ఆకాశ మార్గంలో ప్రయాణానికి.. పైలట్
Sakshi Education
ఈ రోజు ఒక దేశంలో, రేపు మరో దేశంలో, ఎల్లుండి ఇంకో దేశంలో.. ఇలా రోజుల వ్యవధిలోనే దేశ విదేశాలను శరవేగంగా చుట్టొచ్చే అరుదైన అవకాశం అందరికీ దక్కదు. లోహ విహంగాల చోదకులకు మాత్రమే ఆ అదృష్టం సొంతం. ఐదంకెల జీతం, విలాసవంతమైన జీవితం, గ్లామరస్ జాబ్ కావాలంటే.. పైలట్‌గా అవతారం ఎత్తాల్సిందే. హుందాతనం ఉట్టిపడే పైలట్ కొలువుపై యువత మక్కువ పెంచుకుంటోంది. విమాన చోదకులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయి. విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వీరికి డిమాండ్ అధికమవుతుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో..
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్(సీపీఎల్) పొందిన తర్వాత పైలట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. పైలట్లకు ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన వేతనం చేతికందుతుంది. సీనియారిటీని బట్టి వేతనం భారీగా పెరుగుతుంది. జనరల్ ఏవియేషన్‌లో తక్కువ పని గంటలు ఉంటాయి. అంటే.. చార్టర్ ఎయిర్‌వేస్(వ్యక్తిగత విమానాలు), కార్గో ఎయిర్‌లైన్స్(సరకు రవాణా విమానాలు)లో చేరితే ఏడాదిలో 100 నుంచి 150 గంటలపాటు విధులు నిర్వర్తించాలి. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్(ప్రయాణికుల విమానాలు)లో ఏడాదికి 1000 గంటలకుపైగానే పనిచేయాలి. పైలట్లకు ఫ్లైయింగ్ క్లబ్బుల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ మంచి ఆదాయం పొందొచ్చు. పైలట్ శిక్షణకు మన దేశంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. తర్వాత మల్టీ ఇంజిన్ ఎండార్స్‌మెంట్‌కు రూ.3 లక్షలు -4 లక్షలు వెచ్చించాలి.
కావాల్సిన స్కిల్స్:
శారీరకంగా దృఢంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో సెకండ్ల వ్యవధిలోనే నిర్ణయాలు తీసుకొని అమలు చేయగల సామర్థ్యం అవసరం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హైజాక్‌లు.. వృత్తిలో ఇలాంటి ఊహించని సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటిని చాకచక్యంగా ఎదుర్కొనే నేర్పు చాలా ముఖ్యం. ఒత్తిళ్లను అధిగమించి ఎక్కువ గంటలు పనిచేసే ఓపిక ఉండాలి.
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డీజీసీఏ గుర్తింపు పొందిన సంస్థలో పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేరొచ్చు. ఇందులో చేరాలంటే డీజీసీఏ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 200 గంటల ఫ్లైయింగ్ శిక్షణ పూర్తిచేయాలి. ఏవియేషన్ స్టడీస్‌పై డీజీసీఏ నిర్వహించే థియరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో ఐదు పేపర్లు ఉంటాయి. విదేశాల్లో పైలట్ శిక్షణ పొందినప్పటికీ భారత్‌లో పనిచేయాలంటే డీజీసీఏ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందిన తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థలో ఆరు నెలల నుంచి ఏడాదిపాటు మల్టీ ఇంజిన్ ఎండార్స్‌మెంట్ శిక్షణ పొంది కో-పైలట్‌గా విధుల్లో చేరొచ్చు. అనుభవం పెంచుకొని పైలట్‌గా ఉద్యోగోన్నతి పొందొచ్చు.
వేతనాలు: కో-పైలట్‌కు ప్రారంభంలో నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వేతనం అందుతుంది. సీనియర్ పైలట్ నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు పొందొచ్చు. సీనియారిటీని బట్టి ఈ వేతన ప్యాకేజీ నెలకు రూ.5 లక్షల వరకు పెరుగుతుంది.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

- రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్
వెబ్‌సైట్: rgaviation.com/
- ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ
వెబ్‌సైట్: www.flyairaviationacademy.in
- ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ
వెబ్‌సైట్: apaviationacademy.in/
- ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్
వెబ్‌సైట్: www.apft.edu.in
- ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ
వెబ్‌సైట్: www.igrua.gov.in
- అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
వెబ్‌సైట్: www.aaa.co.in
- గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్
వెబ్‌సైట్: www.gujaratflyingclub.org
సవాళ్లతో కూడిన కెరీర్! ‘‘దేశంలో విమానయాన రంగం ఏటా గణనీయమైన వృద్ధిని సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లెసైన్స్‌డ్ పైలట్లకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. ఏవియేషన్‌లో అత్యంత డిమాండ్ ఉన్న విభాగం కూడా పెలైటే. వీరికి వేతనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకాశవీధిలో విహరించే అవకాశంతోపాటు సవాళ్లతో కూడిన కెరీర్ కోరుకునేవారు పైలట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. సిటీలో పలు సంస్థలు పెలైట్ శిక్షణను అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అర్హతతో పైలట్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరొచ్చు. థియరీ, ప్రాక్టికల్స్‌తో సాగే శిక్షణలో విద్యార్థులు ఎయిర్ నేవిగేషన్, మెటీరియాలజీ, ఎయిర్ రెగ్యులేషన్ తదితర సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ఫ్లైయింగ్ శిక్షణలో అనుభవం పొందుతారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెసైన్స్ లభిస్తుంది. పైలట్ కెరీర్‌లో ప్రవేశించాలంటే శారీరక దృఢత్వం తప్పనిసరి. పైలట్‌లకు దేశ, విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’ ఎం.అభిలాష్, పీఆర్‌ఓ రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడెమీ. |
Published date : 20 Sep 2014 03:16PM