సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ
Sakshi Education
చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్‌లే కాదు. వాటికేమాత్రం తీసిపోని కోర్సులెన్నో ఉన్నాయి. వాటిలో ప్రథమశ్రేణిలో నిల్చేవి సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ. వీటిని పూర్తిచేసినవాళ్లకు ఉపాధి గ్యారెంటీ. ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివినప్పటికీ ఈ కోర్సుల్లో చేరొచ్చు. మిగతా కోర్సులతో పోల్చితే వీటిని పూర్తిచేయడానికి కొంత అదనంగా శ్రమించడం తప్పనిసరి. శ్రమకు తగ్గ వేతనం, గుర్తింపు రెండూ ఈ కోర్సులతో గ్యారంటీగా లభిస్తాయని చెప్పొచ్చు.
చార్టర్డ్ అకౌంటెన్సీ
కోర్సు ఇలా...
చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ); ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ), ఫైనల్ కోర్స్.
సీపీటీ:
సీఏ కోర్సు క్రమంలో తొలి దశ కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్. ఇది అర్హత పరీక్ష లాంటిది. సీఏ భవిష్యత్తుగా ఎంచుకోవాలనుకునే ప్రతి విద్యార్థి దీనిలో ఉత్తీర్ణత సాధించాలి. దీనికోసం పదో తరగతి పూర్తి కాగానే ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఐసీఏఐలో పేరు నమోదు చేసుకోవాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న విద్యార్థుల ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తై తర్వాతే సీపీటీకి హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాక దరఖాస్తు చేసుకోవాలి. సీపీటీ ఏటా రెండుసార్లు (జూన్/డిసెంబర్) నిర్వహిస్తారు.. వీటికి హాజరు కావాలంటే... దరఖాస్తు సమయానికి పరీక్ష సమయానికి కచ్చితంగా అరవై రోజుల వ్యవధి ఉండాలి. అంటే.. జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే.. అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఐపీసీసీ:
కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఏ కోర్సు క్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్‌కు పేరు నమోదు చేసుకోవాలి. ఈ కోర్సు గ్రూప్-1, గ్రూప్-2 పేరిట రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలలపాటు ఉండే స్టడీ కోర్సును పూర్తి చేయాలి. దీంతోపాటు 35 గంటల వ్యవధిలో సాగే ఓరియెంటేషన్ కోర్సు, వంద గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. వీటిని పూర్తి చేసిన వారికి మాత్రమే ఐపీసీసీలోని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది.
సీఏ ఫైనల్:
ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఏ ఫైనల్ కోర్సులోకి అనుమతి లభిస్తుంది. దీనికంటే ముందుగా ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్‌షిప్ (ఆర్టికల్డ్ అసిస్టెంట్‌గా) కోసం నమోదు చేసుకోవాలి. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఈ ఆర్టికల్ షిప్ చేయాల్సి ఉంటుంది. వ్యవధి మూడేళ్లు. ఆర్టికల్ షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా సీఏ ఫైనల్ కోర్సు కోసం పేరు నమోదు చేసుకోవాలి. సీఏ ఫైనల్ కోర్సు చదువుతూ, ఆర్టికల్ షిప్ చివరి 12 నెలల సమయంలో.. 15 రోజుల జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తి చేయాలి. మూడేళ్ల ఆర్టికల్ షిప్ పూర్తి చేసిన తర్వాత లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరు నెలల సమయంలో ఉన్నప్పుడు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు లభించినట్లే.
ఉన్నత విద్య:
కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో పూర్తి చేసే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలకు తత్సమాన గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 మొదలు అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు.
కెరీర్ ఆప్షన్స్:
ఐపీసీసీ పూర్తి చేస్తేనే పలు సంస్థలు అకౌంట్స్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్, తదితర హోదాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఫైనల్ పూర్తి చేసిన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.35 వేల నుంచి లక్ష వరకు ఉంటుంది. విదేశాల్లోనైతే ఇంకా భారీగా వేతనాలు లభిస్తాయి. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ స్థాయికి చేరుకోవచ్చు.
