Skip to main content

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విభాగాల వారీగా పరీక్ష వ్యూహం..ఇలా ఉంటే మంచిది..

చివరి దశలో రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్.. ఇలా విభాగాల వారీగా సరైన ప్రిపరేషన్ వ్యూహం అనుసరించడం లాభిస్తుంది.

రీజనింగ్.. పట్టున్న ప్రశ్నలు
ఇతర విభాగాలతో పోల్చితే రీజనింగ్ సులభంగా ఉంటుంది. ఇందులో అనలిటికల్ పార్ట్‌పై ఫోకస్ పెట్టడం లాభిస్తుంది. అలాగే పట్టున్న టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను తొలుత సాధించాలి. ఏదైనా ప్రశ్నపై 3 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని అంచనాకొస్తే.. సదరు ప్రశ్నను స్కిప్ చేయాలి. ఐబీపీఎస్ పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్ విజయంలో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ప్రశ్నలను సాధించాలి..

  • ఇనీక్వాలిటీ
  • సిలాజిజమ్
  • బ్లడ్ రిలేషన్స్
  • ఆర్డర్ అండ్ ర్యాంకింగ్
  • ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ డిస్టెన్స్, డెరైక్షన్ వంటి అంశాల్లో మార్కులు కోల్పోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.
  • వీటితోపాటు..
  • మేకింగ్ సిరీస్/అనాలజీ
  • నంబర్ సిరీస్
  • కోడింగ్ అండ్ డీకోడింగ్
  • పాబ్లమ్ సాల్వింగ్
  • ప్యాసేజ్ అండ్ కంక్లూజన్
  • రీడింగ్ కాంప్రహెన్షన్‌లను ముఖ్యమైన టాపిక్స్‌గా గుర్తించాలి.


క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్..
ఇది క్లిషమైన విభాగం. ఇందులో అడిగే ప్రశ్నల్లో అధిక శాతం ట్రిక్స్‌ను ఉపయోగించి సాధించగలిగేవిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చివరి పది, పదిహేను రోజుల్లో సింప్లిఫికేషన్ అండ్ పర్సంటేజ్ టాపిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి వరకు అధ్యయనం చేసిన అన్ని టాపిక్స్‌ను రివిజన్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్,సీక్వెన్స్ అండ్ సిరీస్, నంబర్ సిస్టమ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, రేషియో, ప్రపోర్షన్ పర్సంటేజ్ అండ్ యావరేజెస్ టాపిక్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. వర్డ్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించి మల్టిపుల్ రీడింగ్స్ ద్వారా సమయాన్ని వృథా చేసుకోకూడదు. అభ్యర్థులు చదవబోయే సమాచారానికి సంబంధించిన ముఖ్యాంశాలను పేపర్‌పై రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చదువుతున్నప్పుడే సదరు సమాచారాన్ని ఫార్ములాలో ప్రతిష్టించి సమాధానాన్ని కనుక్కోవచ్చు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్- గ్రామర్..
ఇందులో అడిగే ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. అలాగే అభ్యర్థి గ్రామర్ నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. రిఫరెన్స్ పుస్తకాలను రివిజన్ చేయడం ద్వారా.. ఇందులో మంచి మార్కులు పొందవచ్చు. ముఖ్యంగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కాంప్రహెన్షన్ పాసేజ్, ప్రేజెస్ అండ్ ఇడియమ్స్, స్పాటింగ్ ఎర్రర్, ప్రపోజిషన్, పారా జంబుల్స్ ప్రశ్నలను సాధించాలి.

డూస్, డోంట్స్..

  • పరీక్ష ముందు రోజు రాత్రి సమతుల, మితాహారం తీసుకొని, బాగా నిద్రపోవాలి. తద్వారా పరీక్ష రోజు ఉదయం ఫ్రెష్‌గా లేవొచ్చు.
  • పరీక్ష రోజు కేంద్రానికి చేరుకొనే సమయంలో అనవసర ఒత్తిడికి గురికాకుండా.. కాస్త ముందుగా ఎగ్జామ్ సెంటర్‌ను చేరుకోవాలి.
  • పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత నిబంధనలన్నింటినీ పూర్తిగా చదువుకోవాలి. అలాగే ప్రశ్నపత్రాన్ని చూసిన తర్వాత ఒత్తిడికి గురికారాదు.
  • ఒకే ప్రశ్న వద్ద సమయాన్ని వృథా చేసుకోరాదు. ఏదైనా ప్రశ్న అధిక సమయం తీసుకుంటుంటే.. సదరు ప్రశ్నను స్కిప్ చే సి తర్వాతి ప్రశ్నకు వెళ్లాలి.


ఇంకా చదవండి: part 1:ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్.. చివరి దశ రివిజన్ ఇలా ఉంటే విజయం ఖాయం..

Published date : 25 Dec 2020 01:27PM

Photo Stories