Skip to main content

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఇంటర్వూ రోజు ఈ పనులు చేస్తే ఇబ్బందులు పడతారు..?

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ స్కేల్ 2, 3 ఆఫీసర్స్ మెయిన్ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. వారికి ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తుంది.

ఇటీవల ప్రకటించిన మెయిన్ ఫలితాల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్‌‌స
డౌన్‌లోడ్‌కు ఐబీపీఎస్ అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్వూ సమయంలో చేయాల్సినవి.. చేయాకూడని పనులపై కథనం..

  • కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అలాంటి వాటిలో ధూమపానం, చూయింగ్ గమ్ లేదా గాఢమైన వాసన వచ్చే మౌత్ ఫ్రెష్‌నర్స్ ముఖ్యమైనవి. అభ్యర్థికి ఇలాంటి అలవాట్లు ఉంటే.. ఇంటర్వ్యూకు కొన్ని రోజులు ముందే మాను కోవడం మంచిది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఇలాంటివి ప్రతికూలంగా మారతాయి.
  • ఇది సర్వీస్ సెక్టార్ ఇంటర్వ్యూ కాబట్టి ఎంతో సహనంతో, చిరునవ్వుతో సౌమ్యంగా కనిపించాలి. మొరటుగా, అసహనంతో అస్సలు ఉండకూడదు. బ్యాంకింగ్ పరిశ్రమలో మర్యాద విలువైనది. కాబట్టి బోర్డు అభ్యర్థిలో ఇలాంటి లక్షణాలు పరిశీలించే అవకాశం ఉంది.
  • బోర్డులో అడిగే ప్రశ్నలకు సానుకూలంగా సమాధానాలు చెప్పాలి. ఆలోచించకుండా తీవ్ర అభిప్రాయాలను వెల్లడించడం సరికాదు. ఉదా హరణకు ‘డీమానిటైజేషన్ వల్ల సామాన్యులకు లాభమా, నష్టమా’ అని అడిగితే.. తొలినాళ్లల్లో మనకు ఎదురైన ఇబ్బందులు ఇక్కడ చెప్పకూడదు. బ్యాంకర్స్ ఎలా ఆలోచిస్తారో మీరూ అలాగే ఆలోచించి సానుకూలంగా సమాధానం చెప్పాలి.
  • ప్యానెల్‌లో ఒకరి తర్వాత మరొకరు ప్రశ్నలు సంధిస్తారు. బోర్డు సభ్యుల్లో ఎవరు ఏది అడిగినా.. ఓపిగ్గా వినాలి. పూర్తిగా విన్న తర్వాతే సమాధానం చెప్పాలి. సమాధానం తెలియ కపోతే నిజాయితీగా తెలియదని చెప్పడం మంచిది. సభ్యులు మీ అభిప్రాయాలను అడిగితే, మీ పరిజ్ఞానం మేరకు బ్యాలెన్స్‌డ్‌గా సమాధానం చెప్పాలి.


పెద్ద కష్టమేమీ కాదు..

  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఇంటర్వ్యూ దశను దాటిన అభ్యర్థులను దేశంలోని ఎక్కడైనా రీజనల్ రూరల్ బ్యాంక్స్(ఆర్‌ఆర్‌బీ)లోఆఫీసర్లుగా విధుల్లో నియమిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసిన పోస్టుకు అనుగుణంగాను, ప్రొఫైల్‌లో పేర్కొన్న అంశాలపైనా, వర్తమాన బ్యాంకింగ్ విధానాలపై అవగాహన పెంచుకుంటే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
  • ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్‌కు చివరి తేది: 17.12.2020.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ibps.in/

 

Published date : 17 Dec 2020 03:00PM

Photo Stories