విమానయాన రంగంలో విస్తృత ఉపాధి మార్గాలు..
Sakshi Education
విమానయాన రంగం.. శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఒకటి! గత కొంత కాలంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ సంఖ్య పెరుగుతోంది.
అందుకనుగుణంగా విమానయాన సంస్థలు సర్వీసుల సంఖ్య పెంచడం తెలిసిందే! ఫలితంగా విమానయాన రంగం.. విస్తృత ఉపాధి వేదికగా మారుతోంది. ఇటీవల కాలంలో నెలకొన్న ఒడిదుడుకులు తాత్కాలికమేనని.. త్వరలోనే ఏవియేషన్ రంగం పుంజుకుంటుందన్నది నిపుణుల అభిప్రాయం! ఈ నేపథ్యంలో విమానయాన రంగంలో టెక్నికల్, నాన్-టెక్నికల్, సర్వీసెస్ తదితర విభాగాల్లోని ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం..
శరవేగంగా విస్తరిస్తున్న రంగం..
ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం విస్తరణ బాటలో పయనిస్తోంది. ఫలితంగా వాణిజ్య, వ్యాపార రంగాలకు ఈ రంగం ఊతమిస్తోంది. ప్రపంచ విమానయాన రంగం విలువ 2019లో 855 బిలియన్ డాలర్లు దాటినట్లు అంచనా. అదేసమయంలో మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018 చివరి నాటికి వరుసగా నాలుగో సంవత్సరం కూడా భారత విమానయాన రంగం వృద్ధి నమోదు చేసుకుంది. డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ మార్కెట్ పరంగా 2017తో పోల్చితే ప్యాసింజర్ల సంఖ్య 2018లో 18.6 శాతం పెరిగింది.
15 లక్షల మందికి ఉపాధి :
ప్రస్తుతం భారత ఏవియేషన్ రంగం అంతర్జాతీయంగా ఏడో స్థానంలో ఉంది. ఇది 2022 నాటికి ప్రపంచంలో మూడో స్థానంలో నిలవనుందని ఐఏటీఏ, ఇతర సంస్థల అంచనా. ఫలితంగా ఈ రంగంలో సర్వీసెస్ నుంచి టెక్నికల్ వరకూ.. 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఉపాధి లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉడాన్ పథకం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. విమానయాన రంగంలో ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎంబీఏ.. ఇలా అన్నిరకాల అర్హతల అభ్యర్థులకు అవకాశముంది.
ఏవియేషన్‌లో జాబ్స్..
విమానయాన రంగంలో టెక్నికల్ నుంచి గ్రౌండ్ డ్యూటీ, గగనతల సిబ్బంది వరకు అనేక రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్ ఉద్యోగాల కోణంలో పైలట్స్, ఇంజనీర్స్, ఏటీసీ, రాడార్ ఇంజనీర్స్ వంటి అవకాశాలు లభిస్తున్నాయి. నాన్-టెక్నికల్ విభాగంలో ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ప్యాసింజెర్ సర్వీస్, క్యాబిన్ క్రూ, ఫ్లయిట్ స్టివార్డ్స్ వంటి ఉద్యోగాలు ఔత్సాహికులను పలకరిస్తున్నాయి. వీటితోపాటు గ్రౌండ్ స్టాఫ్ అంటే కస్టమర్ సర్వీస్, చెక్ ఇన్-చెక్ అవుట్ కౌంటర్ సిబ్బంది వంటి కొలువులు లభిస్తాయి. ర్యాంప్ స్టాఫ్ అంటే.. బ్యాగేజ్ సిబ్బంది, లోడింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉంటాయి. అలాగే సెక్యూరిటీ విభాగంలో ఎయిర్‌క్రాఫ్ట్ సెక్యూరిటీ స్టాఫ్, వీసా, పాస్ట్‌పోర్ట్ చెకింగ్ జాబ్స్ తదితర కొలువులు పొందొచ్చు. ఇవికాకుండా హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ జాబ్స్ కూడా అందుకోవచ్చు.
