Skip to main content

ఐబీపీఎస్ ‘ఎస్‌వో’ ప్రిపరేషన్ టిప్స్

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్టు ఆఫీసర్ (ఎస్‌వో) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే.. ఐటీ నిపుణులు.. న్యాయ పరమైన సమస్యలు చూసే లాయర్లు.. మానవ వనరుల బాధ్యతలు నిర్వహించే హెచ్‌ఆర్ సిబ్బంది.. బ్యాంకు సేవలకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ నిపుణులు.. రైతాంగానికి రుణాల మంజూరుకు వీలు కల్పించే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లు వంటి మొత్తం 1,599 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ ఎస్‌వో నోటిఫికేషన్ వివరాలు.. ఆయా పోస్టులకు అర్హతలు... ఎంపిక ప్రక్రియ... ప్రిపరేషన్ గెడైన్స్...
ఖాళీలు .. అర్హతలు
మొత్తం ఖాళీలు:
1,599 (స్కేల్-1 ఆఫీసర్లు).
  1. ఐటీ ఆఫీసర్ : 219
    అర్హతలు:
    కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత లేదా డీఓఈఏసీసీ-బి లెవల్ డిగ్రీ ఉండాలి.
  2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ : 853
    అగ్రికల్చర్/ హార్టికల్చర్/యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్/ఫిషరీ సైన్స్/పిసి కల్చర్/కోపరేషన్ అండ్ బ్యాంకింగ్/అగ్రోఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/ఫుడ్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  3. రాజ్‌భాష అధికారి : 69
    అర్హతలు :
    హిందీలో పీజీ ఉత్తీర్ణత తోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. లేదా సంస్కృతంలో పీజీ ఉండి డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులు చదివుండాలి.
  4. లా ఆఫీసర్ : 75
    అర్హతలు:
    లా డిగ్రీతోపాటు బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
  5. హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ : 81
    అర్హతలు:
    డిగ్రీతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్‌‌స తదితర సబ్జెక్టుల్లో ఫుల్‌టైం పీజీ డిగ్రీ లేదా డిప్లొమా.
  6. మార్కెటింగ్ ఆఫీసర్ : 302
    అర్హతలు: డిగ్రీతోపాటు మార్కె టింగ్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైమ్ ఎంఎంఎస్/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. రెండు కంటే ఎక్కువ స్పెషలైజేషన్లతో ఎంఎంఎస్ లేదా ఎంబీఏ, పీజీ డిప్లొమా చదివిన అభ్యర్థులు అనర్హులు.
వయో పరిమితి :
పై అన్ని పోస్టులకు 2018, నవంబర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (1988, నవంబర్ 2-1998, నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి). రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు వయసులో పదేళ్ల సడలింపు ఇస్తారు.

ఎంపిక విధానం :
ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష), కామన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం ప్రిలిమినరీ :
  • లా ఆఫీసర్లు, రాజ్‌భాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంశాల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు-125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, మిగతా వాటికి ఒక్కో మార్కు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 40 నిమిషాల చొప్పున మొత్తం రెండు గంటల సమయం కేటాయించారు.
  • ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లు, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున- మొత్తం 150 ప్రశ్నలు-125 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, మిగతా సెక్షన్ల ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 40 నిమిషాల చొప్పున మొత్తం రెండు గంటల పాటు పరీక్ష జరుగుతుంది.
గమనిక: అభ్యర్థులు ఒక్కో సెక్షన్‌లో వేర్వేరుగా అర్హత సాధించాలి. మొత్తంగా నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించడం తప్పనిసరి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హులైన వారినే మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ పరీక్ష :
  • లా ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లు, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు మెయిన్ పరీక్ష 60 ప్రశ్నలు-60 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. 45 నిమిషాల సమయం కేటాయించారు. పోస్టులను బట్టి సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
  • రాజ్‌భాష అధికారి పోస్టుకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో 60 మార్కులకు పరీక్ష ఉంటుంది.
గమనిక: ప్రిలిమ్స్, మెయిన్స్‌లోని ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.

మెయిన్ పరీక్షలో నిర్ణీత కటాఫ్ స్కోరు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఓవరాల్‌గా తుది ఎంపికలో మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు వరుసగా 80 :20 నిష్పత్తిలో వెయిటేజీ ఇస్తారు.

ప్రిలిమ్స్ ప్రిపరేషన్..
అన్ని పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ కామన్. రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్ ఉద్యోగాల కు పోటీపడే వారికి బ్యాంకింగ్ , జనరల్‌అవేర్‌నెస్ అం శాల నుంచి ప్రశ్నలు ఉంటాయి; ఈ రెండు పోస్టులు మినహా మిగతా అన్ని పోస్టులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షలో పదో తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ దశ దాటితే మెయిన్స్‌లో ఉండే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టులో మంచి స్కోరుచేసే అవకాశం ఉంటుంది.
  • పలు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఇంజనీరింగ్, ఎంబీఏ అభ్యర్థులు.. ఐబీపీఎస్. ఎస్‌వోకు సన్నద్ధం కావాలనుకుంటే మెయిన్‌కు కొత్త సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది.

రీజనింగ్ :
ఇందులో ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే.. వేగంగా విశ్లేషించే నైపుణ్యాలు అలవర్చుకోవాలి. సీటింగ్ అరెంజ్‌మెంట్, పజిల్స్, ఇన్‌ఈక్వాలిటీస్, సిలాయిజమ్స్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్‌‌స తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్ :
ఇంగ్లిష్‌లో మంచి స్కోరు చేయడానికి గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సాధన చేయాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహా యంతో పదజాలం పెంచుకోవాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ వంటి ప్రాథమిక గ్రామర్ నిబంధనలు తెలుసుకోవాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఇందులో చాలా వరకు ప్రశ్నలు సింప్లిఫికేషన్, సూత్రాల ఆధారితంగా రాబట్టేలా ఉంటాయి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలను వేగంగా చేయగలిగేలా సిద్ధమవ్వాలి.

జనరల్ అవేర్‌నెస్(రిఫరెన్‌‌స టు బ్యాంకింగ్) :
బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఆర్‌బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఉన్నత స్థానాల్లో తాజా నియామకాలు.. బ్యాంకింగ్/ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం.. ద్రవ్య సాధనాలు(చెక్స్, ఏటీఎం కార్డు తదితర).. భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు.

ముఖ్య సమాచారం..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు:
2018, నవంబర్ 6 నుంచి నవంబర్ 26 వరకు.
ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్: 2018, డిసెంబర్ 29, 30 తేదీల్లో.
మెయిన్ ఆన్‌లైన్ టెస్ట్: 2019, జనవరి 27.
ఇంటర్వ్యూలు: 2019, ఫిబ్రవరి.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ibps.in
Published date : 30 Oct 2018 12:36PM

Photo Stories