అగ్రికల్చరల్ కోర్సులు...సరికొత్త ఉపాధి మార్గాలు
J Rajashekhar Reddy
ఒకప్పుడు వ్యవసాయమంటే రైతులు, రైతు కూలీలకే పరిమితం. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందాలంటే.. ఎండనకా వాననకా చెమట చిందించాల్సిందే! కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి! నేడు చదువుకున్న యువత.. వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తూ.. సాగును అవకాశాల సమాహారంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది! మరోవైపు నూతన సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ఆలంబనతో.. వ్యవసాయ,అనుబంధ రంగాలు కార్పొరేట్ రూపు సంతరించు కుంటున్నాయి.
దాంతో అగ్రికల్చర్, అనుబంధ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు సాగు రంగంలో సరికొత్త ఉపాధి మార్గాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 60కిపైగా ఉన్న వివిధ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రతి ఏటా ఐసీఏఆర్ ఏఐఈఈఏ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అప్‌కమింగ్ కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. దేశంలో నేటికీ నూటికి 60 శాతం మందికిపైగా ప్రజల జీవనాధారం వ్యవసాయమే! సాగు కొత్త పుంతలు తొక్కితేనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. టెక్నాలజీ ప్రవేశంతో.. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో శిక్షణ పొందిన మానవ వనరుల అవసరం నెలకొంది. ఆయా కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఉపాధి అవకాశాలు పుష్కలం అన్నది నిపుణుల అభిప్రాయం.
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ :
ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిర్వహణ.. వ్యవసాయ రంగంలో శాస్త్రసాంకేతికతకు సంబంధించిన విభాగామే.. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్ల బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సు అందుబాటులో ఉంది. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ సూత్రాలను అనువర్తించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడం.. వ్యవసాయ ఉత్పాదకాల ప్రాసెసింగ్ తదితర అంశాలను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అధ్యయనం చేస్తారు. వ్యవసాయ రంగానికి అవసరమైన యంత్రాలు, పరికరాల డిజైన్, రూపకల్పనలో వీరు పాలుపంచుకుంటారు.
కోర్సులో ఏముంటుంది: కోర్సులో భాగంగా ఫామ్ మెషినరీ, ఎక్విప్‌మెంట్, ఫామ్ మెషినరీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, స్ప్రింక్లర్, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిరల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, డెయిరీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ ఆఫ్ హార్టికల్చరల్ క్రాప్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.
ఎక్కడ చదవాలి: అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హతలు: ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణతతోపాటు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ పొందొచ్చు. దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కాలేజీలు 50 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రవేశానికి అర్హులుగా పరిగణిస్తున్నాయి.
కెరీర్ అవకాశాలు: వ్యవసాయ యంత్రాల తయారీ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, డెయిరీ రంగంలో, విత్తన కంపెనీల్లో, రసాయనక ఎరువుల తయారీ సంస్థల్లో, వ్యవసాయ సంబంధిత పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఆయా కంపెనీల్లో అగ్రికల్చరల్ ఇంజనీర్లుగా, అగ్రికల్చర్ ఆఫీసర్లుగా, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్‌గా, ఫామ్ మేనేజర్‌గా, రీసెర్చ్ ఇంజనీర్‌గా, ప్రాసెస్ మేనేజర్‌గా, పర్చేజ్ మేనేజర్‌గా, కన్సల్టెంట్స్‌గా ఉపాధి పొందొచ్చు. l బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే.. ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరొచ్చు.
బీఎస్సీ అగ్రికల్చర్ (హానర్స్) :
బీఎస్సీ అగ్రికల్చర్..ఎంతో వైవిధ్యమైన కోర్సు. ఆహార ఉత్పత్తి, పండ్ల మొక్కల సాగు(హార్టికల్చర్), వ్యవసాయ అనుబంధ రంగమైన డెయిరీ, మేకలు, గొర్రెలు. కోళ్ల పెంపకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, రైతులు.. ఇలా ఎన్నో విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కోర్సు ఇది.
కోర్సులో ఏముంటుంది: ఆగ్రోనమీ, జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, హార్టికల్చర్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, యానిమల్ ప్రొడక్షన్ తదితర అంశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో భాగంగా బోధిస్తారు.
అర్హతలేంటి: బీఎస్సీ అగ్రికల్చర్(హానర్స్) కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఇందులో చేరేందుకు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(బైపీసీ) ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర చోట్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది.
ఉద్యోగాలెక్కడ: బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు, రూరల్ బ్యాంకులు, డెయిరీ రంగంలో, హార్టికల్చర్, పౌల్ట్రీ, అగ్రిసంబంధ కంపెనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్ సంస్థల్లో ఉపాధి పొందొచ్చు.
