుగు కాలాల పాటు కెరీర్ నవనవోన్మేషంగా వర్ధిల్లుతుందనే భరోసా.. గ్రాడ్యుయేట్లను బ్యాంక్ కొలువుల కోసం పోటీపడేలా చేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సైతం నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. యువతకు స్వాగతం పలుకుతున్నాయి.
నియామక సంస్థలు..
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నియామకాలు ప్రధానంగా మూడు మార్గాల ద్వారా జరుగుతున్నాయి.
1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)
ఐబీపీఎస్ జాతీయ స్థాయిలో ఎస్‌బీఐ మినహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలతోపాటు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపడుతోంది. కంబైన్డ్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ క్లర్క్స్, కంబైన్డ్ రిటెన్ ఎగ్జామ్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, కంబైన్డ్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పేరుతో జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. పీవో స్థాయి పోస్టుల భర్తీకి రాత పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా.. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తోంది.
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). ఇది వివిధ కేడర్లలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా ప్రకటనలు విడుదల చేస్తోంది. పీవో స్థాయి ఉద్యోగాలకు రాత పరీక్ష, జీడీ/పీఐ నిర్వహిస్తోంది.
3. ప్రైవేటు బ్యాంకులు
దేశంలోని వివిధ ప్రైవేటు బ్యాంకులు సైతం నిరంతరం ఏదో ఒక నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. కొన్ని బ్యాంకులు.. పీవో ఉద్యోగాల విషయంలో నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకొని జాబ్ ఓరియెంటెడ్ కోర్సు అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశానికి అర్హత పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏడాది పాటు సాగే ఈ కోర్సులో చివరి మూడు నెలలు సంబంధిత బ్యాంకులో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్‌లో పీజీ డిప్లొమాతోపాటు సంబంధిత బ్యాంకులో పీవో పోస్ట్ ఖరారవుతుంది. మరికొన్ని బ్యాంకులు నేరుగా పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్..
క్లరికల్ కేడర్ :
గతంలో క్లర్క్‌గా పిలిచే క్లరికల్ కేడర్ పోస్ట్ ఆధునిక రూపు సంతరించుకుంటోంది. క్లరికల్ కేడర్ పోస్టులను ఇప్పుడు కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ తదితర పేర్లతో పిలుస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఇదే విధానం అమలవుతోంది.
పీవో.. ఆకాశమే హద్దు
బ్యాంకుల్లో మేనేజీరియల్ హోదాకు తొలి అడుగు.. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో). ఈ ఉద్యోగానికి ఎంపికైన వారిని జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్-1 హోదాలో నియమిస్తారు. తొలుత వీరిని అసిస్టెంట్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఇలా మొత్తం ఏడు స్కేల్స్ ఉంటాయి. ఒక్కో స్కేల్‌కు చేరుకున్న సమయంలో ఒక్కో హోదాతో పదోన్నతి లభిస్తుంది. ఆ వివరాలు...
స్పెషలిస్ట్ ఆఫీసర్లు...నిర్దిష్టంగా ఒక విభాగానికి సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, లీగల్ ఆఫీసర్లు, ఫైనాన్స్ మేనేజర్లు తదితర పోస్టులను స్పెషలిస్టు పోస్టులుగా చెబుతున్నారు. వీటిలో చేరేందుకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం. ఉదాహరణకు ఐటీ ఆఫీసర్ జాబ్ కోసం బీటెక్, ఎంటెక్; లీగల్ ఆఫీసర్ పోస్టు కోసం ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం; ఫైనాన్స్ మేనేజర్ పోస్టుల కోసం ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారిని బ్యాంకులు అర్హులుగా పేర్కొంటున్నాయి. పీవోతో పోల్చితే స్పెషలిస్టు ఆఫీసర్ త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
ప్రైవేటు బ్యాంకుల కొత్త దారి...
మేనేజ్‌మెంట్ విభాగం :
మేనేజ్‌మెంట్ విభాగంలో నియామకాలకు ప్రైవేటు బ్యాంకులు కొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికోసం డేటా అనలిటిక్స్, డేటా మేనేజర్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్, ఈఆర్‌పీ ప్రొఫెషనల్స్ తదితర నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ విభాగాల్లో జూనియర్ మేనేజర్/మేనేజర్ హోదాలో తొలుత అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో చేరిన వారు బ్యాంకు కస్టమర్ల డేటాను విశ్లేషించడం, కొత్తగా అందించాల్సిన సేవల గురించి తెలియజేయడం తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

- స్కేల్-1: జూనియర్ మేనేజ్‌మెంట్.
- స్కేల్-2: డిప్యూటీ మేనేజర్‌గా పదోన్నతి లభిస్తుంది.
- స్కేల్-3: మేనేజర్ స్థాయి.
- స్కేల్-4: చీఫ్ మేనేజర్.
- స్కేల్-5: అసిస్టెంట్ జనరల్ మేనేజర్.
- స్కేల్-6: డిప్యూటీ జనరల్ మేనేజర్.
- స్కేల్-7: జనరల్ మేనేజర్.