పైలట్... క్రేజీ కొలువు :
విమానం అనగానే తొలుత గుర్తొచ్చేది పైలట్ అనడంలో సందేహం లేదు. ఇది సమాజంలో అత్యంత క్రేజీ కొలువు. పైలట్ ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే.. కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందాలి. ఇందుకోసం నిర్దిష్ట గంటల వ్యవధిలో పైలట్ శిక్షణ తీసుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో పలు పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్నాయి. కమర్షియల్ పైలట్ శిక్షణలో చేరేందుకు ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసుండాలి. కనీసం 16 ఏళ్ల వయసుతోపాటు మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి. శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత సదరు అభ్యర్థులు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. సర్టిఫికెట్ చేతికందుతుంది. ఈ సర్టిఫికెట్‌తో తొలుత కో-పైలట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఆ తర్వాత రెండు, మూడేళ్ల అనుభవంతో పైలట్‌గా పదోన్నతి లభిస్తుంది. వేతనం రూ.లక్షకు పైగానే ఉంటుంది.
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ :
ఇంటర్‌తోనే క్యాబిన్ క్రూ :
నాన్-టెక్నికల్ హోదాల్లో ప్రధానంగా పేర్కొనాల్సింది.. క్యాబిన్ క్రూ విభాగం. విమానయాన సమయంలో ప్యాసింజర్లకు సేవలందించే విభాగం ఇది. ఇందులో ఎయిర్ హోస్టెస్, సీనియర్ ఎయిర్ హోస్టెస్, ఫ్లయిట్ అటెండెంట్, ప్యాసెంజర్ అటెండెంట్ వంటివి కీలక ఉద్యోగాలు. ఇంటర్మీడియెట్ అర్హత, నిర్దేశిత వయోపరిమితి, శారీరక ప్రమాణాలు ఉంటే క్యాబిన్‌క్రూ విభాగంలో కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఇందుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు ఫ్లయింగ్ క్లబ్‌లు, ఏవియేషన్ సంస్థలు సొంతగా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి శిక్షణ అందిస్తున్నాయి. ఈ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తమ సంస్థల్లోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తుంది.
డిగ్రీ, పీజీతో గ్రౌండ్ డ్యూటీ :
సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు కూడా ఏవియేషన్ రంగంలో ఉపాధి పొందొచ్చు. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థలు గ్రౌండ్ డ్యూటీ విభాగాల్ని ముఖ్యమైన విభాగాలుగా గుర్తిస్తున్నాయి. కారణం.. ప్రీ-ట్రావెలింగ్ వెయిటింగ్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లలో నిరీక్షించే ప్యాసింజర్లకు అందించే సేవలు సైతం ప్రధానంగా నిలుస్తుండటమే. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో ఎయిర్‌పోర్ట్ మెయింటనెన్స్, హౌస్ కీపింగ్, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సూపర్‌వైజర్స్, మేనేజర్స్, చీఫ్ మేనేజర్స్ వంటి హోదాలు లభిస్తాయి. సూపర్‌వైజర్స్ స్థాయిలో డిగ్రీ ఉత్తీర్ణత కనీస అర్హత. మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంబీఏ, ఏవియేషన్ కోర్సుల అభ్యర్థులు పోటీ పడొచ్చు. వీరికి నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం లభిస్తుంది.
ఏటీసీ విధులెంతో కీలకం :
గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ విభాగంలో.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రధానమైందిగా పేర్కొనొచ్చు. ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూపర్ వైజర్, కంట్రోలర్ వంటి కొలువులు లభిస్తాయి. గగనతలంలోని వాతావరణ పరిస్థితులు, ఎయిర్ వే ట్రాఫిక్ పరిస్థితులను రాడార్ల ద్వారా అంచనా వేస్తూ.. విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు.. సురక్షితంగా గమ్యం చేరేలా చూడటం ఏటీసీ విభాగంలోని సిబ్బంది ప్రధాన విధులు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.70 వేల నుంచి అనుభవం ఆధారంగా రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తాయి.
అందుబాటులోకి అకడమిక్ కోర్సులు..
ఏవియేషన్ రంగంలో అవకాశాలు అందుకునేలా.. అందుకు అవసరమైన నైపుణ్యాలు అందించేలా అకడెమిక్ స్థాయిలో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ విభాగాలకు సంబంధించి బీటెక్/బీఈ/ఎంటెక్ స్థాయిలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని కొన్ని క్యాంపస్‌లలో వీటికి సంబంధించిన కోర్సులు లభిస్తుండటం విశేషం.
