కలల కొలువులకు కేరాఫ్.. ఏవియేషన్
Sakshi Education
హై రెమ్యునరేషన్‌కు చిరునామా ఏవియేషన్. పెరుగుతోన్న ఎయిర్ ట్రాఫిక్, సరికొత్త విమానాలు, అధునాతన ఎయిర్‌పోర్టులు దీనికి సాక్షి. గంటకో దేశం, పూటకో ప్రాంతంలో గడపాల్సిన పరిస్థితి సీఈఓలకే కాదు మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లకూ అనివార్యమైంది. అందుకే ఏవియేషన్ విస్తృతి మరింత పెరిగింది. ఏవియేషన్ అంటే పైలట్ ఒక్కటే కాదు. ఇందులో ఎన్నో ఉద్యోగాలున్నాయి. గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ (ఏటీసీ)... ఇలా రకరకాల కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ కెరీర్‌పై ఫోకస్..
రానున్న రెండు దశాబ్దాల్లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండు లక్షల మంది పైలట్ల అవసరముందని ప్రముఖ విమానయాన కంపెనీ బోయింగ్ ఫ్లైట్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. 2032 నాటికి మరో రెండు లక్షల మంది టెక్నీషియన్ల అవసరం ఉంది. 2013 బోయింగ్ పైలట్ అండ్ టెక్నీషియన్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం - ఏవియేషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్క ఆసియా - పసిఫిక్ ప్రాంతమే కాకుండా దాదాపు ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. మన దేశంలో కూడా స్పైస్, జెట్‌ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లోనూ విమానయాన సిబ్బందికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత కోర్సులు అభ్యసించిన అభ్యర్థులకు అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.
కమర్షియల్ పైలట్ లెసైన్స్
ఎయిర్‌లైన్ కంపెనీల్లో పైలట్‌గా చేరాలంటే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉండాలి. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ తర్వాత ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ వస్తుంది. దేశంలో ది డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తన అధీకృత సంస్థలైన కొన్ని ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు/క్లబ్‌ల ద్వారా స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోసం పరీక్ష నిర్వహిస్తుంది. ఎయిర్ నావిగేషన్, ఏవియేషన్ మెట్రాలజీ, ఎయిర్ రెగ్యులేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజన్/ఇన్‌స్ట్రుమెంట్స్ అంశాల్లో మౌఖిక విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. దీనికి 10వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు.
ప్రైవేట్ పైలట్, కమర్షియల్ పైలట్ లెసైన్స్‌ల కోసం పరీక్షలను సెంట్రల్ ఎగ్జామినేషన్ ఆర్గనైజేషన్, డీజీసీఏలు నిర్వహిస్తాయి. ఫ్లైయింగ్‌లో నిర్ణీత శిక్షణ పొందిన వారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చు. ఇందులో రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. 10+2 పూర్తి చేసిన వారు అర్హులు. లెసైన్స్‌కు సంబంధించిన ప్రతి దశలో అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది.
మన దేశంలో పైలట్ శిక్షణనిస్తున్న సంస్థలు:
ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, సికింద్రాబాద్; బాంబే ఫ్లైరుుంగ్ క్లబ్, ముంబై; గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, భువనేశ్వర్; గవర్నమెంట్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా; గవర్నమెంట్ ఫ్లైరుుంగ్ ట్రైనింగ్ స్కూల్, బెంగళూరు; రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ, తిరువనంతపురం; ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్‌బరేలి.
మరిన్ని వివరాలకు dgca.nic.in చూడొచ్చు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
ఎటువంటి ఖర్చు లేకుండా పైలట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వాటి వివరాలు..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలు ఉంటాయి. ఇందులోని ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో చేరడం ద్వారా పైలట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో 10+2 ఎంట్రీలో ఎన్‌డీఏ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. గ్రాడ్యుయేషన్/బీటెక్ ఉత్తీర్ణతతో మూడు విధానాల్లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేర్చుకుంటారు. సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) ఎగ్జామ్‌తోపాటు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ, షార్ట్ సర్వీస్ కమిషన్ విధానాల్లో కూడా పైలట్ల ఎంపిక ఉంటుంది.
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) స్పెషల్ ఎంట్రీ: ఎన్‌సీసీలో ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ ఉన్నవారు దీనికి అర్హులు. దీని ద్వారా ఎంపికైన వారికి పర్మినెంట్ కమిషన్ ఇస్తారు. ఎన్‌సీసీ ఎయిర్‌స్క్వాడ్రన్/డెరైక్టర్ జనరల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఎంట్రీ (ఫ్లైయింగ్ పైలట్): ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి ఏటా జూన్/డిసెంబర్‌ల్లో ప్రకటన వెలువడుతుంది. దీని ద్వారా రిక్రూట్ అయిన వారికి షార్ట్ సర్వీస్ కమిషన్ ఇస్తారు. 14 సంవత్సరాలపాటు సర్వీస్ అందించాలి.
వయసు: 19-23 ఏళ్లు.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్/బీటెక్. 10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి అవివాహిత పురుషులు, ఎస్‌ఎస్‌సీ ఎంట్రీకి పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హులే.