న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ :
ఆధునిక జీవనశైలి దుష్ర్పభావాల కారణంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఎక్కువమంది నాణ్యమైన ఆహార ఉత్పత్తుల వైపు దృష్టిసారిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ ఫుడ్‌సైన్స్ చక్కటి ఎంపికగా నిలుస్తోంది. ఆహార పదార్థాల నాణ్యత, ఎక్కువ కాలం మన్నే విధంగా ప్రాసెసింగ్ నైపుణ్యాలను అందించే.. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ హాస్పిటల్స్, హోటల్స్‌లో డైటీషియన్‌సగా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ :
అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్ వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల మధ్య సంబంధాలను సులభతరం చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, నిల్వ, పంపిణీ, మార్కెటింగ్ సవాలుతో కూడుకున్న పని. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ కార్యకలాపాల్లో నైపుణ్యాలు అలవడతాయి. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా బైపీసీ విద్యార్థులు కార్పొరేట్ కొలువులకు మార్గం వేసుకోవచ్చు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, తద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందించే ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ పొడక్షన్ కంపెనీలలో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అగ్రికల్చరల్ ఎకనమిస్టులు వ్యవసాయ రంగంలోని ఆర్థిక అంశాల గురించి పేర్కొంటారు. ధరలు, మార్కెట్ ట్రెండ్స్, ఎగుమతులు, దిగుమతులు, వినియోగదారుల అభిరుచులు, పెట్టుబడి అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. అగ్రికల్చరల్ అనలిస్టులు వ్యవసాయం, పంట ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. ఇందులో భాగంగా పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తుంటారు.
ఫిషరీస్ సైన్స్ :
దేశంలో ఫిషరీ సైన్స్ విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫిషరీస్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్‌ఎస్‌సీ) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సును పూర్తి చేసినవారికి చేపల పెంపకం, సేకరణలకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు, నైపుణ్యాలు అలవడతాయి.
అర్హతలేమిటి: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో కోర్సుల్లో చేరేందుకు ఇంటర్‌లో బైపీసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
కోర్సు ఎక్కడ: బీఎఫ్‌ఎస్‌సీ కోర్సు తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఉద్యోగాలెక్కడ: ఫిషరీ రంగంలో.. చేపలు, రొయ్యల పెంపకం, కృత్రిమ మెరైన్ వాతావరణ పరిస్థితుల నిర్వహణ, రవాణా, పంపిణీ తదితర విభాగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కొలువుల పరంగా ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్: ఆక్వాకల్చర్ టెక్నీషియన్, ఫీల్డ్ అసిస్టెంట్,సేల్స్ ఆఫీసర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్(ఫిష్ ఫామ్), ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ :
అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ ప్రస్తుతం సరికొత్త ఉపాధి వేదికగా గుర్తింపు పొందుతోంది. ఈ విభాగంలో జెనిటిక్ ఇంజనీరింగ్, డయాగ్నసిస్, వ్యాక్సిన్స్, కణజాల సంస్కృతి తదితరాలను ఉపయోగించి సవరించిన మొక్కల ద్వారా అధిక దిగుబడి సాధిస్తారు. అగ్రి బయోటెక్‌గా పిలిచే బీఎస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ కోర్సు ద్వారా కణజాల సంస్కృతి, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థల్లో కొలువులు లభిస్తాయి.
ఆగ్రోనమీ :
అగ్రికల్చరల్ సైన్సులో ఆగ్రోనమీ ఒక విభాగం. పంట, నేలల గురించి అధ్యయనం చేసేవారిని ఆగ్రోనోమిస్టు లేదా సాయిల్ సైంటిస్టు అంటారు. వీరు నేల సారాన్ని పెంపొందించడం, నిర్వహణ, ఫెర్టిలిటీ, సీడ్ బెడ్‌ల ప్రిపరేషన్, సాయిల్ మాయిశ్చర్ తదితరాలకు సంబంధించిన విధులు నిర్వహిస్తారు. పురుగు మందులను తగు మోతాదులో వాడేలా సాయిల్ సైంటిస్టులు చర్యలు తీసుకుంటారు. దీంతోపాటు పంట మార్పిడిపై అధ్యయనం చేస్తారు. నాలుగేళ్ల వ్యవధిలోని బీఎస్సీ ఆగ్రోనమీ కోర్సును పూర్తి చేయడం ద్వారా ఆగ్రోనమిస్టుగా స్థిరపడొచ్చు. ఇది అగ్రికల్చరల్ బీఎస్సీ విద్యార్థులకు సుపరిచితమైన కోర్సు. ఈ కోర్సులో భాగంగా వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం తదితర నైపుణ్యాలను అందిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయశాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కొలువులను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
ఫుడ్ టెక్నాలజీ :

ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా ఫుడ్ టెక్నాలజీ విభాగం అత్యుత్తమంగా నిలుస్తోంది. ఈ దిశగా విద్యార్థులకు బీటెక్-ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. దీన్ని పూర్తిచేసిన వారికి ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు లభిస్తాయి. కోర్సు అనంతరం ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువులు లభిస్తాయి.
డెయిరీ టెక్నాలజీ :
డెయిరీ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలు,పాల ప్రాసెసింగ్, డైయిరీ ఉత్పత్తుల తయారీ, సంబంధిత పరికరాల నిర్వహణ, నాణ్యత నిర్వహణ, నైపుణ్యాలు అలవడతాయి. బీటెక్ డెయిర్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు అర్హత ఇంటర్ ఎంపీసీ.