ఏవియేషన్ రంగం.. లభించే ఉద్యోగాలు :
పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు..
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ :
క్యాబిన్ క్రూ.. పలు శిక్షణ సంస్థలు :
ముఖ్యాంశాలు..
ఒడిదుడుకులు కొద్దికాలమే..
భారత ఏవియేషన్ రంగం శరవేగంగా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో నెలకొన్న ఒడిదుడుకులు తాత్కాలికమే. త్వరలోనే ఇవి సమసిపోతాయి. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం ఉత్తమ మార్గంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఔత్సాహిక అభ్యర్థులు వ్యక్తిగతంగా తమ దృక్పథానికి సరితూగుతుందనుకుంటేనే ఈ రంగంవైపు అడుగులు వేయాలి. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో నిర్దిష్ట పనివేళలు లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- శశికుమార్, ఎండీ, ఇన్‌డీడ్.

- ఏవియేషన్ రంగంలో టెక్నికల్ విభాగంలో కీలక విభాగం.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్. విమానానికి సంబంధించి అన్నిరకాల సాంకేతిక పరీక్షలు నిర్వహించడం.. సమస్యలుంటే పరిష్కరించడం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్‌లో ప్రధాన విధులు. దీనికోసం ప్రత్యేక కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది. బీటెక్/బీఈ స్థాయిలో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్, ఏవియేషన్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. దేశంలోని కొన్ని ఐఐటీ క్యాంపస్‌లలోనూ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉంది. ఐఐటీ-ముంబై, ఖరగ్‌పూర్, కాన్పూర్, చెన్నై.. బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ద్వారా వీటిలో ప్రవేశం పొందొచ్చు. వీటితోపాటు నిట్‌లు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు ఉంది.
- ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్/ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు సొంతం చేసుకున్న వారికి ఎంట్రీ లెవల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ సూపర్‌వైజర్స్, జూనియర్ ఇంజనీర్స్, మెయింటనెన్స్, రిపెయిర్, ఓవర్‌హ్యాలింగ్ టెక్నీషియన్స్ తదితర ఉద్యోగాలు లభిస్తాయి. వీరు కేవలం గ్రౌండ్ డ్యూటీకే పరిమితం కాకుండా.. విమాన ప్రయాణ సమయంలోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కోసం ఎయిర్ మార్షల్స్ అనే ప్రత్యేక పేరుతో వీరిని నియమిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ విభాగంలోని ఉద్యోగులకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఇంటర్‌తోనే క్యాబిన్ క్రూ :
నాన్-టెక్నికల్ హోదాల్లో ప్రధానంగా పేర్కొనాల్సింది.. క్యాబిన్ క్రూ విభాగం. విమానయాన సమయంలో ప్యాసింజర్లకు సేవలందించే విభాగం ఇది. ఇందులో ఎయిర్ హోస్టెస్, సీనియర్ ఎయిర్ హోస్టెస్, ఫ్లయిట్ అటెండెంట్, ప్యాసెంజర్ అటెండెంట్ వంటివి కీలక ఉద్యోగాలు. ఇంటర్మీడియెట్ అర్హత, నిర్దేశిత వయోపరిమితి, శారీరక ప్రమాణాలు ఉంటే క్యాబిన్‌క్రూ విభాగంలో కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఇందుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు ఫ్లయింగ్ క్లబ్‌లు, ఏవియేషన్ సంస్థలు సొంతగా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి శిక్షణ అందిస్తున్నాయి. ఈ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తమ సంస్థల్లోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తుంది.
డిగ్రీ, పీజీతో గ్రౌండ్ డ్యూటీ :
సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు కూడా ఏవియేషన్ రంగంలో ఉపాధి పొందొచ్చు. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థలు గ్రౌండ్ డ్యూటీ విభాగాల్ని ముఖ్యమైన విభాగాలుగా గుర్తిస్తున్నాయి. కారణం.. ప్రీ-ట్రావెలింగ్ వెయిటింగ్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లలో నిరీక్షించే ప్యాసింజర్లకు అందించే సేవలు సైతం ప్రధానంగా నిలుస్తుండటమే. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో ఎయిర్‌పోర్ట్ మెయింటనెన్స్, హౌస్ కీపింగ్, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సూపర్‌వైజర్స్, మేనేజర్స్, చీఫ్ మేనేజర్స్ వంటి హోదాలు లభిస్తాయి. సూపర్‌వైజర్స్ స్థాయిలో డిగ్రీ ఉత్తీర్ణత కనీస అర్హత. మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంబీఏ, ఏవియేషన్ కోర్సుల అభ్యర్థులు పోటీ పడొచ్చు. వీరికి నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం లభిస్తుంది.