ఎంపిక విధానం: ఎన్‌సీసీ, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు విభాగాల్లోను ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ), సర్వీసెస్ సెలక్షన్ బోర్‌డ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ అనే రెండు దశల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎస్‌ఎస్‌బీలో భాగంగా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ముందుగా సాంకేతిక శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాలపైనా అవగాహన కల్పిస్తారు. అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి.. ఫైటర్ పైలట్, హెలికాప్టర్ పైలట్, ట్రాన్స్‌పోర్ట్ పైలట్‌ల్లో ఏదో ఒకటి కేటాయిస్తారు.
కెరీర్: ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విధానంలో ప్రవేశించినప్పటికీ... శిక్షణ సమయంలో నెలకు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. దాదాపు ఏడాది శిక్షణ తర్వాత ఫ్లైయింగ్ ఆఫీసర్ (నెలకు రూ. 15,600 - రూ. 39,000తోపాటు గ్రేడ్ పే 5,400) గా కెరీర్ ఆరంభమవుతుంది. ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి ఫ్లైయింగ్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ మార్షల్ (వీసీఏఎస్), ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయి వరకు ఎదగొచ్చు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ మాత్రమే కాకుండా విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక పరికరాల వినియోగం వంటి సేవలు అందించడానికి టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, ఏరోనాటికల్ బ్రాంచ్ వంటి విభాగాలు ఉంటాయి. వీటిల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, వివిధ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి.
వెబ్‌సైట్: careerairforce.nic.in
ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ కూడా పైలట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం కల్పిస్తుంది. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ హోదాలో పైలట్ల ఎంపిక ఉంటుంది. అర్హత: 70 శాతం మార్కులతో (కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్నవారు 60 శాతం మార్కులు) గ్రాడ్యుయేషన్ (ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి).
వయసు: 19 నుంచి 25 ఏళ్లు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
కెరీర్: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల (కేరళ)లో నేవల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణనిస్తారు. శిక్షణను పూర్తి చేసుకున్న వారి కెరీర్ సబ్ లెఫ్టినెంట్ ఆఫీసర్ హోదాతో ప్రారంభమవుతుంది. తర్వాత లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కమాండర్, కమాండర్ స్థాయికి చేరుకోవచ్చు. పేస్కేల్ రూ. 15,600 నుంచి రూ. 39,100 (గ్రేడ్ పే రూ. 5,400)
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ)
కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో పైలట్‌గా కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే పరీక్ష.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ఎగ్జామినేషన్. ఈ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది.
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 16 1/2 - 19 ఏళ్లు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా మార్చి, అక్టోబర్‌లలో వెలువడుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే రెండు దశల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష: మొత్తం 900 మార్కులకు ఉంటుంది. పేపర్-1 మ్యాథ్‌స (300 మార్కులు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ. ఇందులో పార్ట్-ఎ ఇంగ్లిష్ (200 మార్కులు), పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ (400 మార్కులు) అనే రెండు విభాగాలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి రెండున్నర గంటలు.
ఇంటర్వ్యూ: రాత పరీక్ష తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్‌డ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 900 మార్కులు ఉంటాయి. ఎంపికైనవారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ-పుణేలో మూడేళ్ల సుదీర్ఘ శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణలో నెలకు రూ. 21,000 స్టైపెండ్ లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ఎంపికను బట్టి బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), బీఏ డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది.
వెబ్‌సైట్: www.upsc.gov.in, www.nda.nic.in
సీడీఎస్ ఎగ్జామినేషన్
యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహించే సీడీఎస్‌ఈ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్) ద్వారా కూడా పైలట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా రెండుసార్లు ఏప్రిల్, సెప్టెంబర్‌లలో వెలువడుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే రెండు దశల ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష మూడు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1 ఇంగ్లిష్ (100 మార్కులు), పేపర్-2 జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు), పేపర్-3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (100 మార్కులు). ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్‌డ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఎన్‌డీఏ మాదిరిగానే ఉంటుంది. ఈ దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి త్రివిధ దళాలకు చెందిన ట్రైనింగ్ అకాడమీల్లో శిక్షణనిస్తారు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
ఏవియేషన్‌లో వివిధ ఉద్యోగాలు
ఇంజనీరింగ్ విభాగం: విమానయాన రంగంలో మరో ముఖ్య విభాగం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్. విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్ది వాటిని సక్రమంగా ఉంచడమే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన విధి. దీంతో పాటు డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్ విధులను కూడా ఈ సిబ్బందే నిర్వర్తిస్తారు. ఐఐటీ-ఖరగ్‌పూర్, ముంబై, కాన్పూర్, మద్రాస్‌లలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు బోధిస్తున్నారు.
కేబిన్ క్రూ: అందం.. ఆకట్టుకునే రూపం.. ఉంటే అద్భుత అవకాశాలందించే విభాగం కేబిన్ క్రూ. ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టివార్ట్, ఫ్లైట్ అటెండెంట్ హోదాలు ఈ విభాగంలో లభిస్తాయి. చేతిలో ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్, 16 ఏళ్ల వయసు ఉంటే చాలు.. కేబిన్ క్రూలో కెరీర్‌ను అన్వేషించవచ్చు. దీనికి సంబంధించి ప్రైవేట్ రంగంలో ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, ఫ్రాంక్‌ఫిన్ తదితర సంస్థలు కేబిన్ క్రూ కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. ఏడాదిపాటు సాగే ఈ శిక్షణకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Published date : 26 Sep 2013 03:36PM