అవకాశాల వేదిక.. ఆర్కిటెక్చర్
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత నిస్తుండడం.. నిర్మాణ రంగం ఊపు మీద ఉండడంతో.. ప్రతి క్షణం ఏదో ఒక చోట ఓ కొత్త కట్టడానికి పునాది పడుతోంది.. దీంతో సంబంధిత రంగంలో నాణ్యమైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది.. ఈ క్రమంలో నిర్మాణాలకు అందమైన రూపం కావాలన్నా.. అనుకున్న బడ్జెట్‌లో నిర్మాణం పూర్తవ్వాలన్నా దోహదం చేసేది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్... సంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో సమానంగా అవకాశాలకు వేదికగా నిలుస్తున్న ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సుపై ఫోకస్..
ఆర్కిటెక్చర్‌ను మదర్ ఆఫ్ ఆర్ట్స్‌గా అభివర్ణిస్తారు. ఆర్కిటెక్చర్‌కు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులను ఎంచుకోవడం ద్వారా ఆర్కిటెక్చర్‌లో కెరీర్ ప్రారంభించవచ్చు.
డిప్లొమా:
ఆర్కిటెక్చర్‌కు సంబంధించి డిప్లొమా స్థాయిలో ఉండే కోర్సును డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్‌గా వ్యవహరిస్తారు. దీని వ్యవధి మూడున్నరేళ్లు. అర్హత: పదో తరగతి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పాలిసెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఆర్కిటెక్చర్‌కు సంబంధించి దీన్ని ప్రాథమిక కోర్సుగా పేర్కొనవచ్చు.
బీ.ఆర్క్:
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ స్థాయిలో ఉండే కోర్సును బీ.ఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్)గా వ్యవహరిస్తారు. ఇది ఐదేళ్ల కోర్సు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో)/ డిప్లొమా/తత్సమానం పూర్తి చేసిన వారు అర్హులు.
స్సెషలైజేషన్స్.. పీజీ:
బీ.ఆర్క్ తర్వాత పీజీ చేయొచ్చు. ఈ స్థాయిలో కోర్సును ఎం.ఆర్క్ (మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్)గా వ్యవహరిస్తారు. ఇందులో విభిన్న స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవి..అర్బన్ డిజైనింగ్, రీజనల్ ప్లానింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్ డిజైన్, సస్టెయినబిల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్ డిజైన్, హబిటాట్ డిజైన్, సిటీ డి జైన్, ఎన్విరాన్‌మెంట్ ఆర్కిటెక్చర్, కాస్ట్ మేనేజ్‌మెంటల్, డిజిటల్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అప్లికేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, నావల్ ఆర్కిటెక్చర్ తదితరాలు. కెరీర్ కోణంలో ఆలోచించినప్పుడు ఏదో ఒక రంగంలో స్పెషలైజేషన్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
యాడ్ ఆన్‌కోర్సులు:
ఆర్కిటెక్చర్‌లో సర్టిఫికెట్‌తోపాటు ఆ రంగానికి సంబంధించి సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం కూడా ఇప్పుడు కలిసొచ్చే అవకాశం. ఈ క్రమంలో 3 డి స్టూడియో మ్యాక్స్ (3D Studio Max), ఆటోక్యాడ్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్), కంప్యూటర్ స్కేచ్‌ప్, కోరల్ డ్రా, యానిమేషన్. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జీఐఎస్) వంటి సాఫ్ట్‌వేర్ కోర్సులను నేర్చుకోవడం ఉపయుక్తం గా ఉంటుంది. ప్రస్తుతం ఆర్కిటెక్చర్లకు సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది.
స్కిల్స్ తప్పనిసరి:
ఆర్కిటెక్చర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి కొన్ని లక్షణాలు తప్పనిసరి. అవి..
- సృజనాత్మకత
- పరిశీలనా సామర్థ్యం
- కమ్యూనికేషన్ స్కిల్స్
- జట్టుతో కలిసి పని చేసే నేర్పు
- మ్యాథమెటికల్ ఎబిలిటీ
డ్రాయింగ్ స్కిల్స్
ఈ రంగంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను గమనించి తదనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. డెస్క్(ఆఫీస్)తోపాటు, అవుట్ డోర్ (కన్‌స్ట్రక్షన్ సైట్)లో పని చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి.