కోర్సు ఎక్కడ: శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి; పి.వి.న రసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో డెయిరీ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది.
ఉద్యోగాలెక్కడ: వీరికి అమూల్ వంటి ప్రముఖ డెయిరీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డెయిరీ టెక్నాలజిస్టులుగా, సూపర్‌వైజర్లుగా కెరీర్ ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగే వీలుంది.
పౌల్ట్రీ :
గత కొన్నేళ్లుగా భారత పౌల్ట్రీ రంగం స్థిరమైన వృద్ధి నమోదు చేస్తోంది. యానిమల్ సెన్సైస్, జువాలజీ సంబంధిత సబ్జెక్టులు, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ కోర్సు ఉత్తీర్ణులు పౌల్ట్రీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. పౌల్ట్రీకి సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఫామ్ నిర్వహణ, పోషణ, పెంపకం, వ్యాధుల నివారణ-చికిత్స, మార్కెటింగ్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో అవకాశాలు దక్కుతాయి.
జాబ్ ప్రొఫైల్స్: అసిస్టెంట్ పౌల్ట్రీ హ్యాండ్, పౌల్ట్రీ హ్యాండ్, సీనియర్ పౌల్డ్రీ హ్యాండ్, లీడింగ్ హ్యాండ్,పౌల్డ్రీ ప్రొడక్షన్ మేనేజర్,పౌల్ట్రీ బిజినెస్ మేనేజర్
హార్టికల్చర్ :
అగ్రికల్చరల్ సైన్సులో.. హార్టికల్చర్ ఒక భాగం. మొక్కల పెంపకం, కూరగాయలు, పండ్ల సాగు, నర్సరీలు, తోటలు, ఉద్యాన వనాలు, పాలీహౌస్‌లు, గ్రీన్‌హౌజ్‌ల నిర్వహణపై ఆసక్తి కలిగిన విద్యార్థులు హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు.
అర్హతలు: ఇంటర్ బైపీసీ అభ్యర్థులు హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు.
కోర్సులెక్కడ: తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది.
కొలువులెక్కడ: హార్టికల్చర్ పూర్తిచేసిన వారికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ డ్రిప్ ఇరిగేషన్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
జాబ్‌ప్రొఫైల్స్: ప్రాజెక్టు మేనేజర్,గార్డెనర్, ఫోర్‌మ్యాన్, హార్టికల్చరిస్టు, హార్టికల్చర్ ఎడ్యుకేషన్ సూపర్‌వైజర్, ప్రొఫెసర్, సైంటిస్టుగా స్థిరపడొచ్చు.
ఉన్నత విద్య: ఉన్నత విద్య పరంగా ఎంఎస్సీ హార్టికల్చర్, పీహెచ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. పీజీ స్థాయిలో.. ఫ్రూట్ సైన్స్, వెజిటె బుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎమ్మెస్సీ చదవొచ్చు.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం :

- అగ్రికల్చరల్ కాలేజ్, బాపట్ల
- ఎస్‌వీ అగ్రికల్చరల్ కాలేజ్, తిరుపతి
- అగ్రికల్చరల్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం
- అగ్రికల్చరల్ కాలేజ్, మహానంది
-
అగ్రికల్చరల్ కాలేజ్, రాజమండ్రి
అనుబంధ కళాశాలలు.. :
ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 6 అనుబంధ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి.
- కేవైఎన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ఎచ్చెర్ల
- కేబీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, కేసీ పురం, ప్రకాశం
- ఎన్‌ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్, మార్కాపురం
- ఎస్‌బీవీఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, బద్వేల్
- కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, అనంతపురం
- జేసీడీఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, తాడిపత్రి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం :
బీఎస్సీ అగ్రికల్చర్ (హానర్స్) :
- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్, రాజేంద్రనగర్, హైదరాబాద్
- అగ్రికల్చరల్ కాలేజ్, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- అగ్రికల్చరల్ కాలేజ్, పొలస, జగిత్యాల జిల్లా
- అగ్రికల్చరల్ కాలేజ్, పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా
- అగ్రికల్చరల్ కాలేజ్, వరంగల్ అర్బన్.
- అగ్రికల్చరల్ కాలేజ్, సిరిసిల్ల జిల్లా
అగ్రి కోర్సుల సీట్ల భర్తీ :
- తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీలు అగ్రికల్చరల్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
-
దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు ప్రతి ఏటా ఐసీఏఆర్ ఏఐఈఈఏ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.
అవి... బీఎస్సీ అగ్రికల్చర్(హానర్స్), బీఎస్సీ హార్టికల్చర్ (హానర్స్), బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ(హానర్స్), బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్(హానర్స్), బీఎస్సీ సెరికల్చర్ (హానర్స్), బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్
వెబ్‌సైట్: https://ntaicar.nic.in/Cms/public/home.aspx
Published date : 08 Jan 2024 05:37PM