ఉద్యోగాలిక్కడ:
బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, ఆడిటింగ్ సంస్థలు, బహుళ జాతి సంస్థలు..
కావల్సిన నైపుణ్యాలు:
విస్తృతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే.. సహనం ఎంతో అవసరం. అదేవిధంగా బుక్స్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు అవసరమైనవే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐసీఏఐ మూడేళ్ల ఆర్టికల్‌షిప్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, సోషల్ నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉండాలి.
వెబ్‌సైట్: www.icai.org
కంపెనీ సెక్రటరీ
కంపెనీల్లో కీలకమైన హోదాల్లో కంపెనీ సెక్రటరీ(సీఎస్) ఒకటి. ఆ ఉద్యోగం పొందాలంటే... కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిచేయూలి. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియూ వుూడు దశల్లో నిర్వహిస్తోంది. అవి.. ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాసైన వారు చివరి రెండు దశలు పూర్తిచేస్తే సరిపోతుంది. ఎగ్జిక్యూటివ్, లేదా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పూర్తయ్యాక ఏదైనా కంపెనీలో సీఎస్ పర్యవేక్షణలో 16 నెలల శిక్షణ పూర్తిచేసుకోవాలి.
ఫౌండేషన్ ప్రోగ్రామ్:
10+2 పూర్తి చేసిన వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనిలో నాలుగు పేపర్లు ఉంటారుు. ఇంగ్లిష్ అండ్ బిజినెస్ కవుూ్యనికేషన్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫైనాన్షియుల్ అకౌంటింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు కనీస కాల వ్యవధి ఎనిమిది నెలలు.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్:
సీఎస్ ఫౌండేషన్ కోర్సు పాసైన వారు లేదా డి గ్రీ (ఫైన్ ఆర్ట్స్ మినహా) పూర్తి చేసిన వారు నేరుగా ఈ ప్రోగ్రామ్‌కు పేరు నమోదు చేసుకోవచ్చు. కనీస కాల వ్యవధి ఏడాది. దీనిలో ఒక్కో దానిలో వుూడు పేపర్లు కలిపి రెండు వూడ్యూల్స్‌లో ఆరు పేపర్లు చదవాలి.
ఫ్రొఫెషనల్ ప్రోగ్రామ్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పాసైన వెంటనే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌కు పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కనీస కాల వ్యవధి ఏడాది. ఒక్కో దానిలో రెండు చొప్పున మొత్తం నాలుగు వూడ్యూల్స్‌లో కలిపి ఎనిమిది పేపర్లు చదవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పూర్తై తర్వాత కంపెనీ లేదా కంపెనీ సెక్రటరీ వద్ద 16 నెలల శిక్షణ పొందితే మెంబర్‌షిప్‌కు అర్హత లభిస్తుంది.
అడ్మిషన్:
ఈ కోర్సు పరీక్షలను ప్రతి ఏటా డిసెంబర్, జూన్‌ల్లో నిర్వహిస్తారు. మార్చి 31లోపు నమోదు చేసుకుంటే.. డిసెంబర్‌లో జరిగే పరీక్షలు రాయడానికి వీలుంటుంది. సెప్టెంబర్ 30లోపు నమోదు చేసుకుంటే తర్వాతి ఏడాది జూన్‌లో జరిగే పరీక్షలకు హాజరుకావడానికి అనుమతి లభిస్తుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే... ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియూ చాప్టర్‌ల్లో సంప్రదించాలి. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నంల్లో చాప్టర్లు ఉన్నారుు.
ఏం చేస్తారంటే...
