Skip to main content

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే ఇవి ఎంతో ముఖ్యం..

విద్యార్థులు ప్రశ్నలను వేగంగా అదే సమయంలో కచ్చితత్వంతో సాధించగలగాలి. పరీక్షలో ఏదైనా ప్రశ్నకు సంబంధించి సందే హం ఉన్నట్లయితే.. సమయాన్ని వృధా చేసుకోకుండా తదుపరి ప్రశ్నకు వెళ్లిపోవాలి. తద్వారా తెలిసిన ప్రశ్నలకు సమాధానం గుర్తించేందుకు అదనపు సమయం చిక్కుతుంది.
  • పాక్టీస్... అందుబాటులో ఉన్న ఈ చివరి 10 రోజులను పూర్తిగా ప్రిపేరయిన సబ్జెక్టుల సాధనకే కేటాయించాలి. ఇప్పుడు కొత్త టాపిక్స్‌ను ప్రారంభిస్తే.. గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
  • మాక్ టెస్టులు.. అభ్యర్థులు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. మాక్‌టెస్టులు స్వీయ సామర్థ్య విశ్లేషణ, బలహీనతలపై అంచనాకు ఉపయోగపడతాయి. కాబట్టి చివరివారంలో మాక్‌టెస్టులకు హాజరవుతూ ప్రాక్టీస్‌ను కొనసాగించాలి.



ఇంకా చదవండి: part 3: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విభాగాల వారీగా పరీక్ష వ్యూహం.. ఇలా ఉంటే మంచిది..

Published date : 25 Dec 2020 01:25PM

Photo Stories