విధులివే:
ఆర్కిటెక్చర్ కోర్సులను చేసిన వారిని ఆర్కిటెక్ట్స్‌గా వ్యవహరిస్తారు. డిజైన్, ప్లానింగ్ అనే అంశాల ప్రధానంగా వీరి విధులు ఉంటాయి. ఈ క్రమంలో క్లయింట్లకు నచ్చిన విధంగా కట్టడాలను ప్లాన్ గీయడం, వాటికి మెచ్చే రూపమివ్వడం, నిర్మాణానికయ్యే ఖర్చులపై అంచనాలను రూపొందించడం, ఎంత సమయంలోగా పూర్తి అవుతుంది అనే అంశాలను పొందుపరుస్తూ ప్లాన్‌ను రూపొందిస్తారు. ఈ సమయంలో నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను పాటించడం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం, భూమి స్వభావం, పర్యావరణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు.
అవకాశాలు:
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తుండడం, నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, పలు ఎంఎన్‌సీలు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుండడంతో ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది. వీరికి కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, కన్సల్టెన్సీలు, ఇన్‌ఫ్రా కంపెనీలు, బిల్డింగ్ ఆర్గనైజేషన్స్ వంటివి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కిటెక్ట్స్ విధులు విస్తృతమవుతున్నాయి. గతంలో మాదిరిగా కేవలం రెసిడెన్షియల్ ప్రాంతాల డిజైన్‌కే పరిమితం కావడం లేదు. పబ్లిక్ పార్క్‌లు, షాపింగ్ సెంట ర్లు, హాస్పిటల్స్, బ్రిడ్జెస్, ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్, హైవేలు- రైలు మార్గాల నిర్మాణం, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, యూనివర్సిటీ/కాలేజ్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు, ఎకలాజికల్ పార్కుల నిర్మాణంలోను ఆర్కిటెక్చర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా చారిత్రక కట్టడాలను మెరుగుపరచడానికి కూడా ఆర్కిటెక్చర్లు అవసరమవుతున్నారు. దీన్ని బట్టి ఆర్కిటెక్చర్లకు అవకాశాలు విస్తృతంగా పెరిగాయని చెప్పొచ్చు.
ప్రభుత్వ విభాగాల్లో:
ఆర్కిటెక్చర్లకు ప్రభుత్వ విభాగాల్లో కూడా పలు అవకాశాలు ఉంటాయి. సెంట్రల్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ (సీఏఎస్) (గ్రూపు-ఏ) పరీక్షలో విజయం సాధిస్తే సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్)లో డిప్యూటీ ఆర్కిటెక్చర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఆ తర్వాత డెరైక్టర్ జనరల్ స్థాయి వరకు పదోన్నతి పొందొచ్చు. అంతేకాకుండా రక్షణ మంత్రిత్వ శాఖ, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, రైల్వేలు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (పీఎస్‌యూ), నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ వంటి కేంద్రప్రభుత్వ సంస్థలతోపాటు రాష్ట్ర స్థాయిలోని హౌసింగ్ బోర్డుల్లో అవకాశాలు ఉంటాయి. వీటికి అర్హత బీఆర్క్. డిప్లొమా అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్లు, హౌసింగ్ బోర్డులు, ఇతర ప్రభుత్వ విభాగాల్లో డ్రాఫ్ట్స్‌మెన్, లెసైన్స్‌డ్ డిజైనర్‌గా అవకాశాలు ఉంటాయి. ఆయా సంస్థలు/పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల ద్వారా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఆసక్తి ఉంటే సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా బీఆర్క్ అభ్యర్థులు హాజరు కావచ్చు,
విదేశాల్లో:
విదేశాల్లో కూడా అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్కిటెక్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలు, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాలు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో మౌలిక వసతుల రంగంలో విస్తృతమవుతున్న కార్యకలాపాలను (హైవేలు, ఎయిర్‌పోర్ట్, డ్యామ్‌లు, పైప్‌లైన్స్ నిర్మాణం) ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా జీఎంఆర్, ఎల్ అండ్ టీ వంటి భారతీయ సంస్థలు విదేశాల్లో మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను దక్కించుకోవడం కూడా ఇందుకు మరో కారణం.
వేతనాలు:
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆదాయం ఆకర్షణీయంగానే ఉంటోంది. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 20 వేల నుంచి 25 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు సంపాదించవచ్చు. రియల్ ఎస్టేట్ సంస్థలు, కన్‌స్ట్రక్షన్ రంగంలోని బహుళ జాతి సంస్థల్లో వేతనాలకు ఆకాశమే హద్దు. ప్రారంభంలోనే నెలకు కనీసం రూ. 40 వేల వేతనం ఖాయం.
