ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారా.. ఇంటర్వూ ప్రిపరేషన్ సాగించండిలా..
ఇటీవల ప్రకటించిన మెయిన్ ఫలితాల్లో ప్రతిభచూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్
డౌన్‌లోడ్‌కు ఐబీపీఎస్ అవకాశం ఇచ్చింది. ఆఫీసర్ కేడర్ నియామక ప్రక్రియలో తుది దశ.. ఇంటర్వ్యూ. ఇందులోనూ ప్రతిభ చూపిన వారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. కీలకమైన ఇంటర్వ్యూ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఉద్యోగం సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ స్కేల్ 2,3 ఆఫీసర్స్ ఇంటర్వ్యూలో విజయం సాధించేందుకు టిప్స్...
ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. రీజనల్ రూరల్ బ్యాంక్స్(ఆర్‌ఆర్‌బీ)లో స్కేల్ 2,3 పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఉద్యోగం పొందేందుకు 70 నుంచి 80 మార్కులు స్కోర్ చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో నలుగురు నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. సీనియర్ బ్యాంకర్లు, సైకాలజిస్టులు బోర్డు సభ్యులుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ప్రొఫైల్ ఆధారంగా ప్రశ్నలు..
- ఇంటర్వ్యూ సాధారణంగా 15-20 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ సమయంలో అభ్యర్థి పలు రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో చదువు, గతంలో చేసిన ఉద్యోగాలు, సాధించిన విజయాలు, హాబీలపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతాయి. కొన్ని ప్యానెల్స్‌లో బ్యాంకింగ్ రంగంపై అవగాహన, కరెంట్ అఫైర్స్‌పై దృష్టిపెట్టే అవకాశం ఉం టుంది. ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కోవాలంటే.. అభ్యర్థి ప్రధానంగా బ్యాంకింగ్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌పై అప్ టు డేట్‌గా ఉండాలి. ఇంటర్వ్యూ జరిగే రోజు వరకు జరిగే ప్రతి పరిణామాన్ని అన్ని కోణాల్లో తెలుసుకోవాలి.
- విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం గురించిన ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఈ పోస్టులు గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించినవి. కాబట్టి, అక్కడి పరిస్థితులు, పంటలపై కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలి.
- వ్యక్తిగత సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు వంటి వాటిపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. అభ్యర్థి కమ్యూనికేషన్ నైపుణ్యాలను సైతం పరీక్షిస్తారు.
ఇంకా చదవండి: part 2: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఇంటర్వూ రోజు కోసం సిద్ధమవ్వండిలా..!