Skip to main content

ఏఎఫ్‌క్యాట్.. వాయుసేన కొలువుకు సరైన మార్గం

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్)..ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈల తర్వాత భారత వాయుసేనలో ‘అధికారి’ హోదాతో కొలువులను అందించే పరీక్ష! ఏటా రెండుసార్లు నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ ద్వారా అన్ని విభాగాల విద్యార్థులకు ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. దీంతో ఔత్సాహికులు పెద్దసంఖ్యలో ఏఎఫ్‌క్యాట్‌కు పోటీ పడుతున్నారు. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌క్యాట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్ సమాచారం...
ఏటా ఫిబ్రవరి, ఆగస్టులో నిర్వహించే ఏఎఫ్‌క్యాట్‌లో ప్రతిభ చూపితే ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచులు; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశించొచ్చు.

పర్మినెంట్ కమిషన్ (పీసీ):
పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్‌గా చేరిన వారికి సదరు బ్రాంచ్‌లో, ర్యాంకుల ఆధారంగా పదవీ విరమణ వయసు వరకు కొనసాగే అవకాశం ఉంటుంది.

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), పురుషులు/మహిళలు:
ఫ్లయింగ్ బ్రాంచ్(పురుషులు/మహిళలు)కు ఎంపికైన వారి సర్వీసు కాలం... సర్వీసు(కమిషన్)లో చేరిన తేదీ నుంచి 14ఏళ్లు. కాగా, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచ్‌కు ఎంపికైన వారి ప్రాథమిక సర్వీసు కాలం 10 ఏళ్లు. గ్రౌండ్ డ్యూటీ అధికారుల సర్వీసు కాలాన్ని నాలుగేళ్లపాటు పొడిగించే అవకాశముంది.

విద్యార్హతల వివరాలు..
ఫ్లయింగ్ బ్రాంచ్ :
గుర్తింపున్న ఏదైనా వర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత/60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్):
ఇంటర్, ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి.
ఏరోనాటికల్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్):
స్పెషలైజేషన్లు: కమ్యూనికేషన్/కంప్యూటర్ లేదా టెక్నాలజీ/కంప్యూటర్ అండ్ అప్లికేషన్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్.
ఏరోనాటికల్ ఇంజనీర్(మెకానికల్):
ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ/పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులుండాలి.
స్పెషలైజేషన్లు: ఏరోస్పేస్/ఏరోనాటికల్/ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్/మెకానికల్/మెకానికల్ అండ్ ఆటోమేషన్/మెకానికల్ (ప్రొడక్షన్)/మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.

గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్):
  • అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ.
  • అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకామ్ లేదా తత్సమాన అర్హత.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్ బ్యాచ్) :
2017, జనవరి 1 నాటికి ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ పొందుండాలి. దీంతోపాటు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం ఉత్తీర్ణత.
వయసు- ఏఎఫ్‌క్యాట్ అండ్ ఎన్‌సీసీ (ఫ్లయింగ్ బ్రాంచ్): 2020, జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందిన వారి గరిష్ట వయోపరిమితి 26 ఏళ్లు.
  • కోర్సు ప్రారంభం నాటికి 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో అవివాహితులు మాత్రమే అర్హులు కాగా, 25ఏళ్ల లోపు వయసు కలిగిన వితంతు, విడాకులు పొందిన మహిళలు/పురుషులు అనర్హులు.

పరీక్ష విధానం :
ఏఎఫ్‌క్యాట్.. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఏఎఫ్‌ఎస్‌బీ (ఫిజికల్)టెస్ట్, ఇంటర్వ్యూలు కలిపి మొత్తం మూడు దశలుగా ఉంటుంది. ఆయా దశల్లో అర్హత సాధించిన వారే తర్వాతి దశకు ఎంపికవుతారు. ఏఎఫ్‌క్యాట్, ఈకేటీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తే.. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది.

ఏఎఫ్‌క్యాట్ పరీక్ష విధానం:
సబ్జెక్టులు:
జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్.
సమయం: రెండు గంటలు.
  • మొత్తం 100 ప్రశ్నలకు 300 మార్కులు కేటాయించారు.

ఈకేటీ :
  • గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) బ్రాంచ్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ)కు హాజరవ్వాల్సి ఉంటుంది.
సబ్జెక్టులు: మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్.
సమయం: 45 నిమిషాలు.
  • మొత్తం 50 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు.

సిలబస్ :
ఇంగ్లిష్:
కాంప్రెహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్/ఫిల్లింగ్ ఇన్ ఆఫ్ కరెక్ట్ వర్డ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, టెస్టింగ్ ఆఫ్ వొకాబ్యులరీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్.
జనరల్ అవేర్‌నెస్: హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్‌మెంట్, బేసిక్ సెన్సైస్, డిఫెన్స్, ఆర్ట్, కల్చర్, స్పోర్ట్స్.
న్యూమరికల్ ఎబిలిటీ: డెసిమల్ ఫ్రాక్షన్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ (ట్రైన్స్/బోట్స్ అండ్ స్ట్రీమ్స్).
రీజనింగ్ అండ్ మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్: వెర్బల్ స్కిల్స్ అండ్ స్పేషియల్ ఎబిలిటీ.
  • న్యూమరికల్ ఎబిలిటీ కింద అడిగే ప్రశ్నలు మెట్రిక్యులేషన్ స్థాయిలో, మిగిలిన సబ్జెక్టుల నుంచి గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి.

ముఖ్యతేదీలు...
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2018.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: డిసెంబర్ 30, 2018.
అడ్మిట్‌కార్డుల జారీ: 2019, ఫిబ్రవరి 1 తర్వాత నుంచి.
ఏఎఫ్‌క్యాట్ (1) ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 16, 17-2019.
పరీక్ష సమయం: ఉ.9.45 గం. నుంచి ఉ.11.45 గం. వరకు, మ. 2.15 గం. నుంచి సా.4.15 గం. వరకు.
ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ): సా.4.30 గం. నుంచి సా.5.15 గం. వరకు.
వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in
Published date : 13 Dec 2018 04:19PM

Photo Stories