- ప్రతి స్కేల్‌కు పదోన్నతి లభించేందుకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. పదోన్నతి ఇచ్చే క్రమంలో బ్యాంకులు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తాయి. జేఏఐఐబీ వంటి బ్యాంకింగ్ సర్టిఫికేషన్లు పూర్తిచేసిన వారికి కొంత ప్రాధాన్యం ఉంటుంది. పీవోగా ఎంపికైన వారిలో దాదాపు 80 శాతం మంది పదవీ విరమణ సమయానికి స్కేల్-7 వరకు పదోన్నతి పొందుతారు. వీటికి అదనంగా.. అత్యున్నత స్థాయిలో టాప్ ఎగ్జిక్యూటివ్ హోదాలు కూడా ఉంటాయి. ఈ హోదాల్లో చీఫ్ జనరల్ మేనేజర్; డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్; మేనేజింగ్ డెరైక్టర్; చైర్‌పర్సన్ స్థాయికి చేరుకునే అవకాశముంది. ఇవి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అమలవుతున్న విధానం. ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం.. ఒక్కో హోదాకు పదోన్నతి పొందే క్రమంలో కాల పరిమితి నిబంధన ఏమీ లేదు. ప్రతిభ ఆధారంగా, మంచి పనితీరుతో ఉద్యోగులు ఏడెనిమిదేళ్లలో జీఎం స్థాయికి చేరుకునే అవకాశముంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు...నిర్దిష్టంగా ఒక విభాగానికి సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, లీగల్ ఆఫీసర్లు, ఫైనాన్స్ మేనేజర్లు తదితర పోస్టులను స్పెషలిస్టు పోస్టులుగా చెబుతున్నారు. వీటిలో చేరేందుకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం. ఉదాహరణకు ఐటీ ఆఫీసర్ జాబ్ కోసం బీటెక్, ఎంటెక్; లీగల్ ఆఫీసర్ పోస్టు కోసం ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం; ఫైనాన్స్ మేనేజర్ పోస్టుల కోసం ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారిని బ్యాంకులు అర్హులుగా పేర్కొంటున్నాయి. పీవోతో పోల్చితే స్పెషలిస్టు ఆఫీసర్ త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
ప్రైవేటు బ్యాంకుల కొత్త దారి...
- నియామకాలు, హోదాల విషయంలో ప్రైవేటు బ్యాంకులు కొత్త మార్గంలో పయనిస్తున్నాయి. సంప్రదాయ బ్యాంకింగ్ విధులకు అవసరమైన వారిని నియమించుకుంటూనే... ఆధునిక పద్ధతులు, సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పోస్టులను సృష్టిస్తూ నియామకాలు చేపడుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో నియామకాల సంఖ్యను క్రమంగా పెంచుతున్నాయి.
- రోబోటిక్ ఇంజనీర్స్: బ్యాంకులు అందించే ఆటోమేటెడ్ సేవలను పర్యవేక్షించడం, కొత్త సేవలను రూపొందించం రోబోటిక్ ఇంజనీర్ల ప్రధాన విధులు.
- సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్: సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడం సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ విధుల్లో ముఖ్యమైనవి.
- టెక్నికల్ అనలిస్ట్: బ్యాంకులు అనుసరిస్తున్న సాంకేతికతను అమలు చేయడంలో వీరి పాత్ర కీలకం.
- నెట్‌వర్క్ ఇంజనీర్స్: ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా.. నెట్‌వర్క్ సంబంధిత సాంకేతిక అంశాలైన డాట్ నెట్, ఇంట్రానెట్ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
- క్లౌడ్ ఇంజనీర్స్: తమకు సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తున్న ఐటీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపడం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తమ సర్వీస్ ప్రొవైడర్‌తో అనుసంధానమై ఇంటర్నెట్ ఆధారంగా పరిష్కరించడం వీరి ప్రధాన విధులు.
- ఇలాంటి ముఖ్యమైన టెక్నికల్ పోస్టుల నియామకాలకు ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇందులో ఎంపికైన వారికి సగటున రూ.15 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
మేనేజ్‌మెంట్ విభాగం :
మేనేజ్‌మెంట్ విభాగంలో నియామకాలకు ప్రైవేటు బ్యాంకులు కొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికోసం డేటా అనలిటిక్స్, డేటా మేనేజర్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్, ఈఆర్‌పీ ప్రొఫెషనల్స్ తదితర నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ విభాగాల్లో జూనియర్ మేనేజర్/మేనేజర్ హోదాలో తొలుత అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో చేరిన వారు బ్యాంకు కస్టమర్ల డేటాను విశ్లేషించడం, కొత్తగా అందించాల్సిన సేవల గురించి తెలియజేయడం తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- మేనేజ్‌మెంట్ విభాగంలో నియామకాలకు కూడా బ్యాంకులు.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై అధికంగా ఆధారపడుతున్నాయి. బీటెక్‌తో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ.. ఏటా సగటున రూ.18 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి.
- క్లరికల్ కేడర్‌లో చేరిన వారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ హోదాకు చేరుకునే అవకాశం.
- పీవో స్థాయిలో చేరిన వారు జీఎం స్థాయికి ఎదిగే వీలుంటుంది.
- ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రతిభ ఆధారంగా ఏడెనిమిదేళ్లకే జీఎం స్థాయికి చేరుకోవచ్చు.
- ప్రైవేటు రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో నియామకాలు పెరుగుతున్నాయి.
- ప్రముఖ సంస్థల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సగటున రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
- బీటెక్, ఎంబీఏ.. ఈ రెండు అర్హతలున్న అభ్యర్థులకు ప్రాధాన్యం పెరుగుతోంది.
Published date : 30 Apr 2018 06:30PM