సెల్ఫ్ ప్రాక్టీస్:
అకడెమిక్ అర్హతలు పొంది.. ఒకట్రెండేళ్లు ఉద్యోగ అనుభవం సాధిస్తే ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సొంతంగా ఆర్కిటెక్ట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం పొందొచ్చు. సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా రాణించాలనుకుంటే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఇలా సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకునే ఆర్కిటెక్ట్స్ యాక్ట్ 1972 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
‘ఎంట్రెన్స్’ టెస్ట్‌లు
నాటా: (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్): ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత:కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియ ట్ (10+2)/ తత్సమానం (పాలిటెక్నికల్ 10+3)
వివరాలకు: https://www.nata.in
ఎన్‌ఐటీలు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ)-న్యూఢిల్లీ, భోపాల్, విజయవాడల్లో జేఈఈ-మెయిన్స్(పేపర్-2) ద్వారా ప్రవేశం కల్పిస్తారు మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ అంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది.
వివరాలకు: https://jeemain.nic.in
ఐఐటీల్లో బీఆర్క్ కోర్సులో ప్రవేశం కోరుకునే విద్యార్థులు ముందుగా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలి. ఆ తర్వాత నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు హాజరుకావాలి. దీని ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఫ్రీ హ్యాండ్ రైటింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, త్రీ-డెమైన్షన్ పర్సెప్షన్, ఇమాజినేషన్ అండ్ ఈస్థటిక్ సెన్సిటివిటీ, ఆర్కిటెక్చరల్ అవేర్‌నెస్ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది.
వివరాలకు: https://jee.iitd.ac.in
ఐఐటీ/ఎస్‌పీఏలు గేట్/సీడీ (కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్)/యూజీసీ జేఆర్‌ఎఫ్-నెట్/పీజీసెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎం.ఆర్క్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు
ఐఐటీ-ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
ఐఐటీ-రూర్కీ
వెబ్‌సైట్: www.iitr.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-త్రిచి
వెబ్‌సైట్: www.nitt.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాలికట్
వెబ్‌సైట్: www.nitc.ac.in
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.spa.ac.in
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ
వెబ్‌సైట్: https://spav.ac.in
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-భోపాల్
వెబ్‌సైట్: www.spabhopal.ac.in
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.jnafau.ac.in
16లక్షల మంది ఆర్కిటెక్టులు అవసరం
ప్రస్తుతం బీ ఆర్క్ కోర్సుకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఐదు లక్షల మంది ఆర్కిటెక్ట్‌లు అవసరం ఉంటుంది. కానీ 50 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 2030 నాటికి 16లక్షల మంది ఆర్కిటెక్టులు అవసరం. ఈ కెరీర్‌లో రాణించాలనుకునే వారికి క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ ఉండాలి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో అసిస్టెంట్ ఆర్కిటెక్ట్‌గా నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం పొందొచ్చు. బీఆర్క్ అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆర్కిటెక్ట్స్ యాక్ట్ 1972 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యాక్ట్ ప్రకారం ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్స్, సిటీ సెంటర్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్, బహుళ అంతస్తులు, థియేటర్లు, ఆడిటోరియంలు, మాస్ హౌసింగ్ బోర్డులు, అపార్టుమెంట్‌లు, కళాశాలలు, పాఠశాలలు, టూరిజం ప్రాజెక్టులు, సౌండ్ స్టూడియోలు, ఎనర్జీ ఎఫీసెంట్ బిల్డింగ్స్, ఇలా ఎక్కడ... ఎలాంటి కట్టడమైనా ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి సర్టిఫై చేయడం తప్పనిసరి. ఆర్కిటెక్ట్ యాక్ట్ 1972 ప్రకారం ప్రాజెక్టుకు కేటాయించిన ఖర్చులో ఐదు శాతం ఆర్కిటెక్ట్‌కు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.10 కోట్ల పెట్టి ఒక ప్రాజెక్టు కడితే... రూ.50లక్షలు ఆర్కిటెక్ట్‌కు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ (సీఏఎస్, గ్రూపు-ఏ) పరీక్షలో ఎంపికైతే సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్)లో డిప్యూటీ ఆర్కిటెక్చర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. తర్వాత డెరైక్టర్ జనరల్ స్థాయి వరకు పదోన్నతి పొందొచ్చు.
-డాక్టర్ రమేష్,
ప్రొఫెసర్ అండ్ హెడ్,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్,
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ.

Published date : 27 Jun 2013 04:28PM