సంస్థల లీగల్, రెగ్యులేటరీ వ్యవహారాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలి. పాలనాంశాలపై కంపెనీ బోర్డును గైడ్ చేయాలి. కంపెనీ బోర్డుకు, స్టాక్ హోల్డర్స్‌కు వుధ్య సంబంధాల్లో సీఎస్‌ల పాత్ర కీలకం. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన వారు క్యాపిటల్ వూర్కెట్, ఇన్వెస్టర్ రిలేషన్స్ తదితర విభాగాల్లో కంపెనీ సెక్రటరీలుగా చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu
కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ
కామర్‌స, అకౌంటింగ్ రంగాల్లో భవిష్యత్తును కోరుకునే విద్యార్థుల ముందున్న మరో చక్కటి అవకాశం కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ (సీడబ్ల్యుఏ). ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్‌క్స అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీడబ్ల్యుఏఐ) ఈ కోర్సును నిర్వహిస్తుంది. ఈ కోర్సు కూడా మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ కోర్సు.
ఫౌండేషన్ కోర్సు:
ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్. ఈ కోర్సు పరీక్షలు ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్‌ల్లో నిర్వహిస్తారు. జూన్‌లో పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు, డిసెంబర్‌లో జరిగే పరీక్షలకోసం అదే సంవత్సరం జూన్ 5 లోపు పేరు నమోదు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.
ఇంటర్మీడియెట్ కోర్సు:
ఐసీడబ్ల్యుఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లోనూ మూడు పేపర్లుంటాయి.
ఫైనల్ కోర్సు:
ఫైనల్ కోర్సులో రెండు స్టేజ్‌లు (స్టేజ్ -3, 4) ఉంటాయి.
సీడబ్ల్యుఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు స్టేజ్‌ల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండు స్టేజ్‌లకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌లలో) నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తు తేదీల క్రమం ఫౌండేషన్ కోర్సు మాదిరిగానే ఉంటుంది.
ఉన్నత విద్య:
సీడబ్ల్యుఏ ఫైనల్ పూర్తిచేసినవాళ్లు కామర్‌స, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సుల్లో పీజీ చేసుకోవచ్చు. గ్రూప్స్, సివిల్స్...లాంటి పోటీ పరీక్షలనూ రాసుకోవచ్చు.
సీడబ్ల్యు ఏ - ఇగ్నో సంయుక్త కోర్సులు:
ఇంటర్ ఉత్తీర్ణతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల సౌలభ్యం కోసం ఐసీడబ్ల్యుఏఐ సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్), అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇంటర్మీడియెట్ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్) అనే రెండు స్థాయిల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తోంది.
కెరీర్ ఆప్షన్‌స:
సీడబ్ల్యుఏ పూర్తి చేసినవాళ్లు.. వస్తూత్పత్తి సంస్థలు, మైనింగ్ సంస్థలు, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. సీడబ్ల్యుఏ ఫైనల్ వరకు వేచిచూడకుండా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో కూడా పలు ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని మైనింగ్ సంస్థలు సీడబ్ల్యుఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. దీంతోపాటు ఐసీడబ్ల్యుఏఐకి దేశవ్యాప్తంగా ఉన్న చాప్టర్లలో పలు సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి. సగటున నెలకు రూ. 25 వేల కనీస వేతనం ఖాయం చేసుకోవచ్చు.
ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్‌లో ఉద్యోగానికి ఐసీడబ్ల్యుఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది.
కావల్సిన నైపుణ్యాలు:
కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రధాన లక్ష్యం వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఖర్చులను.. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగ్గించడం. అంటే ఒకవైపు వస్తువుల ఉత్పత్తి సాఫీగా సాగాలి. మరోవైపు ఖర్చులు తగ్గాలి. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించాలంటే లెక్కల చిక్కుముడులను ఇట్టే విప్పే నైపుణ్యం కావాలి. ఇందుకోసం లెక్కల నిర్వహణకు ఎక్కువ సమయం గడిపే విధంగా సహనం అలవర్చుకోవాలి.
వెబ్‌సైట్ : https://students.icwai.org

Published date : 14 Jun 2012 08:11PM