Skip to main content

వాయుసేన‌లో కొలువులు సాధించేలా.. ప్రిపరేషన్ టిప్స్ పాటించండిలా..

ఏఎఫ్‌క్యాట్‌ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఈకేటీ పరీక్షలో మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి ప్రశ్నలను అడుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగానికి సంబంధించి హిస్టరీ, సివిక్స్, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్, కల్చర్, డిఫెన్స్, క్రీడలు తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

వెర్బల్‌ ఎబిలిటీ: ఈ విభాగానికి సంబంధించి కాంప్రహెన్షన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటన్స్‌ కంప్లీషన్, సినానిమ్స్, యాంటానిమ్స్, వొకాబ్యులరీ, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు మాత్రం డిగ్రీ స్థాయిలో అడుగుతారు. ముఖ్యంగా డెసిమల్‌ ఫ్రాక్షన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, పర్సెంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సింపుల్‌ ఇంట్రస్ట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

రీజనింగ్‌ అండ్‌ మిలటరీ అప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ(మెంటల్‌ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఏఎఫ్‌క్యాట్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే వారు మూడు దశల ఎంపిక ప్రక్రియపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. సిలబస్,ప్రశ్నలు అడిగే విధానం, టెక్నికల్, నాన్‌టెక్నికల్‌ పరీక్షల్లో వ్యత్యాసం, ఇంటర్వూ్య వంటి వాటి గురించి తెలుసుకోవాలి.

స్వీయ ప్రణాళిక, పక్కా వ్యూహాంతో ప్రిపరేషన్‌ సాగించాలి. ఇందుకోసం సబ్జెక్ట్‌ వారీగా నిర్ణిష్ట టైమ్‌ టెబుల్‌ను సిద్ధం చేసుకోవాలి. చదవడం పూర్తిచేసిన అంశాలను రివిజన్‌ చేయాలి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం ఎక్కువగా దినపత్రికలను చదవడం మేలు చేస్తుంది. చదువుతున్నప్పుడే ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ రాసుకోవాలి.

వీలైనన్నీ ఎక్కువ మాక్‌ టెస్టులను, ప్రాక్టీస్‌ టెస్టులను రాయడం మంచిది. దీనివల్ల నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేయడం అలవాటవుతుంది. అంతేకాకుండా పరీక్షలో చేస్తున్న పొరపాట్లను గుర్తించి.. అధిగమించేందుకు అవకాశం ఉంటుంది.

ఇంకా చ‌దవండి : part 1: వాయుసేనలో కొలువులు.. ఎంపికైతే శిక్ష‌ణ‌లోనే రూ.56వేల స్టైఫండ్‌!

Published date : 08 Jun 2021 03:57PM

Photo Stories