ఏటీసీ విధులెంతో కీలకం :
గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ విభాగంలో.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రధానమైందిగా పేర్కొనొచ్చు. ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూపర్ వైజర్, కంట్రోలర్ వంటి కొలువులు లభిస్తాయి. గగనతలంలోని వాతావరణ పరిస్థితులు, ఎయిర్ వే ట్రాఫిక్ పరిస్థితులను రాడార్ల ద్వారా అంచనా వేస్తూ.. విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు.. సురక్షితంగా గమ్యం చేరేలా చూడటం ఏటీసీ విభాగంలోని సిబ్బంది ప్రధాన విధులు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.70 వేల నుంచి అనుభవం ఆధారంగా రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తాయి.
అందుబాటులోకి అకడమిక్ కోర్సులు..
ఏవియేషన్ రంగంలో అవకాశాలు అందుకునేలా.. అందుకు అవసరమైన నైపుణ్యాలు అందించేలా అకడెమిక్ స్థాయిలో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ విభాగాలకు సంబంధించి బీటెక్/బీఈ/ఎంటెక్ స్థాయిలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని కొన్ని క్యాంపస్‌లలో వీటికి సంబంధించిన కోర్సులు లభిస్తుండటం విశేషం.
ఏవియేషన్ రంగం.. లభించే ఉద్యోగాలు :
- పైలట్, కో-పైలట్.
- ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్స్.
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, సూపర్‌వైజర్స్.
- ఎయిర్ హోస్టెస్ (మహిళలు మాత్రమే).
- ఫ్లయిట్ స్టివార్డ్స్.
- లాజిస్టిక్స్ సూపర్‌వైజర్స్, మేనేజర్స్.
- ఎయిర్‌పోర్ట్ మేనేజర్స్, లాంజ్ మేనేజర్స్, సూపర్‌వైజర్స్.
పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు..
- తెలంగాణ ఏవియేషన్ అకాడమీ.
- ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్
- ఆసియా పసిఫిక్ ఫ్లయిట్ ట్రైనింగ్ అకాడమీ.
- ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ.
- ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ.
- రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ.
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ :
- హిందుస్థాన్ ఏవియేషన్ అకాడమీ.
- పుణె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ.
- ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ.
- విశ్వేశ్వరాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్.
క్యాబిన్ క్రూ.. పలు శిక్షణ సంస్థలు :
- యాప్‌టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ.
- ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ.
- ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్.
- ఎయిర్‌బోర్న్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ.
- ఇండియన్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్.
ముఖ్యాంశాలు..
- 2022 నాటికి ప్రపంచంలో మూడో పెద్ద దేశంగా నిలవనున్న భారత విమానయాన రంగం.
- ఉడాన్ పథకంతో మధ్యతరహా పట్టణాల్లోనూ ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం.
- ఏటికేడు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.
- టెక్నికల్ విభాగంలో ఎంట్రీ లెవల్‌లో నెలకు రూ.లక్ష వరకు వేతనం.
- నాన్-టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనం.
- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో టెక్నికల్ కోర్సులు.
ఒడిదుడుకులు కొద్దికాలమే..
భారత ఏవియేషన్ రంగం శరవేగంగా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో నెలకొన్న ఒడిదుడుకులు తాత్కాలికమే. త్వరలోనే ఇవి సమసిపోతాయి. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం ఉత్తమ మార్గంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఔత్సాహిక అభ్యర్థులు వ్యక్తిగతంగా తమ దృక్పథానికి సరితూగుతుందనుకుంటేనే ఈ రంగంవైపు అడుగులు వేయాలి. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో నిర్దిష్ట పనివేళలు లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- శశికుమార్, ఎండీ, ఇన్‌డీడ్.
Published date : 15 May 2019 08:45PM