ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్.. చివరి దశ రివిజన్ ఇలా ఉంటే విజయం ఖాయం..
Sakshi Education
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్(ఐబీపీఎస్).. పీవో ప్రిలిమినరీ పరీక్ష జనవరి 6న జరగనుంది. ప్రస్తుతం అభ్యర్థులంతా చివరి దశ రివిజన్‌పై దృష్టిపెట్టారు. పరీక్షను విజయవంతంగా రాసేందుకు ఈ దశలో ఏం చేయాలో... ఏమి చేయకూడదో అభ్యర్థులకు అవగాహన ఉండాలి. అలాగే చివరి దశలో అనుసరించే చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్ పరీక్షలో వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా చివరి దశ రివిజన్, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ టిప్స్...
పరీక్షపై అవగాహన..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష విధానం గురించి పూర్తి అవగాహన కలిగుండాలి.
- పరీక్ష సమయం: 60 నిమిషాలు
- మొత్తం వంద ప్రశ్నలు-వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఇందులో మూడు విభాగాలు ఉంటాయి..
- రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు
- క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
లాస్ట్ మినిట్ టిప్స్..
- కొత్తవి వద్దు.. ప్రస్తుతం అభ్యర్థులు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి అస్సలు పోకూడదు. ప్రస్తుతం కొత్త చాప్టర్లను ప్రాక్టీస్ చేసేందుకు చాలినంత సమయం అందుబాటులో లేదు. కాబట్టి అభ్యర్థులు కొత్త చాప్టర్లను ప్రారంభించరాదు.
- రివైజ్... ఇప్పటి వరకు ప్రిపేరయిన అన్ని టాపిక్స్‌ను రివైజ్ చేసుకోవాలి. అలాగే పరీక్షకు హాజరుకాబోయే ముందు ముఖ్యమైన టాపిక్స్‌ను మళ్లీ ఒకసారి రివిజన్ చేయాలి. ప్రశ్నల సాధనకు ఉపయోగపడే ట్రిక్స్, ఫార్ములాలను రివిజన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఫార్ములాలను జ్ఞాపకం ఉంచుకోవచ్చు.
- సమయపాలన... పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు ప్రతి విద్యార్థి అనుసరించి, పరీక్షించుకోవాల్సిన వ్యూహం ఇది. ప్రతి విభాగాన్ని త్వరగా ముగించి.. చివరిలో మిగిలిన సమయాన్ని అటెంప్ట్ చేయని ప్రశ్నల సాధనకు వినియోగించాలి. విద్యార్థులు టైమ్ మేనేజ్‌మెంట్ పరంగా ఆయా కాన్సెప్ట్‌లకు సంబంధించి వేగం, కచ్చితత్వాలను కలిగుండాలి.
ఇంకా చదవండి: part 2: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే ఇవి ఎంతో ముఖ్యం..
Published date : 25 Dec 2020 01:23PM